Guppedantha Manasu: రిషికి మళ్లీ షాక్ ఇచ్చిన వసుధార.. అప్పుడేమో అలా.. ఇప్పుడు ఇలా!
వసుధార తనకు చేసిన ద్రోహం గురించి తలుచుకుంటూ మదన పడుతుంటాడు రిషి. ఇక కొడుకు బాధను చూడలేక తల్లడిల్లిపోతారు మహేంద్ర-జగతి. ఏం చేయాలో తెలియక కాలేజీకి వెళతాడు రిషి. అక్కడ కూడా వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు రిషి. వసుధార చేసిన దానికి జగతిని బాధపెడతాడు రిషి. ఆ మాటలు తలుచుకుంటూ బాధపడుతుంటుంది జగతి. ఇంతలో మహేంద్ర వస్తాడు. ఏంటీ జగతి అని మహేంద్ర అంటే.. రిషిని చూడాలంటేనే నా గుండె తరుక్కుపోతుంది మహేంద్ర అని జగతి చెబుతుంది. మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జనవరి 12 గురువారం నాటి తాజా ఎపిసోడ్ 657లో ఇంకా ఏం జరిగిందంటే?

స్పృహలోకి వచ్చిన సుమిత్ర-చక్రపాణి..
రిషిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది మహేంద్ర. మనసు ముక్కలు చేసుకుని బాధను అనుభివిస్తూ మౌనంగా ఉన్నాడు. మనం ఏం చేయలేమా.. రిషి బాధను తీర్చలేమా.. అని అంటుంది జగతి. మనం ఏం చేయలేం జగతి అని మహేంద్ర అనడంతో అలాగే ఆలోచిస్తూ ఇద్దరు బాధపడుతూ ఉంటారు. మరోవైపు ఆస్పత్రిలో వసుధార తల్లిదండ్రులు సుమిత్ర-చక్రపాణికి మెలకువ వస్తుంది. చక్రపాణి కళ్లు తెరవగానే.. ఇద్దరికి దొంగ నమస్కారం చేస్తాడు వసుధార బావ రాజీవ్. వారితో ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు రాజీవ్. అప్పుడు ఎస్సైకి సుమిత్ర, చక్రపాణిలకు మెళకువ వచ్చింది సార్ అని కానిస్టేబుల్ ఫోన్ చేసి చెబుతాడు.

కుమిలిపోతున్న రిషి..
కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పడంతో.. సరే వస్తున్నాను అని అంటాడు ఎస్సై. మరోవైపు రిషి తన క్యాబిన్ లోకి వెళ్లి తన కుర్చిలో కూర్చుని బాధపడుతుంటాడు. వసుధార మాటలు తలుచుకుని మదనపడిపోతుంటాడు. కాలేజీలో వాళ్లు కలిసి మాట్లాడుకున్న సంగతులు అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వసుధార కాలేజీకి వచ్చిన రోజు, వాళ్లు గొడవ పడిన రోజులను అన్నీ గుర్తు చేసుకుంటాడు. ఓవైపు బాధ మరోవైపు మోసం చేసిందని తనలో తానే కుమిలిపోతుంటాడు రిషి. తర్వాత గురువారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులో రిషి దగ్గరకు వసుధార వస్తుంది.

నువ్ నా కళ్ల ఎదురుగా ఉంటే..
గురువారం నాటి ఎపిసోడ్ ప్రోమోలో.. రిషి క్యాబిన్ లోకి వసుధార అడుగుపెడుతుంది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన రిషి.. నువ్ వచ్చావా అని గట్టిగా అడుగుతాడు. ఏంటీ సార్.. రాకూడదా అని వసుధార అంటుంది. తర్వాత మీరు నన్ను వదిలేసి వస్తే.. నేను రాననుకున్నారా అని వసుధార అంటుంది. అప్పుడు వసుధార తాళి వైపు చూస్తాడు రిషి. ఈ పెళ్లి నా ఇష్టపూర్వకంగానే జరిగింది అన్న వసుధార మాటలను తలుచుకుంటాడు రిషి. దీంతో వెళ్లిపో వసుధార అని అరుస్తాడు రిషి. నువ్ వేరేవాళ్లతో తాళి కట్టించుకున్నప్పుడు.. నువ్ నా కళ్ల ఎదురుగా నిలుచుంటే.. నేను భరించలేను.. మోసపోయాను నీ చేతిలో.. అని ఆవేదనగా అంటాడు రిషి. దీనికి సర్.. నాకు పెళ్లయింది నిజమే.. కానీ అంటూ వసుధార చెప్పబోతుండగా.. ఇంకేం మాట్లాడకు వసుధార వెళ్లిపో ఇక్కడి నుంచి అంటూ గట్టిగా అరుస్తూ టేబుల్ పై ఉన్న ఫైళ్లను విసిరేస్తాడు రిషి. దీంతో షాక్ అయి అలానే చూస్తుండిపోతుంది వసుధార.

నువ్వే తాళి కట్టుకుని..
వసుధార జైల్లో ఉన్నప్పుడు అసలు ఏం జరిగిందని రిషి ఎంత బతిమాలుడుకున్న వెళ్లిపోమ్మని వసుధార గట్టిగా అరిచిన విషయం తెలిసిందే. ఇక బుధవారం నాటి ఎపిసోడ్ లో జైలు నుంచి విడుదలవుతుంది వసుధార. నువ్వే తాళి కట్టుకుని నన్ను నమ్మిస్తున్నావ్. ఎంత గొప్ప ఆలోచన నీది ఎంత తెలివి నీది అని రాజీవ్ అంటాడు. ఇంతగొప్ప తెలివైనది నాకు భార్యగా వస్తుందంటే నాకు సంతోషంగా ఉంటుందో తెలుసా అన్న రాజీవ్.. పద హాస్పిటల్ కు వెళదాం అంటాడు. నేను హాస్పిటల్ కు వెళ్తాను. నువ్వు రావాల్సిన అవసరం లేదని వసుధార అంటుంది. మరోవైపు కాలేజీలో ఉన్న రిషి దగ్గరకి జగతి వెళ్తుంది.

నా పని మనసును అర్థం చేసుకోకుండా..
మనసుకు గుచ్చుకునే జ్ఞాపకాలను ఎందుకు తలుచుకుంటావు. ఈ జ్ఞాపకాల నుంచి నువ్వు బయటపడాలి అని జగతి అంటే.. ఇందులో నా తప్పేం ఉంది చెప్పండి. ఎందుకు ఇలా చేసింది. ప్రాణంగా ప్రేమించడమే తప్పా. మీ శిష్యురాలు నా మనసుని ఏం అర్థం చేసుకుంది మేడమ్. నా పసి మనసుని అర్థం చేసుకోకుండా మీరు వెళ్లిపోయారు. మీరు ఎందుకు వెళ్లిపోయారు నాకు తెలియదు. మీరు కూడా నాకు చెప్పలేదు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేను వారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారని అనుకోవడం లేదు అని రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆగు రిషి అని జగతి అనడంతో.. మీరేం చెప్పకండి.. మీ శిష్యురాలు కనిపిస్తే.. ఈ రిషీంద్ర భూషణ్ కి మోసపోవడం కొత్తేమి కాదు. జ్ఞాపకాలతో బతకగలడు. తను నాకు అక్కర్లేదు అన్న విషయం చెప్పండి అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి.


Click it and Unblock the Notifications











