Guppedantha Manasu: రిషి తిరకాసు ప్రశ్నలు, వసు వంకర సమాధానాలు.. మహేంద్ర కొత్త స్కెచ్!

కారులో కాలేజీకి వస్తాడు రిషి. వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాలేజీలోని ఒక చెట్టు దగ్గర కూర్చుని వసుధార మెడలో తాళి ఎవరకు కట్టి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార కాలేజీకి వచ్చిందా. ఇంతజరిగాక అసలు వస్తుందా అని తనలో అనుకుంటాడు రిషి. అంతలోనే మరోవైపు నుంచి వసుధార వస్తుంది. రిషి కూర్చున్న చెట్టుకు మరోవైపు వచ్చి కూర్చుంటుంది వసుధార.

రిషి గురించి వసుధార ఆలోచిస్తూ రిషిని చూస్తుంది. ఇంతలో కాలేజీకి వచ్చావా అని వసుధారకు మెసేజ్ చేస్తాడు రిషి. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఫిబ్రవరి 6 సోమవారం నాటి తాజా ఎపిసోడ్‌ 679లో ఇంకా ఏం జరిగిందంటే?

 నువ్ బాగానే ఉంటావ్..

నువ్ బాగానే ఉంటావ్..

కాలేజీకి వచ్చావా అని వసుధారను రిషి అడిగితే.. ఎందుకు సార్ అని వసుధార రిప్లై ఇస్తుంది. ఎలా ఉన్నావ్ అని రిషి మేసేజ్ సెండ్ చేస్తాడు. దీంతో వసుధారకు మెసేజ్ వచ్చినట్టుగా సౌండ్ వస్తుంది. అది విని వసుధారను చూస్తాడు రిషి. ఒకరినొకరు చూసున్నా కూడా మెసేజ్ లోనే మాట్లాడుకుంటారు. నాకేంటీ సార్ బాగున్నాను అని వసుధార చెబుతుంది.

నువ్ బాగానే ఉంటావ్.. అని రిషి అనుకుంటాడు. అంటే నిన్న జరిగినదానికి డిస్టర్బ్ అయ్యావా అని రిషి మెసేజ్ చేస్తాడు. ఒకరు డిస్టర్బ్ చేస్తే నేను డిస్టర్బ్ కాను సార్ అని వసుధార అంటుంది. వసుధార పెళ్లి గురించి, తాళి ఎవరు కట్టారో తెలుసుకోవాలని అనుకుంటాడు రిషి. కానీ డైరెక్ట్ గా అడగడు.

 నేను చెప్పిన మాటలే..

నేను చెప్పిన మాటలే..

రిషి సార్ మనసులో ఏదో అడగాలని ఉంది. కానీ రిషి సార్ కి ఈగో ఎక్కువగా నేరుగా అడగరు అని వసుధార అనుకుంటుంది. ఏంటీ సైలెంట్ గా ఉన్నావ్ అని రిషి మెసేజ్ చేస్తే.. నా లిమిట్స్ లో నేనున్నాను సార్ అని వసుధార అంటుంది. ఇదివరకు నీ లిమిట్స్ లో నువ్ ఉండు.. నా లిమిట్స్ లో నేను ఉంటా అని రిషి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. నేను చెప్పిన మాటలే నాకు చెబుతుంది పొగరు.. అని అనుకుంటాడు రిషి.

వాళ్లు ఇలానే ఏదో ఒకటి మెసేజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మహేంద్ర-జగతి కారులో వస్తారు. వచ్చి రిషి, వసుధార అలా కూర్చోవడం చూసి ఆశ్చర్యపోతారు. ఏంటీ జగతి వీళ్లిద్దరు.. అసలు వీళ్లు ఎవరికీ అర్థం కారు అని మహేంద్ర అంటే.. ఒకరికి అర్థం అవుతే.. వాళ్లు రిషి, వసుధార ఎందుకు అవుతారు అని జగతి అంటుంది.

మేడమ్ ప్రవర్తనలో మార్పు..

మేడమ్ ప్రవర్తనలో మార్పు..

జగతి-మహేంద్రలను చూసిన వసుధార.. వాళ్ల దగ్గరికి వెళ్లి గుడ్ మార్నింగ్ చెబుతుంది. వాళ్లు కూడా సంతోషంగా గుడ్ మార్నింగ్ చెబుతారు. తర్వాత వర్క్ ఉందని వసుధార వెళ్తుంది. వసుధారతో నవ్వుతూ మాట్లాడటం చూసిన రిషి జగతి-మహేంద్రల వద్దకు వచ్చి వసుధార ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు. లేదు రిషి.. నేను కూడా ఏం అడగలేదు అని జగతి అంటుంది.

వసుధార ఏదైనా సమస్యలో ఉందేమో అని మహేంద్ర అంటాడు. జగతి నవ్వుకుంటూ మాట్లాడటం చూసిన రిషి.. మేడమ్ ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది అని రిషి అనుకుంటాడు. జగతి కూడా రిషి ఆలోచనలో మార్పు వచ్చింది అని అనుకుంటుంది.

ఇంతలో ఎవరో ఎన్నారై కాల్ చేసినట్లు చెప్పి అక్కడి నుంచి రిషిని పంపించేస్తారు మహేంద్ర. రిషిని, వసుధారను కలిపేందుకు మిషన్ ఎడ్యుకేషన్ టూర్ ప్లాన్ వేస్తాడు మహేంద్ర. తర్వాత మంత్రి దగ్గరికి జగతి-మహేంద్ర వెళతారు.

కొన్నాళ్లు లీవ్ తీసుకోకుండా..

కొన్నాళ్లు లీవ్ తీసుకోకుండా..

మహేంద్ర-జగతి, రిషి, వసుధారల గొప్పదనం, మంచితనం గురించి ప్రశంసిస్తారు మంత్రి. మిషన్ ఎడ్యుకేషన్ లో పనులు మొదలు పెట్టమని.. తనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలని మంత్రి అంటాడు. మరోవైపు వసుధార క్యాబిన్ కు రిషి వెళతాడు. వసుధార మెడలో తాళి ఎవరు కట్టారనే విషయం ఎలాగైనా రాబట్టాలని అనుకుంటాడు రిషి.

మాములుగా అయితే ఇలాంటి సమయంలో అటు ఇటు ప్రయాణాలు చేస్తారు కదా.. నువ్వేంటి ఎక్కడికి వెళ్లలేదా అని రిషి అడుగుతాడు. ఎక్కడికి వెళ్లాలి సార్ అని వసుధార అంటే.. కొన్నాళ్లు లీవ్ తీసుకోకుండా ఇలా వచ్చావ్ ఏంటీ అని రిషి అడిగితే.. సార్ నాకు ఆకలి చాలా వేస్తుంది. ఏం తినకుండా వచ్చాను అని వసుదార అంటుంది. నేను కూడా ఏం తినలేదు అని రిషి చెబుతాడు.

చెప్పాల్సి మాత్రం చెప్పవ్..

చపాతీలు తెచ్చాను సార్.. మీకు కూడా చపాతీలు చేయడం వచ్చు కదా సార్ అని వసుధార అంటుంది. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన మీటింగ్ ఎప్పుడు ఉంటుంది అని రిషి అంటే.. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అడగటానికి మీకు ఇగో అడ్డు వస్తుంది. అయినా మీరు అడిగినా నేను చెప్పను అని వసుధార అనుకుంటుంది.

రిషి పెళ్లి గురించి ఇన్ డైరెక్ట్ గా అడిగితే వసుధార కూడా అంతే వంకరగా సమాధానాలు చెబుతుంది. చెప్పాల్సింది మాత్రం చెప్పవ్ కదా అని తిట్టుకుంటాడు రిషి. ఇద్దరు కిలిస చపాతీలు తింటారు. జీవితాంతం మీతో కలిసి తినే అవకాశం ముందు ముందు వస్తుందని వసుధార అనుకుంటే.. నీతో కిలిసి గడిపే ప్రతీ క్షణం ఎంతో బాగుంటుందని రిషి అనుకుంటాడు.

ఏది జరిగినా నాకే నష్టం..

ఏది జరిగినా నాకే నష్టం..

మరోవైపు ఇంట్లో రాజీవ్ పోలీసులకు పట్టుబడటంపై కంగారు పడుతుంది దేవయాని. వాడు ఉంటే వసుధారను ఎలాగో ఇబ్బంది పెట్టేవాడు. ఉన్న ఒక్క ఆయుధం పోయింది. ఇప్పుడు రిషి అయితే వసుధార పక్కన కూర్చోవాలి లేదా జగతితో ఉండాలి. అందులో ఏది జరిగినా నాకే నష్టం.

ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని. ఇంతలో స్వీట్స్ అంటూ ధరణి నవ్వుతూ వస్తుంది. దీంతో చిరాకు పడిన దేవయాని తిట్టి ధరణిని పంపిచివేస్తుంది. ఇంతలో దేవయానికి జగతి కాల్ చేస్తుంది. నేను మహేంద్ర కొద్ది రోజులు ట్రిప్ కు వెళ్తున్నామని చెబుతుంది. పిక్ నిక్ ఆ.. టూర్ ట్రిప్ ఆ అని దేవయాని అంటే.. రెండు అనుకోండి అని జగతి అంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని దేవయాని అడిగితే.. ఆ వివరాలాన్ని తర్వాత చెబుతాం అని ఫోన్ కట్ చేస్తుంది జగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X