Guppedantha Manasu: రిషికి షాక్ ల మీద షాక్ లు.. ఏమయ్యో, పెనిమిటీ అంటూ వసుధార!

మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ టూర్ కి వసుధార, రిషి ఇద్దరూ బయలుదేరుతారు. దారిలో కారులో కాఫీ తాగాలనుకుని కప్పులో పోసుకుంటుంది వసుధార. కానీ, రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా కారు అటు ఇటు షేక్ అవ్వడంతో తాగలేకపోతుంది. దీంతో ఒక చోట కారు ఆపుతాడు రిషి. ఇద్దరు కాఫీ తాగుతారు. కాఫీ బాగుంది వసుధార అని రిషి అంటాడు.

దీనికి ఇలా బయటకు వచ్చి కాఫీ తాగడం బాగుంది కదా సార్ అని వసుధార అంటుంది. నీతో ప్రతిక్షణం బాగుంటుంది. కానీ ఇది ఎప్పటికీ ఇలా ఉండదు కదా వసుధార అని మనసులో అనుకుంటాడు రిషి. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఫిబ్రవరి 9 గురువారం నాటి తాజా ఎపిసోడ్‌ 682లో ఇంకా ఏం జరిగిందంటే?

ఎలా అర్థం చేసుకోవాలి..

ఎలా అర్థం చేసుకోవాలి..

వసుధార పెళ్లి గురించి రిషి మనసులో బాధపడుతుంటే.. ఏం ఆలోచిస్తున్నారు ఏండీ గారు అని వసుధార అడుగుతుంది. దీంతో ప్రతీసారి అలా పిలవకు అని రిషి అంటాడు. నాకు మాత్రం ఎండీ మై డార్లింగ్ అని మనసులో అనుకుంటుంది వసుధార. తర్వాత టూర్ లో భాగంగా పిల్లల్ని, వాళ్ల తల్లిదండ్రులను కలుస్తారు రిషి, వసుధార.

రిషి గురించి చాలా గొప్పగా చెబుతుంది వసుధార. అలాగే కిట్ లో ఉన్న స్కూల్ యూనిఫామ్, నోట్ బుక్స్, పెన్సిల్స్, పెన్స్ అన్నింటి గురించి, చదువు గురించి చెబుతుంది వసుధార. అలాగే మధ్యలో ప్రతీ సారి మై ఎండీ అని అంటూ ఉంటుంది. దీంతో షాక్ అయిన రిషి.. ఏంటీ వసుధార ఇలా మాట్లాడుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. పిల్లల చదువు కోసం డీబీఎస్టీ కాలేజీ కిట్స్ ఇస్తుందని, వాళ్లను దత్తత తీసుకుని చదివిస్తామని వసుధార చెబుతుంది.

వసుధారలా అందనంత ఎత్తుకు..

వసుధారలా అందనంత ఎత్తుకు..

వసుధార మాట్లాడిన తర్వాత ధర్మయ్య అనే వ్యక్తి రిషి సార్ చాలా మంచి మనసున్న వారు, గొప్పవారు అని పొగుడుతాడు. అవును రిషి సార్ చాలా గొప్పవారు అని వసుధార అని.. రిషి సార్ ను మాట్లాడమంటుంది. దీంతో వసుధార గురించి వంకరగా పొగుడుతాడు రిషి. వసుధార మేడమ్ కూడా చాలా గొప్పవారు. ఎంతలా అంటే.. ఆమె ఆలోచనలు, పనులు ఊహకందని విధంగా ఉంటాయి.

అంత గొప్పవారు అని వసుధార గారు అని రిషి అంటాడు. అలాగే ఎండీ అంటే మేనేజింగ్ డైరెక్టర్ అని నొక్కి మరీ చెబుతాడు. తర్వాత పిల్లలకు కిట్స్ ఇస్తారు. అందులో ఒక పాపతో వసుధార మేడమ్ లా యూనివర్శిటీ టాపర్ అవ్వాలి. ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదగాలి అని చెబుతాడు రిషి. కిట్స్ పంపిణీ అయ్యాక వాళ్ల ఇంట్లో భోజనం చేసి వెళ్లమని చెబుతాడు ధర్మయ్య. అందుకు రిషి ఒప్పుకున్నాక ధర్మయ్య వెళ్లిపోతాడు.

అంచుకు పచ్చిమిర్చి కొరకండి..

అంచుకు పచ్చిమిర్చి కొరకండి..

ధర్మయ్య వెళ్లిపోయాక.. ఇద్దరు ఒకరికొకరు ఏం మాట్లాడట్లేదు ఏంటీ అని అనుకుంటారు. ఇంతోల వసుధార బ్యాగులో నుంచ చాక్లెట్ తీసి తిందాం అంటుంది. కానీ ఒక్కటే ఉంది ఎలా అని వసుధార అంటే.. అంతకుముందు చాక్లెట్ ను నోటితో కొరికి షేర్ చేసి ఇచ్చింది గుర్తు చేసుకుంటాడు రిషి. అయితే ఈసారి ఆ చాక్లెట్ తీసి లటుక్కున ఒక్కడే నోట్లో వేసుకుంటాడు.

అనంతరం ఇద్దరు ధర్మయ్య ఇంట్లో భోజనానికి నేలపై కూర్చుంటారు. రాగి సంగటి వడ్డిస్తారు. అందులోకి పచ్చిమిర్చి అంచుకు కొరకండి చాలా బాగుంటుంది అని రిషికి నేర్పిస్తుంది వసుధార. అయితే వాళ్లిద్దరిని ధర్మయ్య దంపతులు భార్యాభర్తలు అనుకుంటారు. చిలకా గోరింకల్లాగా చక్కగా ఉన్నారు అని ధర్మయ్య భార్య అంటుంది. దీంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు.

మీకు బట్టలు పెడతాం..

మీకు బట్టలు పెడతాం..

రిషి సార్ అని మాటిమాటికి వసుధార అంటే.. భర్తను సర్ అంటున్నారు ఏంటీ.. మా ఊర్లో అయితే ఏమిటోయ్.. ఏవండి.. పెనిమిటీ అని పిలుస్తారని చెబుతుంది ధర్మయ్య భార్య. ఆమె లానే వసుధార ఏమిటోయ్.. ఏవండి.. పెనిమిటీ అని రిషిని ఇన్ డైరెక్ట్ గా పిలుస్తూ నవ్వుకుంటుంది. దీంతో రిషికి ఏం అర్థం కాదు. మీరు మా ఊరికి వచ్చి సాయం చేశారు.

వెళ్లేటప్పుడు మీ దంపతులకు బట్టలు పెడతాం అని ధర్మయ్య అనేసరికి.. రిషి మళ్లీ షాక్ తో బిత్తరపోతాడు. ఏదో ఒక కారణం చెప్పి వద్దంటాడు రిషి. చెప్పొచ్చు కదా మనం భార్యాభర్తలం కాదని అని వసుతో రిషి అంటే.. మీరే చెప్పండి.. నాకేం పని అని వసుధార అంటుంది. దీంతో పొగరు అని రిషి అంటాడు.

బాధపడాలో.. సంతోషించాలో..

బాధపడాలో.. సంతోషించాలో..

భోజనం అయ్యాక మళ్లీ వచ్చే ఏడాది కల్లా పాపతోనో.. బాబుతోనే మా ఇంటికి రావాలని ధర్మయ్య అనే సరికి మళ్లీ షాక్ అయిన రిషి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. తర్వాత రిషి, వసుధార ఇద్దరు వెళ్లివస్తామని చెప్పి బయలు దేరతారు. దారిలో ఇద్దరు సైలెంట్ గా ఉంటారు. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉందామని వసుధార అనుకుని నిద్ర పోతుంది.

అది చూసి నేనేమైనా డ్రైవర్ నా.. అని అడ్డదిడ్డంగా కారు నడుపుతాడు రిషి. దీంతో ఏంటీ సార్ ఈ డ్రైవింగ్ అని వసు అంటే.. రోడ్డు మీద గుంతలు ఉంటే నన్నేం చేయమంటావ్ అని అంటాడు. నాకు ఒకరి గురించి తెలుసుకోవాలని ఉంది.. ఎవరు అతను అని రిషి అంటే.. వసుధార మాత్రం ఏం వినపడనట్టు మాట్లాడుతుంది.

నా జీవితంలో లేవని బాధపడాలో.. ఈ రకంగా అయినా నా పక్కన ఉన్నందుకు సంతోషించాలో అర్థం కావడం లేదని రిషి మనసులో అనుకుంటాడు. ఇంతలో మినిస్టర్ ఫోన్ చేసి వచ్చి కలవమని చెబుతాడు.

నా భార్త ఆల్ రౌండర్ సార్..

రిషికి మినిస్టర్ రమ్మంటున్నారని అని చెబితే.. వినపడింది అంటాడు. అసలు నన్ను పొగరు అంటారు కానీ రిషి సార్ కే పొగరు ఎక్కువ అని వసుధార అనుకుంటుంది. వసుధార, రిషి ఇద్దరు మినిస్టర్ ని కలుస్తారు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లో సాధారణ వ్యక్తులను వాలంటీర్స్ గా చేయడం తదితర విషయాలు చెబుతుంది వసు.

దీంతో వసుని మెచ్చుకుంటాడు మినిస్టర్. వసుధారకు పెళ్లి అయినందుకు చీరను బహుమతిగా ఇస్తాడు మంత్రి. రిషిని కూడా రమ్మని పిలిచి.. ఇద్దరు కలిసి వసుధారకు చీర పెడతారు. మీ వారు ఏం చేస్తారు అని మంత్రి అడిగితే.. ఆయన ఆల్ రౌండర్ సార్.. చాలా గొప్ప వ్యక్తి అని వసుధార చెబుతుంది.

ఇద్దరు కలిసి భోజనానికి రమ్మని పిలుస్తాడు మంత్రి. ఓకే సర్.. రిషి సార్ ను కూడా తీసుకొస్తాం అని వసుధార అంటుంది. నీ భర్తను రిషి సార్ కి పరిచయం చేశావా అని వసును అడుగుతాడు మంత్రి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X