Guppedantha Manasu: దేవయానికి జగతి-మహేంద్ర బెదిరింపులు.. రిషికి నిజం చెబుతానంటూ వసుధార!
రిషి అన్న మాటలు భరించలేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా.. తాళి కట్టింది ఎవరు అని అడిగాను అంతేగా.. అది తప్పా.. ఇన్నాళ్లు ఓపిక పట్టాను అని తను అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు రిషి. వసుధార అటోలో వెళ్తుంటుంది. ఇంతలో జగతి కాల్ చేస్తుంది. దీంతో రిషిపై ఉన్న కోపాన్ని జగతిపై చూపిస్తుంది వసుధార.
ఏం జరిగింది వసు అని జగతి అడిగితే.. ఏం జరగలేదో అడగండి. అన్ని పుల్లవిరుపు మాటలు. తనను తానే తిట్టుకుంటున్నారు. అంత కోపం ఏంటీ మేడమ్ అని వసుధార అంటుంది. దీంతో జగతి-మహేంద్ర ఇద్దరూ నవ్వుకుంటారు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 11 శనివారం నాటి తాజా ఎపిసోడ్ 684లో ఇంకా ఏం జరిగిందంటే?

ఏమైంది.. కాయ.. పండా..
మినిస్టర్ కాల్ చేసి కాన్సెప్ట్ బాగుందని మెచ్చుకున్నారు అని వసుధారకు జగతి చెబుతుంది. ఈ ప్రపంచంలో అందరూ నన్ను మెచ్చుకుంటారు. ఒక్కరు తప్పా అని వసుధార అంటుంది. మా అబ్బాయి చాలా మంచోడు. కానీ మీ ఎండీనే సీరియస్ సింహం అని జగతి అంటే.. మై డార్లింగ్ అన్న విషయాన్ని గుర్తు చేసుకుని కాల్ కట్ చేస్తుంది వసుధార.
మరోవైపు తను అంతగా ఏం తప్పు మాట్లాడాని ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరతాడు రిషి. మహేంద్ర దగ్గరికి వచ్చి.. కడుపు నొప్పి పూర్తిగా తగ్గిందా డాడ్ అని అడుగుతాడు. నువ్వు వెళ్లిన పని ఏమైంది కాయ, పండా అని అడుగుతాడు మహేంద్ర. డాడ్ మేమేమైనా టెండర్ వేయడానికి వెళ్లామా అని అంటాడి రిషి.

తాళి రిషి కట్టాడని నమ్ముతుంది..
కడుపు నొప్పి తగ్గిందా అని మళ్లీ రిషి అడగుతుంటే.. అప్పుడే ధరణి వస్తుంది. కషాయం ఇచ్చావా వదినా అని రిషి అడుగుతాడు. మహేంద్ర తాగానని చెబుతాడు. అయితే అదేం లేదు కాషాయం అక్కడే ఉందని చెప్పేసరికి తండ్రి మహేంద్రతో బలవంతంగా కషాయం తాగిస్తాడు రిషి. అది తాగలేక నానా అవస్థలు పడతాడు మహేంద్ర. అదంతా చూసిన జగతి నవ్వుకుంటుంది.
ఇలా తను కషాయం తాగుతూ నవ్వులు పూయిస్తాడు మహేంద్ర. తర్వాత రిషి వెళ్లాక.. వసుధార, రిషి ఇద్దరి గురించి కాసేపు మాట్లాడుకుంటారు మహేంద్ర-జగతి. తన మెడలో వేసుకున్న మంగళసూత్రాన్ని రిషి కట్టాడని వసుధార నమ్ముతుంది. వాళ్ల ప్రేమే వాళ్లను గెలిపిస్తుందని జగతి అంటుంది.

రిషిని బాధపెడుతున్నానా..
మరోవైపు వసుధార గురించి రిషి ఆలోచిస్తూ ఉంటాడు. తను అన్న మాటలకు ఫీల్ అవుతూ ఉంటుందా. అయినా నేను అన్నదాంట్లో తప్పేముందని ఫోన్ చేద్దామని అనుకుంటాడు రిషి. తను ఏ పరిస్థితిలో ఉందో అని మిస్ డ్ కాల్ ఇస్తాడు. అది చూసిన వసుధార.. సార్ ఏంటీ కొత్తగా మిస్డ్ కాల్ ఇస్తున్నారు.
కాల్ చేస్తే చెయ్యి లేదంటే.. లేదని అర్థమా. నేను మిస్డ్ కాల్ ఇస్తానని వసుధార అలాగే చేస్తుంది. మెడలో తాళి పడ్డాక తను మాములుగా ఉంటుంది. నేను ఉండలేకపోతున్నా.. సరే నేనే ఫోన్ చేస్తానని అనుకుని ఇద్దరూ ఒకేసారి ఫోన్ చేసుకుంటారు. లేని పంతానికి వెళ్లి రిషి సార్ ను బాధపెడుతున్నాను ఏమో అని వసుధారే కాలే చేస్తుంది.

వసుధారను మాట్లాడనివ్వకుండా..
ఫోన్ లో రిషి, వసుధార ఇద్దరూ సైలెంట్ గా ఉంటారు. ఫోన్ చేసి మాట్లాడకపోతే ఎలా అని మళ్లీ ఇద్దరూ పోట్లాడుకోవడం మొదలు పెడతారు. తిట్టడానికే ఫోన్ చేస్తారు కదా, వసుధార తిన్నవా.. ఏం చేస్తున్నావ్ అని అడగరుగా.. అని అంటుంది వసుధార. ఇది జీవితం ఫజిల్ ఏం కాదు. నాకు బాధ్యతలు తెలుసు అని అంటాడు రిషి.
వసుధారను మాట్లాడనివ్వకుండా తిట్టేసి ఫోన్ పెట్టేస్తాడు రిషి. ఆరోజు అన్ని మాటలు అనకుండా ఉంటే నిజం చెప్పేదాన్ని, ఇలాంటప్పుడు నేనేం చెప్పిన నమ్మరు గొడవ పెద్దది అవుతుందని అనుకుని సైలెంట్ గా ఉండిపోతుంది వసుధార. మరోవైపు మహేంద్ర ఫోన్ లో గేమ్ ఆడుకుంటూ ఉండగా దేవయాని ఎఁట్రీ ఇస్తుంది.

మీకు వచ్చిన కడుపు నొప్పి ఏంటీ..
మళ్లీ నీకు కడుపు నొప్పి ఎప్పుడు వస్తుంది మహేంద్ర అని వెటకారంగా అడుగుతుంది దేవయాని. నిజం కడుపు నొప్పి అయితే చెప్పి రాదు. అబద్ధం కడుపు నొప్పి అయితే మనం అనుకున్నప్పుడే వస్తుంది. వసుధార, రిషి కలిసి టూర్ కి వెళ్లాలని కడుపు నొప్పి నాటకం ఆడారా.. మీరు మాట్లాడుకున్నవన్నీ నేను చాటుగా విన్నానులే అని దేవయాని అంటుంది.
మీకు చాటుగా వినడం ఇష్టం కదా అక్కయ్య అని జగతి అంటుంది. అవును, నాటకం ఆడాను. కావాలని వసుధారతో రిషిని పంపించాను. అందుకు మీకు కడుపునొప్పి ఏంటి. ఇన్నాళ్లు మీరేం చేశారు. నాటకాలు ఆడలేదా.. స్కెచ్ లు వేయలేదా.. వాటి ముందు ఇవి ఎంత చెప్పండి. అవును నేనే నటించాను. ఇప్పుడు ఏంటంట అని మహేంద్ర అంటాడు.

ప్రేమ అనే ముసుగులో తప్పుదారి..
పెళ్లయిన వసుధార వెంట రిషిని పంపించడం ఏంటీ. ఈ విషయం రిషికి చెప్తే ఏమవుతుందే తెలుసా అని దేవయాని బెదిరిస్తుంది. చెప్పండి అక్కయ్య. ఎప్పుడెప్పుడు చెప్తారా అని ఎదురుచూస్తున్నా. మా గురించి మీరు చెప్పండి. మేం ఇన్నాళ్లు కడుపులో దాచుకున్నవన్నీ మేం చెబుతాం అని జగతి అంటుంది. ప్రేమ అనే ముసుగులో రిషిని తప్పుదారి పట్టించారు.
అవన్నీ రిషికి చెబితే తెలుసు కదా.. అని ఇద్దరూ రివర్స్ లో దేవయానిని బెదిరిస్తారు. దీంతో ఏం చేయలేక, ఏం మాట్లాడలేక దేవయాని వెళ్లిపోతుంది. మరోవైపు రిషి మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటుంది వసుధార. ఇంతలో చక్రపాణి వచ్చి వసుధారను పిలుస్తాడు.

ఇక ఆలస్యం చేయను..
నిజం తెలియక రిషి సార్ బాధపడటం.. నిజం చెప్పలేక నువ్వు బాధపడటం ఎందుకమ్మ అని చక్రపాణి అంటాడు. అసలు నిజం తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో అని భయంగా ఉందని వసుధార అంటుంది. మీ ఇద్దరి మధ్య దూరం పెరగకముందే నిజం చెప్పేయమని తండ్రి చక్రపాణి సలహా ఇస్తాడు. దీనికి చెప్పేస్తాను నాన్న.. మనసులోని భారాన్ని మోయలేకపోతున్నా. ఇక ఆలస్యం చేయను. వెళ్లి రిషి సార్ కి నిజం చెప్పేస్తాను అని వసుధార అంటుంది.


Click it and Unblock the Notifications











