twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: కన్నతల్లి కంటే వేయి రెట్ల గాయం చేశావ్.. రిషి మాటలకు కుంగిపోయిన వసుధార!

    |

    రాత్రి బయట ఒక చోట కారు ఆపి ఉంటారు రిషి, మహేంద్ర. తాగేందుకు కారుపై మద్యం బాటిళ్లు ఉంటాయి. ఇదంతా అవసరమా నాన్న అని మహేంద్ర అంటాడు. అవసరమే డాడ్.. అత్యంత అవసరమే.. గుండె మండిపోతుంది డాడ్. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది. నేను రెజెక్టెడ్ వస్తువా డాడ్ అని రిషి అంటే.. అయ్యే నాన్నా నువ్ చాలా గొప్పోడివి అని మహేంద్ర అంటాడు. గొప్పోన్ని అయితే అందరు వదిలేసి ఎందుకు వెళుతున్నారు డాడ్. వసుధార పెళ్లి చేసుకుని వెళ్లింది. వెళితే వెళ్లింది. మళ్లీ ఎందుకు రావాలి డాడ్ అని రిషి అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జనవరి 27 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్‌ 671లో ఇంకా ఏం జరిగిందంటే?

     బాటిల్ విసిరికొట్టిన మహేంద్ర..

    బాటిల్ విసిరికొట్టిన మహేంద్ర..

    తండ్రితో మనసులో ఉన్న బాధను చెప్పుకుంటూ ఉంటాడు రిషి. తర్వాత ఓ ఆకాశమా.. వసుధారను అడుగు ఎందుకు మోసం చేశావని అంటూ ఏడుస్తూ మాట్లాడుతాడు రిషి. తర్వాత తాగేందుకు గ్లాస్ ను దగ్గరిదాకా తీసుకుని.. ఆ గ్లాస్ ను విసిరికొడతాడు రిషి. అది చూసి మహేంద్ర.. సంతోషంతో మిగిలినా బాటిల్ ను కూడా విసిరికొడతాడు. నాకు తెలుసు నాన్నా.. ఇలాంటి వాటికి నువ్వు లొంగవు అని. ఇదే నువ్వు అని మహేంద్ర అంటాడు. నా బాధలను ఈ మందు తీర్చలేదు డాడ్. తాగితే మర్చిపోయే ప్రేమ కాదు డాడ్ అని రిషి అంటాడు. మరోవైపు తండ్రి చక్రపాణికి వసుధార భోజనం పెడుతుంది. మళ్లీ ఎప్పటిలానే కూతురుని క్షమించమని అడుగుతాడు తండ్రి చక్రపాణి.

    దేవుడు నీకు మంచివాడినే చూపించాడు..

    దేవుడు నీకు మంచివాడినే చూపించాడు..

    అయ్యో నాన్న రోజుకీ వందసార్లు చెబుతున్నారు అవసరం లేదు నాన్న అని వసుధార అంటుంది. నువ్ ఒక్క ముద్ద పెడుతుంటే నాకు అప్పుడే కడుపు నిండినట్లు అవుతుంది అని చక్రపాణి అంటాడు. తర్వాత నేనే మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు తల్లి అని చక్రపాణి అంటే.. లేదు నాన్న మాకోసం, మమ్మల్ని పెంచేందుకు మీరు చాలా కష్టపడ్డారు అని వసుధార అంటుంది. మాధవి అక్క, అమ్మ వాళ్లు ఎలా ఉన్నారు అని అడిగితే బాగున్నారు అని చెబుతాడు చక్రపాణి. తర్వాత రిషి గొప్పదనం గురించి వసుధార చెబితే.. నాకు తెలుసు అమ్మా.. రిషి సార్ వజ్రం అని అంటాడు చక్రపాణి. దేవుడు నీకు మంచి వాడినే చూపించాడమ్మ అని తండ్రి అంటే వసుధార సంతోషిస్తుంది.

     నీకు చెప్పే అర్హత కూడా లేదు..

    నీకు చెప్పే అర్హత కూడా లేదు..

    మరుసటి రోజు ఉదయం రిషి క్యాబిన్ కు వెళుతుంది వసుధార. ఎప్పటిలానే జరిగింది చెప్పేందుకు ప్రయత్నిస్తుంటుంది వసుధార. కానీ రిషి అదేం పట్టించుకోడు. అస్సలు వినిపించుకోకుండా ఫైర్ అవుతాడు. వసుధార ఏదో చెప్పబోతుంటే.. షటప్ వసుధార.. అంటూ కుర్చీలో నుంచి లేచి నిలుచుని కోప్పడతాడు రిషి. ఎవరితోనో తాళి కట్టించుకుని.. ఆ ముచ్చట్లన్నీ సరదాగా నాకు చెబుతానంటే.. నేను వినను గాక వినను. అయినా చెప్పడానికి, నిజానికి నీకు చెప్పడానికి అర్హత కూడా లేదు అని రిషి అంటాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధార. ఇకమీదట మీకు ఇంకేం చెప్పను అని వసుధార అంటుంది. దానికి సంతోషం.. చాలా సంతోషం. ఇక నువ్వు వెళ్లొచ్చు.. అని రిషి అంటే బాధగా బయలుదేరుతుంది వసుధార.

     నా తల్లి చేసిన గాయం కన్నా..

    నా తల్లి చేసిన గాయం కన్నా..

    నా తల్లి చేసిన గాయం కన్నా వేయ్యి రెట్టు ఎక్కువ గాయం చేశావ్ వసుధార అని రిషి అంటే మరింతగా బాధపడిపోతుంది వసుధార. దీంతో గాయం నా మనసుకి కూడా అయింది సార్.. థ్యాంక్స్ అని వసుధార అంటుంది. ఇలా జనవరి 27 శుక్రవారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ముగుస్తుంది. ఇక ఇదంతా చూస్తుంటే దేవయాని-రాజీవ్ ప్లాన్ వర్కౌట్ అయినట్లే తెలుస్తుంది. రిషి అన్న మాటలకు గాయపడిన వసుధార ఇప్పట్లో నిజం చెప్పే అవకాశం కానీ, రిషి అసలు నిజం తెలిసే ఛాన్స్ కానీ లేనట్లే అనిపిస్తోంది. తర్వాత ఏం జరిగిందో అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

    గురువారం నాటి ఎపిసోడ్ లో..

    గురువారం నాటి ఎపిసోడ్ లో..

    కాలేజీ మేడమ్, రిషితో కలిసి మినిస్టర్ ను కలుస్తుంది వసుధార. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్స్ ను మంత్రికి వివరిస్తుంది వసుధార. ఆ ప్లాన్స్ అన్ని విన్నా ప్రోసీడ్ అయిపోండని, వసుధార ఆలోచన బాగుందని మెచ్చుకుంటాడు మంత్రి. వసుధార లాంటి తెలివైన అమ్మాయి దొరకడం మన అదృష్టం.. తనను నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు అని రిషికి సలహా ఇస్తాడు మంత్రి. దీనికి తనే నన్ను వదులుకుంది అని బాధపడతాడు రిషి. భూషణ్ కుటుంబం నీకు వెనుక ఉంటుంది.. మీరంతా కలిసి ఉంటే అద్భుతాలు చేయగలరు అని ఆల్ ది బెస్ట్ చెబుతాడు మంత్రి. తర్వాత అక్కడి నుంచి కారులో బయలు దేరతారు. మధ్యలో కాలేజీ మేడమ్ కొడుకుకు దెబ్బ తగిలిందన్న విషయం తెలుసుకుని వాళ్ల ఇంటి వద్ద డ్రాప్ చేస్తారు రిషి. వసుధార.

    ఏ భర్తకు ఈ పరిస్థితి రాకూడదు..

    అక్కడికి రాజీవ్ వస్తాడు. రిషి సార్ మీకు నాకు ముఖ్యం కారు పోనివ్వండి అని వసుధార అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని రిషి కోప్పడంగా.. రాజీవ్ వచ్చి కారు దిగమని రిక్వెస్ట్ చేస్తాడు. నా భార్యని నాతో పంపించండి రిషి సార్ అని రాజీవ్ అంటే.. ఏంటీ రోడ్డు మీద న్యూసెన్స్.. నేను ఎక్కడికి రాను.. రిషి సార్ తో వెళతాను అని వసుధార అంటుంది. నా భార్య గురించి పరాయి మొగాడిని అడగాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఏ భర్తకు రాకూడదు అని అంటాడు రాజీవ్. వసు మారిపోయింది.. వాళ్ల నాన్న మారిపోయాడు ఇలా అయితే నా పరిస్థితి ఏంటీ సార్ అని రాజీవ్ అంటే.. నేను రానంటున్నాను కదా వెళ్లు.. సార్ తనది నటన.. అసలేం జరిగిందో వినండి సార్ అని వసుధార అంటుంది. జరిగింది తర్వాత నేను తీరిగ్గా రిషి సార్ కు చెబుతాను రా అని వసుధార చేయి పట్టుకుంటాడు రాజీవ్. దీంతో అటొ ఎక్కి వెళ్లిపోతుంది వసుధార. ఏం అర్థం కాక రిషి ఉంటే పైశాచికంగా నవ్వుతాడు రాజీవ్.

     విడిపోవడానికి శంకుస్థాపన చేశాను..

    విడిపోవడానికి శంకుస్థాపన చేశాను..

    మరోవైపు ఇంట్లో నా కళ్లెదుటే అన్నీ జరుగుతున్నా ఏం చేయలేకపోతున్నా అని దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాజీవ్ కాల్ చేసి.. జరిగినదంతా చెబుతాడు. వాళ్లు విడిపోవడానికి శంకుస్థాపన చేశాను. త్వరలోనే రిషి-వసుధార విడిపోవడం తథ్యం అని హామీ ఇస్తాడు రాజీవ్. మనకు కావాల్సింది అదే కదా అని దేవయాని అంటుంది. తర్వాత కాల్ కట్ చేసి నవ్వుకుంటున్న దేవయానిని ధరణి చూస్తుంది. ఈవిడ నవ్వుకుంటుందంటే ఏదో ప్లాన్ వేసినట్లే. వసుధార గురించే అనుకుంటా అని అనుకుంటుంది ధరణి.

    English summary
    Guppedantha Manasu Serial January 27 2023 Today Full Episode 671
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X