Guppedantha Manasu: రిషి జీవితంలో సునామీ.. ఆవిరైన సంతోషం.. అడ్డంగా బుక్కైన జగతి-మహేంద్ర!
వసుధార జరిగినదంతా చెప్పాక రిషికి ఎక్కిళ్లు వస్తే వసుధార వెళ్లి నీళ్ల బాటిల్ తీసుకొస్తుంది. నీళ్లు తాగిన తర్వాత ఇందాకే కళ్లు తిరిగి పడిపోయావ్ కదా.. నువ్వు వెళ్లి వాటర్ బాటిల్ తీసుకురావడం అవసరమా. అంత మొండితనం ఎందుకు అని రిషి అంటాడు. మొండితనం కాదు సార్.. ప్రేమ అని వసుధార అంటుంది. అంత ప్రేమ ఉన్నదానికి ఎందుకు అంతలా బాధపెట్టావ్ అని రిషి అంటే.. నేను కూడా బాధపడ్డాను సార్ అని వసుధార సమాధానం ఇస్తుంది.
మీ ద్వేషం కోపంతో వచ్చింది కాదు. నాపై ప్రేమ వల్ల వచ్చిన కోపం, ద్వేషం అని వసుధార చెబుతుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 18 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్ 690లో ఇంకా ఏం జరిగిందంటే?

తప్పులన్నీ ఎండీ గారివేనా..
మనం ప్రేమించినవాళ్లు చిన్న తప్పు చేసినా తట్టుకోలేం అంటూ చెబుతుంది వసుధార. దీంతో కొంచం గ్యాప్ దొరికితే చాలు హిత బోధ చేస్తావ్ అని రిషి అంటాడు. చూశారా.. నిజం చెబుతుంటే హిత బోధ అంటున్నారు అని వసుధార అంటుంది. తర్వాత సరే.. నేను ఏం మాట్లాడను. ఇలానే సైలెంట్ గా ఉంటాను అని అన్న వసుధార సడెన్ గా కారు ఆపమని చెబుతుంది.
ఓ పక్కకు కారు ఆపగా.. వసుధార దిగి.. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి కానీ చెప్పను. ఎందుకంటే మా ఎండీ గారికి ముక్కు మీద కోపం. ప్రతిదానికి కోప్పడుతూ ఉంటాడు అని వసుధార అంటుంది. హో.. తప్పులన్నీ మీ ఎండీగారివేనా.. మీవి ఏం లేవా అని రిషి అంటాడు.

వసుధార నాదే..
ఏమో.. ఆయనుక వెంటనే కోపం వస్తుంది. కానీ మా ఎండీగారితో జీవితాంతం కలిసి ప్రయాణం చేయాలని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార. అనంతరం ఒక చోటుకు వెళ్లిన రిషి తెగ సంతోషపడతాడు. వసుధార మాటలు, హగ్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ వసుధార నాదే అనుకుంటాడు. ఓ ఆకాశమా విన్నావా.. నేను ఓడిపోలేదు.
వసుధార ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. మిస్టర్ రిషీంద్ర భూషణ్ ఈ వసుధార నీదే అంటూ గట్టిగా అరుస్తూ తెగ ఆనందపడతాడు. ఇన్నాళ్లు ఎంత బాధపడ్డాను. ఎంత నరకం చూశాను. వర్షం వెలిసింది. కాదు కాదు.. నా జీవితంలోకి ఓ సునామీ వచ్చి వెళ్లిపోయింది అనుకుంటాడు.

వదినకు బాగుంటుంది..
మరోవైపు ధరణి కిచెన్ లోకి వెళుతుండగా అక్కడ హాల్లో దేవయాని కూర్చుని ఉంటుంది. ఈవిడకు కనిపిస్తే ఏదో ఒకటి అంటుంది అనుకుని దొంగచాటుగా వెళ్తుంది. అది గమనించిన దేవయాని.. ఏంటీ వెనుక నుంచి వెళ్తున్నావ్ వెన్నుపోటు పొడుద్దామనా అని అడుగుతుంది. ఇంతలో అక్కడికి రిషి చాలా సంతోషంగా వస్తాడు. అది గమనించిన దేవయాని ఏంటీ ఇంత సంతోషంగా ఉన్నాడు అనుకుంటుంది. వదిన ఈ మధ్య మీతో మాట్లాడటం కుదరలేదు.
కావాలంటే అప్పుడప్పుడు కాలేజీకి రండి. కాలేజీ విషయాలు మీకు కూడా తెలియాలి. ఇంట్లో బోర్ గా ఉండే చెప్పండి.. అక్కడ జాబ్ చేసుకోండి అని రిషి అంటాడు. దీంతో షాక్ అయిన దేవయాని అంత పని చేయకు రిషి. ధరణి కాలేజీకి వస్తే నాకు ఇబ్బంది అవుతుంది కదా అని అంటుంది. దీనికి రానివ్వండి వదినకు కూడా బాగుంటుంది అని రిషి అంటాడు.

బయటకు కోపం నటిస్తాడు..
తర్వాత పెద్దమ్మా ఈ మధ్య మీరు షాపింగ్ కు వెళ్లనట్లు ఉన్నారు. ఓరోజు షాపింగ్ చేద్దామని అంటాడు రిషి. ఏంటీ రిషి చాలా కొత్తగా కనిపిస్తున్నావ్ అని దేవయాని అంటే అవును నాకు కూడా కొత్తగానే ఉంది పెద్దమ్మ అని వెళ్లిపోతాడు రిషి. మరోవైపు వసుధార ఇంట్లో జగతి, మహేంద్ర కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడు వసుధార కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంపై జగతి సీరియస్ అవుతుంది. దీంతో ఈ సంతోష సమయాన్ని మనం పార్టీ చేసుకోవాలి అని అంటాడు మహేంద్ర.
తర్వాత రిషి నువ్వు కలిసిపోయినట్టేనా అని మహేంద్ర అడిగితే.. నిజం తెలిసింది కానీ రిషి సార్ నా మీద ఇంకా కోపంగా ఉన్నారు అని వసుధార అంటుంది. రిషి మాములుగా లోపల ప్రేమగా ఉంటాడు. కానీ బయటకు మాత్రం కోపం ఉన్నట్లు నటిస్తూ ఉంటాడు అని మహేంద్ర అంటాడు.

మీరందరూ గొప్ప నటీనటులు..
మనకు నిజం తెలిసిన కూడా చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు రిషి నిజం తెలుసుకున్నాడు అదే చాలు అనగానే రిషి అక్కడికి వచ్చి చప్పట్లు కొడుతుంటాడు. వసుధార తన మెడలో తానే తాళి వేసుకుందన్న విషయం మీ అందరికీ ముందే తెలిసి కూడా నా దగ్గన బాగా నటించారు అని అంటాడు రిషి.
మీరందరూ నిజం తెలిసి కూడా చెప్పకపోవడంతో నేను పిచ్చోన్ని అయ్యాను. మీరందరూ గొప్ప నటీనటులు. మీ అందరికీ తెలిసి కూడా నిజం చెప్పలేదు అంటూ మాట్లాడతాడు రిషి. దీంతో అందరూ సైలెంట్ గా ఉంటారు. అంత బాధపడుతున్నాడు. నిజం చెప్పి తన బాధను తగ్గిద్దామాని మీకు అనిపించలేదా మేడమ్ అని బాధగా అడుగుతాడు రిషి.

రాక్షస ఆనందం పొందారు..
నేను ఆ ఒక్క విషయంలో తప్పా మిగతా అన్నింట్లో గౌరవంగానే చూస్తున్నాను కాద మేడమ్.. దానికి ప్రతిఫలంగా మీరు నాకు ఇచ్చింది ఇదా. మిమ్మల్ని వసుధార ఏమైనా చెప్పిందా అని ఎన్నిసార్లు అడిగాను మేడమ్ అప్పుడు కూడా చెప్పాలనిపించలేదా అని అంటాడు రిషి. డాడ్ మీరు నటులు అని తెలుసు.. కానీ మహా నటులు అని ఇప్పుడే తెలిసిందే ఇలా ఒక్కొక్కరిని ఆవేదనగా అడుగుతాడు.
నేను బాధపడుతుంటే మీరు లోపల నవ్వుకున్నారు కదా. దాన్ని రాక్షస ఆనందం అంటారు అని కఠినంగానే మాట్లాడాతాడు రిషి. మీరు కూడానా అని చక్రపాణి అడుగుతాడు. ఇంతలో నేనే వీళ్లను నిజం చెప్పొద్దని చెప్పాను సార్ అని వసుధార అంటుంది.
తాళి వేసుకోవడాన్ని..
హో నీ దాపరికాలు వీళ్లకు కూడా అంటగట్టావా. నా మనసుకు గాయం అయింది. అందరు కలిసి నా మనసుకు గాయం చేశారు. నా మనసును బాధపెట్టారు. వసుధార నీ మెడలో తాళి ఎవరు కట్టారని కొన్ని వందల సార్లు అడిగాను. ఏవేవో చెప్పింది. నాకు పరీక్షలు పెట్టింది. ఒక ఆట మొదలు పెట్టింది.
మీరందరూ నా కళ్లకు గంతలు కట్టి ఒక ఆట ఆడుకున్నారు అంటాడు రిషి. వాళ్లంతా ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే.. ఇప్పుడు మీరు సంజాయిషీ ఇచ్చుకునే అవసరమే లేదు. మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. వసుధార తన మెడలో తాళి వేసుకోవడాన్ని మీరు సమర్ధిస్తున్నారా అని అంటాడు రిషి.


Click it and Unblock the Notifications











