Guppedantha Manasu: దేవయానికి వరుసగా షాక్ లు.. తాళి గురించి వసుధార క్లారిటీ!

రిషికి వసుధార సేవలు చేయడం గురించి హాల్లో కూర్చుని ధీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని. ఇంతలో మహేంద్ర వస్తూ.. దేవయానిని చూసి పక్కనుంచి వెళ్లిపోదామని అనుకుంటాడు. అయితే మహేంద్రను పిలిచి దేవయాని పెద్ద క్లాస్ తీసుకుంటుంది. మీ మొగుడు పెళ్లాం ఇద్దరు ఏమనుకుంటున్నారు.. రిషికి జ్వరం వస్తే.. నువ్వు, జగతి, ధరణి చూసుకోవాలి గానీ మధ్యలో ఆ వసుధార ఏంటీ. అయిన తను ఇంటికి రావడం ఏంటీ.

మనల్ని పక్కకు పెట్టి రిషిని చూసుకోవడం ఏంటీ అని అడుగుతుంది దేవయాని. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఫిబ్రవరి 25 శనివారం నాటి తాజా ఎపిసోడ్‌ 696లో ఇంకా ఏం జరిగిందంటే?

జగతిని ఉద్దేశిస్తూ..

జగతిని ఉద్దేశిస్తూ..

దేవయాని అలా అడగడంతో.. వదిన గారు మనకు ఇలాంటి సమయంలో రిషికి జ్వరం తగ్గడం ఇంపార్టెంట్ అని మహేంద్ర అంటాడు. అసలు నీకు రిషికి ఏం కావాలి ఏం వద్దు.. అనేది నీకు ఏం తెలియదు. రిషి ఏ సమయంలో ఎలా ఉంటాడు. ఎలా ఆలోచిస్తాడు అని అంచనా ఇప్పటికీ వేయలేవు. జగతి చిన్నప్పుడు రిషిని వదిలి వెళ్లిపోయినప్పుడు రిషిని పెంచి పెద్ద చేసింది నేను అని దేవయాని అంటుండగా.. అటు నుంచి మెట్లు దిగుతూ జగతి వస్తుంది. రిషి మనసేంటో నాకు తెలుసు. రిషి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు.. అంటూ జగతిని ఉద్దేశిస్తూ రా జగతి నీకోసమే చూస్తున్నాను అని దేవయాని అంటుంది. తర్వాత అసలు వసుధారను ఇంట్లో నుంచి పంపించివేస్తారా లేదా అని అంటుంది.

రిషి నా కొడుకు..

రిషి నా కొడుకు..

ఇప్పుడు ఈ సమయంలో రిషికి జ్వరం తగ్గడం ముఖ్యం కదా అక్కయ్య అని జగతి అంటే.. ఏంటీ మీరిద్దరూ ఒకే సమాధానం చెబుతున్నారు. మీకు ఎలా ఉందో కానీ నాకు, లోకానికి మాత్రం బాగుండదు. ఫస్ట్ వసుధారను పంపించివేయండి. అసలు ఆ వసుధారను ఇంటికి తీసుకురావొద్దని నేను చెబుతున్నా.. నా మాట వినలేదు. ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుని అని దేవయాని అంటుండగా.. వదిన గారు ప్లీజ్ ఇక మీరు ఏం మాట్లాడకండి అని ఆపేస్తాడు మహేంద్ర. రిషికి ఏం కావాలో నాకు తెలుసు. రిషి నా కొడుకు. చెబుతున్నా కదా రిషి నా కొడుకు. రిషికి ఏం చేయాలో కూడా తెలుసు. రిషికి జ్వరం తగ్గడం ముఖ్యం. అవును మీరు రిషిని పెంచారు. కాదనట్లేదు. అందుకు కొంచెం గౌరవం మీపై ఉంది. దాన్ని నిలబెట్టుకోండి. ఇంతకుముందు లాగే పెత్తనం చేస్తానంటే కుదరదు అని మహేంద్ర అంటాడు.

మీ కోపం.. నా ప్రేమ..

మీ కోపం.. నా ప్రేమ..

అది కాదు మహేంద్ర అని దేవయాని అంటుంటే.. ఇంకేం చెప్పకండి వదిన గారు.. నేను మీకు చెప్పింది అర్థమైందనే అనుకుంటాను అని అక్కడి నుంచి వెళ్లిపోతారు మహేంద్ర-జగతి. ఇంతలో ధరణిని కోపంగా పిలిచి ఎందుకు పిలిచానని తనే అనుకుంటుంది. ధరణి నవ్వుకుంటూ వెళ్తుంది. మరోవైపు రిషి కోసం జ్యూస్ చేస్తుంది వసుధార. రిషి అన్నమాటలు గుర్తు చేసుకుంటుంది. మీరు నా మీద ఎంత అరిచినా కూడా మీ మీద ఉన్న ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మీ కోపం మీదే.. నా ప్రేమ నాదే అని వసుధార అంటుండగా.. రిషి నిద్ర లేస్తాడు. కూర్చునేందుకు ప్రయత్నించి తూలిపడబోతుంటే.. వసుధార పట్టుకుంటుంది. మీకు ఎంత జ్వరం వచ్చిందో మీకు కూడా తెలుసు. ఈ జ్యూస్ తాగండి అని వసు అంటే.. నాకు తాగాలనిపించట్లేదు అని రిషి అంటాడు.

ఇంకా కోపం పోలేదు..

ఇంకా కోపం పోలేదు..

జ్వరం వచ్చినప్పుడు అలానే ఉంటుంది కానీ తాగాలి అని వసుధార అంటే.. నీకేం ఎన్నైనా చెబుతావ్ జ్వరం వచ్చింది నాకు అని రిషి అంటాడు. మీరు అంతలా జ్వరంతో మూలుగుతుంటే నాకు భయం వేసింది. భయం కాదు దానికి ఏం పేరు పెట్టి పిలుస్తారో నాకు కూడా తెలియదు అని వసు అంటే.. అదేంటీ నీకు అన్ని తెలుసుగా.. అని రిషి అంటే వసుధార చిన్నపిల్లాడు, నడవడం, భయం అని ఉదాహరణ చెబుతుంది వసుధార. అన్ని స్పష్టంగా చెబుతావ్ అవసరమైనవి తప్పా అని రిషి అంటే.. సార్ కి ఇంకా కోపం పోలేదు అని జ్యూస్ తాగిపిస్తుంది వసుధార. తర్వాత వసుధారకు ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వసుధార పక్కన ఉందని ఏమో జ్వరం కూడా బాగుంది. ఇన్నాళ్లు ఈ ప్రేమను ఎందుకు దాచావ్. నాపై ఇంత శ్రద్ధ చూపే నువ్వు ఎందుకు నన్ను ఇంతలా బాధపెట్టావ్ అనుకుంటాడు రిషి.

ఎందుకు బాధ పెట్టావ్..

ఎందుకు బాధ పెట్టావ్..

రాత్రి నిద్రలేచి చూసేసరకి వసుధార కుర్చీలో కూర్చుని అలాగే పడుకుని ఉండటం చూస్తాడు రిషి. వాటర్ బాటిల్ తీసుకోవాలని అనుకుంటే అది అందదు. ఇంతలో వసుధార నిద్ర లేవడంతో కళ్లు మూసుకుని ఉండిపోతాడు రిషి. అప్పుడు టైమ్ చూసి రిషిని లేపి కూర్చోబెట్టి ట్యాబ్లెట్ ఇస్తుంది. పాలు తీసుకు వస్తానని చెప్పి వెళ్లిపోతుంది వసుధార. అక్కడి నుంచి వసు వెళ్తుండగా చేయి పట్టుకుంటాడు రిషి. మనసులో ఏదైనా ఉంటే చెప్పేయండి సార్ అని వసు అంటే.. నాకు జ్వరం వస్తే నువ్వు భయపడ్డావ్. ఇంత ప్రేమగా చూసుకుంటున్నావ్. మరి నన్ను ఎందుకు బాధ పెట్టావన మనసులో అనుకుంటాడు రిషి. జ్వరం తగ్గేవరకు ఏం మాట్లాడకూడదు. నేను చెప్పినట్లు వినాలి అని వసుధార వెళ్లి పాలు తీసుకొస్తుంది.

ఓపిక పట్టండి..

ఓపిక పట్టండి..

వసుధార పాలు తీసుకొస్తుండగా.. దేవయానిని చూసి.. ఏంటీ మేడమ్ మీరు ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. పడుకునేంత ప్రశాంతత ఇంట్లో ఎక్కడ ఉంది అని దేవయాని అంటే.. అదేంటి మేడమ్ ఇల్లు ప్రశాంతంగానే ఉంది కదా అని వసు అంటుంది. చాలా ఎక్కువ చేస్తున్నావ్.. చాలా ధైర్యం ఎక్కువ మొండి దానివి అని దేవయాని అంటే.. థ్యాంక్స్ మేడమ్ నాకు అవన్నీ ఉన్నాయని గుర్తించినందుకు అని వసు అంటుంది. అవన్నీ పక్కన పెట్టు నీ మెడలో తాళి సంగతి ఏంటీ పెళ్లి జరిగింది అంటున్నావ్.. ఆ తాళి ఎవరు కట్టారు. ఏది మాట్లాడిన ఏదో సమాధానం చెప్పి తప్పించుకుంటున్నావ్ అని దేవయాని అంటుంది. ఈ తాళికి ఎవరైతే కారణమో వాళ్లే చెబుతారు. అప్పటివరకు ఒపిక పట్టండి అని వసుధార వెళ్లిపోతుంది. ఉదయం రిషి జ్వరం గురించి అడిగితే తగ్గిపోయింది సార్ రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు అని వసుధార అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X