Mukesh Gowda: 'గుప్పెడంత మనసు' హీరో రిషి తండ్రి కన్నుమూత.. తరలిన అభిమానులు

బుల్లితెర ప్రపంచంలో అనేక సీరియళ్లు తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అలాంటి వాటిలో టాప్ వ్యూస్ తో దూసుకుపోతోన్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు ఒకటి. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివేంజ్ డ్రామాతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్ లో హీరోగా రిషి పాత్రలో అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడు ముఖేష్ గౌడ.

రిషి క్యారెక్టర్ లో తనదైన నటనతో ప్రేక్షకులను నిత్యం ఎంగేజ్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ హీరో ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ముఖేష్ గౌడ తండ్రి కన్నుమూయడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Guppedantha Manasu Serial Fame Mukesh Gowda Father Passed Away

మోడలింగ్ రంగంతో కెరీర్ స్టార్ట్ చేశాడు ముఖేష్ గౌడ. 2015 సంవత్సరంలో మిస్టర్ కర్ణాటక టైటిల్ గెలుచుకున్న ముఖేష్ గౌడ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. నాగకన్నిక అనే సీరియల్ తో హీరోగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రేమ నగర్ ధారావాహికతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. కానీ గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి పాత్రలో అద్భుతమైన నటనతో తెలుగు ఆడియెన్స్ హృదయాలను గెలుచుకున్నాడు ముఖేష్ గౌడ.

గుప్పెండత మనసు సీరియల్ లో రిషి పాత్రలో ముఖేష్ గౌడను తప్పా ఇంకెవరిని ఊహించుకోలేనంత గొప్పగా నటించి ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా ఆయన ఇంట తీవ్ర విషాదం జరిగింది. ఎన్నో ఏళ్లుగా పక్షవాతం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న ముఖేష తండ్రి కన్నుమూశారు. చాలా కాలంగా ఇంటి దగ్గరే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కానీ సడెన్ గా ఆరోగ్యం క్షీణించడంతో ముఖేష్ తండ్రి తుది శ్వాస విడిచారు. దీంతో కన్నడ బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొనడమే కాకుండా రిషి అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు.

Guppedantha Manasu Serial Fame Mukesh Gowda Father Passed Away

ముఖేష్ గౌడ ఇంటికి అభిమానులు, కన్నడ సినీ సెలబ్రిటీలు తరలివస్తున్నారని సమాచారం. పలువురు ముఖేష్ తండ్రి మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఇదివరకు స్టార్ మా అవార్డ్ ఫంక్షన్ లో తన తండ్రిని అందరికీ పరిచయం చేశాడు ముఖేష్. ఈ సందర్భంగా తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. మా నాన్నను నేను నాకే పుట్టిన కొడుకులా చూసుకున్నాను. అందరి జీవితంలో ఇది జరుగుతుందో తెలియదు. కానీ, నా జీవితంలో జరిగింది అని రిషి తెలిపాడు.

ఇక గుప్పెడంత మనసు సీరియల్ తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఈ సీరియల్ లో ముఖేష్ గౌడతోపాటు రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్, ఉషా శ్రీ, కొండవీటి సంగీత, రామ్ జగన్, శ్రీమంతుడు సీరియల్ ఫేమ్ సురేష్ బాబు తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X