Guppedantha Manasu: ఒక్కటైన ప్రేమ పక్షులు.. టెన్షన్ లో వసుధార.. దేవయానితో మహేంద్ర అలా!
వసుధార అమ్మవారి దగ్గర మొక్కుకుంటూ జరిగిన విషయాలు చెప్పుకుని బాధపడుతుంటుంది. ఇదంతా రిషి సార్ కోసమే కదా చేసింది. ఆయన ఎందుకు అర్తం చేసుకోవడం లేదు. నా బాధ ఎవరికీ చెప్పుకోవాలి నీకు తప్పా. ప్రతి చిన్న విషయంలో నన్ను అర్థం చేసుకునే రిషి సార్.. ఇప్పుడు ఇలా ఎందకు చేస్తున్నారు. నా సంతోషమైనా దుఃఖమైనా నీతోనే కదా నేను పంచుకునేది అని బాధపడుతుంటుంది వసుధార. తర్వాత అక్కడున్న పసుపు, కుంకుమతో రిషిధార అని రాస్తుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 17 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్ 689లో ఇంకా ఏం జరిగిందంటే?

ఈ వేదన ఎన్నాళ్లు..
పసుపుతో రిషి అని.. కుంకుమతో ధార అని మొత్తంగా రిషిధార అని రాస్తుంది వసుధార. రిషి సార్ కి చెప్పాలంటే భయం వేస్తోంది. అందుకే ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తున్నాను. అద్దంలో తన రూపం చూసినప్పుడైనా అర్థం కాలేదా. రిషి సార్ కి నిజం తెలిసిందో లేదో అర్థం కానట్టు ఉంటున్నారో తెలియట్లేదు. ఇంకా ఈ వేదన ఎన్నాళ్లు.. ఈ దోబుచులాట ఎన్నాళ్లు.. రిషి సార్ ని నువ్వే మార్చాలి తల్లీ.. తను నిజం తెలుసుకుని వసుధార అంటూ నా దగ్గరకి రావాలి. నువ్వే ఆ పని చేయాలి అని వేడుకుంటుంది వసుధార. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి.. వసుధార అని పిలుస్తాడు. దీంతో వెంటనే వసుధార వెనక్కి తిరగ్గా.. వచ్చి హగ్ చేసుకుంటాడు రిషి. ఇలా ప్రేమగా కొద్దిసేపు కౌగిలించుకుంటారు రిషి, వసుధార.

ఏటీ దాగుడుమూతలు..
హగ్ చేసుకున్నాకా.. వసుధార మెడలోని తాళి రిషి షర్ట్ బటన్ కి ముడిపడుతుంది. అది తొలగించాక.. ఓ నిజం తెలుసుకునేందుకు నాకు ఇన్నాళ్లు పట్టిందేంటి.. ఇన్నాళ్లు ఎందుకు ఆగాలి. ఎందుకు ఇలా చేశావ్ వసుధార అని రిషి అంటే మీకోసమే సార్ అని వసుధార సమాధానం ఇస్తుంది. నాకోసమే అయితే నాకు ఎందుకు చెప్పలేదు.. ఏంటీ దాగుడుమూతలు. ఎందుకు దాచావ్ అని రిషి అడిగితే.. నేను దాచలేదు సార్ అని వసుధార అంటుంది. ఇన్ని రోజులు నా ఎమోషన్స్ తో, నా మనసుతో, నా ప్రేమతో ఆడుకున్నావ్.. ఇలా ఎందుకు అని రిషి అంటాడు. అసలు ఆరోజు ఏమైందంటే అని పెళ్లి రోజు జరిగినదంతా చెబుతుంది వసుధార. తన బావ రాజీవ్ రిషిని చంపేస్తానని బెదిరించడం.. తన తల్లిని పొడవడం అన్నీ చెబుతుంది.

రంపంతో నా గుండె కోసినట్లు..
వసుధార చెప్పింది విన్న రిషి షాక్ అవుతాడు. మన మధ్య దాపరికాలు ఉండవు అనుకున్నాను. నీ సైడ్ నుంచి నువ్వు కరెక్ట్ గానే చేసి నన్ను చేతగాని వాడివి చేశావ్ అని రిషి అంటే.. అయ్యే అలా ఎందుకు ఆలోచిస్తున్నారు సార్ అని వసుధార అంటుంది. దానికి.. కాలేజీలో వసుధార పెళ్లి చేసుకుంది అని ప్రతి ఒక్కరు అన్నప్పుడల్లా రంపంతో నా గుండె కోసినట్లు అయింది. ఇన్ని రోజులు ఒక శవంలా బతికాను. అయినా నీ చేతులతో నువ్వు తాళి కట్టుకోవడం ఏంటీ వసుధార అని రిషి ప్రశ్నిస్తే.. నేనే వేసుకున్నాను.. అది మీరు కట్టినట్లుగా భావించాను అని వసుధార చెబుతుంది. దీంతో కోప్పడిని రిషి.. అన్నీ నీ అంతట నువ్వు చేశావ్.. కానీ నేను నరకం అనుభవించాను అని రిషి అంటాడు. మెడలో తాళి చూపించి.. ఇది మీ చేతులతో మీరే ఇచ్చారు అనడంతో ఆశ్చర్యపోతాడు రిషి. ఇంతకన్నా ఈ తాళికి పవిత్రత ఏముంటుంది అని వసుధార అంటుంది.

రిషి పెళ్లికి కూడా ఇలానే..
నువ్ చేసింది ముమ్మాటికి తప్పు.. తప్పే అని అరుస్తుంటాడు. ఇంతలో వసుధార కళ్లు తిరిగి పడిపోతుంది. మరోవైపు ధరణి లగ్న పత్రిక తీసుకుని వెళ్తుండగా.. ఏంటది అని దేవయాని అడుగుతుంది. తెలిసిన వారు ఎవరో శుభలేఖ ఇచ్చారు అని ధరణి చెప్పడంతో అది చూస్తుంటుంది. ఇంతలో అక్కడికి జగతి మహేంద్ర రావడం గమనించి.. అంతా బాగుంటే ఈపాటికి రిషి పెళ్లికి కూడా శుభలేఖలు చేయించే వాళ్లం కదా అని అంటుంది దేవయాని. దీంతో దేవయానిపై మహేంద్ర సెటైర్లు వేస్తుంటాడు. త్వరలో శుభలేఖలు ప్రింట్ అయ్యేలా.. అందులో రిషి పేరు ఉండేలా చేయి దేవుడా అని మహేంద్ర అంటే.. మరి రెండో పేరు ఎవరిది అని ధరణి అంటుంది. అది దేవుడు డిసైడ్ చేస్తాడులే ధరణి అని మహేంద్ర అంటాడు.

నాదు డైరెక్ట్ అటాక్..
మహేంద్ర మాటలకు మీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావడం లేదని దేవయాని అంటే.. ప్లాన్స్ వేయడాలు.. మనుషులను పురమాయించడాలు.. నేరస్తులను రప్పించడాలు.. బెయిల్ ఇప్పించడాలు నాకు రాదు. ఏదైనా డైరెక్ట్ అటాక్ అని మహేంద్ర అంటాడు. అవును మహేంద్ర. మన మనసులో ఏం ఉండదు అని జగతి అంటుంది. ఇప్పటివరకూ చేసింది చాలు.. రిషి పెళ్లి గురించి ఆలోచించడం మానేయండి.. రిషి జీవితాన్ని ఎలా తీర్చి దిద్దాలో నాకు తెలుసు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని. దీంతో జగతి, ధరణి ఇద్దరూ నవ్వుకుంటారు. మరోవైపు రిషి కారులో వసుధారను తీసుకెళ్తూ ఉంటాడు. జరిగినవన్నీ తలుచుకుంటాడు.

అంతా ప్రేమ ఉన్నదానివి ఇలా ఎందుకు..
ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర ఎలా దాచావు వసుధార. ఇన్నిరోజులు ఇలా బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని అనుకుంటాడు రిషి. తర్వాత వసుధార మేలుకోవడంతో.. ఒకవైపుకు కారు ఆపుతాడు. ఏంటీ వసుధార అలా పడిపోయావ్ అని రిషి అంటే.. టెన్షన్ లో పడిపోయాను సార్.. అని వసుధార అంటుంది. హాస్పిటల్ కు వెళ్దామని రిషి అంటే.. లేదు సార్.. బాగా సంతోషంలో ఉన్నా.. టెన్షన్ లో ఉన్నా ఇలా అవుతుంది కదా సార్ అని చెబుతుంది. అప్పుడే రిషికి ఎక్కిళ్లు రావడంతో వసుధార వెళ్లి వాటర్ బాటిల్ కొనుక్కొని వస్తుంది. నీకే ఆరోగ్యం బాలేదు. నువ్వే వెళ్లి తీసుకురావాలా అని రిషి అంటే.. ప్రేమ సార్ అని వసుధార అంటుంది. అంతా ప్రేమ ఉన్నదానివి ఎందుకు ఇలా చేశావ్ వసుధార అని రిషి అంటాడు.


Click it and Unblock the Notifications











