Guppedantha Manasu: ఆ తాళి తీయ్యగలవా వసుధార అంటూ రిషి ప్రశ్నల వర్షం.. జగతిని నిందించిన మహేంద్ర!

వసుధార తన మెడలో తాళి వేసుకున్న నిజాన్ని తనకు చెప్పకపోవడంపై బాధగా సీరియస్ అవుతాడు రిషి. వసుధార మెడలో తాళి వేసుకోవడాన్ని సమర్ధిస్తున్నారా అని జగతి-మహేంద్ర, చక్రపాణిలను సూటిగా ప్రశ్నిస్తాడు. రిషి ఆ సమయంలో అంటూ జగతి ఏదో చెప్పబోతుంటే.. అదంతా కాదు.. అలా వసుధార చేయడాన్ని సమర్ధిస్తున్నారా అని మళ్లీ అడుగుతాడు రిషి. తర్వాత అదంతా సరే.. వసుధార తన మెడలో తనే తాళి వేసుకుందని మీరు నేను నమ్ముతాం. మరి ప్రపంచం సంగతి ఏంటి అని రిషి ప్రశ్నిస్తాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఫిబ్రవరి 20 సోమవారం నాటి తాజా ఎపిసోడ్‌ 691లో ఇంకా ఏం జరిగిందంటే?

రిషి ప్రశ్నల వర్షం..

రిషి ప్రశ్నల వర్షం..

జగతి-మహేంద్రలపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు రిషి. నువ్ చేసిన పనిని ఆ రాజీవ్ గాడు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. పోలీస్ స్టేషన్ చుట్టూ పిచ్చోడిలా తిరిగాను. అడిగితే అరిగిపోయిన రికార్డుల ఒకటే మాట ఇది నా ఇష్ట పూర్వకంగా వేసుకున్నా అని. రిషి, వసుధార కలిసిపోయారు. ఇంకా ఏ సమస్య లేదు అనే కదా మీరు మాట్లాడుకుంటున్నారు. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలు అయింది. కొన్నింటిని వెనక్కి తీసుకోలేం. మెడలో తాళి వేసుకోవడం అంత ఈజీనా వసుధార. ఏంటీ అంత ఈజీనా.. ఇప్పుడు ఆ తాళి తీయగలవా వసుధార.. చెప్పు.. వేసుకున్నంత ఈజీగా ఆ తాళీ తీయగలవా. మరి భవిష్యత్తులో పెళ్లి సంగతి ఏంటీ. అప్పుడు పెళ్లి ఎలా అప్పుడు తాళి ఎలా.. ఇవన్నీ ఆలోచించావా అని రిషి ప్రశ్నల వర్షం కురిపిస్తాడు.

ఒక చేతగాని వాడిలా..

ఒక చేతగాని వాడిలా..

సర్ అప్పుడు ఆ సమయంలో నాకు అనిపించింది చేశాను అని వసుధార అంటే.. నీకు అనిపించింది నువ్ చేశావ్. ఏది ఆలోచించలేదు అని రిషి అంటాడు. దీనికి పొరపాటు చేశానా సార్ అని వసుధార అంటే.. పొరపాటు కాదు.. చారిత్రక తప్పు. పొరపాటులను క్షమించవచ్చు. కానీ గొప్ప తప్పుని క్షమించలేం. వెనక్కి తీసుకోలేం. ఇది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదు. నీ వైపు ఆలోచించి నన్ను ఒక చేతగాని వాడిలా నిరూపించాలని అనుకున్నావ్. ఫూల్ గా మిగిలిపోయాను అని రిషి బాధపడతాడు. సార్ అలా కాదు అంటూ ఆగిపోతుంది వసుధార. దీన్ని సమాజంలో ఒక్కరైన సమర్ధిస్తారా. నీకు నువ్వు తాళి కట్టుకున్నావ్ అంటే నమ్ముతారా అని రిషి అంటాడు.

 రక్షించుకోవడానికి వేరే దారి లేక..

రక్షించుకోవడానికి వేరే దారి లేక..


సార్ మన బంధం, ప్రేమ ముఖ్యం. ఇక సొసైటీతో పనేముంది సార్. వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని వసుధార అంటుంది. అవునా.. అలాగా.. అసలు సొసైటీ గురించి పట్టించుకోకపోతే అందరికీ తాళి కనిపించేలా ఎందుకు వేసుకున్నావ్ అని రిషి అంటాడు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో వేరే దారి కనిపించలేదు. మిమ్మల్ని రక్షించుకోవడానికి ఇలా చేశాను అని వసుధార అంటుంది. సరే చేశావ్.. అదంతా అయ్యాక అయిన నాకు చెబితే అయిపోయేది కదా. ఎంత బాధ, చిత్రవధ అనుభవించానో నీకు తెలుసా. నీకు తెలీదు అని రిషి అంటాడు. నిజం చెప్పాలని చాలా క్షోభ పడ్డాను సార్. వస్తే మీరు కసురుకున్నారు, విసుక్కున్నారు అని వసుధార అంటుంది.

టైమ్, ధైర్యం లేవా..

టైమ్, ధైర్యం లేవా..

ఇప్పుడు తప్పు నామీదే వేస్తున్నావా.. నువ్ చేసినదానికి నన్నే బాధ్యున్ని చేస్తున్నావా వసుధార. నువ్వు చేసిన పనికి ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నీ పెళ్లి ఒక టాపిక్ అయింది. ఇప్పుడు అందరికీ ఏం సమాధానం చెప్తావ్. చెప్పుకోండి చూద్దాం అని పరీక్ష పెడతావా అని రిషి అంటాడు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సార్. మీరు నమ్మితే చాలు అని వసుధార అంటుంది. మన మధ్య దాపరికాలు ఉండకూడదని ఎప్పుడో చెప్పాను. కానీ నిజాన్ని దాచిపెట్టావ్ అని రిషి అంటే.. చెప్పడానికి టైమ్, ధైర్యం చాలలేదు సార్ అని వసుధార అంటుంది. అలా అనకు వసుధార. ఏంటీ టైమ్, ధైర్యం లేవా. నాకు పరీక్షలు పెట్టే సమయంలో ఈ తాళి ఎవరు కట్టలేదు.. నాకు నేనే వేసుకున్నా అని చెప్పొచ్చు. లేదా ఒక్క మెసేజ్ చేయొచ్చు. ఒక్క వాయిస్ నోట్ పంపిచొచ్చు కదా. ఏంటీ వసుధార ఈ ఆటలు అని రిషి బాధగా అంటాడు.

రిషి అన్నదాంట్లో తప్పు లేదు..

రిషి అన్నదాంట్లో తప్పు లేదు..

ఎవడో వచ్చి చంపేస్తా అంటూ భయపడిపోతావా వసుధార. కాలేజీ మొదట్లో ప్రెస్ మీట్ పెడతా అన్న నువ్వేనా ధైర్యం లేదని అన్నావ్ అని రిషి అంటాడు. ఆ టైమ్ లో నాకు వేరే మార్గం కనిపించలేదు. మనసుకు ఇదే కరెక్ట్ అనిపించి చేశాను. ఇవన్నీ పక్కన పెట్టండి. నేను మిమ్మల్ని కాకుండా వేరే వాళ్లన పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు అని వసుధార అంటుంది. నేను నిన్ను వదులుకుంటానని నువ్వు ఎలా అనుకుంటావ్. దీని వల్ల నువ్వు ఏం సాధించావ్ నన్ను బాధ పెట్టడం, నాతో ఆడుకోవడం తప్పా ఇంకేం లేదు అన్న రిషి.. చక్రపాణి తీసుకొచ్చిన కాఫీ తాగి.. కాఫీ బాగుంది, కానీ చల్లారిపోయింది అనేసి వెళ్లిపోతాడు. తర్వాత ఒక చోట ఆగిన జగతి-మహేంద్ర రిషి అన్న మాటల గురించి మాట్లాడుకుంటారు. రిషి అన్నదాంట్లో నాకు తప్పేం కనిపించడం లేదు మహేంద్ర అని జగతి అంటుంది.

 పెళ్లి, తాళి అంటూ కంగారుగా చేయకు..

పెళ్లి, తాళి అంటూ కంగారుగా చేయకు..


నేను అప్పుడే చెప్పాను. రిషికి చెప్పేద్దాం అంటే నువ్వే ఆపావ్. అసలు ఇదంతా నీవల్లే జరిగింది. ఆ తాళి బొట్టు రిషికి ఇచ్చి పంపించకుండా ఉండి ఉంటే ఇక్కడి దాకా వచ్చేది కాదు కదా అని జగతిని మహేంద్ర అంటాడు. తర్వాత ఎవరు నెగ్గారు.. ఎవరు ఓడారు అని మహేంద్ర అంటే.. ప్రేమ గెలిచింది మహేంద్ర అని జగతి అంటుంది. నువ్వు దూకుడుగా పెళ్లి, తాళి అంటూ కంగారుపనులు చేయకు. ఈ విషయంలో మనం జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచింది. ఈ సమస్య నుంచి వాళ్లనే బయటపడనివ్వు అని జగతి అంటుంది. తర్వాత ఇంట్లో అందరూ కూర్చును బోజనం చేస్తుంటారు. వంటలు బాగున్నాయని రిషి అంటే దేవయాని ఏం తినకుండా ఉంటుంది.

ఈ పొగరు తినిందో లేదో..

ఈ పొగరు తినిందో లేదో..

దేవయాని ఏం తినకుండా ఉండటం చూసిన జగతి.. అక్కయ్య ఏం తినట్లేదు ఏంటీ అని అడుగుతుంది. తినండి వదిన గారు అని సెటైరికల్ గా అంటాడు మహేంద్ర. వంట నచ్చలేదా అని ఫణీంద్ర అడిగితే.. లేదు బావగారు.. రిషి ఆనందం చూసి అక్కయ్యకు కడుపు నిండిపోయింది అని జగతి అంటుంది. ఈ సంతోష సమయంలో స్వీట్ కూడా ఉంటే బాగుంటుంది అని ఫణీంద్ర అంటే.. నా మనసులో మాట చెప్పారు అని మహేంద్ర అంటాడు. ధరణి స్వీట్ తీసుకొస్తే.. మహేంద్ర ఆ స్వీట్ ను రిషికి తినిపిస్తాడు. కానీ రిషి తినకుండా వద్దంటాడు. తర్వాత దేవయానికి రిషి స్వీట్ తినిపిస్తాడు. ఈ పొగరు తిన్నదో లేదో అనుకుని తన గదిలోకి వెళ్లి వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు రిషి. మరోవైపు రిషి అన్న మాటలు తలుచుకుంటూ రిషి ఫొటో చూస్తూ మాట్లాడుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X