Guppedantha Manasu: జగతిని అనుమానించిన రిషి.. మహేంద్ర షాకింగ్ నిర్ణయం.. అయోమయంలో చక్రపాణి!
జగత-మహేంద్ర ఇద్దరు తనను రివర్స్ బెదిరించడంతో రగిలిపోతుంది దేవయాని. అదంతా తలుచుకుంటూ మెట్లు దిగుతూ.. నన్నే రివర్స్ బెదిరిస్తారా.. ఈ దేవయాని అంటే ఏంటో చూపిస్తా. రిషి నా చెప్పు చేతల్లో ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏం చేయలేరు అని అనుకుంటుంది.
అటువైపు రెడీ అవుతున్న రిషిని చూసి.. రిషిని అడిగితే నిజం చెబుతాడో లేదో చూద్దాం అని.. నిన్న ఎక్కడికో వెళ్లావంట కదా అని దేవయాని అడుగుతుంది. వసుధారతో కలిసి మిషన్ ఎడ్యుకేషన్ టూర్ కి వెళ్లానని చెబుతాడు రిషి. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 13 సోమవారం నాటి తాజా ఎపిసోడ్ 685లో ఇంకా ఏం జరిగిందంటే?

నీ ప్రశాంతత గురించి..
వసుధారతో వెళ్లడం గురించి రిషి చెప్పగానే.. రిషి అన్ని నిజాలే చెబుతున్నాడు అని అనుకున్న దేవయాని.. ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన వసుధారతో నువ్వు వెళ్లడం ఎందుకని అడుగుతుంది. వృత్తి పరమైన పనులకు పర్సనల్ ఫీలింగ్స్ ను కలపడం కరెక్ట్ కాదమ్మ పెద్దమ్మ అని రిషి అంటాడు. అలా అయితే వసుధార కాలేజీకి ఎందుకు రావాలి.
వచ్చి నిన్ను ఇబ్బంది ఎందుకు పెట్టడం. నీ కళ్ల ముందే తిరుగుతుంటే బాధగా ఉంటుంది కదా. ఇక్కడ అందరూ నీ ముందు నీకు సపోర్ట్ గా మాట్లాడిన తర్వాత నీ ప్రశాంతత గురించి వాళ్లెవరు (జగతి-మహేంద్ర) ఆలోచించరు. నీ గురించి ఆలోచించేవారు అతి తక్కువగా ఉంటారు. న ఆనందం గురించి ఆలోచించేది ఈ పెద్దమ్మ ఒక్కతే. ఆ వసుధారను కాలేజీ నుంచి తీసేయ్ అని చెబుతుంది దేవయాని.

రిషికి వర్కౌట్ కావట్లేదు..
ఇవన్నీ మీకు అవసరం లేదు పెద్దమ్మా అని రిషి అంటే.. నాకు అవసరం లేదు ఏంటీ రిషి.. నాకే అవసరం అని మనసులో అనుకుంటుంది. అవసరం లేని వాటి గురించి మీరు ఇబ్బంది పడకండి. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి అని చెప్పి రిషి వెళ్లిపోతాడు. దీంతో బిత్తరపోయిన దేవయాని.. నా ఆరోగ్యానికి ఏమైంది. అయినా రిషికి ఒకేసారి అంతా చెప్పకూడదు.
మెల్లిగా మెల్లిగా ఎక్కించాలి అని అనుకుంటుంది దేవయాని. మరోవైపు వసుధార నిజం చెప్పడం లేదు. రిషి నిజం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నా వర్కౌట్ కావట్లేదు. రిషి బాధను చూడలేకపోతున్నాను అని జగతితో మహేంద్ర అంటాడు. ఏం మాట్లాడవేంటీ జగతి అని మహేంద్ర అంటే సైలెంట్ గా ఉంటుంది. ఇంతలో రిషి వచ్చి తలుపు కొడతాడు.

ఏం జరగనట్లు మాములుగా..
రిషిని చూసి లోపలికి రమ్మంటారు మహేంద్ర. మేడమ్ మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని రిషి అడుగుతాడు. షాక్ అయిన జగతి.. మేం నీ దగ్గర ఏం దాస్తాం రిషి అని జగతి అంటుంది. వసుధార పెళ్లి చేసుకుని వచ్చాక కోపంగా ఉన్నారు. దూరం పెట్టారు. కానీ ఈ మధ్య మీరేదో మారినట్లు అనిపిస్తుంది నాకు అని రిషి అంటాండు. ఆహా పుత్ర.
ఇప్పుడు దారిలోకి వచ్చావ్. ఇదే మంచి అవకాశం రిషికి నిజం చెప్పేద్దామని జగతితో చిన్నగా అంటాడు మహేంద్ర. మేడమ్ వసుధార విషయంలో మీ మాట తీరు మారినట్లు ఉంది. అన్నీ మర్చిపోయి ఏం జరగనట్లు మాములుగా ఉంటున్నారు అని రిషి అంటే.. డేట్ మారుతుంది, క్యాలేండర్ మారుతుంది కదా రిషి.. అలానే అని మహేంద్ర అంటాడు.

రెండు రోజులు ఓపిక పడతాను..
డాడ్ మీరు ఉండండి అని మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి మేడమ్ అని రిషి అంటాడు. అసలు నిజం తెలిశాక చెప్పలేదని ఎంత గొడవ చేస్తాడో అని జగతి అనుకుంటుంది. తర్వాత ఇంతన్నా చెప్పేది లేదు అని వెళ్లిపోతాడు రిషి. మంచి అవకాశం జగతి ఇప్పుడే అసలు నిజం చెప్పేస్తే అయిపోయేది అని మహేంద్ర అంటాడు.
ఇప్పుడు రిషికి నిజం చెబితే మనం గొప్పవాళ్లం కావచ్చు కానీ వసుధార బ్యాడ్ అవుతుంది. రిషినే నిజం తెలుసుకోనిద్దామని చెబుతుంది జగతి. దీంతో రెండు రోజులు ఓపిక పడతాను. అంతలోపు రిషి నిజం తెలుసుకుంటే సరి. లేదంటే.. నేనే రిషికి నిజం చెప్పేస్తాను ఇది ఫైనల్ అని మహేంద్ర చెప్పేస్తాడు. మరోవైపు రిషి మాటలు తలుచుకుంటూ వసుధార బాధపడుతుంటే చక్రపాణి వచ్చి పలకరిస్తాడు. అప్పుడే రిషి వచ్చి హారన్ కొడతాడు.

తలనొప్పిగా ఉందంటూ వసుధార..
ఇది రిషి సార్ కార్ హారనే అనుకున్న వసుధార.. మళ్లీ తిట్టడానికే వచ్చి ఉంటారు అని అలాగే ఉండిపోతుంది. హారన్ సౌండ్ ఇట్టే గుర్తి పట్టేస్తుంది కదా.. రావడం లేదు ఏంటని రిషి అనుకుంటాడు. వసుధార ఎంతకీ రాకపోయేసరికి రిషి ఇంట్లోకి అడుగు పెట్టే సమయంలోనే వసుధార కావాలనే తనకు తలనొప్పిగా ఉన్నట్లు తండ్రి చక్రపాణికి చెబుతుంది.
చక్రపాణి రిషి సార్ అని అంటే కావాలని మాట దాటేస్తుంది. ఈలోపు రిషి సౌండ్ చేయడంతో లోపలికి పిలుస్తాడు చక్రపాణి. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి నేను వెళ్లి కాఫీ తీసుకొస్తాను అని చక్రపాణి అంటాడు. కానీ వసుధార మాత్రం తండ్రిని ఆపి కాఫీ మీకు కలపడం రాదు.. అలా కలపడం కొందరికే బాగా వస్తుందన తనే వెళ్తుంది.
నువ్ ఇలా చేయవు కదా..
వసుధార వచ్చి కాఫీ ఇస్తుంటే నాకు తలనొప్పి ఏం లేదు అని తీసుకోడు రిషి. అయితే వాళ్లిద్దరూ మాట్లాడుకోకుండా చక్రపాణిని మధ్యలో పెట్టి మాట్లాడుతారు. దీంతో ఏదో తగాదా పడ్డట్టు ఉన్నారు అని చక్రపాణి అయోమయంగా ఉంటాడు. తలనొప్పిగా ఉందని కాలేజీకి వెళ్లను అని చక్రపాణితో వసు అంటే.. అలా సడెన్ గా చెబితే ఎలా అని అదే చక్రపాణితో రిషి అంటాడు.
దీనికి రిషి ఎదుటే లీవ్ కావాలని ఎండీ అంటూ నొక్కి మరి మెయిల్ పెడుతుంది. తర్వాత అక్కడి నుంచి రిషి వెళ్లిపోతాడు. ఒకచోట కారు ఆపి.. తను కావాలనే తలనొప్పి అని అబద్ధం చెబుతోంది. తను వసుధారను అన్న మాటలు తలుచుకుంటూ నువ్ ఇలా చేయవు కదా. ఎందుకు అన్నీ మర్చిపోయినట్లు ఎలా ఉండగలుగుతున్నావ్ అని వసుధారతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటాడు రిషి. తర్వాత వసు లీవ్ ను క్యాన్సిల్ చేస్తున్న అని చెబుతాడు రిషి. తర్వాత రాత్రి ఇంటికి వెళ్లిన రిషి వసుధార గురించి ఆలోచిస్తూ ఏం చేస్తున్నావ్ అని మెసేజ్ పెడతాడు.


Click it and Unblock the Notifications











