Guppedantha Manasu: వసుధారపై రిషికి కట్టలు తెంచుకున్న కోపం.. అనరాని మాటలు అంటూ షాకింగ్ గా!
మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించి మినిస్టర్ ను కలుస్తారు రిషి, వసుధార. మీటింగ్ తర్వాత పెళ్లి అయినందుకు వసుధారకు చీరను బహుమతిగా ఇస్తాడు మంత్రి. రిషిని కూడా రమ్మని పిలిచి.. ఇద్దరు కలిసి వసుధారకు చీర పెడతారు. మీ వారు ఏం చేస్తారు అని మంత్రి అడిగితే.. ఆయన ఆల్ రౌండర్ సార్.. చాలా గొప్ప వ్యక్తి అని వసుధార చెబుతుంది. అనంతరం ఇద్దరిని భోజనానికి రమ్మని పిలుస్తాడు మంత్రి. ఓకే సర్.. రిషి సార్ ను కూడా తీసుకొస్తాం అని వసుధార అంటుంది. నీ భర్తను రిషికి మీ ఆయన్ని పరిచయం చేశావా అని వసును అడుగుతాడు మంత్రి. దానికి లేదు సార్.. త్వరలోనే ఆరోజు వస్తుందని చెబుతుంది వసు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 10 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్ 683లో ఇంకా ఏం జరిగిందంటే?

ఏం జరగనట్టు ఎలా ఉంటుంది..
నీ భర్తకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాలేజీలోనే పెట్టించు.. ఇద్దరూ కలిసి రిషి కళ్ల ముందే ఉంటారు అని వసుధారకు మినిస్టర్ సలహా ఇస్తాడు. హా ఓకే సర్.. అంటూ సంతోషంగా ఈ సలహా ఏదో బాగుంది సార్ అని అంటుంది వసుధార. వసుధార లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న అతను ఎంతో అదృష్టవంతుడు. ఓసారి చూడాలని ఉంది అని మినిస్టర్ అంటే.. ఇంచుమించు రిషి సార్ కూడా ఇలాగే అన్నారు. నిజానికి నాకు అతను దొరకడం నా అదృష్టం అని వసుధార అంటుంది. వసుధార అలా మాట్లాడటంతో.. పొగరు.. ఏం జరగనట్లు ఎలా మాట్లాడుతుంది అని రిషి తన మనసులో అనుకుంటాడు. సరే వెళ్దాం వసుధార అని రిషి అంటాడు.

ప్రాజెక్ట్ ను బాగా చేయండి..
రిషి వెళ్దాం పదా అని అంటే.. ఉండు రిషి.. వసుధార తన భర్త గురించి చెబుతుంది కదా అని మినిస్టర్ అంటాడు. ఇంతలో మినిస్టర్ కు కాన్ఫరెన్స్ ఉన్నట్లు పీఏ గుర్తు చేస్తాడు. అవును. అదొకటి ఉంది కదా.. మర్చిపోయాను అని మినిస్టర్ అంటాడు. విన్నావ్ కదా వసుధార సార్ కి మీటింగ్ ఉందట పదా వెళ్దాం అని రిషి అంటాడు.వెళ్లొస్తాం సార్ అని రిషి అంటే.. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ను బాగా చేయండి అని చెప్పిన మినిస్టర్ మళ్లీ వసుధార ఉందిగా.. బాగానే చేస్తుందిలే అని అంటాడు. దీంతో సరే అని బయలుదేరతారు. ఇంతలో రిషి సార్.. ఈ చీర పట్టుకోరా.. నా దగ్గర బ్యాగ్ కూడా ఉంది అని వసుధార అంటే.. ఏదో ఫోన్ వచ్చినట్లు తప్పించుకుంటాడు రిషి. తర్వాత ఇద్దరు కలిసి కారులో బయలుదేరతారు.

చీరతో వసు సెల్ఫీలు..
మరోవైపు మహేంద్ర, జగతి అటూ ఇటూ తిరుగుతూ రిషి, వసుధార ఫోన్లు చేయలేదేంటని ఆలోచిస్తారు. మినిస్టర్ ను కలిశారు. అసలు ఏం జరిగింది ఏంటీ అనే విషయం చెప్పాలి కదా అని జగతి అంటుంది. మరోవైపు రిషి, వసుధార ఇద్దరూ కారులో వెళ్తుండగా సైలెంట్ గా ఉంటారు. ఇక వసుధార కావాలనే చీర తీసి తన మీద పెట్టుకుని సెల్ఫీలు దిగుతుంది. చీర బాగుంది కదా సార్ అని చెప్పి రిషికి థ్యాంక్స్ చెబుతుంది. తర్వాత తనపై చీర పెట్టుకుని రిషితో కలిసి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుంది వసుధార. రిషిని నవ్వమని అడుగుతుంది. అలా ఊకే నవ్వండి సార్.. కొంచెం నవ్వండి సార్ అని వసుధార అనేసరికి కోపంగా ఒక పక్కకు కారు ఆపుతాడు రిషి.

ఎస్సై చెప్పేవరకు తెలియదు..
అసలు ఏమనుకుంటున్నావ్ నువ్వు.. ఆ తాళి నీ మెడలో నీ ఇష్టప్రకారమే పడిందని అన్నావ్ కదా.. ఎవరతను.. ఎవరిని పెళ్లి చేసుకున్నావ్.. మన బంధం ఏమైంది.. రిషి సార్ లేకపోతే బతకను అన్నావ్.. ఆ మాటలన్నీ ఏమైపోయాయి.. ఊరు వెళ్లే వరకు బాగానే ఉన్నావ్.. తర్వాత ఇలా మారిపోయావ్.. నా జీవితంతో ఆటలాడుతున్నావా.. నీ ఇంటికి వస్తే.. వెళ్లమన్నావ్.. పోలీస్ స్టేషన్ కి వస్తే.. తాళి బొట్టు ఉంది.. అదేంటని అడిగితే.. ఏదేదో చెప్పి నోరు మూయించావ్. ఆ రాజీవ్ గాడు వచ్చి నా పెళ్లాం అంటాడు. తీరా చూస్తే ఆ ఎస్సై చెప్పేవరకు అసలు నిజం తెలియదు. అది నిజం కాకపోతే నిజం ఏంటి వసుధార అని రిషి అంటే.. నిజమే నిజంగా.. నిజం సార్.. అని వసుధార సమాధానం ఇస్తుంది.

ఇదంతా నీ ప్లానా..
నీ మెడలో ఆ తాళి ఎవరు కట్టారు.. ఎన్నాళ్లు దాస్తావ్.. నువ్వు.. నీ ప్రేమ.. మాటలు అన్నీ అబద్ధమా అని రిషి అంటాడు. గట్టిగా అరిచి మాట్లాడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారా అని వసుధార అంటుంది. నిన్ను నేను భయపెట్టడం ఏంటీ వసుధార.. అడుగుతున్నాను.. ఎవడు వాడు.. నీ మెడలో తాళి కట్టింది ఎవడు వాడు.. అని రిషి అంటే.. తాళికి సంబంధించిన వ్యక్తి గురించి అగౌరవంగా మాట్లాడొద్దు అని వసుధార అంటుంది. నేను లవ్ చేస్తున్నా అని చెప్తే ముందు నో అన్నావ్.. తర్వాత నువ్వే వచ్చి ఎస్ చెప్పావ్. నేను ప్రేమిస్తున్నప్పుడే నో చెబితే అయిపోయేది కదా.. ఎందుకు నన్ను బాధపెడుతున్నావ్.. ఇదంతా నీ ప్లానా.. ఎందుకు ఇలా రంగులు మారుస్తున్నావ్.. ఎందుకు ఇలా జీవితాలు తలకిందులు చేస్తున్నావ్ అని రిషి కోపంగా, ఆవేదనగా అంటాడు. నేను రంగులు మారుస్తానా.. ఏంటీ సర్ మీరు ఇలా కూడా మాట్లాడుతారా అని వసుధార అంటుంది. నువ్వే ఇలా మాట్లాడిస్తున్నావ్ వసుధార.. ఆ తాళి ఎవరు కట్టారో చెప్పి తీరాలి.. అని గట్టిగా అడుగుతాడు రిషి.

నోటికొచ్చినట్లు మాట్లాడారు కదా..
ప్రేమగా అడిగితే చెప్పేదాన్ని కానీ మీరు చాలా ఘోరంగా మాట్లాడారు. నేను చెప్పను సార్.. చెప్పను గాక చెప్పను. నన్ను ఎన్ని మాటలు అన్నారు. రంగులు మారుస్తున్నా. నా గురించి ఇన్ని తెలుసుకున్న వాళ్లు ఇది కూడా మీరే తెలుసుకోండి. నేను అసలు చెప్పను. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. నా మెడలో తాళి కట్టిన వ్యక్తి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడారు కదా.. ఈ విషయం నా మెడలో తాళి పడటానికి కారణమైన వాళ్లకు తెలిస్తే ఊరుకోడు అనేసి వెళ్లిపోతుంది వసుధార. మరోవైపు జగతికి మినిస్టర్ కాల్ చేసి కాన్సెప్ట్ బాగుందని మెచ్చుకుంటాడు. తర్వాత వసుకి జగతి కాల్ చేసి ఏమైందని అడుగుతుంది. రిషి గురించి చాలా వెటకారంగా మాట్లాడుతుంది వసు. మా అబ్బాయి చాలా మంచివాడు.. మీ ఎండీనే సీరియస్ సింహం అని జగతి అంటుంది. వసుధార వాడే పదాలకు, తెలుగు భాషకు నవ్వుకుంటారు జగతి, మహేంద్ర. ఆయన్ని ఆయనే తిట్టుకుంటున్నారు అని వసుధార అంటుంది. మరోవైపు నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా.. ఇంతకాలం ఓపిక పట్టాను కదా అని రిషి ఆలోచిస్తాడు.


Click it and Unblock the Notifications











