Guppedantha Manasu: వసుధారకు ఫ్లాట్ కీ ఇచ్చిన రిషి, మొదలైన దేవయాని-రాజీవ్ కుట్ర.. చక్రపాణి వార్నింగ్!
వసుధార కాలేజీకి వచ్చిందని తెలుసుకున్న దేవయాని మహేంద్ర-జగతిపై సీరియస్ అవుతుంది. వసుధారకు లేని ప్రాధాన్యత ఇచ్చి నెత్తిన కూర్చోబెట్టుకున్నారు అని దేవయాని అంటే.. అయినదాని గురించి ఇప్పుడు ఎందుకు అని ఫణీంద్ర అంటాడు. జగతి ఏం మాట్లాడవేంటీ అని దేవయాని అడిగితే.. ఏం మాట్లాడమంటారు అక్కయ్య.. జరిగింది అందరికీ తెలిసిందేగా అని జగతి అంటుంది.
అసలు రిషి కాలేజీలో ఉన్నాడని ఎవరు చెప్పారని దేవయాని అడిగితే.. వసుధార పంపించిన వాయిస్ మెసేజ్ ను వినిపిస్తాడు మహేంద్ర. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జనవరి 21 శనివారం నాటి తాజా ఎపిసోడ్ 666లో ఇంకా ఏం జరిగిందంటే?

మీ మొహం మీదే చెప్పింది..
వసుధార అన్న మాటలు విన్న దేవయాని మరింత రగిలిపోతుంది. రిషిని అలా ఎలా వదిలేశారు అంటే మహేంద్ర బాధ్యతను వసుధార గుర్తు చేస్తుందా. వసుధార చెప్పింది నిజమే అని దేవయాని అంటే.. దేనిగురించి అంటున్నారు వదిన గారు అని మహేంద్ర అంటాడు. రిషిని మీరు వదిలేశారు కదా ఆ విషయమే. వసుధార మీ మొహం మీదే చెప్పింది కదా.
రిషిని చిన్నప్పుడు జగతి వదిలి వెళ్లింది. అప్పుడు నేను రిషిని కంటికి రెప్పలా కాపాడాను. ఇప్పుడు ఇదే జగతి తీసుకొచ్చిన వసుధార మన జీవితాలను అతలాకుతలం చేస్తోంది. దీనికి మీరే పరిష్కారం చెప్పాలని అంటుంది దేవయాని. సాక్షికి ఇచ్చి పెళ్లి చేద్దాం అంటే ఎవరు సపోర్ట్ చేయలేదు.. వెళ్లిపోయిందని దేవయాని అంటుంది.

విసుక్కున్న దేవయాని..
సాక్షి తర్వాత వసుధార వచ్చింది. ప్రేమ అని చెప్పి నటించి మోసం చేసింది అని ఫైర్ అవుతుంది దేవయాని. ఇంతలో జగతి రిషి నుంచి ఫోన్ వస్తుంది. మేడమ్ కాలేజీకి ఒకసారి రండి మాట్లాడాలి అని రిషి చెబుతాడు. జగతితోపాటు మహేంద్ర, దేవయాని కూడా వస్తాం అని చెబితే.. మహేంద్ర.. నువ్ రావాలనుకుంటే నీకే కదా కాల్ చేసేవాడు.
నాకు చెప్పాడంటే నన్నే రమ్మనమని అని జగతి చెబుతుంది. అది కూడా కరెక్టే అనుకున్న మహేంద్ర.. రిషి మనసు అసలే బాగాలేదు. ఇప్పుడు వెళితే డిస్టర్బ్ అవుతాడు అని దేవయానికి నచ్చజెబుతాడు మహేంద్ర. ఇక జగతి ఒక్కతే రిషి దగ్గరికి వెళుతుంది. అది చూసి దేవయాని విసుక్కుని వెళ్లిపోతుంది.

నీ చావు నా చేతిలోనే..
మరోవైపు ఇంట్లో సుమిత్రకు సేవలు చేస్తూంటాడు చక్రపాణి. ఇంతలో రాజీవ్ కాల్ చేయడంతో కోపంతో ఊగిపోతాడు చక్రపాణి. ఇన్నాళ్లు నమ్మించి మోసం చేశావని.. నాకు కనుక కనిపిస్తే.. అని చక్రపాణి అంటే.. ఏం చేస్తారు మావయ్య గారు.. మీరు ఏం చేయలేరు అని రాజీవ్ అంటాడు. నా మనవడి మొహం చూసి నిన్ను వదిలేస్తున్నాను.. ఇంకొకసారి నా కంటికి కనపడే ప్రయత్నం చేసిననా.. వసుధార వైపు చూసినా నీ చావు నా చేతిలోనే ఉందని గుర్తుపెట్టుకో.. ఈసారి నా మనవడి మొహం కూడా చూడను అని ఆవేశంతో కాల్ కట్ చేస్తాడు చక్రపాణి.
తర్వాత నవ్వుకున్న రాజీవ్.. పిల్లి శాపానికి ఉట్లు తెగుతాయా అన్నట్లు మామ కోపానికి ఈ అల్లుడు ఆగుతాడా.. వసుధారను పెళ్లి చేసుకుని తీరతాను అని అనుకుంటాడు రాజీవ్. మరోవైపు కాలేజీలో కూర్చున్న రిషి ఆలోచిస్తూ ఉంటాడు.

వసుధార భర్త లక్కీ కదా సార్..
పుష్పతో మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకుంటాడు రిషి. తాను వేరే చిన్న ఉద్యోగం చేస్తున్నాని చెబుతుంది పుష్ప. వసుధారకు క్యారియర్ ఇవ్వమని.. వసుధార తన ఇంట్లోనే ఉంటుందని రిషితో చెబుతుంది పుష్ప. నువ్ వాళ్ల ఆయన్ను చూశావా అంటే లేదు సార్.. కానీ లక్కీ ఫెల్లో కదా సార్.. వసుధార లాంటి భార్య దొరకడం అని పుష్ప అంటుంది.
వాళ్ల నాన్న గారు వస్తున్నారంటా తన కోసం ఇల్లు చూడాలని వసుధార చెప్పింది అని పుష్ప చెప్పి వెళ్లిపోతుంది. ఒకరు లక్కీ ఫెలో అయితే ఇంకొకరు అన్ లక్కీనా అని అనుకుంటాడు రిషి. ఈలోపు జగతి రిషి దగ్గరకి వస్తుంది. రిషి నువ్.. అని జగతి అడిగితే.. ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెబుతాడు రిషి. వసు అని జగతి అంటే.. ప్రాజెక్ట్ హెడ్ వసుధార వచ్చారు. నన్ను కలిశారు అని రిషి చెబుతాడు. రిషి కూల్ గా ఉన్నాడా.. ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడా అని జగతి అనుకుంటాడు.

మన కోపం మన వ్యక్తిగతం..
ప్రాజెక్ట్ హెడ్ కి ఇవ్వండి అని చెప్పిన రిషి.. ఇది గౌతమ్ ఫ్లాట్ కీ. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా తనకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సినా బాధ్యత మన కాలేజీకి ఉంది. తనకు కావాల్సిన అరెంజ్ మెంట్స్ స్టాఫ్ తో చెప్పి చేయించండి అని రిషి అంటాడు. వసుధారపై కోపం లేదా అని జగతి అడిగితే.. ఎవరి కోపాలకు ఎవరిని బాధ్యులం చేస్తాం.. మన కోపం మన వ్యక్తిగతం.. అదే గతం సాధ్యమైనంత తొందరగా ప్రాజెక్ట్ హెడ్ గారిని గౌతమ్ ఫ్లాట్ లోకి షిప్ట్ అవ్వమని చెప్పండి.
అలాగే పుష్ప తెచ్చింది.. ఈ క్యారియర్ ప్రాజెక్ట్ హెడ్ కి ఇవ్వండి అని రిషి చెబుతాడు. నువ్ ఎంత మంచివాడివి.. గొడ్డలితో గంధం చెట్టును నరికినా.. ఆ పరిమళం గొడ్డలికి కూడా అంటుకుంటుంది అని జగతి అనుకుని వెళ్లిపోతుంది. మరోవైపు వసుధార ఇంట్లో రిషి వాళ్లతో ప్రవర్తించిన తీరు గుర్తు చేసుకుంటుంది వసుధార.

ఎందుకు చిత్రవధ చేస్తున్నారు..
నాది తప్పే కానీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అని వసుధార అనుకుంటుండగా.. జగతి వస్తుంది. నేను చేసిన తప్పు ఏంటీ.. నన్ను ఎందుకు చిత్రవధ చేస్తున్నారని అని వసుధార అడిగితే.. షటప్.. ఎవరు ఎవరినీ చిత్రవధ చేస్తున్నారు.. తప్పొప్పుల గురించి మాట్లాడే అవసరం ఇప్పుడు లేదు. నువ్వు చెప్పింది వినే అవసరం నాకు లేదు.
ప్రాజెక్ట్ హెడ్ గా ఏమైనా చెప్పు వింటాను, మిషన్ ఎడ్యుకేషన్ హెట్ గా మీకు సౌకర్యాలు కల్పించాలి కాబట్టి రిషి సార్ ఈ కీ ఇచ్చారు అని జగతి చెబుతుంది. రిషి సార్ కి నాపై ఎంతో శ్రద్ధ కదా అని వసు అంటే.. నీ ప్లేస్ లో పుష్ప ప్రాజెక్ట్ హెడ్ అయిన ఇలాగే చేస్తాడు రిషి సార్ అని జగతి అంటుంది. మీరేదో కోపంగా ఉన్నారు అని వసుధార అంటే.. రిషి చెప్పిన మాట చెప్పిన జగతి.. మీరిప్పటికే జీవితంలో గొప్ప విజయాలు సాధించారు.
మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని వెళ్లిపోతుంది జగతి. జరిగింది చెప్పే అవకాశం కూడా ఇవ్వడం లేదు.. రిషి సార్ కి నాపై ఎంత శ్రద్ధనో.. ఎంతైనా రిషి సార్ జెంటిల్మెన్ కదా అని వసుధార అనుకుంటుంది.
శాలువా కప్పి సన్మానం చేయాలా..
మరోవైపు రిషి వెళ్లిపోతాడు అనుకుంటే వెళ్లలేదు.. వసుధార మళ్లీ వచ్చింది. ఇప్పుడు వాళ్లిద్దరు ఒక్కటైపోతారా.. ఒక్కటైపోతారా ఏంటీ.. పైగా రిషి-జగతి కూడా కలిసిపోయేలా ఉన్నారు అనుకుంటూ రాజీవ్ కి కాల్ చేస్తుంది దేవయాని. రేయ్ ఎక్కడ చచ్చావురా అని దేవయాని అంటే.. రా.. ఏంటీ రా.. అలా అంటే బాగోదు.. మీ మీద గౌరవం ఉంది.
దాన్ని అలాగే ఉండనివ్వండి అసలే మంటమీదున్నాను అని రాజీవ్ సీరియస్ అవుతాడు. నేను అంతకంటే మంటమీద ఉన్నాను.. నీకు డబ్బిచ్చాను, అవకాశం ఇచ్చాను.. అయినా చెప్పినా పని చేయకుండా తిరుగుతున్నావ్. అందుకు నిన్ను సార్ అని పిలవాలా.. శాలువా కప్పి సన్మానం చేయాలా అని దేవయాని కోపంగా అంటుంది.


Click it and Unblock the Notifications











