twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: తండ్రీ కూతుళ్లను అవమానించిన జగతి-మహేంద్ర.. దేవయాని కొత్త ప్లాన్!

    |

    రిషి తన దగ్గరికి అర్జెంట్ గా రమ్మని రిషి చెబుతాడు. అనంతరం వసుధార నిజం చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే అస్సలు వినిపించుకోడు రిషి. అనేక మాటలు అని వసుధార మనసుకు గాయం చేస్తాడు. దీంతో మీకు మీరుగా నిజం తెలుసుకోండి సార్. నేను ఏం చెప్పను. చెప్పినా అది నమ్మే పరిస్థితుల్లో లేరు అని వెళ్లిపోతుంది. తర్వాత గెస్ట్ హౌజ్ లో ఉన్న రిషిని వెళ్లి కలుస్తుంది దేవయాని.

    వసుధార గురించి తక్కువ చేసి మాట్లాడుతుంది. అన్నయ్య దగ్గరికి వెళ్లు.. ఇక్కడ అంతా సర్దుకున్నాక నేను కూడా వచ్చేస్తాను అని చెబుతుంది దేవయాని. నేను ఎవరి వల్ల బాధపడట్లేదు.. నా జ్ఞాపకాలతో బాధపడుతున్నాను అని రిషి చెబుతాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జనవరి 28 శనివారం నాటి తాజా ఎపిసోడ్‌ 672లో ఇంకా ఏం జరిగిందంటే?

    సేవ చేసుకోవడం తప్పు కాదు..

    సేవ చేసుకోవడం తప్పు కాదు..

    నేను ఎక్కడికి వెళ్లిన నా జ్ఞాపకాలు నా వెంటే ఉంటాయి అని రిషి చెబుతాడు. వసుధారను ప్రాజెక్ట్ హెడ్ పదవి నుంచి తీసేయి రిషి అని దేవయాని అంటే.. అలా చేసే హక్కు మనకు లేదు. వసుధారను ప్రభుత్వం నియమించింది అని చెప్పి దేవయానిని పంపించేస్తాడు రిషి. మరోవైపు వసుధార ఇంటికి చేరుకుంటుంది.

    రిషి అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతుంటే చక్రపాణి వచ్చి కాఫీ ఇస్తాడు. మీరేంటీ నాన్న నాకు కాఫీ ఇవ్వడం అని వసుధార అంటే.. నువ్వు మా అమ్మవి. అమ్మకు సేవ చేసుకోవడం తప్పు లేదంటాడు చక్రపాణి. రిషి సార్ తో చెప్పావా అని చక్రపాణి అడిగితే.. చెప్పనివ్వడం లేదని అంటుంది వసుధార.

    నేనైమైన తప్పు చేశానా నాన్న.. అప్పుడు ఆ పరిస్థితుల్లో తప్పు చేశానా అని వసుధార అడిగితే.. మన కుటుంబాన్ని, రిషి ఫ్యామిలీనా కాపాడేందుకు నువ్ అలా చేశావ్ అని తెలిస్తే రిషి సార్ అర్థం చేసుకుంటారు. అన్నీ సర్దుకుంటాయిలే అమ్మా అని ధైర్యం చెబుతాడు చక్రపాణి.

    ఏదో ప్లాన్ చేస్తున్నారని డౌట్..

    ఏదో ప్లాన్ చేస్తున్నారని డౌట్..

    మరోవైపు జగతి-మహేంద్ర-ధరణి ముగ్గురు రిషి, వసుధార గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దేవయాని వదిన వల్ల ఒక్క మంచి పని జరిగింది.. అని మహేంద్ర అంటే.. తను కోరుకున్నట్లే వసుధార, రిషి విడిపోయారు కదా మహేంద్ర. అయినా నాకేందుకో దేవయాని అక్కయ్య ఏదో ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది అని జగతి అంటుంది.

    వసుధార, రిషి ఇద్దరు విడిపోయారు కదా.. ఇంకా ఏముంది చేసేందుకు అని మహేంద్ర అంటారు. లేదు నాకు కూడా దేవయాన్ని అత్తయ్య ఏదో ప్లాన్ చేస్తున్నారని అనుమానం వస్తోంది. ఈ మధ్య ఆమె చాలా సంతోషంగా ఉంటున్నారు.

    అలా ఉంటున్నారంటో ఎవరికో కీడు చేస్తున్నారని ధరణి అంటుంది. ఇప్పుడు ఇలా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదేమో కానీ, అది కూడా నిజమే అని మహేంద్ర అంటాడు. ఇంతకుముందు రిషి వసుధార కలవాలనుకునేవాళ్లం.. ఇప్పుడు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం అని అనుకుంటారు.

    విడిపోయారంటే నమ్మేలా లేదు..

    విడిపోయారంటే నమ్మేలా లేదు..

    వసుధార మరొకరిని పెళ్లి చేసుకుని రిషి ముందు తిరుగుతుంటే ఆ బాధ వర్ణనాతీతం కదా మహేంద్ర అని జగతి అంటుంది. వసుధార మనకు ఏదో చెప్పాలను ప్రయత్నిస్తోంది జగతీ గమనించావా అని మహేంద్ర అంటే.. మనల్నీ క్షమాపణ అడిగి ఏదో జరిగిందని నచ్చజెప్పి.. మనతో ఎప్పటిలా కలిసి ఉండాలని అనుకుంటోందేమో అని జగతి అంటుంది.

    అప్పుడు రిషిదార బంధం మొదలైనప్పటి నుంచి వాళ్లు ఒకరికోసం మరొకరు పుట్టారనపించేలా ఉన్నారు. ఇప్పుడు విడిపోయారంటే నమ్మేలా లేదు అని ధరణి అంటుంది. కొన్ని నమ్మక తప్పదు. రిషిని మనం జాగ్రత్తగా చూసుకోవాలని అని జగతి అంటుంది. అవును.. రిషిని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి అని మహేంద్ర అంటాడు.

    రిషి సార్ ఇంటికి వెళుతున్నా..

    రిషి సార్ ఇంటికి వెళుతున్నా..

    మరోవైపు వసుధార తండ్రి చక్రపాణి ఇంట్లో నుంచి బయటకు వెళతాడు. అప్పుడు జగతి, రిషిని అన్న మాటలు తలుచుకుని బాధపడతాడు. నేను పెద్ద తప్పు చేశాను. వసుధారకు జీవితాన్ని ఇచ్చి, చదువు చెప్పిన టీచరమ్మను, వాళ్ల ఆయన్ను అవమానించాను, మూర్ఖంగా ప్రవర్తించాను. ఇప్పుడు నా కళ్లు తెరుచుకున్నాయి.

    రిషి సార్ లాంటి ఉత్తముడు నా కూతురికి భర్తగా రాబోతున్నాడు. వాళ్ల కాళ్లు పట్టుకుని ప్రాయిశ్చిత్తం చేసుకుంటాను అని అనుకుంటాడు చక్రపాణి. మొత్తానికి రిషి ఇంటి అడ్రస్ తెలుసుకుని వెళ్తున్న చక్రపాణికి వసుధార కాల్ చేస్తుంది. చిన్న పని మీద బయటకు వచ్చాను.

    తొందరగానే వస్తాను అని చక్రపాణి చెబుతాడు. నీకు సిటీ కొత్త కదా నాన్న అని వసుధార అంటే.. రిషి సార్ ఇంటికి వెళుతున్నాను. ఇంటి దగ్గరిలో ఉన్నాను అని చెబుతాడు చక్రపాణి. దీంతో వద్దు నాన్నా మీరు వెళ్లకండి అని వసుధార చెబుతున్న.. వినకుండా కాల్ కట్ చేస్తాడు చక్రపాణి.

    అందుకు కారణం మీరేనమ్మా..

    అందుకు కారణం మీరేనమ్మా..

    రిషి ఇంటి గేటు నుంచి లోపలికి వెళుతుంటాడు చక్రపాణి. నేను కూడా నా కూతురికి ఇలాంటి సంబంధం తీసుకురాలేను అని సంతోషపడతాడు. ఇంతలో ఇంట్లో నుంచి వచ్చిన జగతి-మహేంద్ర చక్రపాణిని చూసి షాక్ అవుతారు. ఎందుకొచ్చారు.. వెళ్లిపోండి అని సీరియస్ అవుతాడు మహేంద్ర.

    చక్రపాణి ఏదో చెప్పేందుకు ప్రయత్నించిననా జగతి వినిపించుకోదు. కాదమ్మా, అప్పుడు నా కళ్లు నెత్తిమీదకెక్కి.. పరువు కోసం పాకులాడాను. నేను చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నా. ఇప్పుడు నా కూతురు గొప్పగా ఉందంటే అందుకు కారణం మీరేనమ్మా. జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాను అని చక్రపాణి అంటాడు. మీ కూతురు, మీ ఫ్యామిలీ మాకు ఇచ్చిన బహుమతికి మేమే జీవితాంత కృతజ్ఞతతో ఉంటాం. ఇంట్లో నుంచి వెళ్లి పోమ్మన్నారు అదెలా మర్చిపోతాం అని జగతి అంటుంది.

    చాలా గొప్ప ఆలోచన..

    అప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది.. ఆరోజు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానంటే అని చక్రపాణి చెబుతుంటే.. అది మాకు అనవసరం అని జగతి అంటుంది. నిజం మీకు చెప్పాలి అని చక్రపాణి వేడుకుంటుంటే.. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. మీలా మాట్లాడలేం.. మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తాయి అని జగతి అంటుంది.

    ఇంతలో అక్కడికి వసుధార వస్తుంది. నాన్న నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని వసుధార అడుగుతుంది. ఒకరు తర్వాత ఇంకొకరు రావాలని ముందుగానే అనుకున్నారేమో అని మహేంద్ర అంటాడు. వసుధార గారు మీరు వెళ్లండి ప్లీజ్ ఈ ఇంటికి రావాల్సిన అవసరం మీకు లేదంటుంది జగతి.

    మనిషిని నిలువునా కోసినట్లు మాట్లాడి.. ఇప్పుడు క్షమించమనడం చాలా గొప్ప ఆలోచన చక్రపాణి గారు అని జగతి అంటుండగా.. ధరణి అని పిలుస్తూ దేవయాని హాల్లోకి వస్తుంది. దేవయాని మాట వినడంతో వాళ్లను అతి బలవంతంగా పంపించివేస్తుంది జగతి.

    English summary
    Guppedantha Manasu Serial January 28 2023 Today Full Episode 672..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X