twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: ఊహించని ట్విస్ట్.. వసుధారను మెడ పట్టి గెంటేసిన జగతి.. భార్యకు రిషి కానుక!

    |

    రిషి కోసం ఇంటికి వెళుతుంది వసుధార. రిషి గురించి అడుగుతుంటే.. నిన్ను అంటూ కోపంగా వసుధారపైకి వెళుతుంది దేవయాని. ఇంతలో మీరు ఉండండి అక్కయ్య. వసుధారకు నేను చాలు బుద్ధి చెప్పడానికి అని జగతి అంటుంది. దీంతో వసుధార షాక్ అవుతుంది. తర్వాత ఏంటీ వసుధార గారూ రిషి సార్ తో మీకు ఏంటి పని అని జగతి అడిగితే.. ఏంటీ మేడమ్ మీరు నన్ను గారూ అంటున్నారు అని వసుధార అంటుంది. గొప్ప గొప్ప పనులు చేసేవాళ్లను ఏక వచనంతో పిలవలేము కదా వసుధార గారు అని మళ్లీ జగతి అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జనవరి 19 గురవారం నాటి తాజా ఎపిసోడ్‌ 664లో ఇంకా ఏం జరిగిందంటే?

    ఇది మా ఫ్యామిలీ మ్యాటర్..

    ఇది మా ఫ్యామిలీ మ్యాటర్..

    రిషి సార్ తో మాట్లాడాలి.. ఎక్కడికి వెళ్లారు అని వసుధార అడుగుతుంది. ఇంక ఎక్కడ రిషి.. నువ్ చేసిన పనికి ఎక్కడికి వెళ్లాడో తెలియదు అని దేవయాని ఫైర్ అవుతుంది. ఇంకా దేవయాని అనబోతుంటే.. మీరు ఆగండి అక్కయ్య అని.. రిషి ఎక్కడికి వెళ్లాడో తెలియదు.. తెలిసినా చెప్పం అని జగతి కోపంగా అంటుంది. రిషి సార్.. అని వసుధార అంటుంటే.. వసుధార మేడమ్.. ఇది మా ఇల్లు.. మా ఫ్యామిలీ.. మా ఫ్యామిలీ మ్యాటర్.. మీరు వెళ్లిపోండి.. అని మహేంద్ర అంటాడు. అప్పుడు వసుధార ఇంట్లో జగతి-మహేంద్రలను వెళ్లిపోమనడాన్ని గుర్తు చేసుకుంటుంది వసుధార. రిషితో నీకేం పని అని మహేంద్ర అడిగితే.. మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలని వసుధార అంటుంది.

    ఇలా ఎప్పుడు బాధపడలేదు..

    ఇలా ఎప్పుడు బాధపడలేదు..

    మిషన్ ఎడ్యుకేషన్ గురించి అయితే ఆఫీస్ లో మాట్లాడండి. ఇది ఇల్లు. ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అని కోపంగా అరుస్తాడు మహేంద్ర. అక్కడే ఉన్న ఫణీంద్ర.. మహేంద్ర ఏంటీ ఇది.. ఎందుకు అంత ఆవేశపడుతున్నావ్ అని అంటాడు. మళ్లీ రిషి గురించి వసుధార అడగ్గా.. అమ్మా నీకు దండం పెడతాము. ఇక్కడి నుంచి వెళ్లిపో అని జగతి అంటుంది. అయినా వసుధార వినకపోయేసరికి.. నీ కాళ్లు పట్టుకుంటా అని కిందకు వంగుతుంది జగతి. దీంతో మేడమ్.. అంటూ బాధపడుతుంది వసుధార. తర్వాత జగతి-మహేంద్రలు ఎన్నో కష్టాలు చూశారు. కానీ ఇలా ఎప్పుడు బాధపడలేదు. ఏంటీ వసుధార నువ్ కూడా. నువ్ చేయాల్సింది చేశావ్. మళ్లీ ఈ ఇంటికి రాకు వసుధార ప్లీజ్ అని ఫణీంద్ర అంటాడు.

    వసుధారను గెంటేసిన జగతి..

    వసుధారను గెంటేసిన జగతి..

    అది కాదు సార్ అంటూ మళ్లీ రిషి గురించి వసుధార అడగడంతో.. వసుధారను పట్టుకుని బలవంతంగా బయటకు గెంటేస్తుంది. జగతి ఆగు.. నేను వసుధారను కొన్ని ప్రశ్నలు అడగాలి అని చెబుతున్నా వినకుండా వసుధారను ఇంటి నుంచి బయటకు గెంటేస్తుంది దేవయాని. తర్వాత వసుధార మొహం మీదే తలుపు వేస్తుంది జగతి. ఈ రిషీంద్ర భూషణ్ భార్యగా అడుగు పెట్టు అని రిషి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది వసుధార. తలుపు మూసిన జగతి అక్కడే బాధపడుతూ ఉంటుంది. తర్వాత అమ్మవారి దగ్గరికి వెళుతుంది వసుధార. నీ దగ్గరికి రప్పించుకోవడానికే నాకు ఈ కష్టాలు తెప్పిస్తున్నావా.. ఎందుకిలా చేస్తున్నావ్.. రిషి సార్ ని కనిపించేలా చేయమని కన్నీళ్లతో తన కష్టాలన్నీ చెప్పుకుంటుంది వసుధార. ఇంతలో వసుధార గురించి ఆలోచించుకుంటూ అమ్మవారి దగ్గరికి వస్తాడు రిషి.

     రెండు మనసుల కథ వ్యథగా..

    రెండు మనసుల కథ వ్యథగా..

    అప్పటికే అక్కడ ఉన్న వసుధారను చూసి షాక్ అవుతాడు రిషి. ఇది నిజమా.. నా భ్రమ అని అనుకుంటాడు. ఇంతలో రిషిని వసుధార చూసి సంతోషిస్తుంది. వసుధార మెడలో తాళి చూసిన రిషి వెళ్లిపోవాలనుకుంటాడు. కానీ, అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శించుకోకుండా వెళ్లడం ఏంటి అని వచ్చి అమ్మవారికి మొక్కుతాడు. తర్వాత వసుధార మాట్లాడాలని అడిగితే వినిపించుకోడు రిషి. రెండే నిమిషాలు అని వసుధార అంటే.. రెండు మనసుల కథ వ్యథగా ఎలా మారిందో రెండు నిమిషాల్లో చెబుతావా అని బాధగా అంటాడు రిషి. నా పెళ్లి అంటూ వసుధార చెబుతుంటే.. వద్దు.. నీ పెళ్లి గురించి నాకు చెప్పొద్దు అని కోపంగా కారు దగ్గరికి వెళ్లిపోతాడు. ఇంతలో అక్కడికి పూలు అమ్మే ఆమె వచ్చి.. ఏంటీ సార్ పూలు తీసుకోకుండా వెళ్తున్నారు అని అనడంతో.. పూలు తీసుకుంటాడు. ఆ పూలు అమ్మవారి దగ్గర పెట్టమని చెబుతాడు.

    వసుధారను కాపాడిన రిషి..

    వసుధారను కాపాడిన రిషి..

    అమ్మవారి దగ్గర ఆ పూలు పెట్టిన పూలమ్మే ఆమె మీ ఇద్దరు కళకళకాలం కలిసి ఉండాలని అంటుంది. తర్వాత ఆ పూలను వసుధార తీసుకోవడం రిషి చూస్తాడు. ఈ వసుధార మనసులో ఏముంది.. పెళ్లి చేసుకుంది.. ఇక్కడికి వచ్చి ఆ పూలు తీసుకుంటుంది అనుకొని రోడ్డు పక్కన కారు ఆపి ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఆ పూలు తీసుకున్న వసుధార.. ఇది రిషి సార్ కానుక అంటూ అలాగే రోడ్డుపైకి వస్తుంది. ఇంతలో అటు నుంచి వ్యాన్ వస్తుంది. అది చూసుకోకుండా రోడ్డు దాటుతుంటుంది వసుధార. వసుధార వెనుక నుంచి వ్యాన్ రావడం చూసిన రిషి.. పరిగెత్తుకుంటూ వచ్చి వసుధారను పక్కకు లాగి.. చూసుకోవాలి కదా అని అంటాడు. మీరు చూస్తున్నారు కదా సార్ అని వసుధార అంటే.. చేతి వదిలి ఫోన్ తీసుకుని వసుధారకు క్యాబ్ బుక్ చేస్తాడు రిషి. నీ కోసం క్యాబ్ వచ్చింది.. ఎక్కడికి వెళ్లాలో.. అక్కడికి వెళ్లిపో అని చెప్పి వెళ్లిపోతాడు రిషి.

    మంచి భర్తగా మారిన చక్రపాణి..

    మంచి భర్తగా మారిన చక్రపాణి..


    మరోవైపు సుమిత్ర కోసం చక్రపాణి సేవలు చేస్తుంటాడు. ప్రేమగా కాఫీ తీసుకు వచ్చి సుమిత్రకు ఇస్తే.. మీరు నాకు సేవలు చేయడం ఏంటని సుమిత్ర అంటుంది. ఇన్ని రోజులు ఈ రాక్షసుడికి నువ్వు సేవలు చేశావ్ కదా ఇప్పుడు నాకు ఆ భాగ్యం లభించింది ఏం కాదులే సుమిత్ర అని అంటాడు చక్రపాణి. దీంతో సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. నీ ఆరోగ్యం బాగా అవుతుంది నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను అని చక్రపాణి అంటే.. సుమిత్ర సంతోషిస్తుంది. ఇల్లు శుభ్రంగా లేదని.. చీపురు తెచ్చి ఇల్లు శుభ్రం చేస్తుంటాడు. మరోవైపు వసుధారకు తన ఇంట్లో రూమ్ ఇస్తుంది పుష్ప. అందుకు థ్యాంక్స్ చెబుతుంది వసుధార. ఇంతలో వసుధారకు కాల్ చేసిన తల్లి సుమిత్ర.. తండ్రి చక్రపాణి గురించి సంతోషంగా చెబుతుంది.

    English summary
    Guppedantha Manasu Serial January 19 2023 Today Full Episode 664
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X