Guppedantha Manasu: వసుధార భర్త కోసం రిషి ప్రయత్నం.. జగతి కొత్త ప్లాన్, తల్లికి దక్కిన కొడుకు ప్రేమ!
ఇంట్లో కూర్చుని వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు రిషి. వసుధారకు తలనొప్పి అన్నమాట గుర్తొచ్చి ఎలా ఉన్నావ్ అని మెసేజ్ చేస్తాడు రిషి. దానికి కంప్యూటర్ పిక్ పంపించిన వసుధార.. తలనొప్పి తగ్గిందా అని అడగొచ్చు కదా అనుకుంటుంది వసుధార. తర్వాత తలనొప్పి తగ్గిందా అని రిషి మెసేజ్ చేస్తే.. మీరు వెళ్లిపోయారు గా అని రిప్లై ఇస్తుంది వసుధార. అప్పుడు అంటే.. నేను తలనొప్పా.. వసుధారను ఎక్కువగా విసిగించానా.. కోపంగించుకున్నానా అని అనుకుంటాడు రిషి. ఇద్దరూ ఒకేసారి కాల్ చేయడంతో.. ఇద్దరికీ బిజీ వస్తుంది. దీంతో ఇద్దరు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 14 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్ 686లో ఇంకా ఏం జరిగిందంటే?

జాబ్ ఎలా ఉంది..
వసుధార ఫోన్ బిజీగా రావడంతో... ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుంది అనుకున్న రిషి.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తాడు. వసుధార కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో.. ఏంటీ రిషి సార్ ఇది అనుకుంటూ ఉంటుంది వసుధార. అనంతరం వసుధార జ్ఞాపకాలను తలుచుకుంటాడు రిషి. వసుధార మెడలో తాళిని చూసిన కూడా ఈ బంధం ఏంటీ అంటూ బాధ పడుతుంటాడు రిషి. రిషి అనుకునే ప్రతి ప్రశ్నకు అటువైపు వసుధార సమాధానం ఇస్తుంది. అనంతరం ఉదయం ఆఫీస్ లో రిషి ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వసుధార ఫ్రెండ్ పుష్ప వస్తుంది. ఎలా ఉన్నావ్.. జాబ్ ఎలా ఉంది.. ఎందుకు వచ్చావ్ అన్న రిషి ప్రశ్నలకు.. స్టడీ సర్టిఫికేట్ కోసం వచ్చినట్లు పుష్ప చెబుతుంది.

ఎప్పుడు అడిగిన దాటేస్తుంది..
అనంతరం వసుధార గురించి పుష్ప దగ్గర ఆరా తీస్తాడు రిషి. వసుధార భర్తను చూశావా అంటే చూడలేదని చెబుతుంది. అందుకే ఒక ప్లాన్ వేసాం. ఈ సండే అందరం కలిసి వసుధార వాళ్ల ఇంటికి వెళ్తున్నాం అని పుష్ప అనడంతో.. మంచి ఐడియా అన్న రిషి.. మీరు వసుధార ఇంటికి వెళ్లే బదులు వసుధారను, తన హస్బండ్ ను మీ ఇంటికి రమ్మని చెప్పు అంటాడు. పిలిచాను సార్.. కానీ ఇంకెప్పుడైన వస్తామని చెప్పింది అని పుష్ప చెబుతుంది. తెలివైందిగా అలాగే తప్పించుకుంటుంది అని అనుకున్న రిషి.. పెళ్లి ఫొటోలు, వీడియోలు ఏమైనా అడిగావా అని అడుగుతాడు. అడిగాను సార్.. ఏం అడిగినా మాట దాటేస్తుంది సార్ అని చెబుతుంది పుష్ప.

కాలేజీ ఏండీ మీరే కదా..
తర్వాత అక్కడి నుంచి పుష్ప వెళతానని చెబుతుంది. ఆమె దగ్గరి నుంచి వసుధార తండ్రి ఫోన్ నెంబర్ అడిగి తీసుకుంటాడు రిషి. వసుధార తండ్రి చక్రపాణికి కాల్ చేస్తాడు రిషి. అయితే ఆ కాల్ వసుధార లిఫ్ట్ చేస్తుంది. దీంతో వెంటనే కాల్ కట్ చేస్తాడు రిషి. ఆ తర్వాత వసుధారే రిషికి కాల్ చేస్తుంది. కాల్ కట్ చేసిన పదే పదే వసుధార కాల్ చేయడంతో లిఫ్ట్ చేస్తాడు రిషి. అప్పుడు కావాలనే రిషిని ఆటపట్టిస్తుంది వసుధార. ఫోన్ లో పదే పదే ప్రతి దానికి ఎండీ గారు అంటూ నొక్కి మాట్లాడుతుంది వసుధార. అలా పిలవకు అని రిషి అన్నా కూడా కాలేజీ ఎండీ మీరే కదా అని ఆటపట్టిస్తుంది వసుధార. దీంతో సిగ్నల్ సరిగ్గా లేదని వెంటనే కట్ చేస్తాడు రిషి.

సీరియస్ గా ఉన్నప్పుడే అలా..
కాల్ కట్ అయిన తర్వాత నా పెళ్లి వివరాల కోసం బాగానే ప్రయత్నిస్తున్నారు అని అనుకుంటుంది వసుధార. ఆ తర్వాత కాలేజీకి వెళ్తుంది వసుధార. అక్కడ రిషి జేబులో చేతులు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ నడుస్తుంటాడు. అది చూసిన వసుధార రిషి సార్ ఏంటీ అలా వెళ్తున్నారు. మూడాఫ్ లో ఉన్నప్పుడు, సీరియస్ గా ఉన్నప్పుడే అలా నడుస్తారు. ఇప్పుడు మేం ఏం గొడవ పడలేదు కదా. ఎందుకు అలా నడుస్తున్నారు అని రిషి వెనుక ఫాలో అయి.. రిషి పక్కనే.. రిషిలాంటి ఎక్స్ ప్రేషన్స్ పెట్టి కూర్చుంటుంది. రిషిలా ఇమిటేట్ చేస్తుంది. ఇంతలో వసుధారను గమనించిన నువ్వెప్పుడు వచ్చావ్ అని రిషి అడుగుతాడు. నేనేప్పుడు మీ వెనకే ఉంటాను కదా సార్ అని వసుధార అంటుంది.

నిజం తెలిసాకా అంత ప్రశాంతతే..
నువ్వు నా వెనకాల కాదు.. నా పక్కన ఉండాల్సింది అని రిషి మనసులో అనుకుంటే.. వెనుక ఉన్న వారే పక్కకు వస్తారు. ఆ తర్వాత ముందుకు వస్తారు అని వసుధార అంటుంది. మ్యాథ్స్ లో లాజిక్స్ ఉంటాయి. జీవితంలో కాదు అని రిషి అంటాడు. ఎక్కువగా ఆలోచించకండి సార్.. అన్ని విషయాలు తెలిసాక అంత ప్రశాంతంగా ఉంటుంది అని వసుధార అంటే.. అలాంటప్పుడు ఎందుకని కొన్ని విషయాలు దాచావ్ అని రిషి అంటాడు. కొన్ని విషయాలు దాచాలి సార్ అని వసుధార అంటుంది. ఇదే నీతో వచ్చింది వసుధార. చెప్పాల్సినవి దాచేస్తావ్. దాచాల్సినవి చెబుతావ్ అని రిషి అంటాడు. ఇలా బాధ, జీవితం, ప్రేమ అంటూ మాట్లాడుకుంటూ ప్రేమగా పొగుడుకుంటారు.

సంతోషంలో జగతి..
ఇంతలో కాలేజీ మీటింగ్ ఉంది పదండి సార్ అని వసుధార అంటే.. నువ్వు వెళ్లు నేను తర్వాత వస్తా అని రిషి అంటాడు. అప్పుడు 7 లెక్కపెట్టేలోపు రావాలి అని లెక్కపెట్టేలోపు రిషి వస్తాడు. మరోవైపు రిషి, వసు గురించి జగతి-మహేంద్ర ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పటికే రెండు రోజుల్లో ఒక్క రోజు గడిచింది. ఇంకొక రోజు మాత్రమే ఉందని మహేంద్ర అంటాడు. ఎందుకు మహేంద్ర అలా అంటావ్. నాకు కూడా ఓపిక నశిస్తోంది అని జగతి అంటుంది. ఇంతలో రిషి వచ్చి తలుపు కొట్టడంతో.. జగతి కొత్త ప్లాన్ వేస్తుంది. రమ్మంటే రానంటున్నావేంటీ అని జగతి అంటే.. జగతి సైగ చూసి అర్థం చేసుకుని అవును రానంటే రాను అని మహేంద్ర అంటాడు. ఎక్కడికి అని రిషి అడిగితే.. జగతి ఎక్కడికి రమ్మంటే అక్కడికి అని కవర్ చేస్తాడు మహేంద్ర. దీంతో మేడమ్ మిమ్మల్ని నేను తీసుకెళతాను పదండి అని అనడంతో జగతి తెగ సంబరపడిపోతుంది.


Click it and Unblock the Notifications











