twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: వసుధార దగ్గరకు రిషి, టెన్షన్ లో మహేంద్ర-జగతి.. వసుకి దేవయాని మనీ ఆఫర్!

    |

    రిషి ఒక చోట కూర్చుని వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. అసలు ఏం జరగనట్టు అలా ఎలా మాట్లాడుతున్నావ్. నన్ను అంతగా బాధించి నీకేమి పట్టనట్లు, నువ్వేం చేయనట్టు మాట్లాడుతున్నావ్. నీకు అది ఎలా సాధ్యమవుతుంది. ఇలా ఎందుకు చేశావ్. నువ్వు నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తావని ఎప్పుడు అనుకోలేదు. అన్ని మాటలు చెప్పి.. అన్నీ జ్ఞాపకాలు అందించి చివరికీ నీ ఇష్టం అన్నావ్. ఆ ఇష్టం నీదైనప్పుడు అందులో నేను ఎందుకు లేను. నువ్వు నిజంగా నన్ను ఇష్టపడలేదా? ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జనవరి 30 సోమవారం నాటి తాజా ఎపిసోడ్‌ 673లో ఇంకా ఏం జరిగిందంటే?

    ఇలా ఎందుకు చేశావ్..

    ఇలా ఎందుకు చేశావ్..

    వసుధార గురించి, తను అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతుంటాడు రిషి. అందమైన జ్ఞాపకాలు అందించావ్. అవి జ్ఞాపకాలుగా మిగిలిపోయేందుకేనా. నాకు ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశావ్. రిషి, వసుధార వేర్వేరు కాదు.. రిషిధార అన్నావ్. మరి ఇప్పుడు చేసింది ఏంటీ. ప్రిన్స్, జెంటిల్ మెన్, ఎండీ అన్నావ్. మరి ఇలా ఎందుకు చేశావ్. నేను ఇలా ఉండాల్సిందేనా.. లేదు. అన్ని మర్చిపోవాలి అని అనుకుంటూ కుమిలిపోతుంటాడు రిషి. మరోవైపు వసుధార, ఆమె తండ్రి చక్రపాణి ఇంటికి రావడం గురించి మాట్లాడుకుంటారు మహేంద్ర-జగతి. వసుధార వాళ్ల నాన్న మన ఇంటికి వస్తే ఏం మాట్లాడలేకపోయాం. అసలు తను ఎందుకు వచ్చాడో తెలుసుకోవాల్సిందని మహేంద్ర అంటాడు.

     ఆ అలవాటు ఇంకా పోలేదా..

    ఆ అలవాటు ఇంకా పోలేదా..

    మహేంద్ర అన్నదానికి తనతో మాట్లాడటానికి ఏం లేదు. దేవయాని అక్కయ్య చూస్తే ఇంకా పెద్ద గొడవ అయ్యేది. అందుకే త్వరగా పంపించేశాం అని జగతి అంటుంటే.. అప్పటిదాకా వీళ్లిద్దరి మాటలు విన్న దేవయాని చప్పట్లు కొడుతూ ఎంట్రీ ఇస్తుంది. చాటుగా ఉండి మా మాటలు వింటున్నారా అని మహేంద్ర అంటే.. ఇంకా అలవాటు మీకు పోలేదా అక్కయ్య అని జగతి అంటుంది. మీరు అన్న మాటలే కదా విన్నది.. లేనివి సృష్టించట్లేదు కదా. చక్రపాణి.. అదే వసుధార వాళ్ల నాన్న వస్తే మీరు పంపించేస్తారా.. ఎలాంటి వివరాలు తెలుసుకోకుండా చేశారా అని దేవయాని అంటుంది. తర్వాత జగతి-మహేంద్రలను ఇద్దరిని ఇష్టం వచ్చినట్లు మాటలు అంటుంది దేవయాని. రిషి గురించి మీకు ఎలాంటి బాధ్యత లేదు. మీకు మీరు ఇద్దరు ఉంటే చాలు అంటూ తెగ మాటలు అంటుంది దేవయాని.

    రిషి జీవితం పర్సనల్ కాదా..

    రిషి జీవితం పర్సనల్ కాదా..

    మీ వల్లే రిషి బతుకు ఇలా అయింది. సాక్షిని ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తే మీరు రిషి మనసు మార్చేశారు. తర్వాత వసుధారను ఎరగా వేశారు. రిషిని పెంచింది, పోషించింది నేనే. రిషి భవిష్యత్తు కోసం ఆలోచించేది నేనే అని అంటుంది దేవాయని. రిషి ఎక్కడ.. ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తున్నారా అని నిలదీస్తుంది దేవయాని. ఎక్కడికి వెళ్లిన మీరు చేతులు పట్టుకుని ఉంటారు అని దేవయాని అంటే.. మా పర్సనల్ విషయాల గురించి మాట్లాడటం బాగాలేదు అక్కయ్య అని జగతి అంటుంది. రిషి జీవితం పర్సనల్ కాదా. రిషి పర్సనల్ జీవితాన్ని పట్టించుకోరా అని దేవయాని అంటే.. రిషి అక్కడ ఉంటేనే ప్రశాంతంగా ఉంటాడు అని మహేంద్ర అంటాడు. రిషిని ఎలాగైనా ఇంటికి తీసుకోస్తానంటూ కాల్ చేస్తుంది. కానీ రిషి ఫోన్ లిఫ్ట్ చేయడు. తర్వాత రిషిని అడ్డుపెట్టుకుని చేయాల్సింది అంతా చేస్తా అని వెళ్లిపోతుంది దేవయాని.

    మనల్ని ఎవరూ విడదీయలేరు..

    మనల్ని ఎవరూ విడదీయలేరు..


    రిషిని ఎలాగైనా ఇంటికి తీసుకొస్తానని వెళ్లిపోతుంది దేవయాని. అక్కయ్య వెళ్లి రిషి మనసు డిస్ట్రబ్ చేయకముందే మనం వెళ్దామని జగతి, మహేంద్రలు కూడా బయులుదేరతారు. మరోవైపు తండ్రి చక్రపాణికి వసుధార భోజనం వడ్డిస్తుంటుంది. కాలం మనల్నీ దూరం చేసింది. మనల్ని ఇంకెవరూ విడదీయలేరు అని చక్రపాణి అంటుంటే.. అటునుంచి దేవయాని అడుగుపెడుతుంది. దేవయానిని చూసి వసుధార షాక్ అవుతుంది. దేవయాని ఎవరో తెలియని చక్రపాణి అలా చూస్తుండిపోతాడు. ఏంటీ వసుధార నేను ఇలా వస్తానని ఊహించలేదా.. నేను రిషి పెద్దమ్మ దేవయానిని..
    తనను పెంచి.. పెద్ద చేసింది నేనే అని చెబుతుంది దేవయాని.

    చెక్ తీసుకుని వెళ్లి..

    చెక్ తీసుకుని వెళ్లి..

    మేడమ్ మీరా.. రండి కూర్చొండి అని చక్రపాణి అంటే.. నేను మీ మర్యాదల కోసం రాలేదు. రిషి ఎక్కడ అని వసుధారను అడుగుతుంది దేవయాని. రిషి సర్ గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారు అని వసుధార అంటుంది. జరిగినవన్నీ మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని దేవయాని అంటే.. నాకు కూడా అని వసుధార అంటుంది. వెరీ గుడ్ వసుధార. నువ్వు ఏం చేశావో.. నీకు మాత్రమే తెలుసు.. మళ్లీ ఎందుకు వచ్చావో నాకు అర్థం కావడం లేదు అని దేవయాని అంటుంది. రిషి సర్ కి, నాకు అర్థం అయితే చాలు అని వసుధార అంటుంది. ఇదే తగ్గించుకుంటే మంచిది. ఈ బ్లాంక్ చెక్ తీసుకుని ఊరు వదిలి వెళ్లిపో అని దేవయాని అంటుంది. నేను ఎందుకు వెళ్లాలి అని వసుధార అంటే.. పెళ్లి చేసుకుని మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చావ్. పైగా గౌతమ్ ఇంట్లో ఉంటున్నారు. అసలు రిషిని ఏం చేద్దామని అనుకుంటున్నారు అని దేవయాని అడుగుతుంది.

    చాలా సమస్యలకు మీరే కారణం..

    చాలా సమస్యలకు మీరే కారణం..

    అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నారు అని చక్రపాణి నిజం చెప్పబోతుంటే.. అది ఆపి.. ఏం అనుకోకుండా లోపలికి వెళ్లండి నాన్నా అని పంపించివేస్తుంది వసుధార. ఒక చెక్ మీద సంతకం పెట్టి వెళ్లిపోమ్మంటే నేను ఎలా వెళ్తాను. వచ్చిన దారిలోనే వెళ్లిపోండి. ఇంతకన్నా మర్యాదగా చెప్పలేను అని వసుధార అంటుంది. రిషికి దూరంగా వెళ్లిపో.. ఈరోజుతో సమస్యకు పుల్ స్టాప్ పెడదాం అని దేవయాని అంటుంది. చాలా సమస్యలకు మీరే కారణం. మీరు సమస్యల గురించి మాట్లాడకపోతేనే బెటర్ అనేసి చెక్ చేతిలో పెడుతుంది. దేవయానికి అదే చెక్ ఇచ్చి తండ్రి పిలుస్తుంటే అక్కడికి వెళ్తుంది వసుధార. మరోవైపు రిషి కోసం జగతి-మహేంద్ర వెళ్తారు. రిషి, దేవయాని లేరని ఆలోచిస్తుంటే.. మహేంద్రకు వసుధార ఫోన్ చేస్తుంది.

    వసుధార దగ్గరికి రిషి..

    వసుధార దగ్గరికి రిషి..


    వసుధార కాల్ చేస్తుంది అని జగతితో మహేంద్ర చెబుతుంటే.. అప్పుడే వచ్చిన రిషి.. అది వింటాడు. డాడ్ ను కూడా ఇబ్బంది పెడుతుందా వసుధార అనుకొని ఫోన్ తీసుకుంటాడు. అటు నుంచి ఫోన్ లో.. సర్.. దేవయాని మేడమ్ ఇక్కడికి వచ్చారు. ఏదేదో మాట్లాడుతున్నారు. గొడవ చేస్తున్నారు. మీరు ఒకసారి ఇక్కడికి రండి అని చెబుతుంది వసుధార. ఆ మాటలు విన్న రిషి.. తండ్రి మహేంద్రకు చెబుతాడు. వసుధార దగ్గరికి రిషి వెళ్తుంటే మేము కూడా వస్తామని చెబుతారు మహేంద్ర. కానీ రిషి ఒక్కడే వెళ్తాడు. మరోవైపు.. నీకు మీ నాన్నకు టికెట్స్ బుక్ చేస్తాను వెళ్లిపోండి అని దేవయాని అంటుంది. ఆ చెక్ చింపి విసిరికొడితే కానీ బయటకు వెళ్లరా మేడమ్ అని వసుధార అంటుంది.

    English summary
    Guppedantha Manasu Serial January 30 2023 Today Full Episode 673
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X