Guppedantha Manasu: షాకింగ్.. వాళ్లను డిస్మిస్ చేసిన రిషి.. దేవయానికి ఊహించని దెబ్బ!
రిషికి జ్వరం రావడంతో వసుధారే దగ్గరుండి చూసుకుంటుంది. జ్వరం తగ్గింది రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని మహేంద్ర, జగతితో చెబుతుంది వసుధార. తర్వాత మినిస్టర్ కాల్ చేయడం, మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారు అని చెప్పిన వసుధార అది వద్దని అన్నానని అంటుంది.
ఎందుకు వద్దన్నావ్ అని రిషి అడిగితే.. సార్ మీకు బాలేనప్పుడు ఎలా పెడతాం అని వసుధార అంటుంది. అది కరెక్ట్ కాదు కదా.. నా ఆరోగ్యం కారణంగా ప్రెస్ మీట్ వాయిదా వేస్తే మంత్రిగారు ఫీల్ అవుతారు కదా అని రిషి అసహనం వ్యక్తం చేస్తాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 27 సోమవారం నాటి తాజా ఎపిసోడ్ 697లో ఇంకా ఏం జరిగిందంటే?

పెద్దమ్మ ప్రెస్ మీట్ ఉంది..
మీరు ఎండీ కదా.. మీరు లేకుండా ఎలా అని వసుధార అంటే.. నేను లేకపోతే ఏమైంది. మీరు చూసుకోండి. నేను కొన్ని పాయింట్స్ చెబుతాను కదా. ఆ తర్వాత అన్నీ నువ్వు చూసుకో. నేను లేకపోయినా ప్రెస్ మీట్ ఆగొద్దు. మినిస్టర్ గారు కూడా ఫీల్ అవుతారు అని రిషి అంటాడు. ఇంతలో దేవయాని ఎంట్రీ ఇస్తుంది. రిషి పరిస్థితి ఏంటీ.. మీరు మాట్లాడుతుంది ఏంటీ అని కోపంగా అంటుంది.
వచ్చి రిషి పక్కనే ఉన్ మహేంద్రను లేచి నిలబడితే.. అక్కడ కూర్చుంటుంది. నాన్నా రిషి.. నీకు బాలేదు రెస్ట్ తీసుకోవాలి కదా నాన్నా అని ప్రేమ నటిస్తుంటుంది దేవయాని. పెద్దమ్మ ప్రెస్ మీట్ ఉంది. మేము చర్చించుకోవాలి. ఇది చాలా అవసరం అని రిషి అంటాడు.
దీంతో పదా జగతి మనం వెళ్దాం.. వాళ్లిద్దరూ చర్చించుకుంటారు అని మహేంద్ర అంటాడు. అదే మాట అన్న జగతి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దేవయాని మాత్రం అక్కడే ఉంటుంది.

నిజం మీకు తెలుసు..
పెద్దమ్మా ప్లీజ్.. మేము చర్చించుకోవాలి.. వెళ్లండి అన్నట్లుగా అంటాడు రిషి. దీంతో రగిలిపోయిన దేవయాని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక రిషి వసుధార ఇద్దరు ప్రాజెక్ట్, ప్రెస్ మీట్ గురించి చర్చించుకుంటారు. అది పూర్తియన వెంటనే నేను వెళ్తాను సార్ అంటుంది వసుధార. వెళ్తావా అంటూ కాస్త బాధగా చూస్తాడు రిషి. అప్పుడే వసుధార మెడలోని తాళిని రిషి చూస్తే వసుధార సర్దుకుంటుంది.
కొన్ని విషయాల్లో తొందరపాటు పనికిరాదు. బంధాల్లో గోప్యత బాగుంటుందని అనిపిస్తోంది సార్. ఈ విషయం తెలుసుకునే సరికి కొంత సమయం పట్టింది నాకు. అయినా జరిగినా నిజం మీకు తెలుసు. ఈ బంధానికి బందనాలు పడితే వాటిని మీరే తొలగించాలి సార్. జరిగినదాన్ని మీరు వివరిస్తేనే ప్రపంచానికి బహిర్గతం చేస్తేనే గౌరవంగా ఉంటుందేమో సార్ అని వసుధార అంటే సైలెంట్ గా ఉంటాడు రిషి.

తొందరపాటు నిర్ణయం..
మౌనంగా ఉన్నారేంటీ సార్ అని వసుధార అంటే మౌనంగా ఉండటం కూడా మాట్లాడటమే వసుధార అని రిషి అంటాడు. అర్థం చేసుకోగలిగితే చిక్కుముడిని అలవోకగా విప్పగలం సార్.. కోపం చిరాకుతో ఆలోచిస్తే చిక్కుముడి ఎప్పటికీ చిక్కు వీడదు. వస్తాను సార్ అని వసుధార అంటుంది. థ్యాంక్స్ వస్తాను అన్నందుకు అని రిషి అంటాడు. రావడానికి నేను ఎప్పుడో సిద్ధం సార్. రావడానికి సమయం రావాలి.
మీ అనుమతి కావాలి. జాగ్రత్త సార్. నేను ఇంటికి వెళ్లి కాలేజీకి వెళ్తాను. టైమ్ కి తినండి అని చెప్పేసి వెళ్లిపోతుంది వసుధార. వసుధార నువ్వు చేసిన తొందరపాటు నిర్ణయం.. మన జీవితానికే అడ్డుతెర అయింది. అలా జరిగి ఉండాల్సింది కాదు. జరిగిన దాన్ని తేలిగ్గా తీసి పారేయలేను. అలాగని నిన్ను క్షమించలేను. కోపమో బాధో నేను బాధపడుతూనే నిన్ను బాధపెడుతున్నానా. ఏం అర్థం కానీ పరిస్థితుల్లో ఉన్నాను అని మనసులో అనుకుంటాడు రిషి.

విన్న కాలేజీ స్టాఫ్..
తర్వాత కాలేజీకి వెళ్లిన వసుధార రిషి కార్ చూసి షాక్ అవుతుంది. క్యాబిన్ కు వెళ్లి చూస్తే రిషి కనిపించడంతో.. కోపంతో వెళ్లి ఏంటీ సార్ జ్వరం వస్తే ఇలా కాలేజీకి వచ్చేస్తారా లేవండి అంటూ అరుస్తుంది వసుధార. ఏంటీ దబాయిస్తున్నావ్ అని రిషి అంటే.. నేను అంతే సార్. మకు ఎంత జ్వరం వచ్చిందో నాకు తెలుసు.
మీకు ఎలా ఉందో కూడా నేనే చెప్పాలి. ప్రెస్ మీట్ అయ్యాక వెళ్తారా మరి అని వసుధార అంటే ఇదంతా ఆపి ప్రెస్ మీట్ సంగతి చూడు అని రిషి అంటాడు. దీంతో కాలేజీ బాయ్ ని పిలిచి రిషి సార్ కారులో టాబ్లెట్స్ ఉంటాయి తీసుకుని రమ్మని చెబుతుంది. ఇదంతా కాలేజీ స్టాఫ్ వింటారు. చూశారా మేడమ్ దగ్గరుండి టాబ్లెట్స్ వేస్తుందేమే అనుకుంటారు. వసు టాబ్లెట్ ఇస్తే రిషి వేసుకుంటాడు. అది చూసిన కాలేజీ స్టాఫ్ వసు, రిషి గురించి తప్పుగా మాట్లాకుంటూ ఉంటారు.

జగతి మేడమ్ ని పిలవండి..
చూశారా మేడమ్ ఆ వసుధార స్టూడెంట్ గా ఉండి మనల్నీ మేడమ్ అంటూ ప్రాజెక్ట్ హెడ్ అయిపోయింది. రిషి సార్ చేరదీశారు కాబట్టి ఆటలు సాగుతున్నాయి. కాలేజ్ అనుకుంటుందో కాటేజ్ అనుకుంటుందో. రిషి సార్ కి సేవలు చేస్తోంది కదా. అయినా వాళ్లకు ఆ స్పృహ ఎక్కడుంది. ఏదో ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉంటారు. వసుధారకు పెళ్లి అయిన రిషి సార్ ని ఎందుకు వదలడం లేదు.
కాలేజీకి తీసుకొచ్చి ఇంకా నెత్తిన పెట్టుకోవడం అంటూ మాట్లాడుకుంటారు. అదంతా రిషి వింటాడు. వాళ్లిద్దరిని క్యాబిన్ రమ్మని చెప్పి వెళ్లిపోతాడు. జగతిని రమ్మనమని బాయ్ కు చెబుతాడు రిషి. జగతి వచ్చే సరికి రిషి కోపంగా ఉంటాడు. లెక్చరర్స్ భయపడుతూ ఉంటారు.

అయినా మీరు మారలేదు..
వీళ్లు చేసిన తప్పుల లిస్ట్, వీళ్ల ప్రవర్తనకు సంబంధించిన రిపోర్ట్ అని ఒక ఫైల్ జగతికి ఇస్తాడు రిషి. చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. వీళ్ల మాటలు నేను స్వయంగా విన్నాను. వీళ్లకు అవసరం లేని వాటి గురించి డిస్కస్ చేస్తున్నారు. పర్సనల్ మాటర్ లోకి వెళ్లారు. వసుధారతో కలిపి నన్ను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మీకు నచ్చినట్లు మాట్లాడితే మేము తీసుకునే నిర్ణయాలు మేం తీసుకుంటాం.
వసుధార గురించి ఇంతకుముందు మాట్లాడినప్పుడు సర్ది చెప్పాను. పెద్దమ్మ దగ్గరికి తీసుకెళ్లి చెప్పించాను. అయినా మీరు మారలేదు. అలాగే మాట్లాడుతున్నారు. మీరు మారరని అర్థం అయింది. ఇక మీకు ఇంకేమి సలహాలు ఇవ్వను. డిస్మిస్ చేస్తున్నాను అని చెప్పేస్తాడు రిషి. వీళ్లను డిస్మిస్ చేశాను. నోటీస్ బోర్డ్ పై ఉంచండి. మూడు నెలల సాలరీ అడ్వాన్స్ గా ఇచ్చేయండి. ఇంకేదైనా ఉంటే అది కూడా సెటిల్ చేయండి అని రిషి చెప్పేసి వెళ్లిపోతాడు.
వెనుక నుంచి వచ్చి..
సార్ సార్ అంటూ లెక్చరర్స్ క్షమించమని అడిగితే.. మీరేదైనా మాట్లాడాలంటే జగతి మేడమ్ తో మాట్లాడుకోండి అనేసి వెళ్లిపోతాడు రిషి. దాంతో వాళ్లు జగతి వైపు తిరిగి మేడమ్ మీరే రక్షించాలి.. ప్లీజ్ మేడమ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తారు. సారీ మేడమ్.. ఇది రిషి సార్ నిర్ణయం.. నేను కలుగజేసుకోను అని జగతి అంటుంది. కాదు మేడమ్.. మేము ఏదో మాట్లాడుతుంటే రిషి సార్ వెనుక నుంచి విన్నారు మేడమ్ అని ఒక లెక్చరర్ అనడంతో.. జగతికి తెగ కోపం వచ్చేస్తుంది.


Click it and Unblock the Notifications











