Guppedantha Manasu: రిషి సేవలో వసుధార.. దేవయానికి ఊహించని స్టైల్ లో జగతి వార్నింగ్!

రిషి గదిలో మహేంద్ర-జగతి కూర్చుని ఆలోచిస్తూ రిషి కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి కొద్దిగా ఆశ్చర్యపడతాడు. రా రిషి రా నీకోసమే ఎదురుచూస్తున్నాం అని మహేంద్ర అంటే.. ఇద్దరూ నా రూమ్ కి వచ్చారంటే పెద్ద విశేషమే ఉండాలి. ఏంటీ డాడ్ అది అని రిషి అంటాడు. ఏంటీ రిషి అలా అన్నావ్.. ఇంతేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంది అని మహేంద్ర అంటాడు. అర్థం చేసుకున్నా కదా డాడ్.. అంత పెద్ద నిజం దాచి బాగానే చేశారు కదా అని రిషి అంటాడు.

రిషి అది కాదు అని సరే.. పాయింట్ కి వస్తాను రిషి.. వసుధారను నువ్వు అవాయిడ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది అని మహేంద్ర అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఫిబ్రవరి 24 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్‌ 695లో ఇంకా ఏం జరిగిందంటే?

అపార్థాలు తొలగిపోయాయి..

అపార్థాలు తొలగిపోయాయి..

వసుధారను అవాయిడ్ చేయడం గురించి మహేంద్ర అడిగితే.. మనకు అనిపించేవి అన్నీ నిజాలు కదా డాడ్. మరి మీకేం అనిపించింది మేడమ్. మీరు మనుషుల్ని అంచనా వేస్తారు కదా. మీ శిష్యురాలిలా. మీ ప్రతిభనే వసుధారకు వచ్చింది అని రిషి అంటాడు. దీంతో వసుధారది నాది అభిప్రాయం ఒక్కటే అని జగతి అంటుంది. రిషి అంతా అయిపోయింది.

కదా. అపార్థాలు తొలగిపోయాయి కదా.. తనను దూరం పెట్టడం ఎందుకు అని మహేంద్ర అంటే.. డాడ్ తను చేసింది నాకు నచ్చలేదు అని అంటాడు రిషి. తర్వాత నా ఎమోషన్స్ మీ ముగ్గురు ఆడుకున్నారు అని రిషి అంటే.. ముగ్గురు అని చెప్పి మమ్మల్ని ఎందుకు కలుపుతున్నావ్. అందులో మా తప్పు పరిమితం అని మహేంద్ర అంటాడు.

దూరం చేసుకోను అని..

దూరం చేసుకోను అని..

మహేంద్ర అన్నదానికి.. పరిమితం అంటే.. తప్పు లేదని కాదు కదా డాడ్ అని రిషి అంటాడు. వసుధార చెబితే చేశారు. మీ కొడుకు గురించి ఆలోచించలేదు కదా. కొడుకుకి చెప్పాలనిపించలేదా డాడ్ అని రిషి అంటాడు. వసుధారను క్షమించలేను.. అలా అని దూరం చేసుకోలేను అని రిషి అంటాడు. మహేంద్ర ఏదో చెప్పబోతుంటే.. మీరు అనుకున్నది ఏం జరగదులేండి డాడ్ భయపడకండి అని రిషి చెప్పేసి వెళ్లిపోతాడు.

మనం అనుకున్నది జరగదు అని అంటాడు ఏంటీ జగతి అని మహేంద్ర అడిగితే.. అంటే.. వసుధారను దూరం చేసుకోను అని చెబుతున్నాడు అని జగతి అంటుంది. దీనిలో ఇంత అర్థం ఉందా.. ఏంటో రిషి ఈ మధ్య కొత్తగా మాట్లాడుతున్నాడు అని మహేంద్ర అంటే.. కొత్తగా కాదు.. సూటిగా మాట్లాడుతున్నాడు అని జగతి అంటుంది.

ఇలా అనుకున్నానో లేదో..

ఇలా అనుకున్నానో లేదో..

రిషి గది నుంచి జగతి మహేంద్ర వెళ్తుండగా.. అక్కడ దేవయానిని చూసి షాక్ అవుతారు. అక్కయ్య ఎక్కువసేపు అలానే నిల్చుని ఉంటే కాళ్లు నొప్పి పుడతాయి పదండి అని జగతి అంటుంది. వదిన గారు మాట్లాడింది అంతా విన్నారు కదా.. రిషిలో కొత్త మార్పు వచ్చింది కనిపెట్టారా అని మహేంద్ర అంటే.. నేనేం వినలేదు.. ఇప్పుడే వచ్చాను అని దేవయాని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత వసుధార-రిషి ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు.

మా జెంటిల్మెన్ ఏం చేస్తున్నారు అని వసుధార అంటే.. ఈ పొగరు ఏం చేస్తుందో అని మెసేజ్ చేయానా అని అనుకుని ఎందుకులే కదపడం అని ఊరుకుంటాడు. అంతలోనే వసుధార నుంచి మెసేజ్ వస్తుంది. ఇలా అనుకున్నానో లేదో అప్పుడే మెసేజ్ వచ్చింది అని రిషి అనుకుంటాడు. ఇద్దరు కాసేపు తలనొప్పి, సంగతులు అంటూ సెటైరికల్ గా మాట్లాడుకుంటారు.

2 రోజుల్లో తగ్గిపోతుంది..

2 రోజుల్లో తగ్గిపోతుంది..

వసుధారకు పొద్దున్నే కాల్ చేస్తానని మెసేజ్ పెట్టి రిషి పడుకుంటాడు. ఉదయం రిషి ఇంకా నిద్ర లేవలేదని తెలిసి లేపేందుకు మహేంద్ర వెళతాడు. రిషికి జ్వరం వచ్చిందని మహేంద్రకు తెలుస్తుంది. ఇంతలో వసుధార కాల్ చేస్తే రిషికి జ్వరం వచ్చినట్లు చెబుతాడు మహేంద్ర. రిషి దగ్గర కూర్చుని ఏంటీ మహేంద్ర ప్లాన్ వేసి మిషన్ ఎడ్యుకేషన్ అని చెప్పి అక్కడ ఇక్కడ తిప్పితే రిషికి జ్వరం వచ్చింది చూడండి అని దేవయాని అంటుంది.

మిషన్ ఎడ్యుకేషన్ టూర్ కి, జ్వరానికి సంబంధం ఏంటీ అని జగతి అంటుంది. ఇంతలో అక్కడికి వసుధార వచ్చి సార్ కి ఎలా ఉంది ఏంటీ అని కంగారుగా అడుగుతుంది. దీనికి కూల్ వసుధార.. డాక్టర్ వచ్చి చెప్పారు. 2 రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు అని జగతి చెబుతుంది. దేవయాని మేడమ్ పక్కకి లేవండి అని లేపి రిషి పక్కను కూర్చుంటుంది వసుధార. రిషికి సేవలు చేస్తుంటుంది. అది చూసి దేవయాని కోపంతో రగిలిపోతుంది.

ఇప్పటికీ నేను ఏదైనా చేయగలను..

ఇప్పటికీ నేను ఏదైనా చేయగలను..

కొంతమంది ఉంటారు రిషి కోసం అది చేశాను ఇది చేశాను అంటూ దేవయానిపై సెటైర్లు వేస్తుంది వసుధార. తర్వాత వాళ్లందరిని వెళ్లిపోమ్మని చెబుతుంది. రిషి జ్వరం తగ్గాలనుకుంటే వెళ్లిపోండని చెప్పి.. దేవయానితో మేడమ్.. రిషి సార్ కోసం పాలు పంపించండి అని అంటుంది. దీంతో జగతి-మహేంద్రపై సీరియస్ అవుతుంది దేవయాని. పరాయి ఆడపిల్ల కొడుకుకి ఎలా అప్పగించి వస్తావ్ జగతి అని దేవయాని అంటుంది. వసు పరాయిది ఎలా అవుతుంద అక్కయ్య అని జగతి అంటే. వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు.

రేపో మాపో వాళ్లకి మనం పెళ్లి కూడా చేయాల్సి ఉంటుంది అని మహేంద్ర అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మహేంద్ర అంటూ సీరియస్ అయినా దేవయాని.. రిషి మీ వైపు ఉండి మీరు చెప్పినట్టు వింటాడని అనుకుంటున్నారా.. ఇప్పటికీ నేను ఏదైనా చేయగలను అని అంటుంది.

వసుధార చేయి పట్టుకుని..

వసుధార చేయి పట్టుకుని..

చూడండి అక్కయ్య వసుధార, రిషి విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. మీరు ఎన్ని చేసిన ఇప్పటివరకు భరించాం. మీరు చిన్నప్పటి నుంచి రిషికి ఏం చేశారు నుంచి.. రాజీవ్ కి ఎన్ని సార్లు కాల్ చేశారు. ఎందుకు చేశారు. కాలేజీ స్టాఫ్ కి ఏం చెప్పారు. వాళ్లతో ఏం మాట్లాడించారు అని చెప్పేస్తాను అని దేవయానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది జగతి.

దీంతో నేనంటే భయం భక్తి లేదు.. ప్రతిదానికి బెదిరిస్తున్నారు అని కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని. మరోవైపు రిషి నిద్ర లేవడంతో.. వసుధార టాబ్లెట్ ఇచ్చి పాలు తాగమని చెప్పి జాగ్రత్తగా చూసుకుంటుంది. అప్పుడు వసుధార చేయి గట్టిగా పట్టుకుని పడుకుంటాడు రిషి. నిద్రలేచేసరికి వసుధార అలాగే తన పక్కనే నిద్ర పోవడం చూసి ఇక్కడే పడుకున్నావా అని అడుగుతాడు రిషి.

దేవయానిపై సెటైర్

దేవయానిపై సెటైర్

మీకు జ్వరం అయితే నేను అక్కడ ఎలా ఉంటాను సార్ అని వసుధార అంటుంది. దీంతో వసు చేయి పట్టుకుని థ్యాంక్స్ చెబుతాడు రిషి. కేవలం థ్యాంక్స్ మాత్రమేనా అని వసు అంటే చెప్పు ఏం కావాలని రిషి అడుగుతాడు. మీరు నాకు ఇవ్వడం ఏంటీ సార్.. మీరు నేను ఒకటే కదా.

నేను మీ నీడ అంటుంది వసుధార. ఇంతలో అక్కడికి దేవయాని, జగతి-మహేంద్ర వస్తారు. సార్ కి జ్వరం తగ్గింది నేను వెళ్లి కాఫీ తీసుకొస్తాను.. అన్న వసుధార.. దేవయాని మొహం చూసి.. ఏంటీ మేడమ్ అలా చూస్తున్నారు.. మీకు కూడా కాఫీ తీసుకొస్తాలేండీ అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X