Guppedantha Manasu: వసుధార మాటలకు షాక్ అయిన జగతి-మహేంద్ర.. అపార్థం చేసుకుంటున్న రిషి!
కాలేజీలో వసుధార మెడలో రాజీవ్ కట్టలేదని తెలియడంతో జగతి, మహేంద్ర, రిషి, కాలేజీ స్టాఫ్ అంతా షాక్ అవుతారు. కాలేజీలో కూర్చుని జగతి-మహేంద్ర ఇదేం కొత్త తలనొప్పి అని బాధపడుతుంటారు. మరోవైపు కాలేజీ స్టాఫ్ మేడమ్స్ వసుధార, రిషి గురించి చెడ్డగా మాట్లాడటం విని జగతి చాలా బాధపడిపోతుంది. ఏంటీ మహేంద్ర ఇది.. ఈ టాపిక్ తో మళ్లీ రిషిని చిత్రవధ చేసేలా ఉన్నారు. అసలువసుకి బుద్ధి లేదు. రిషి ఆనందంగా ఉండాలని మనం కోరుకుంటే.. వసుధార ఇలా చేస్తోంది అని జగతి అంటుంది. ఏదో ఒకటి కాదు.. వసుధార దగ్గరికి వెళ్లి నిజం చెప్పమని నిలదీద్దాం అని మహేంద్ర అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 4 శనివారం నాటి తాజా ఎపిసోడ్ 678లో ఇంకా ఏం జరిగిందంటే?

ఏం చెప్పడానికి వచ్చారు..
వసుధారను నిజం చెప్పమని నిలదీద్దాం అని మహేంద్ర అంటే.. వసుధార నిజం చెబుతుందని అనుకుంటున్నావా మహేంద్ర అని జగతి అంటుంది. అసలు వసుధార ఇలా ఎందుకు చేస్తోంది. నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు అని జగతి అంటే.. ఆరోజు చక్రపాణి గారు ఈ విషయం చెప్పడానికే ఇంటికి వచ్చారేమో అని మహేంద్ర అంటాడు. అవును మహేంద్ర ఆయన్ను కలిస్తే మనకు కచ్చితంగా నిజం తెలుస్తుంది పదా వెళ్దాం అని అక్కడి నుంచి చక్రపాణి ఇంటికి వెళతారు. వారిని చూసి రండి సర్.. రండి టీచరమ్మా అని కూర్చోమంటాడు చక్రపాణి. ఆరోజు మా ఇంటికి వచ్చారు ఏం చెప్పడానికి వచ్చారో చెప్పండి అని మహేంద్ర అడుగుతాడు. అందుకు చక్రపాణి సంశయిస్తూ ఉంటాడు.

అందరినీ చంపేస్తానని..
రాజీవ్ కాలేజీకి వచ్చి నానా రచ్చ చేశాడు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అని మహేంద్ర అంటే.. వసుధార మెడలో రాజీవ్ తాళి కట్టకుంటే ఇంకెవరు తాళి కట్టారు.. అసలు ఏం జరిగింది అని జగతి అడుగుతుంది. అందుకు వసుధార ఒట్టు వేయించుకుంది గుర్తుకు వచ్చిన చక్రపాణి ఆలోచనలో పడిపోతాడు. అప్పుడు వచ్చిన వసుధార నేను చెబుతాను అని అంటుంది. తన పెళ్లి సమయంలో రాజీవ్ చంపుతానని బెదిరించిన విషయం అంతా చెబుతుంది వసుధార. అందుకు జగతి-మహేంద్ర ఇద్దరు షాక్ అవుతారు. ఆరోజు మిమ్మల్ని, అమ్మా నాన్నలను చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తేనే ఇలా చేశానని వసు చెప్పడంతో ఆశ్చర్యపోతారు జగతి-మహేంద్ర. అనంతరం తన మెడలో ఉన్న తాళి తీసి ఇది ఏంటి మేడమ్ అని వసుధార అడుగుతుంది.

నేను పోలీస్ స్టేషన్ కు..
ఈ తాళి ఎవరు ఇచ్చారు అని వసుధార అడిగితే.. నేనే ఇచ్చాను. ఇప్పుడు అదికాదు. అసలు నీ మెడలో తాళి ఎవరు కట్టారనేదే ముఖ్యం అని జగతి అనడంతో.. ఇది నా మెడలో ఇష్టపూర్వకంగా పడింది మేడమ్. ఇంకెవరు కడతారు. రిషి సారే అని వసుధార చెప్పడంతో మహేంద్ర-జగతి షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావ్ వసుధార అని జగతి అనడంతో.. అవును మేడమ్.. ఇది రిషి సార్ కట్టాడు. నా చేతులతో నేనే ఈ తాళిని నా మెడలో వేసుకున్నాను. కానీ మానసికంగా రిషి సార్ మెడలో వేసినట్లుగా భావించాను. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజీవ్ బావ నుంచి తప్పించుకోవడానికి, నా వాళ్లను కాపాడుకోవడానికి అదే కరెక్ట్ అనిపించింది. తర్వాత అమ్మా నాన్నలకు అలా జరిగింది. వారు ఆస్పత్రికి వెళితే.. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ పరిస్థితులు, ఆలోచనలు వేగంగా మారిపోయాయి. నా తాళి గురించి చెప్పే అవకాశం రాలేదు అని వసుధార చెబుతుంది.

ప్రేమకు నేను పెట్టుకున్న పరీక్ష..
వసుధార అలా చెప్పడంతో జగతి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక రిషికి జరిగింది చెప్పేయ్ అని జగతి అంటుంది. లేదు మేడమ్. అది రిషి సార్ తెలుసుకోవాలి అని వసుధార అంటుంది. మళ్లీ ఇదంతా ఎందుకు వసుధార అని మహేంద్ర అంటాడు. నువ్వు చెప్పకపోతే మేము వెళ్లి చెబుతాం అని చక్రపాణి అంటాడు. వద్దు నాన్న. నన్ను క్షమించండి. నాకు మీపై గౌరవం ఉంది. కానీ నాకు రిషి సార్ మధ్య ఎవరి సంప్రదింపులు జరుపకూడదుని నిశ్చయించుకున్నాను. రిషి సార్ నన్ను అపార్థం చేసుకున్నారు. దాన్ని తొలగించుకోవాలి. మా ప్రేమకు నాకు నేనుగా పెట్టుకున్న పరీక్ష. అందులో రిషి సార్ గెలవాలి. గెలిపిస్తాడని నమ్మకం ఉంది. నేను వేరేవాళ్లతో తాళి కట్టించుకున్నా అని రిషి సార్ అలా ఎలా అనుకుంటారు మేడమ్ అని వసుధార అంటుంది. దీంతో వసుధారను వెళ్లి జగతి హగ్ చేసుకుంటుంది. సారీ అని చెబుతుంది.

నాకు తెలియని దగ్గరి వాళ్లు ఎవరు..
రిషి సార్ లేకపోతే నేను ఉండలేను అని తెలుసుకున్నాను. అలాగే రిషి సార్ కూడా ఉండలేరన్న నిజం తెలుసుకోవాలి. దయచేసి ఈ నిజాన్ని రిషి సార్ కు మీరు చెప్పొద్దు అని ఒట్టు వేయించుకుంటుంది వసుధార. మరోవైపు గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. వసుధార మెడలో రాజీవ్ తాళి కట్టకుంటే ఇంకెవరు కట్టారు. తాళి కట్టారంటే ఎవరో దగ్గరి వ్యక్తులే కావాలి. నాకు తెలియను అలాంటి దగ్గరి వ్యక్తులు ఎవరు ఉన్నారు. అది నాకు ఎందుకు తెలియలేదు అని ఆలోచనలో ఉంటాడు రిషి. ఇంతలో అక్కడికి జగతి-మహేంద్ర వస్తారు. వెంటనే లేచి వెళ్లి.. మేడమ్ వసుధార నిజంగా మీకు ఏం చెప్పలేదా అని అడుగుతాడు రిషి. ఇలా నిజం దాచిపెట్టి నటించడం నావల్ల కాదు అని జగతి అంటే.. కొంప ముంచకు జగతి.. వసుధార ఒట్టేయించుకుంది కదా అని మహేంద్ర అంటాడు. అందుకు నాకు వసు మాట కన్నా రిషి ముఖ్యం. రిషిని ఇలా బాధలో చూడలేకపోతున్నాను అని జగతి అంటుంది. వద్దు అని మహేంద్ర అంటాడు.

దేవయానిని పొగిడిన జగతి..
వసుధార చెప్పలేదే అనుకోండి.. మీరైనా తనను అడగొచ్చు కదా అని రిషి అంటే.. నాకు ఏం అవసరం రిషి. నేను ఎందుకు అడుగుతాను. తను కేవలం ప్రాజెక్ట్ హెడ్. కాలేజీ విషయాలు, పర్సనల్ విషయాలు వేరు వాటిని కలపొద్దు అని నువ్వే అన్నావ్ కదా అని జగతి అంటుంది. ఇంతలో దేవయాని ఎంట్రీ ఇస్తుంది. వసుధార గురించి మాట్లుడుతూ దొంగప్రేమ నటిస్తుంటే మహేంద్ర సెటైర్లు వేస్తాడు. అందుకు జగతి నవ్వుకుంటూ ఉంటుంది. వసుధారను తక్కువ చేస్తూ దేవయానిని పొగుడుతుంటుంది జగతి. నువ్వేనా ఇలా మాట్లాడుతోంది అని దేవయాని అంటే.. అవును అక్కయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు జగతి-మహేంద్ర. తర్వాత ఇంతా జరిగినా రాజీవ్ కాలేజీకి వచ్చి గొడవ చేశాడంటే అందులో దేవయాని అక్కయ్య హస్తం ఉందని అనుమానిస్తుంది జగతి. నిజమా అని మహేంద్ర అంటే.. తన పెత్తనం కోసం రిషిని బాధపెడుతూ ఎంతకైనా దిగజారుతుంది అని జగతి అంటుంది.


Click it and Unblock the Notifications











