Guppedantha Manasu: వసుధారా రాస్తారోకో.. MH అంటూ రిషికి మరో పజిల్.. దేవయాని కొత్త ప్లాన్!

ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూ ఉంటారు రిషిధార. ఒకరికొకరు కోపంగా ఉన్నారా అని అనుకుంటూ ఉంటారు. అటు వసుధార మాత్రం నేను మీకు ఫోన్ చేస్తాను. ఎందుకంటే మీరు నా మీద కోపంగా ఉన్నారు. మీ మీద నాకు ప్రేమ ఉంది అనుకుంటుంది వసుధార. కానీ రిషి మాత్రం నేను లిఫ్ట్ చేయనుగా అంటూ కావాలనే కాల్ కట్ చేస్తాడు. వసుధార మళ్లీ కాల్ చేస్తుంది.

అయిన లిఫ్ట్ చేయడు. మూడోసారి వసుధార కాల్ చేయగా లిఫ్ట్ చేస్తాడు రిషి. నాకు నిద్ర వస్తోంది. మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఉదయం మాట్లాడుకుందాం అని రిషి అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఫిబ్రవరి 21 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్‌ 692లో ఇంకా ఏం జరిగిందంటే?

మూడు సార్లు కాల్ చేస్తే..

మూడు సార్లు కాల్ చేస్తే..

మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఉదయం మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేద్దమాని రిషి అనుకునేలోపు వసుధార పిలుస్తూ ఆ అవకాశం ఇవ్వదు. నేను మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటానికి కాల్ చేయలేదు అని వసుధార అంటుంది. నువ్ ఈ సయమంలో కాల్ చేస్తే అందుకే అనుకున్నా అని రిషి అంటాడు. వసుధార ఏదేదో చెప్పి విసిగిస్తే కాల్ కట్ చేస్తాడు.

మళ్లీ వసుధార కాల్ చేస్తుంది. ఫోన్ స్విచ్ఛాప్ చేసే అవకాశం కూడా ఇవ్వవా అనుకుంటూ కాల్ లిప్ట్ చేస్తాడు రిషి. ఏంటి చెప్పు అని రిషి అంటే.. ఏంటి సార్ సంగతులు అని వసుధార అంటుంది. మూడు సార్లు కాల్ కట్ చేస్తే ఇప్పుడు ఏంటీ సంగతులు అని అడుగుతున్నావా.. టీవీ చూడూ సంగతులు, విశేషాలు తెలుస్తాయని రిషి అంటాడు.

ఎక్కడో పని ఉండి ఆగొచ్చు..

ఎక్కడో పని ఉండి ఆగొచ్చు..

అది కాదు ఎండీ గారు అని వసుధార అంటుంది. ఈ సమయంలో ఎండీ గారు అని అనడం అవసరమా అని విసుక్కుంటూ కాల్ కట్ చేస్తాడు రిషి. దీంతో అలా సడెన్ గా కాల్ కట్ చేయడంతో.. గుడ్ నైట్ చెప్పలేదు.. గుడ్ నైట్ ఎండీ గారు అని మెసేజ్ పెడుతుంది వసుధార. దీంతో ఫోన్ స్విచాఫ్ చేస్తాడు రిషి. మర్నాడు ఉదయం కాలేజీకి వెళతారు జగతి-మహేంద్ర.

రిషి, వసుధార కూర్చున్న ప్లేస్ చూసి బాధపడతారు. రిషి మనకంటే ముందుగా బయలుదేరాడు. ఇంకా రాలేదు అని జగతి అంటుంది. నువ్వేం టెన్షన్ పడకు ఎక్కడో పని ఉండి ఆగొచ్చు.. ఫోన్ రావొచ్చు అని సర్ది చెబుతాడు మహేంద్ర. మనం ఇప్పుడే రిషి గురించి ఆలోచించాలి అని అనుకుంటూ బయలు దేరతారు ఇద్దరు.

చేసేది లేక కారు డోర్ తీసి..

చేసేది లేక కారు డోర్ తీసి..

మరోవైపు కారులో కాలేజీకి బయలుదేరతాడు రిషి. అతని కారుకు దారిలో అడ్డంగా నిల్చుంటుంది వసుధార. కారుకు అడ్డంగా ఈ రాస్తారోకో ఏంటీ అని రిషి అనుకుంటే.. తీసుకెళ్లకుండా తనదారిన వెళ్తారని తెలిసే ఇలా అడ్డంగా నిల్చున్నా అని వసుధార అనుకుంటుంది. ఏంటీ నేనే లిఫ్ట్ కావాలా అని అడగాలా అని రిషి అనుకుంటే.. రిషి సార్ దిగి వచ్చి లిఫ్ట్ ఇస్తానంటే తప్పా ఇక్కడి నుంచి కదలను అని వసుధార అనుకుంటుంది.

ఇంతలో వెనుక నుంచి వేరే కారు హారన్ కొట్టడంతో.. చేసేది లేక వచ్చి కూర్చోమన్నట్లుగా కార్ డోర్ తీస్తాడు రిషి. అప్పుడు వసుధార వెళ్లి కారులో కూర్చుంటుంది. చేసిందంతా చేసి నన్ను ఇరకాటంలో, బాధ పెట్టి రివర్స్ లో తనే నాపై అలుగుతోంది అని రిషి అనుకుంటే.. ఏంటీ సార్ సైలెంట్ గా ఉన్నారు. మీకేనా పొగరు ఉండేది. నాకు కూడా ఉంది అనుకుంటూ సైలెంట్ గా ఉంటుంది వసుధార.

సాధిస్తున్నారా సార్..

రిషి ఎవరికో ఫోన్ చేసి కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ మీటింగ్ ఉంది. వసుధార గారు మిషన్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన కొన్ని అద్భుతమైన పాయింట్స్ చెబుతారు అని మీటింగ్ అరెంజ్ చేస్తాడు రిషి. మీటింగ్ ఏంటీ సార్.. ఏం మాట్లాడాలి అని వసుధార అంటుంది. ప్రాజెక్ట్ హెడ్ వి కాబట్టి నువ్వే ప్రిపేర్ అవ్వు అని రిషి అంటాడు.

తర్వాత కాలేజీలో కారు ఆపిన తర్వాత సీట్ బెల్ట్ రావడం లేదని వసుధార చెబుతుంది. గతంలో రిషికి వసుధార పరీక్ష పెట్టిన దాన్ని గుర్తుచేస్తూ నువ్వే తీసుకో.. తెలుసుకుని తీసుకో అని రిషి అంటాడు. ఏంటీ సార్ సాధిస్తున్నారా అని వసుధార అంటే.. నేను ఇప్పటికే చాలా సాధించాను. గోల్డ్ మెడల్ సాధించాను అని రిషి అంటాడు. తర్వాత కావాలనే చేస్తున్నారని సీట్ బెల్టు తీసుకుని వస్తుంది వసుధార.

హార్ట్ పై ఎండీ అని రాసి..

హార్ట్ పై ఎండీ అని రాసి..

అనంతరం రిషి తన క్యాబిన్ లో కూర్చుని లవ్ సింబల్ చూస్తూ ఏంటీ వసుధార ఇలా చేశావ్. ప్రేమ అనే గాలానికి ప్రతి మనసు చిక్కుకుని విలవిల్లాడాల్సిందేనా అనుకుంటూ.. దానిపై ఎండీ అని రాస్తుండగా వెనుక నుంచి వచ్చిన వసుధార చూస్తుంది. అది గమనించిన రిషి ఏంటీ చూస్తున్నావ్ అని అంటే.. మీరు ఏం రాశారో చూశాను లేండీ.

ఎండీ అన రాసుకున్నారు ఏంటీ సార్ అని వసుధార అంటే.. నేను ఎండీనే కదా అని రిషి అంటాడు. వీళ్లిద్దరు మాట్లాడుకుంటుండగా జగతి-మహేంద్ర వస్తారు. హార్ట్ పైన ఏదో రాశారు అనడంతో నా ఇష్టం అని రిషి అంటాడు. ఇక్కడ ఎండీ అనే టాపిక్ పై సరదాగా మాట్లాడుకుంటారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతారు.

MH అంటే ఏంటీ..

MH అంటే ఏంటీ..

తర్వాత లవ్ సింబల్ పైన పెట్టాక.. మీరు నాకు ఎండీనే అని వసుధార అంటుంది. తర్వాత నేను మీ MH అని వసుధార అంటుంది. అంటే ఏంటీ అని రిషి అడిగితే.. తెలుసుకోండి.. లేదా తర్వాత చెబుతాను అని వెళ్లిపోతుంది. MH అంటే ఏంటీ అని రిషి ఆలోచిస్తుంటాడు. మరోవైపు దేవయాని రిషిలో వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతోంది. వసుధార మళ్లీ వచ్చింది.

అందరూ కలిసిపోతున్నారు. అలా ఎప్పటికీ జరగనివ్వను అని అక్కడి నుంచి బయలుదేరుతుంది దేవయాని. మరోవైపు మీటింగ్ కి వెళ్తారు రిషి, వసుధార, జగతి-మహేంద్ర. అక్కడ వసుధార గురించి గొప్పగా చెబుతాడు రిషి. వసుధారను రిషి ఆడుకుంటున్నాడు అని మహేంద్ర-జగతి అనుకుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X