For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: వసుధారను పట్టుకున్న రిషి, అంతలోనే ఆగ్రహం.. దేవయాని సీరియస్!

    |

    వసుధారకు తల్లి సుమిత్ర ఫోన్ చేసి మాట్లాడుతుంది. బాగున్నావా అమ్మా.. ఆరోగ్యం ఎలా ఉంది అని వసుధార అడుగుతుంది. మీ నాన్న నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు అని సుమిత్ర చెబుతుంది. ఇంతలో నేను మాట్లాడతా అని చక్రపాణి అంటాడు. సుమిత్ర చక్రపాణికి ఫోన్ ఇస్తుంది. రిషి సార్ ని కలిసావా.. జరిగింది మొత్తం వివరించావా.. సార్ మనసు చాలా మంచిది. మహారాజు లాంటి వాడు. నాకు బాగా తెలుసు. నిన్ను అర్థం చేసుకుని ఉంటాడు అని చక్రపాణి అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జనవరి 20 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్‌ 665లో ఇంకా ఏం జరిగిందంటే?

    ఇక్కడ ఉండాలని అనిపించట్లేదు..

    ఇక్కడ ఉండాలని అనిపించట్లేదు..

    తండ్రి చక్రపాణితో బావ రాజీవ్ తో జాగ్రత్తగా ఉండండి అని వసుధార చెబుతుంది. దీంతో ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు చక్రపాణి. వాడు ఎంత మోసం చేశాడు. ఎంత నమ్మాను వాన్ని నేను. మొహం చాటేసి పారిపోయాడు వాడు. నేను వాడిని వదిలిపెట్టను. ఈసారి వాడు దొరకని ఈ చక్రపాణి అంటే ఏంటో చూపిస్తాను అని చక్రపాణి అంటే.. నాన్న ఆవేశపడకండి.. దుష్టులకు దూరంగా ఉండటం మంచిది అని వసుధార చెబుతుంది. మనవడి మొహం చూసి ఊరుకుంటున్నాను అని చక్రపాణి అంటాడు. అలాగే మాకు ఇక్కడ ఉండాలని అనిపించట్లేదు. ఇంతకాలం నీకు దూరంగా ఉన్నాం కదా.. నీ దగ్గరికి వచ్చేస్తాం అని తండ్రి చక్రపాణి అంటాడు. సరే మీరు ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు చేస్తాను అని వసుధార చెబుతుంది.

    ఇంత పని చేశావ్ ఏంటీ వసు..

    ఇంత పని చేశావ్ ఏంటీ వసు..

    చక్రపాణి, సుమిత్ర హైదరాబాద్ వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తానని వసుధార చెప్పడంతో తెగ సంతోషిస్తారు. మన అమ్మాయి దగ్గరే ఉందాం అంటూ ఇద్దరూ మురిసిపోతారు. ఆనంద బాష్పాలతో సంతోషిస్తుంది సుమిత్ర. తర్వాత రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. రిషి కొన్న పూలను తీసుకుని చూస్తుంది. రిషి సార్ కు నాపై కోపం ఉంది అర్థం చేసుకోగలను అని అనుకున్న వసుధార.. అమ్మ వారి దగ్గరికి తిరిగి వెనక్కి ఎందుకు వస్తారు. నాపై కోపం లేదు కాబట్టే.. తిరిగి వెనక్కి వచ్చారు అని అనుకుంటుంది వసుధార. మరోవైపు కాలేజ్ గెస్ట్ హౌజ్ సోఫాలో పడుకున్న రిషి వసుధార మాటలు గుర్తు చేసుకుంటాడు. ఇంత పని చేశావ్ ఏంటీ వసుధార. నా జీవితంలో ఎన్నో ప్రశ్నలు సమాధానం చెప్పావు. కానీ, చివరికీ నువ్వే ప్రశ్నగా మిగిలిపోయావ్ అని అనుకుంటాడు.

     ఇంత దూరం ఎందుకు వచ్చింది..

    ఇంత దూరం ఎందుకు వచ్చింది..

    అటువైపు రిషి కొన్న పూలవైపు చూస్తూ నన్ను నేను, మా వాళ్లను కాపాడుకోవంలో పెద్ద తప్పు చేశానా.. ఒకవేళ చేసి ఉంటే రిషి సార్ ఎప్పుడు క్షమిస్తారో అని అనుకుంటుంది వసుధార. మరోవైపు వేరే వాళ్ల భార్యగా ఉన్నప్పుడు నాతో ఎందుకు మాట్లాడాలి. పూలు తీసుకోవడం తప్పు కదా అని ఆలోచిస్తాడు రిషి. ఇంతలో పూలను పిక్ తీసి వాటిని సెండ్ చేస్తూ ఓసారి మాట్లాడాలి సార్ అని మెసేజ్ చేస్తుంది వసుధార. అది చూసిన రిషి.. చందమామ వైపు వెళ్లి చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు వసుధార కూడా చందమామ వైపూ చూస్తూ ఉంటుంది. మా మధ్య ఎందుకు ఇంత దూరం వచ్చిందో అర్థం కావడం లేదు అని వసుధార అంటే.. దూరం తెచ్చేంతగా వసుధార ఇలా ఎందుకు చేసిందో ఇంకా అర్థం కావడం లేదు అని రిషి అనుకుంటాడు.

     నిన్ను చాలా ప్రశ్నలు అడగాలి..

    నిన్ను చాలా ప్రశ్నలు అడగాలి..

    కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు, మెసేజ్ కు ఆన్సర్ ఇవ్వరు.. అసలు రిషి సార్ మీరు ఎక్కడ ఉన్నారు అని వసుధార అనుకుంటుంది. ఎక్కడ ఉన్నానో.. ఏమైపోతున్నానో నాకే అర్థం కావడం లేదు అని రిషి అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం కాలేజీకి వెళుతుంది వసుధార. రిషి సార్ ఎక్కడికి వెళ్లి ఉంటారో అనుకుంటూ గతంలో ఇద్దరూ కూర్చున్న ప్రదేశంలో కూర్చుని బాధపడుతుందు వసుధార. గతంలో జరిగిన జ్ఞాపకాలను తలుచుకుంటుంది. రిషికి, జగతి, మహేంద్రకు కాల్ చేస్తుంది వసుధార. కానీ వాళ్లు ఎవరు లిఫ్ట్ చేయరు. తర్వాత ధరణికి కాల్ చేసి రిషి గురించి అడుగుతుంది వసుధార. నిన్ను చాలా ప్రశ్నలు అడగాలి.. కానీ నేను ఇప్పుడు ఎక్కువ సేపు మాట్లాడలేను అని ధరణి అంటే.. నా గురించి వద్దు మేడమ్ రిషి సార్ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది వసుధార.

    వసుధారను పట్టుకున్న రిషి..

    వసుధారను పట్టుకున్న రిషి..

    రిషి గురించి వసుధార అడగడంతో.. రిషి ఎక్కడ ఉన్నాడో మాకు ఎవ్వరికీ తెలియదు. రాత్రి కూడా ఇంటికి రాలేదు అని చెబుతుంది ధరణి. తర్వాత వసుధార అసలు నువ్ అలా ఎందుకు చేశావ్ అని ధరణి అడిగితే కాల్ కట్ చేస్తుంది వసుధార. అనంతరం రిషి, వసు ఇద్దరు మొదటిసారిగా కలుసుకున్న గెస్ట్ హౌజ్ గుర్తుకు వస్తుంది. అక్కడ ఉన్నారేమో అనుమానంతో అక్కడకి వెళుతుంది వసుధార. రూమ్ డోర్ ను లోపలి నుంచి రిషి.. బయట నుంచి వసుధార ఇద్దరు ఒకేసారి ఓపెన్ చేయడంతో వసుధార పడబోతుంటే రిషి పట్టుకుంటాడు. అప్పుడు ఇద్దరు చూపులు కొద్దిసేపు కలుస్తాయి. ఇంతలో రిషి షర్ట్ కి వసుధార తాళి తగులుకోవడం చూసి.. అది తీసేసి పక్కకు వెళ్లి నిల్చుంటాడు రిషి. ఏంటీ సార్ ఇక్కడ ఉన్నారు అని వసుధార అడిగితే.. అది నేను అడగాలి అని రిషి అంటాడు.

    నన్ను ఒంటరిగా వదిలేయు..

    నన్ను ఒంటరిగా వదిలేయు..

    వసుధార ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని రిషి అంటే.. ఒకసారి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్. నేను మీకు చెప్పాల్సింది చాలా ఉంది అని వసుధార అంటే.. నాకు వినడానికి ఏం లేదు అని రిషి అంటాడు. ఇంటికి వెళ్లండి అని వసుధార అంటే రిషి వినడు. నన్ను ఒంటరిగా వదిలేయమని దండం పెడతాడు రిషి. మీకు ఎలా చెబితే అర్థం అవుతుందో అని అంటూ మహేంద్రకు వాట్సాప్ లో రిషి సార్ కాలేజ్ గెస్ట్ హౌజ్ లో ఉన్నారు. వచ్చి తీసుకెళ్లండి అని వాయిస్ మెసేజ్ పెడుతుంది వసుధార. ఎందుకు ఇలా వేధిస్తున్నావ్ వసుధార.. నువ్ వెళ్తావా.. నన్ను వెళ్లమంటావా అని కోపంగా రిషి అనడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార. తర్వాత వసుధారకు చక్రపాణి కాల్ చేసి మీ అక్క మాధవికి ఒంట్లో నలతగా ఉందని, మీ అమ్మ అక్కడికి వెళ్తుంది.. నేను నీ దగ్గరికి వస్తాను.. ఎందుకో నీ దగ్గరికి రావాలని ఉందమ్మా అని చక్రపాణి అంటే.. వసుధార ఓకే అంటుంది. మరోవైపు ఇంట్లో కాలేజీలో రిషి ఉండటం ఏంటీ, వసుధార అక్కడికి వెళ్లడం ఏంటీ.. అసలు ఏం జరుగుతోంది.. మీరంతా రిషి గురించి ఆలోచించకుండా ఏం చేస్తున్నారు, బాధ్యత లేదా అని సీరియస్ అవుతుంది దేవయాని.

    English summary
    Guppedantha Manasu Serial January 20 2023 Today Full Episode 665
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X