Guppedantha Manasu: హమ్మయ్యా.. వసుధార భర్త ఎవరో తెలుసుకున్న రిషి.. తొలిగిపోయిన ప్రేమ చాటు మబ్బులు!
రిషికి కావాల్సిన మనిషి గదిలో ఉన్నాడని చెప్పడంతో అక్కడికి వెళ్లి చూస్తాడు రిషి. అయితే అక్కడ ఎవరు ఉండకపోగా అద్దంలో రిషి కనిపిస్తాడు. గదిలో ఎవరు లేరన్న కోపంతో బయటకు వెళ్లిపోతాడు రిషి. అనంతరం జగతి, మహేంద్రను కలిసి జరిగినదంతా చెబుతుంది. ఇలా కాదు.. ఏదో ఒకటి తేల్చేద్దాం అని వసుధార దగ్గరికి బయలు దేరతారు జగతి-మహేంద్ర.
వసుధార లైబ్రరీలో బుక్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. అక్కడికి రిషి కూడా వస్తాడు. తనకు కావాల్సిన బుక్స్ వెతుక్కుంటూ చూస్తాడు. ఇంతలో కిందపడిన బుక్స్ తీస్తుండగా వసుధార మెడలోని తాళి బయటపడతుంది. ఆ తాళికి వీఆర్ అని గతంలో రిషి ఇచ్చిన ఉంగరం ఉంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 16 గురవారం నాటి తాజా ఎపిసోడ్ 688లో ఇంకా ఏం జరిగిందంటే?

వసుధా చేయి పట్టుకున్న రిషి..
లైబ్రరీలో ఎదురెదురుగా బుక్స్ చూసుకుంటూ వెళ్తుంటారు వసుధార, రిషి. ఇలా బుక్స్ చూస్తుండగా.. అటవైపు నిల్చున్న వసుధార మెడలో తాళికి ఉన్న వీఆర్ ఉంగరం చూసి షాక్ అవుతాడు రిషి. వసుధార అలా నడిచి వెళ్లిపోతుండగా.. నమ్మకం కుదరక.. అలాగే వెంటపడి మరి చూస్తాడు.
పరుగున వెళ్లి వసుధార ఎదురుగా నిలబడతాడు. వసుధార మెడలోని తాళి అలాగే చూస్తూ ఉండిపోతాడు. అది గమనించిన వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ ఉంగరంపై వేలు పెట్టి రిషి చూపిస్తుండగా.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార. తన వెనుకే వెళ్లిన రిషి.. వసుధార చేయి పట్టుకుంటాడు. ఏంటది అని రిషి అడుగుతాడు. ఏది సార్ అని వసుధార అంటుంది.

ఎందుకు అర్థం చేసుకోలేదు..
ఆ వీఆర్ అనే ఉంగరం అక్కడ ఎందుకుంది అని రిషి అడుగుతాడు. నా మెడలోకి ఈ ఉంగరం నా ఇష్టం లేకుండా రాదు కదా సార్ అని వసుధార అంటుంది. రిషి ఏదో చెప్పబోతుండగా ఇంతలో లైబ్రేరియన్ వస్తాడు. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న బుక్స్ వచ్చాయని రిషికి చెబుతాడు. వసుధారను చూసి మేడమ్ మీరు ఎప్పుడు వచ్చారని అడుగుతాడు.
దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార. ఆటోలో వెళుతూ రిషి అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. నేను ఎంత చెబుదామని ట్రై చేస్తున్నా మీకు అర్థం కావడం లేదు. ఆ గదిలో మీకు కావాల్సిన వాళ్లు ఉన్నారని చెబితే వెళ్లారు. ఆ గదిలో మీరు ఒక్కరే ఉన్నారని ఎందుకు అర్థం చేసుకోలేదని, అనవసర కోపం తెచ్చుకుని నన్నే ప్రశ్నిస్తున్నారు. నా ప్రశ్నకు మీరే సమధానం అని ఎప్పటికి తెలుసుకుంటారు అని వసుధార అనుకుంటుంది.

నేను ఇచ్చిన ఉంగరం మెడలో ఏంటీ..
మన మధ్య అడ్డుతెర ఎప్పుడో తొలగిపోయింది. కానీ మీరే తెలుసుకోవడం లేదు అని వసుధార మనసులో అనుకుంటుండగా.. తండ్రి చక్రపాణి ఫోన్ చేస్తాడు. ఇంటికి రావడం లేట్ అవుతుందని.. మీరు కంగారు పడకండి అని చెబుతుంది వసుధార. రిషి సార్ ఎప్పుడు నిజం తెలుసుకుంటారో... మా వసుధార ఎప్పుడు సంతోషంగా ఉంటుందో అని చక్రపాణి అనుకుంటాడు.
మరోవైపు రిషి కారులో కూర్చోని వసుధార అన్న మాటలు, మెడలో తాళి, దానికి ఉన్న వీఆర్ ఉంగరం అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను ఇచ్చిన ఉంగరం తన మెడలో ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది. ఇది కరెక్ట్ కాదు కదా. చాలా ప్రశ్నలున్నాయి. కానీ ఒక్కదానికి సమాధానం చెప్పదు అని రిషి అనుకుంటూ ఉంటాడు.

నాతో ఆటలాడటం ఏంటీ..
అసలు వసుధార ఏం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. తన మనసులో ఉన్నది ఏది బయటపెట్టదు. మీకు కావాల్సిన మనిషి లోపలున్నారు అంది. వెళ్లి చూస్తే అక్కడ ఎవరు లేరు. ఆ అద్దంలో నన్ను నేను చూసి ఏమనుకోవాలి. తన ఉద్దేశం ఏంటీ. నాకు ఎండీగా గౌరవం ఇస్తోందా. ఆ గౌరవం నాకు ఏమొద్దు. వసుధార నాతో గేమ్స్ ఆడుతోందా. క్లూస్ ఇస్తోందా.
ఏంటీ ఇదంతా అని తనలో తానే సమతమైపోతాడు రిషి. వసుధార తెలివైందో కావొచ్చు.. యూనవర్సిటీ టాపరే కావొచ్చు. కానీ నా లైఫ్ లోకి వచ్చి నా జీవితాన్ని చిందరవందర చేసి నాతో ఆటలాడటం ఏంటీ. ఏదో జరిగింది. కానీ చెప్పడం లేదు. అసలు జరిగింది చెప్పడానికి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ చెప్పలేదు అని అనుకుంటాడు రిషి.

వసుధార ఇంకా రాలేదు..
కోపంలో నేను అన్నమాటలతో నన్నే తెలుసుకోమంది అని వసుధార అన్న మాటలు తలుచుకుంటాడు రిషి. నేను ఇంకా ఓపిక పట్టలేను. ఈ బాధను భరించలేను. అటో ఇటో తేల్చుకుంటాను అని వసుధార ఇంటికి వెళతాడు రిషి. ఇంటికొచ్చిన రిషిని చూసి ఇంట్లోకి ఆహ్వానిస్తాడు చక్రపాణి. వసుధారను పిలవండి అంటే.. ఇంకా రాలేదని, లేట్ అవుతుందని చెప్పిందని చెబుతాడు చక్రపాణి.
మీకు బాధ్యత లేదా అడగరా అని రిషి అంటే. ఒకప్పుడు అడిగేవాన్ని. ఇప్పుడు అడగటం మానేశాను. అయిన ఈ తరం పిల్లలను ఏమని అడుగుతాం అని చక్రపాణి అంటాడు. తను వచ్చేవరకు వెయిట్ చేస్తాను అంటే.. ఇక్కడ ఫ్యాన్ సరిగ్గా పనిచేయదు.. ఆ గదిలో కూర్చోండి అని చెబుతాడు చక్రపాణి.

వసు చెబితే అబద్ధం ఉండదు..
వసుధార గదిలోకి వెళ్లిన రిషి.. మొన్న వచ్చినప్పుడు ఈ గదిలో నాకు కావాల్సిన వారు ఉన్నారని వసు చెప్పింది. కానీ ఎవరు లేరు అని రిషి అంటే.. వసు అమ్మ చెబితే నిజమే కదా సార్ అని చక్రపాణి అంటాడు. అప్పుడు ఎవరు లేరు.. ఇప్పుడు ఎవరు లేరు అని రిషి అంటే.. వసు అమ్మ ఎప్పుడు నిజమే చెబుతుంది. మీకు కాఫీ ఇవ్వకపోతే.. వసు అమ్మ ఒప్పుకోదు సార్.. అని కాఫీ తీసుకురావడానికి వెళతాడు చక్రపాణి.
వసు అమ్మ చెప్పిందంటే అబద్దం ఉండదందీ అని మరోసారి అనేసి అద్దం వైపు చూసి వెళ్లిపోతాడు చక్రపాణి. ఇంతలో వెనక్కు తిరిగి అద్దంలో తనను తాను చూసుకుంటాడు రిషి. అప్పుడు వసు మాటలు, చక్రపాణి మాటలు పదే పదే గుర్తు చేసుకుంటాడు రిషి. ఇంతలో ఫ్యాన్ గాలికి పేపర్లన్నీ ఎగిరి కింద పడతాయి.
నన్ను బాధపెడుతూ.. నువ్వు బాధపడుతున్నావా..
ఆ పేపర్లపై వీఆర్ అని, ఐ లవ్యూ ఏండీ గారు మీ పొగరు అని రాసి ఉంటుంది. అలాగే గోలీల సీసా.. నెమలీకా అన్ని కనిపిస్తాయి. ఆ నెమలీక, గోలీల సీసాను పట్టుకుని అద్దంలో చూసుకుంటాడు రిషి. మరోసారి వసుధార అన్న మాటలు గుర్తు చేసుకున్న రిషికి తను వెతుకుతుంది తననే అని అర్థమైనట్లు చూపించారు. నన్ను బాధపెడుతూ.. నువ్వు బాధపడుతున్నావా వసుధార అనుకోని బయటకు వెళ్తాడు రిషి.
ఇంతలో కాఫీ చక్రపాణి కాఫీ తీసుకొస్తే.. వద్దని చెబుతాడు రిషి. మా సమస్యను మేమే ఇద్దరం తేల్చుకుంటాం అంటాడు రిషి. వసు ఎక్కడుందో అని చక్రపాణి అంటే.. నాకు తెలుసు అని వెళ్లిపోతున్న రిషి మళ్లీ వచ్చి చక్రపాణికి థ్యాంక్స్ చెబుతాడు. ఇలా వసుధార భర్త ఎవరో రిషికి దాదాపు తెలిసినట్లుగా అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











