Guppedantha Manasu: వసుధార మనసులో చెప్పలేని బాధ, గన్ తో బెదిరింపులు.. రిషి ఏం చేస్తాడు?

వసుధారను గదిలో బంధించిన తండ్రి చక్రపాణి పెళ్లికి అన్ని సిద్దం చేస్తాడు. ఇంతలో వసుధార బావ రాజీవ్ ఎంట్రీ ఇస్తాడు. తనకోసం జరుగుతున్న పెళ్లి తంతు చూసి సంబరపడిపోతాడు. ఇంతలో వసుధారకు పెళ్లి అన్న సంగతి రిషికి ఫోన్ ద్వారా తెలిసిపోయిందని రాజీవ్ కి కంగారుగా చెబుతాడు చక్రపాణి. వివాహం జరగడానికంటే ముందుగానే రిషి వచ్చేలా ఉన్నాడని చక్రపాణి అంటే.. అదంతా నేను చూసుకుంటాను అని రాజీవ్ అంటాడు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరి గుప్పెడంత మనసు సీరియల్ జనవరి 3, 2023 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్​ 650లో ఏం జరిగిందో చదివేసేయండి.

చాలా బుల్లెట్లు ఉన్నాయి..

చాలా బుల్లెట్లు ఉన్నాయి..

వసుధార గదిలోకి వచ్చిన రాజీవ్ తననే వసుధార ఎందుకు పెళ్లి చేసుకోవాలో చెబుతాడు. వివిధ రకాలుగా వసుధారను భయపెట్టేందుకు ప్రయత్నిస్తాడు రాజీవ్. అయితే రాజీవ్ ప్రలోభాలకు ఎక్కడా లొంగదు వసుధార. తర్వాత గన్ తీసి బెదిరిస్తాడు రాజీవ్.

తన మెడలో రిషి తాళి కడితే ఆ గన్నుతో రిషిని తర్వాత జగతి మేడమ్ ను, ఆ తర్వాత మహేంద్ర ను చంపుతానని బెదిరిస్తాడు. అనంతరం అదంతా చూసిన వసుధార తల్లిదండ్రలను కూడా చంపేస్తా, తనదగ్గర చాలా బుల్లెట్లు ఉన్నాయని భయపెడతాడు రాజీవ్. దీంతో వసుధార ఆలోచనలో పడిపోతుంది. అనంతరం పెళ్లికూతురిలా ముస్తాబైన వసుధార జగతి ఇచ్చిన బాక్సు ఓపెన్ చేస్తుంది.

వసుధార మెడలో తాళి..

వసుధార మెడలో తాళి..

అందులో నల్ల పూసల దండ ఉంటుంది. జగతి ఇచ్చిన నల్ల పూసల దండ చేతిలోలిక తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార. జగతి మేడమ్ ముందే ఊహించి.. ఇది పంపించారు అని అనుకుంటుంది వసుధార. అప్పుడే రిషి అక్కడ ప్రత్యక్షమవుతాడు.

ఆ నల్లపూసలు చేతికి అందించడంతో రిషి ఆనంద పడతాడు. తర్వాత వసుధార మెడలో ఆ నల్ల పూసల తాడును రిషి వేస్తాడు. బ్యాక్ గ్రౌండ్ లో మంగళవాయిద్యాలు వినిపిస్తుంటాయి. అప్పుడు వసుధార సంతోషంతో కనిపించినా సన్నివేశం మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంది. ఈ వసుధార మీది సార్ అని వసుధార అంటే.. మనసుకు హత్తుకుంటాడు రిషి. ఇద్దరు ఆనందంతో మురిసిపోతుంటారు.

రాజీవ్ తో వసుధార పెళ్లి..

రాజీవ్ తో వసుధార పెళ్లి..

సోమవారం ఎపిసోడ్ ఇక్కడే ముగిసింది. ఇక మంగళవారం ఎపిసోడ్ లో రిషి వచ్చింది కలలో అనుకుని వసుధార బయటపడటం జరుగుతుందని అంచనా వేయవచ్చు. ఎందుకంటే తాళం వేసి ఉన్న గదిలోకి ఎవరు చూడకుండా ఎలాంటి గొడవ జరగకుండా రిషి రాలేడు. ఇక ఈ ఎపిసోడ్ లో వసుధార పెళ్లి గురించి హడావుడి జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజీవ్ కి వసుధారను ఇచ్చి పెళ్లి చేసేందుకు చక్రపాణి సిద్ధంగా ఉంటాడు. మరోవైపు వసుధార కోసం రిషి వస్తుంటాడు. అలాగే ఏం జరుగుతుందో తెలియక కంగారుగా జగతి, మహేంద్రలు వస్తుంటారు. వీళ్లందరి రాకతో రాజీవ్, చక్రపాణి ఏం చేస్తారో తెలియాల్సి ఉంది.

సోమవారం నాటి ఎపిసోడ్ లో..

సోమవారం నాటి ఎపిసోడ్ లో..

రిషి ముహుర్తం టైమ్ కన్నా ముందే వచ్చేస్తాడేమో అని రాజీవ్ కు కంగారుగా చెబుతుంటాడు చక్రపాణి. నేను వసుతో మాట్లాడి వస్తానంటాడు రాజీవ్. రాజీవ్ రావడంతో వసుధార విసుక్కుంటుంది. కాసేపట్లో మనిద్దరం భార్యాభర్తలం కాబోతున్నాం. ఇంకా బావా ఏంటీ.. ప్రేమగా ఏవండి అని పిలువు అంటాడు. మర్యాదగా బయటకు వెళ్లు బావా అని వసుధార అంటుంది. దీంతో నువ్ రిషి సార్ చట్టాపట్టాలు వేసుకుని తిరిగినవీ, నాకు దొరికినవి రికార్డ్ చేసి పెట్టాను. అంతేకాకుండా ప్రెస్ వాళ్లకు మీడియా వాళ్లకు కొన్ని కాపీలు కూడా పంపించాను. నన్ను పెళ్లి చేసుకోను అంటే మీడియా వాళ్లు ఇంటి దగ్గరికి వస్తారు. వాళ్లు వస్తే మీ నాన్న పరువు పోతుంది. అప్పుడు మీ నాన్న ఉరి వేసుకుని చస్తాడు. మీ నాన్న పోతే మీ అమ్మ ఏం చేస్తుంది. ఆమె కూడా చనిపోతుంది అని రాజీవ్ బెదిరిస్తాడు.

రిషి, జగతి మేడమ్ ను చంపుతా..

రిషి, జగతి మేడమ్ ను చంపుతా..

నువ్వు చాలా ఎక్కవ మాట్లాడుతున్నావ్ అని వసుధార అంటుంది. నీకు భయం లేదని, ధైర్యం ఎక్కువని నాకు తెలుసు అంటూ జేబులో నుంచి గన్ బయటకు తీస్తాడు రాజీవ్. ఆ గన్ను వాడాలాని డిసైడ్ అయ్యానని అంటాడు. చివరిసారిగా ఎప్పుడు వాడానో తెలుసా. ఒకరోజు మీ జగతి మేడమ్ ని షూట్ చేశారు కదా.. అది ఎవరో కాదు నేనే. ఇప్పుడు కూడా నాతో పెళ్లికి ఒప్పుకోకుంటే.. రిషి సార్ ని, జగతి మేడమ్ ని, మహేంద్ర సార్ ని, ఆ తర్వాత మీ అమ్మా నాన్నని చంపేస్తానని బెదిరిస్తాడు రాజీవ్. దీంతో షాక్ అయిన వసుధార అద్దం ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత జగతి ఇచ్చిన నల్ల పూసలు తీసుకుంటుంది. అప్పుడే రిషి వచ్చినట్లు, మెడలో నల్ల పూసలు వేసినట్లు చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X