twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: సూపర్ ట్విస్ట్.. పోలీసుల చేతికి చిక్కిన రాజీవ్.. వసుధార గురించి తెలిసిన నిజం!

    |

    కాలేజీకి వసుధార కోసం వెళతాడు రాజీవ్. జగతి మేడమ్.. మహేంద్ర సార్.. ఫణీంద్ర సార్ అంటూ అందరికీ నమస్కారం చేస్తాడు. తర్వాత అందరూ బాగున్నారా.. బాగానే ఉంటారు. మంచివారు కదా. మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని రాజీవ్ అంటాడు. ఏంటీ మహేంద్ర ఇతను ఇక్కడికి వచ్చాడు అని జగతి అంటే.. అదే నాకు అర్థం కావట్లేదు అని మహేంద్ర అంటాడు.

    నా భార్య వసుధార ఎక్కడుంది.. మీ అందరికీ నేను ఎవరో తెలియదు కదా.. వసుధార నా భార్య. నేను వసుధార భర్త రాజీవ్ ను. తనకోసమే వచ్చాను అని రాజీవ్ చెప్పడంతో.. అక్కడున్న కాలేజీ స్టాఫ్ అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఫిబ్రవరి 3 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్‌ 677లో ఇంకా ఏం జరిగిందంటే?

    వదిలేసి వచ్చిందంటున్నాడు..

    వదిలేసి వచ్చిందంటున్నాడు..

    వసుధార కోసం వచ్చానని రాజీవ్ చెప్పడంతో.. హలో చూడండి.. మర్యాదగా మాట్లాడండి. ఏదైనా ఉంటే బయట చూసుకోండి. కానీ ఇలా కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చి గొడవ చేయడం బాలేదు అని మహేంద్ర అంటాడు. దానికి కదా సార్.. కాన్ఫరెన్స్ డిస్టర్బ్ చేస్తేనే మీకు ఇంత కోపం వస్తే.. నా కాపురం డిస్టర్బ్ అయితే నాకు ఎంత కోపం రావాలి చెప్పండి అని రాజీవ్ అంటాడు. అప్పుడు వసుధార ఇతన్ని పెళ్లి చేసుకుందా.. చూస్తే రౌడీలా ఉన్నాడు ఏంటో.

    వదిలేసి వచ్చిందంటున్నాడు ఏంటీ. మరి రిషి సార్ కోసం ఇక్కడికి వచ్చేసింది కదా అని కాలేజీ స్టాఫ్ మాట్లాడుకుంటారు. చూడండి మీకు మీకు ఏమైనా ఉంటే బయట చూసుకోండి. ఇక్కడికి వచ్చి ఇలా అరిస్తే బాగుండదు చెబుతున్నాను అని జగతి అంటుంది.

    క్యాబిన్ లో ఉండొచ్చు సార్..

    క్యాబిన్ లో ఉండొచ్చు సార్..

    మేడమ్ మేడమ్.. మీరు.. మీ పద్ధతులు.. మీ డిసిప్లెన్.. మీ ట్రైనింగ్ అన్నీ నాకు తెలుసు కదా. ఎంతైనా మీరు చెక్కిన శిల్పమే కదా మా.. అదే నా భార్య అని రాజీవ్ అంటాడు. ఏదైనా ఉంటే కాలేజ్ బయటే మాట్లాడు ఇక్కడ న్యూసెన్స్ చేయద్దు.. వెళ్లు అని మహేంద్ర అంటాడు. హో.. మహేంద్ర సార్.. వసుధార నా భార్య సార్.. నన్ను వదిలి కాలేజీ, రిషి సార్ అంటూ వస్తే ఎలా ఉంటాను సార్ చెప్పండి.

    నా బాధను కూడా కొంచెం అర్థం చేసుకోండి సార్. నా భార్యను నాకు ఇప్పించండి. కనీసం ఎక్కడుందో చెప్పండి అని రాజీవ్ అంటే.. తన క్యాబిన్ లో ఉండొచ్చు సార్ అని కాలేజీ స్టాఫ్ చెబుతారు. దీంతో అక్కడి నుంచి వసుధార అనుకుంటూ అరుచుకుంటూ వసుధార క్యాబిన్ వైపు వెళతాడు రాజీవ్. అతని వెంటే జగతి-మహేంద్ర, ఫణీంద్ర, కాలేజీ స్టాఫ్ గుమిగూడుతారు.

    నా పెళ్లా నాతో రమ్మంటే..

    నా పెళ్లా నాతో రమ్మంటే..

    వసుధార అని పిలుచుకుంటూ రాజీవ్ వెళుతుంటే అది విని షాక్ అయిన వసుధార బయటకు వస్తుంది. ఎందుకొచ్చావ్ అని వసుధార అడిగితే.. నీకోసం అని రాజీవ్ అంటే షాక్ అవుతుంది వసుధార. ఇక్కడి నుంచి వెళతావా లేదా అని వసుధార సీరియస్ అవుతుంటే.. వెళ్లడం కాదు వసుధార.. కలిసి వెళదాం రా అని రాజీవ్ అంటాడు.

    ఎందుకు రావాలి అని వసుధార అంటే.. నవ్వుకుంటూ అందరూ విన్నారా.. నా పెళ్లాం నాతో రమ్మంటే ఎందుకు అని ప్రశ్నిస్తోంది అని రాజీవ్ అంటాడు. షటప్ అని వసుధార అంటే.. రాకుంటే ఎలాగైనా తీసుకెళ్తాను అని చెప్పిన రాజీవ్.. వసుధార చేయి పట్టుకుని బలవంతంగా బయటకు తీసుకెళ్తాడు. మేడమ్, సార్ అని వసుధార అన్న ఎవరు ఏం చేయలేకపోతారు. అతని వెంటే అందరూ బయటు వస్తారు.

    రిషి వెనుకవైపుకి వసుధార..

    రిషి వెనుకవైపుకి వసుధార..

    వసుధార చేయి పట్టుకుని బలవంతంగా రాజీవ్ బయటకు తీసుకువస్తాడు. అక్కడ రిషి ఉంటాడు. ఏం జరుగుతోంది ఇక్కడ అని రిషి అంటే.. ఓ భార్య.. ఓ భర్త.. ఒక చిన్న తగాదా. భార్యాభర్తల మధ్య తగాదాలు సాధారణం కదా. రమ్మంటే రాను అంటుంది అని రాజీవ్ చెబుతాడు. నేను రానని చెబుతున్నాను కదా వసుధార అంటుంది.

    ఏంటీ వసుధార ఇది ఇలాంటి రోజు ఒకటు వస్తుందని అనుకోలేదు. వెళ్లిపో అని రిషి అంటాడు. అది సార్ అలా చెప్పండి అంటూ వసుధార చేయి రాజీవ్ పట్టుకుంటే.. విడిపించుకుని రిషి వెనుకవైపు వెళ్లి నిలుచుంటుంది. ఏంటీది వసుధార.. ఎందుకు వెళ్లవు.. భార్య అంటున్నాడు కదా అని రిషి అంటాడు. మీరు జెంటిల్ మెన్ సార్.. చాలా బాగా చెప్పారు అని రాజీవ్ అంటాడు. ఏంటీ వసుధార కాలేజీలో ఈ పంచాయితీ వెళ్తావా లేదా అని సీరియస్ అవుతాడు రిషి. తర్వాత వసుధార చేయి రాజీవ్ పట్టుకోబోతుంటే ఆపుతాడు రిషి.

    రిషికి సారీ చెప్పిన ఎస్సై..

    రిషికి సారీ చెప్పిన ఎస్సై..

    ఏంటీ సార్ ఈ ట్విస్ట్ అని రాజీవ్ అంటే.. ట్విస్ట్ ఇక్కడ కాదు అక్కడ అని పోలీసుల దగ్గరికి పంపిస్తాడు రిషి. పోలీసులను చూసి షాక్ అవుతాడు రాజీవ్. ఏరా తప్పించుకుంటే దొరకవు అనుకున్నావా. నువ్ వస్తావని తెలిసే మేము రిషి సార్ ని ఆపమని చెప్పాము. ఏంట్రా ఆ అమ్మాయి నా పెళ్లామా.. అసలు నువ్వు తాళే కట్టలేదు కదరా.. నీకు ఎలా పెళ్లాం అవుతుంది అని ఎస్సై అనడంతో.. జగతి-మహేంద్ర, రిషి అందరూ షాక్ అవుతారు.

    కానిస్టేబుల్స్ వీడిని తీసుకెళ్లండి అని చెప్పిన ఎస్సై.. రిషి దగ్గరికి వెళ్లి అప్పుడు మిస్ అండస్టాండ్ అయింది అని సారీతోపాటు రాజీవ్ ను పట్టించినందుకు థ్యాంక్స్ చెబుతాడు. తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అక్కడ జరిగినదంతా దేవయానికి కాలేజీ మేడమ్ చెప్పడంతో దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. రాజీవ్ ఇలా దొరికేసేడేంటీ.. ప్లాన్ మార్చాలా అని అనుకుంటుంది దేవయాని.

    కాలమే సమాధానం చెబుతుంది..

    కాలమే సమాధానం చెబుతుంది..

    వసుధార ఒకచోట ఉండి బాధపడుతుండగా.. రిషి అక్కడికి వస్తాడు. అప్పుడు వసుధార వెళ్లిపోతుంది. నీ మెడలో ఆ తాళి ఎవరు కట్టారు అని రిషి అనడంతో.. నేను మీకు ముందే చెప్పాను సార్. ఈ తాళి నా ఇష్టపూర్వకంగానే మెడలో పడింది అని చెబుతుంది వసుధార. నీ మెడలో తాళి ఆ రాజీవ్ కట్టలేదు. మరి ఇంకెవరు కట్టారో చెప్పు.

    ఎవరినీ మోసం చేస్తున్నావ్. లేదా నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావా వసుధార అని రిషి అంటే.. నేను ఎవర్నీ మోసం చేయట్లేదు అని వసుధార అంటుంది. మరి ఇది అంతా ఏంటీ అని అడిగితే పొంతన లేని సమాధానం చెబుతుంది వసుధార. సమాధానం కావాలి అని రిషి అంటే.. కాలమే సమాధానం చెబుతుంది అని వసు అంటుంది. అతను ఎవరో నాకు తెలియాలి అని రిషి అంటే.. తెలుసుకోండి. కనీసం ఈ ప్రయత్నం అయినా చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార.

    రిషికి మనశ్శాంతి లేకుండా..

    రిషికి మనశ్శాంతి లేకుండా..

    వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర-జగతి. మనం చాలా పొరపడ్డాం జగతి. వసుధార మెడలో రాజీవ్ తాళి కట్టకపోతే ఇంకెవరు కట్టారు. ఇదేం తలనొప్పి జగతి అంటాడు మహేంద్ర. నన్ను ఏం అడక్కు మహేంద్ర అని జగతి అంటే.. మన వసుధార ఇలా చేయడం ఏంటీ. మన ఇంటి సభ్యురాలుగా ఉన్న వసధార మనకు నిజం చెప్పకపోవడం ఏంటీ.. కాలేజీలో ఇంతపెద్ద గొడవ జరిగితే కానీ రాజీవ్ తన మెడలో తాళి కట్టలేదన్న విషయం మనకు తెలియలేదు అని మహేంద్ర అంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన కాలేజీ స్టాఫ్ వసుధార, రిషి గురించి చెడ్డగా మాట్లాడుతారు.

    జగతి అవమానంతో తలదించుకుంటుంది. వీళ్ల మాటలతో రిషికి మనశ్శాంతి లేకుండా చేసేలా ఉన్నారు. పెద్ద గొడవ అయ్యేలా ఉంది. ఏం చేద్దాం అని అంటుంది జగతి. వసుధార దగ్గరకు వెళ్లి నిజం చెప్పమని నిలదీద్దాం పద ఆని మహేంద్ర అంటాడు.

    English summary
    Guppedantha Manasu Serial February 3 2023 Today Full Episode 677..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X