twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: షాకింగ్.. వసుధారను పదవి నుంచి తొలగిపోమన్న రిషి.. దేవయానితో ఛాలేంజ్!

    |

    ఒక సారి కలవాలి, మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి ఎండీ సార్ అని రిషికి మెసేజ్ చేస్తూ రోడ్డుపై నడుస్తుంటుంది. కలవడం జరిగింది.. విడిపోవడం జరిగింది అని అనుకున్న రిషి ఎండీ అంటే మై డార్లింగ్ అని వసుధార చెప్పింది గుర్తు చేసుకుంటాడు. నేను నీ ఎండీని కాదు అని మెసేజ్ చేస్తాడు. అది చూసిన వసుధార మీరు ఎప్పటికీ నా ఎండీనే అనుకుని కాల్ చేస్తుంది. అటువైపు స్విచ్ఛాఫ్ చేస్తాడు రిషి. స్విచ్ఛాఫ్ వస్తుందేంటి అనుకుంటూ వెళుతున్న వసుధార వెనుక బావ రాజీవ్ ఉంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జనవరి 24 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్‌ 668లో ఇంకా ఏం జరిగిందంటే?

    అంతా చేసే వెళతాను..

    అంతా చేసే వెళతాను..

    వసుధార వెళుతుండగా.. చిటికెలు వేస్తూ పిలుస్తాడు రాజీవ్. నువ్వా అని షాక్ అయిన వసుధార్ అంటే.. అవును.. నేనే మీ అభిమానా రాజీవ్ బావను అంటాడు. మనకు పెళ్లయింది అని రాజీవ్ అంటే.. షటప్.. ఇక్కడి నుంచి వెళ్లమంటుంది వసుధార. రిషితో పెళ్లయిందని అన్నావ్ కదా.. ఇంకేముంది అని రాజీవ్ అంటే.. రిషి సార్ ను నా నుంచి దూరం చేయడం ఎవరి వల్ల కాదు అని స్ట్రాంగ్ గా చెబుతుంది వసుధార. దీంతో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావ్.. ఎలాగైన నిన్ను పెళ్లి చేసుకుంటా అని రాజీవ్ అంటాడు. ఇంతలో అటోను పిలిచి వెళ్లిపోతుంది వసుధార. వెళతానులే వసుధార.. ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో.. అంతా చేసే వెళతా అని రాజీవ్ అంటాడు.

    పదవి నుంచి తొలగించండి..

    పదవి నుంచి తొలగించండి..

    ఇక తాజాగా జనవరి 24 మంగళవారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అందులో.. తలనొప్పితో సోఫాపై వాలి కళ్లు మూసుకుని కూర్చుని ఉంటాడు రిషి. అది చూసిన వసుధార వచ్చి సైలెంట్ గా రిషి తలపై చేతులతో బామ్ రాస్తుంటుంది. అది ఎవరా అని ఆ చేతుల స్పర్శకు ఉలిక్కి పడి లేచిన రిషి.. వసుధారను చూసి షాక్ అవుతాడు. అసలు నేను ఇక్కడ ఉన్నాని నీకు ఎలా తెలిసింది అని రిషి అంటే.. మనసుకు ఎవరు చెప్పాలి సార్ అని వసుధార అంటుంది. మనసు గురించి నువ్ మాట్లాడకపోతేనే బాగుంటుందేమో. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నుంచి కూడా వెళ్లిపో వసుధార అని రిషి అంటాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధార. మీరే నన్ను ప్రాజెక్ట్ హెడ్ గా అంగీకరించారు. మీరే నన్ను ప్రాజెక్ట్ హెడ్ పదవి నుంచి దించేయండి అని వసుధార అంటుంది. అప్పుడు వసుధార ఈ సీట్ కు మేడమ్ తర్వాత నువ్వే కరెక్ట్ అని రిషి చెప్పింది గుర్తు చేసుకుంటాడు.

    సోమవారం నాటి ఎపిసోడ్ లో..

    సోమవారం నాటి ఎపిసోడ్ లో..

    ఈ సీరియల్ లోకి ఇవాళ ప్రారంభం కానున్న బ్రహ్మముడి సీరియల్ రాజ్ (మానస్) ప్రత్యక్షమవుతాడు. కారులో వెళుతుండగా రాజ్ కారు ఆగిపోతుంది. అటునుంచి రిషి కారులో వస్తూ రాజ్ ను చూసి పలకరిస్తాడు. తర్వాత లిఫ్ట్ కావాలంటే కారు ఎక్కించుకుని వెళతాడు రిషి. దారిలో వెళుతుండగా.. వసుధార కనిపిస్తుంది. వసుధారను చూసి రాజ్ పిలుస్తాడు. కాలేజీ వైపే వెళ్తున్నాం.. కారు ఎక్కు అని పిలుస్తాడు రాజ్. కొద్దిసేపు సందేహంగా ఉన్న వసుధారను చూసిన రాజ్.. ఇది మీ రిషి సార్ కారు.. నాది కాదు రా ఎక్కు అంటే వచ్చి కారు ఎక్కుతుంది వసుధార. అప్పటి వరకు బ్రహ్మముడి (పెళ్లి) గురించి మాట్లాడుకున్న రిషి, రాజ్ కొనసాగిస్తారు. రాజ్ నువ్ మాత్రం పెద్దలు చూసినే అమ్మాయినే పెళ్లి చేసుకో.. లైఫ్ లో ఎవరినీ నమ్మకు అని రిషి అంటాడు. దానికి రాజ్ సర్ నచ్చిన వాళ్లు అందరికీ దొరకరు అని వసుధార అంటుంది. అందుకు దొరికిన వాళ్లు మోసం చేసి తప్పుకుంటారు అని రిషి అంటాడు. ఎవరెవరు ఎవరికీ రాసి పెట్టారో ఎవరికీ తెలుసు అని వసుధార అంటుంది.

    వసుధార ఏదో చెప్పాలని చూస్తుంది..

    వసుధార ఏదో చెప్పాలని చూస్తుంది..

    మరోవైపు కాలేజీలో మహేంద్ర-జగతి కూర్చుని రిషి గురించి బాధపడుతుంటారు. వసుధార చేసింది చేసి మళ్లీ ఎందుకు వచ్చినట్లు అని మాట్లాడుకుంటారు. ఇక్కడికి వసుధార రాకుండా తన బతుకు ఏదో బతుకితే అయిపోయేది. తను రావడం రిషికి ఇంకా బాధను పెంచుతుంది అని జగతి అంటుంది. అప్పుడు.. ఒకరకంగా ఆలోచిస్తే మనతో వసుధార ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తోందని మహేంద్ర అంటాడు. దీనికి అదేం లేదు.. తనను కవర్ చేసుకునేందుకు ఏవేవో చెబుతుంది. అప్పుడు ఉన్న తన పరిస్థితి గురించి, వాళ్ల ఇంట్లో విషయాలు అంటూ ఏవేవో చెప్పేందుకు ట్రై చేస్తుంది. అవేం పట్టించుకోవద్దు అని జగతి అంటుంది. గురు దక్షిణ ఇస్తానంది అని మహేంద్ర బాధపడతాడు. మాట ఇచ్చింది.. కానీ నెరవేర్చలేదు కదా.. అన్న జగతి.. రిషి బాధను తొలగించేదెవరు.. ఓదార్చేదెవరు అని ఇద్దరు మాట్లాడుకుంటారు.

    అర్థం చేసుకుంది అంతా అబద్ధం..

    అర్థం చేసుకుంది అంతా అబద్ధం..

    గెస్ట్ హౌజ్ రూమ్ లో కూర్చుని రిషిధార అని పేపర్ రాసి తనలో తానే మాట్లాడుకుంటాడు. జీవితం ఇంత అందంగా ఉంటుందా.. ఇన్న అందమైన జ్ఞాపకాలుంటాయా అనుకున్నాను. కానీ కేవలం జ్ఞాపకంగా మారిపోయావా అనుకుంటాడు రిషి. తర్వాత రిషిధార లోనుంచి రిషి, ధార వేరు చేస్తాడు. నా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు. నువ్వు నన్ను ఎందుకు దూరం పెట్టావో.. ఆ తాళి ఎందుకు కట్టించుకున్నావో అర్థం కాలేదు. అడిగితే ఇష్టప్రకారమే తాళి నా మెడలో పడిందన్నావ్. అర్థం లేని నా జీవితానికి అర్థం చూపించావ్ అనుకున్నాను. కానీ నేను అర్థం చేసుకున్నది అబద్ధం అని ఒక్క మాటలలో నిరూపించావ్ అనుకుంటాడు రిషి. ఇంతంలో రిషి రాసిన పేపర్ గాలికి ఎగిరి కిందపడుతుంది. అప్పుడే వసుధార వస్తుంది. వసుధారను చూసిన రిషి ఆ పేపర్ ను తీసుకుంటాడు.

    కొత్త కాపురానికి వస్తువులు కొనడానికేమో..

    కొత్త కాపురానికి వస్తువులు కొనడానికేమో..

    మీరు ఇక్కడున్నారేంటీ సార్ అని వసుధార అంటే.. నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది. నేను ఎక్కడ ఉంటే ఏంటీ వసుధార అని రిషి అంటాడు. ఇంటిని వదిలేసి ఇలా ఒంటరిగా ఎన్నాళ్లిలా అని వసు అంటే.. చిన్నప్పటి నుంచి నాకు ఒంటరి తనం అలవాటే. బహుశా నాకు ఒంటరితనం శాపంగా మారిన వరమేమో. నా జ్ఞాపకాలే నా తోడు. మోసపోవడం కూడా అలవాటైంది అని రిషి అంటాడు. మనం మాట్లాడుకోవాలి సార్ వసుధార అంటే.. కొన్ని పదాలను వాడడం సంస్కారం కాదు. నువ్వు నేను అనుకోవడం ఓకే. కానీ మనం అనుకోవడం కరెక్ట్ కాదేమో అని రిషి అంటాడు. మానిన గాయాన్ని తవ్వకు.. మనం అనే పదం వాడొద్దు వెళ్లు అంటే.. గౌతమ్ ఫ్లాట్ కీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతుంది వసుధార. తెలిసి ఇచ్చారో.. తెలియక ఇచ్చారో కానీ అవసరమైనప్పుడు ఇచ్చారు. మా నాన్న వస్తున్నారు అని వసుధార అంటే.. కొత్త కాపురానికి వస్తువులు కొనడానికేమో అనుకుంటూ బయటకు వెళ్లిపోతాడు రిషి. బయటకు వచ్చిన వసుధారకు దేవయాని ఎదురుపడుతుంది. రిషి సార్ ని, నన్ను ఎవరు విడదీయలేరని దేవయానితో ఛాలేంజ్ చేస్తుంది వసుధార.

    English summary
    Guppedantha Manasu Serial January 24 2023 Today Full Episode 668
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X