Guppedantha Manasu: సాక్షి గాలి తీసేసిన రిషి.. గట్టి వార్నింగ్ ఇచ్చిన వసుధార!
గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఎలా అయినా తమ ప్రేమ విషయాన్ని రిషి ముందు ప్రస్తావించడానికి వసుధార అనేక ప్రయత్నాలు చేస్తుంది. కానీ రిషి మాత్రం ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఆమె మళ్ళీ తనను ఎక్కడ రిజెక్ట్ చేస్తుందనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఆమె మాట్లాడుతున్న మాటలను అక్కడితో కట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే సాక్షి మాత్రం వీళ్లిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ కలగకూడదు అని ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు ఇద్దరి మధ్య ఏదో ఒక గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్న దృశ్యాలను కూడా గత కొన్నాళ్లుగా చూపిస్తూ వస్తున్నారు. ఇక గత ఎపిసోడ్లో వసుధార రిషి ఇంటికి రావడంతో ఆమెకు దింపడానికి రిషి వెళ్ళబోతున్న సమయంలోనే ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

డ్రాప్ చేయడానికి
తాజా ఎపిసోడ్ ప్రకారం వసుధార రిషి ఇంటికి రావడంతో రిషి ఆమెను తీసుకువెళ్లి డ్రాప్ చేయడానికి బయలుదేరుతున్న సమయంలో అనుకోకుండా ఆమె వెనక్కి తూలి పడబోతుంది. వెంటనే రిషి ఆమెను పట్టుకుని ఉంటాడు. ఆమెను పట్టుకుని అలాగే నిలబడిపోయిన క్రమంలో వారిద్దరినీ దేవయాని చూస్తుంది. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా స్టన్ అయిపోయి అలాగే నిలబడిపోవడంతో రిషి ఏమిటిది అని వసుధారను వదిలేయమని దేవయాని అంటుంది. దీంతో ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటారు ఏం జరుగుతోంది అని అడిగితే వసుధర కాలేజీ పనిమీద ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆమె ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళుతున్నాను అని రిషి అంటే అసలు ఈ సమయంలో రావాల్సిన అవసరం ఏమి వచ్చింది అని దేవయాని అంటుంది.

డ్రాప్ చేస్తానని
ఫోన్ చేసి చెప్పచ్చు కదా అంటే అన్ని విషయాలు ఫోన్లో చెప్పలేం మేడం అని వసుధార అంటుంది. దీంతో దేవయాని లోపల సాక్షిని రమ్మన్నాను అది ఇంకా రావడం లేదు ఏమిటి అని అనుకుంటూ ఉంటుంది. అదే సమయానికి సాక్షి కూడా వస్తుంది వస్తు రావడంతోనే ఈ టైంలో ఎందుకు వచ్చావు అని అడుగుతాడేమో అనే ఉద్దేశంతో ఒక చిన్న పని మీద వెళుతూ ఇటు వచ్చాను అని అంటుంది. అయితే ఎక్కడికి వెళ్తున్నారు అంటే వసుధారను డ్రాప్ చేయడానికి వెళుతున్నారు అని చెప్పడంతో నేను కూడా అటే వెళుతున్నాను నేను డ్రాప్ చేస్తానని అంటుంది. ఏదో పనిమీద వెళుతున్నాను అన్నారు.

కలుస్తూనే ఉంటామని
మళ్ళీ డ్రాప్ చేస్తాను అంటున్నారు ఏమిటి అని వసుధార అడిగితే అదేమీ లేదు డ్రాప్ చేస్తాను అని చెప్పి రిషి దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి తీసుకు వెళుతూ ఉంటుంది సాక్షి. వీళ్లిద్దరూ కలిసి ఉంటారు కదా అనుకుంటే వసుధారని డ్రాప్ చేస్తానంటుంది ఏమిటి అని దేవయాని అనుకుంటే వీళ్లిద్దరూ కలవకుండా చేశాను అదే చాలు అని సాక్షి అనుకుంటుంది. కారులో వెళుతున్న సమయంలో మీ ఇద్దరినీ కలవనివ్వను అంటూ వసుధారకు వారిని ఇంగిస్తే మేమిద్దరం భూమి నీరు లాంటి వాళ్ళం మీరు ఎంత కలవకూడదని ప్రయత్నం చేసినా కలుస్తూనే ఉంటామని వసుధార అంటుంది. అక్కడితో సీన్ కట్ అవుతుంది తర్వాత సీన్లో చదువుల పండగ కోసం అందరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు.

ఇబ్బందికరంగా
కాలేజీ మొత్తం కూడా అట్టహాసంగా సిద్ధం చేస్తారు. ఈ క్రమంలో సాక్షి తన ఎద భాగంలో పెట్టుకున్న బ్యాడ్జిని కొంచెం చిందరవందరగా పెట్టి దీనిని సరిజేయమనిషిని అడుగుతాను అని రిషి దగ్గరికి వెళ్లి అడిగితే చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా ఒకసారిగా షాక్ అవుతారు. వెంటనే రిషి తేరుకుని పుష్ప అది ఏదో కాస్త ఇబ్బందికరంగా ఉందట దాని సంగతి చూడమని అంటాడు. దీంతో ఆమె సైలెంట్ అవుతుంది.

బ్యాడ్జిని సరిచే
ఇక ఆ తర్వాత వసుధార రిషి భుజానికి ఉన్న బ్యాడ్జిని సరిచేస్తుంది ఆ తర్వాత మీటింగ్ జరుగుతున్న సమయంలోనే వసుధార రిషి క్యాబిన్ కి వెళ్లి రిషితో ప్రేమతో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. రిషి కూడా ఆమె వెంట వెళతాడు. ఆమె మాట్లాడుతున్న విషయాలు అర్థం కాకపోవడంతో నేను లోపలికి రావచ్చా అని అడుగుతాడు. దీంతో వసు ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్కడితో తాజా ఎపిసోడ్ ముగించారు. చూడాలి తదుపరి ఎపిసోడ్ ఎలా సాగనుంది అనేది.


Click it and Unblock the Notifications











