Guppedantha Manasu: రిషితో వసుధార హనీమూన్ కు స్కెచ్.. జగతి-మహేంద్ర కొత్త ప్లాన్! ఏం జరగనుంది?
కాలేజీలో రిషికి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి బోర్డుపై వివరిస్తూ ఉంటుంది. బోర్డుపై రాసిన పనులకు చివర్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలా చివర్లో క్వశ్చన్ మార్క్ ఎందుకు అని రిషి అడిగితే.. న్యూటన్ యాపిల్ సిద్ధాంతం చెప్పిన వసుధార.. ప్రశ్నే నాలేడ్జ్ కు పునాది అని చెబుతుంది. దీంతో మరి నా ప్రశ్నకు సమాధానం ఎప్పుడు దొరుకుతుంది అని రిషి అంటే.. ప్రశ్న సరైనదే అయితే కచ్చితంగా దొరుకుతుంది అని వసుధార సమాధానం ఇస్తుంది. ఇంతలో వసుధార చేతిలో ఉన్న మార్కర్ కింద పడుతుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 7 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్ 680లో ఇంకా ఏం జరిగిందంటే?

నీ ముక్కు చూసుకో..
వసుధార చేతిలో ఉన్న మార్కర్ కింద పడగానే అది తీసేందుకు రిషి, వసుధార ఇద్దరు కిందకు వంగుతారు. ఇంతలో ఇద్దరి తలలు గుద్దుకుంటాయి. ఇలా ఒకసారి తల తగిలితే కొమ్ములు వస్తాయని ఎక్కడో విన్నాను సార్ అని వసుధార గతంలో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు రిషి. సర్ మరొసారి కొట్టండి అని వసుధార అంటే.. వద్దు వచ్చిన కొమ్ములు పోతాయేమో చూసుకో అంటాడు రిషి.
అయినా వినకుండా రిషి తలను తన తలతో మళ్లీ కొడుతుంది వసుధార. ఈ క్రమంలో వసుధార ముక్కుపై మార్కర్ కలర్ అంటుకుంటుంది. అలా అంటుకోవడంతో నీ ముక్కు అని చెబుతాడు రిషి. నా ముక్కు బాగుంటుంది సార్ అని వసుధార అంటుంది. ఎవరు చెప్పారని రిషి అడిగితే.. అందరూ అంటారు అని వసుధార చెబుతుంది.

హార్ట్ గురించి బాధపడతారా..
అది కాదు అంటూ వసుధార ముక్కుపై ఉన్న మార్కర్ తుడిచేందుకు వెళ్లి.. ఆగిపోతాడు. తర్వాత అది ఫొటో తీసి వసుధారకు చూపిస్తాడు. ఒకప్పుడు మీరే తుడిచేవారు ఇప్పుడు దూరంగా ఉంటున్నారా సార్ అని అనుకుంటుంది వసుధార. దూరమయ్యావా వసుధార అని మనసులో రిషి అనుకుంటాడు. దూరం మీరే తగ్గించాలి అనుకుంటూ వెళ్లోస్తానని వెనక్కి తిరుగుతుంది వసుధార.
ఇంతలో అక్కడ ఉన్న లవ్ సింబల్ కింద పడిపోతుండగా వసుధార, రిషి ఇద్దరూ పట్టుకుంటారు. ఎందుకు పట్టుకున్నావ్ వసుధార అని రిషి అడిగి.. హార్ట్ కదా సార్ అని వసుధార అంటుంది. హార్ట్ లేని వాళ్లు హార్ట్ గురించి బాధపడతారా అని రిషి అంటే.. కొద్దిగా బాధపడుతుంది వసుధార. వెళతానని చెప్పి వెళ్లిపోతుంది వసుధార. నా జీవితంలో నుంచి ఎప్పుడో వెళ్లిపోయావ్.. ఇప్పుడు వెళ్తున్నా అని చెబుతున్నావా అని బాధపడతాడు రిషి.

ఎక్కడికి రమ్మంటే అక్కడికి..
మరోవైపు చక్రపాణికి సుమిత్ర ఫోన్ చేసి అక్కడి పరిస్థితలు ఏంటని అడుగుతుంది. అమ్మాయి జీవితం బాగుంటుందని సంతోషించే లోపే వాళ్ల మధ్య చిక్కుముడి వచ్చిపడింది. ఏ దేవుడో సాయం చేస్తే కానీ వాళ్లిద్దరు ఒక్కటి కారు సుమిత్ర అని చక్రపాణి మాట్లాడుతుండగా.. అక్కడికి జగతి-మహేంద్ర రావడంతో షాక్ అవుతాడు.
మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది అని చక్రపాణి మర్యాదలు చేస్తుంటాడు. మర్యాదలు పక్కన పెట్టి కాసేపు కూర్చోండి. మీతో చిన్న పని ఉండి వచ్చాం అని మహేంద్ర అంటాడు. కాల్ చేసి చెబితే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడకు వచ్చేవాన్ని కదా అని చక్రపాణి అంటాడు.
వీళ్లిద్దరిని చూస్తే బాధేస్తుంది.. భయమేస్తుంది. రిషి తనంతట తానే నిజం తెలుసుకోవాలని వసుధార అనుకుంటుంది. వసుని తప్పుబట్టలేం. కానీ రిషి బాధను చూడలేకపోతున్నాం అని జగతి అంటుంది.

ఈ మర్యాదలు ముందు ముందు..
వసుధార బయటకు అలా అంటుంది కానీ, రిషి సార్ గురించి చాలా బాధపడుతోంది మేడమ్ అని చక్రపాణి అంటాడు. అందుకే.. వారిద్దరినీ పక్కపక్కన ఉండేలా ఒకటి ప్లాన్ చేశాం. దానికి మీరు సహాయం చేస్తే చాలు. వాళ్లిద్దరినీ ఏదైనా టూర్ పంపించాలి అని అనుకుంటున్నాం అని మహేంద్ర అంటాడు. కాలేజీలో పొడిపొడిగా మాట్లాడుకుంటున్నారు.
అదే పక్కపక్కన ఉంటే చనువు పెరిగి నిజం తెలిసే అవకాశం ఉంది. టూర్ వివరాలు తర్వాత చెబుతాం అని జగతి అంటుంది. అందుకు సరే అని అంటాడు చక్రపాణి. జగతి-మహేంద్ర వెళ్లిపోతాం అని అంటే.. రాక రాక వచ్చారు. ఏదైనా తీసుకోండి అని చక్రపాణి అంటే.. ఈ మర్యాదలు ముందుముందు చేద్దురు అని జగతి అంటుంది.
తర్వాత చక్రపాణి ఆలోచనలో పడిపోతే.. జగతి-మహేంద్ర వెళ్లిపోతారు. కాలేజీలో వసుధార నిలబడి ఉంటుంది. ఇంతలో రిషి వచ్చి లిఫ్ట్ కావాలా అని అడుగుతాడు. వసుధార ఏం చెప్పకపోవడంతో కారు దిగి వసు దగ్గరికి వెళ్లి నిలుచుంటాడు రిషి. నేను ఇప్పుడు డీబీఎస్టీ కాలేజీ ప్రాజెక్ట్ హెడ్ ను క్యాబ్ చేసుకోగలను అంటుంది వసుధార.

టూర్ కు వెళ్లేది మనం కాదు..
పొగరు అని మనసులో అనుకుంటాడు రిషి. అయినా క్యాబ్ బుక్ చేసుకోవడం ఏంటీ తీసుకెళ్లడానికి కొత్తగా ఇంట్లోకి వచ్చినవాళ్లు వస్తారు కదా అని రిషి అంటే.. కొత్తగా వచ్చినవాళ్లకు పని చెప్పం కదా సార్ అని వసుధార అంటుంది. ఇంతలో వసు బుక్ చేసిన క్యాబ్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఫన్నీగా పోట్లాడుకున్న వసుధార.. రిషి కారు ఎక్కుతుంది.
మధ్యలో బొట్టు బిళ్లలు కొనుక్కోవాలి అంటే.. నేను నీ డ్రైవర్ ని కాదు.. అడగాల్సిన వాళ్లను అడుగు అంటాడు రిషి. తర్వాత రిషి, మహేంద్ర-జగతి ముగ్గురు డిన్నర్ చేస్తుంటారు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులో భాగంగా చిన్న చిన్న పల్లెటూర్లకు వెళ్లి కిట్ లు ఇవ్వాలి కదా. అందుకు నేను జగతి వెళ్తున్నాం అని చెబుతాడు మహేంద్ర. సరే వెళ్లండి డాడ్ అని రిషి అంటాడు. అయితే టూర్ కు వెళ్లేది మనం కాదు.. రిషి వసుధార అని తెలిస్తే.. ఉంటుంది అని జగతితో అంటాడు మహేంద్ర.
నీకు భయపడతా అనుకుంటున్నావా..
మరోవైపు ఇంట్లో లవ్ సింబల్ వేసి దాంట్లో వీఆర్ అని లెటర్ రాసి సంతోషపడుతుంది వసుధార. మా ఇద్దరిని ఎవరు విడదీయలేరు. ఇవి రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి అనుకుంటూ ఆనందంగా ఉంటుంది వసుధార. ఇంతలో చక్రపాణి వచ్చి వసుధారను చూసి సంతోషిస్తాడు.
త్వరలోనే మీ ఇద్దరు ఒక్కటి అవుతారని అనిపిస్తోందమ్మా అని చక్రపాణి అంటాడు. నాక్కూడా అలాగే ఉంది నాన్న అని చెప్పిన వసుధార వెళ్లి చందమామతో మాట్లాడుతుంది. హలో చందమామ నీకు కూడా కోపంగా ఉందా.. నేను నీకు భయపడతానని అనుకుంటున్నావా.. నేను రిషి సార్ కే భయపడను అని అంటుంది వసుధార.
మరోవైపు రిషి కూడా చందమామతో మాట్లాడుతుంటాడు. ఏంటీ చందమామ సార్.. మీ ఫ్రెండ్ మీరు ఒకటేనా. మీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు.. లేదంటే వెళ్లిపోతారు. వసుధార తన భర్త ఎవరో చెప్పదు. మేము జ్ఞాపకాలతో బతికేయాలా అని అంటాడు రిషి.


Click it and Unblock the Notifications