For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: రిషి కోసం అత్తింటికి వెళ్లిన వసుధార.. శత్రువులుగా మారిన జగతి-మహేంద్ర!

  |

  వసుధార బ్యాగ్ తో సహా కాలేజీలోకి అడుగు పెడుతుంది. దారిలో కారులో రిషి వెళుతూ కనిపిస్తాడు. అయితే సార్ అంటూ వసుధార పిలిచిన రిషి పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. తర్వాత కాలేజీలోకి రిషి క్యాబిన్ లోకి వెళుతుంది వసుధార. రిషి స్థానంలో జగతిని చూసిన వసుధార.. పాత ఎండీ గారు ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. కనిపించని భవిష్యత్తు కోసం.. తెలియని దారిలో వెళ్తున్నాడు. అందుకే మాకు కూడా చెప్పలేదు. ఒక్కొక్కసారి పాలలాగే మనసులు కూడా విరిగిపోతాయి. మనసుల్ని విరకొట్టి చాలా మంది ఆనందాన్ని పొందుతారు అని జగతి అంటుంది. మీరు ఏమంటున్నారో నాకు అర్థమైందని వసుధార అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జనవరి 18 బుధవారం నాటి తాజా ఎపిసోడ్‌ 663లో ఇంకా ఏం జరిగిందంటే?

  మాట్లాడరేంటి వసుధార గారూ..

  మాట్లాడరేంటి వసుధార గారూ..

  రిషి గురించి వసుధార అడిగితే.. మళ్లీ ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది జగతి. అందుకు సైలెంట్ గా ఉన్న వసుధారను చూసి మాట్లాడరేంటి వసుధార గారు.. మా అబ్బాయి పరిస్థితి ఎలా ఉందో చూద్దామని వచ్చారా.. లేకపోతే బతికి ఉన్నాడో లేదో చెక్ చేద్దామని వచ్చారా అన మహేంద్ర అంటాడు. సార్.. మీరు నన్ను మేడమ్ గారు మీరు అంటున్నారు ఏంటీ అని వసుధార అడిగితే.. మీరు గొప్పవారయ్యారు.. మా వసు అయితే మాకు తెలిసిపోయేది. తను మా అందరి గురించి ఆలోచించేది. మీరు కొత్త వసుధారగా అవతారమెత్తారు కదా.. మీ ప్రవర్తనను, ఆలోచనలను మా ఊహకు అందడం లేదు. అందుకే మిమ్మల్ని గౌరవించక తప్పడం లేదని మహేంద్ర సమాధానమిస్తాడు.

  ఎన్నాళ్లు దాటేస్తావు వసు..

  ఎన్నాళ్లు దాటేస్తావు వసు..

  ఇంతలో తనతో మాటలేంటీ మహేంద్ర.. కొందరు పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటారు. అందరితో మంచిగా ఉంటారు. చివరికీ తాము నడిచి వచ్చిన దారి, తాము ప్రేమించిన వారని మర్చిపోయి కొత్త అడుగులు వేస్తారు. మనం అల్పులం. వాళ్ల ఆలోచనలను అంచనాలను మనం అందుకోలేము. మనం అల్పులం వాళ్లతో మనం పోటీ పడలేం అని జగతి అంటుంది. సరే మేడమ్.. నేను నా క్యాబిన్ కు వెళ్తున్నాను. మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ గా ఛార్జ్ తీసుకుంటున్నాను అని వసుధార చెబుతుంది. నువ్వు ఇక్కడికి రావడం అవసరామా.. సమాధానం చెప్పకుండా ఎన్నాళ్లు దాటవేస్తావు అంటూ నిలదీస్తుంది జగతి. కొన్ని సమాధానాలు కొందరికి చెబితేనే బాగుంటాయి. నేను ఎవరికీ చెప్పాలో వాళ్లకే చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార. తన క్యాబిన్ లో కూర్చున్న వసుధార.. రిషి ఎక్కడికి వెళ్లాడా అని ఆలోచిస్తూ ఉంటుంది.

   ఫ్లైట్ క్యాన్సిల్ అయింది..

  ఫ్లైట్ క్యాన్సిల్ అయింది..

  రిషి కాల్ చేస్తుంది వసుధార. కానీ, రిషి కాల్ కట్ చేస్తాడు. మీ స్థానంలో ఎవరున్నా కోపం వస్తుంది సార్. కానీ, ఏం జరిగిందో మీకు వివరించడానికి వచ్చాను అనుకుంటుంది వసుధార. కన్నవాళ్ల మీద ఎంత మమకారం ఉందో.. కాలేజీ మీద కూడా అంతే మమకారం ఉంది అనుకుంటుంది వసుధార. అలా అనుకుంటూ రిషికి ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేస్తుంటాడు రిషి. మళ్లీ మళ్లీ ఫోన్ రింగ్ కావడంతో లిఫ్ట్ చేసి కోపంగా అరుస్తాడు రిషి. అటునుంచి వసుధార కాదు సార్.. ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని సమాచారం వస్తుంది. దీంతో సైలెంట్ అయిపోయిన రిషి కారు సీటులో వెనక్కి వాలుతాడు. మరోవైపు వసుధార క్యాబిన్ కి జగతి-మహేంద్ర వస్తారు. మిషన్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని ఐడియాలున్నాయని వసుధార అంటుంది.

  వసుధారను కొట్టబోయిన జగతి..

  వసుధారను కొట్టబోయిన జగతి..

  నువ్ ఎందుకు వచ్చావ్.. జరిగినవన్నీ మర్చిపోయి ఎప్పటిలాగా కాలేజీకి వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నావ్. మేము నీకు ఎలా కనిపిస్తున్నాం. అసలు నువ్వు ఏం చేసావో నీకు అర్థం అవుతోందా.. నువ్వు రిషిని మోసం చేశావ్. అసలు రిషి ఎలా ఉన్నాడో తెలుసా. ఏం మాట్లాడవేంటీ వసుధార అని అసహనం, బాధతో అడుగుతుంది జగతి. అన్నింటికి సమాధానాలు నేను చెప్పాల్సిన సమయంలోనే చెబుతాను. ముందు జరిగినదంతా రిషి సార్ కి చెప్పాలి. లేకపోతే చాలా ఫీల్ అవుతారు అని మనసులో అనుకున్న వసుధార.. జగతి వాళ్లతో మాత్రం జరగాల్సిన దాని గురించి అందరం కలిసి మాట్లాడుకుందాం అంటుంది వసుధార. దీంతో వసుధారను కొట్టబోతుంది జగతి. మహేంద్ర వారిస్తాడు.

   చంపి పాతిపెట్టి.. ఇప్పుడు..

  చంపి పాతిపెట్టి.. ఇప్పుడు..

  మంచి శిష్యురాలు దొరికింది అనుకున్నాను. కానీ, ఇంత గొప్ప శిష్యురాలు, ఇంత తెలివైన శిష్యురాలు దొరుకుతుందని అనుకోలేదు. నా జన్మ సార్థకం అయిపోయింది. ఒక గురువుగా కాకుండా కన్న తల్లిగా అడుగుతున్నాను. అసలు రిషినిఎందుకు మోసం చేయాల్సి వచ్చింది. రిషి గురించి ఆలోచించకుండా నీ స్వార్థం కోసం నీకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటే రిషి గుండె ఆగిపోతుంది అని నీకు తెలియదా అని బాధగా జగతి అంటుంది. మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒక రోజు వస్తుంది అని వసుధార అంటుంది. చంపి పాతి పెట్టి.. దానిమీద గులాబీ మొక్క నాటినట్లు మాట్లాడుతున్నావ్ అని జగతి అంటుంది. తర్వాత చిన్న వాళ్లకు దండం పెట్టకూడదు. కానీ నీకు పెడుతున్నాను.. ఏం సాధిద్దామని మళ్లీ కాలేజీకి వచ్చావ్ అని మహేంద్ర అడుగుతాడు.

  అత్తారింటికి వచ్చినట్లు వెళ్తున్నావ్..

  అత్తారింటికి వచ్చినట్లు వెళ్తున్నావ్..

  తర్వాత మంచి గురుదక్షిణ ఇచ్చావ్ అని కోపంగా వెళ్లిపోతుంది జగతి. అనంతరం వసుధారను పలకరిస్తుంది పుష్ప. పెళ్లి గురించి మాట్లాడితే ఏదో ఒకటి కవర్ చేస్తుంది వసుధార. తర్వాత ఉండేందుకు పుష్పను వసుధార రూమ్ చూడమంటుంది. మరోవైపు వసుధార వచ్చిన విషయం తెలుసుకున్న దేవయాని కోపంతో రగిలిపోతుంది. రిషి ఇప్పటికే నలిగిపోతున్నాడు మళ్లీ వసుధార కాలేజీకి వస్తే ఎలా అని ఫణీంద్ర అంటాడు. తను మిషన్ ఎడ్యుకేషన్ కి హెడ్ అని జగతి అంటే.. తీసిపారేయమని దేవయాని అంటుంది. అలా కుదరదు, మినిస్టర్ గారి తరఫున చేరిందని మహేంద్ర అంటాడు. వసుధార గురించి అది ఇది బ్యాడ్ గా మాట్లాడుతుంటుంది దేవయాని. ఇంతలో రిషి సార్ అంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది వసుధార. ఏదో అత్తారింటికి వచ్చినట్లు అలా ఎక్కడికి వెళ్లిపోతున్నావ్. నీకు సిగ్గుగా లేదా అని దేవాయని కోప్పడుతుంది. దాంతో అక్కయ్య మీరు ఆగండి.. నేను చాలు తనకు బుద్ది చెప్పటానికి అని జగతి అంటుంది.

  English summary
  Guppedantha Manasu Serial January 18 2023 Today Full Episode 663
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X