twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: దేవయానికి షాక్ ఇచ్చిన రిషి.. మళ్లీ విడగొట్టకండని అంటూ మహేంద్ర!

    |

    వసుధార ఉన్న ఇంటికి వెళ్లి గొడవ చేస్తుంది దేవయాని. రిషిని వదిలిపెట్టి వెళ్లమని చెక్ బుక్ ఇస్తుంది. ఆ చెక్ బుక్ లో ఇష్టం వచ్చినంతగా డబ్బు రాసుకొమ్మని ఆఫర్ ఇస్తుంది దేవయాని. నీకు మీకు నాన్నకు టికెట్స్ బుక్ చేస్తాను ఎక్కడికైనా వెళ్లిపోండి. లేదా ఇద్దరికి కలిపి ఏసీ కారు బుక్ చెస్తా.. కనిపించకుండా వెళ్లిపోండి అంటూ మాట్లాడుతుంది దేవయాని. మేడమ్.. ఆ చెక్ ను చింపి ఆ ముక్కలను విసిరి కొడితే గానీ మీరు ఇక్కడి నుంచి వెళ్లరా. నేను మీకంటే గట్టిగా అరవగలను. మీకంటే మొండి దాన్ని. పెద్దవాళ్లు అని గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. వెళ్లిపోండి అని అంటుంది వసుధార. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జనవరి 31 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్‌ 674లో ఇంకా ఏం జరిగిందంటే?

    నేను బెదిరించాలనుకుంటే..

    నేను బెదిరించాలనుకుంటే..

    వసుధార వెళ్లిపోండి అని అన్నదానికి.. వెళ్లిపో.. వెళ్లిపో అంటున్నావ్.. ఇది గౌతమ్ ఫ్లాట్. అంటే రిషికి సంబంధించిందే కదా అని దేవయాని అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన చక్రపాణి.. మేడమ్ ఇది రిషి సార్ ఇచ్చింది కదా అని అంటాడు. నీకు భయం లేదనుకున్నాను.. సిగ్గు కూడా లేకుండా ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా అని దేవయాని అంటుంది. మేడమ్ అని గట్టిగా అరిచిన వసుధార.. మేడమ్ ఇది అఫీషియల్ గా వచ్చినప్పుడు ఎవరిదైతే నాకేంటి. మీరు మీ భాషను మార్చుకోండి అని అంటుంది. ఏంటీ బెదిరిస్తున్నావా అని దేవయాని అంటే.. నేను బెదిరించాలనుకుంటే ఆ కథ వేరేగా ఉంటుంది అని వసుధార అంటుంది. మీ బంధాన్ని మొదట్లోనే తుంచేయాల్సింది అని దేవయాని అంటుంది.

    నేను చెబుతున్నా కదా..

    నేను చెబుతున్నా కదా..

    బంధాలను దూరం చేసేవారికి.. బంధాలను తుంచే వారికి బంధం విలువ గురించి ఏం తెలుస్తుంది. ఇక్కడ ఉంటే ఇంకా చాలా మాట్లాడుతాను వెళ్లిపోండి అని వసుధార అంటుంది. నిన్ను వెళ్లగొడతాను.. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అని నీకు తెలుసు.. అని దేవయాని అంటుండగా ఇంతలో రిషి వస్తాడు. రిషి సార్ రండి అని చక్రపాణి అంటే.. కొంచెం సంశయించినా రిషి లోపలికి వస్తాడు. రిషి రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది దేవయాని. అలాగే కంగారుపడతుంటుంది. పెద్దమ్మా మీరు ఇక్కడ ఏంటీ అని రిషి అడుగుతాడు. దీనికి సర్ ఏదో చెక్ ఇచ్చి అంటూ వసుధార చెబుతుంటే.. నేను చెబుతున్నా కదా వసుధార అని అంటుంది దేవయాని.

    పెద్దమ్మ వల్ల ఇబ్బంది..

    పెద్దమ్మ వల్ల ఇబ్బంది..

    తను ఇక్కడ ఉండటమేంటీ.. గౌతమ్ ఫ్లాట్ కదా అని రిషితో దేవయాని అంటుంది. అవన్నీ మీకెందుకు.. తను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్. తనకు ఒక సౌకర్యాలు సమకూర్చే బాధ్యత మనది. అందుకే ఈ ఫ్లాట్ ఇచ్చాం అని రిషి అంటాడు. అప్పుడు దేవయాని ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే.. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలియదు.. ఏం మాట్లాడారో కూడా తెలియదు. కానీ ఇదంతా ప్రేమ వల్ల వచ్చిన సమస్య. అదే పెద్దమ్మకు నాపై ఉన్న ప్రేమ వల్ల వచ్చిన సమస్య అని చెబుతాడు రిషి. తర్వాత పెద్దమ్మ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి అని చేతులు జోడించి క్షమాపణలు చెబుతాడు రిషి. అయ్యో మీరు క్షమాపణలు చెప్పడం ఏంటీ అన్నట్లుగా చూస్తాడు చక్రపాణి. అనంతరం దేవయానిని తీసుకుని తన ఇంటికి వెళ్లేందుకు కారు ఎక్కుతాడు.

     నీకు పేగు బంధం తెలియదు..

    నీకు పేగు బంధం తెలియదు..

    రిషి వెళుతుండగా.. సార్ కు నాపై ప్రేమ ఉంటే వెనక్కి తిరిగి చూస్తారు అని వసుధార అనుకుంటుంది. అప్పుడు రిషి వెనక్కి తిరిగి చూడటంతో వసుధార చాలా సంతోషపడుతుంది. మరోవైపు హాల్లో మహేంద్ర-జగతి-ధరణి ఎదురుచూస్తూ ఉండగా రిషి, దేవయాని వస్తారు. రిషిని చూసి జగతి-మహేంద్ర సంతోషిస్తారు. వదిన మంచి నీళ్లు ఇవ్వండి అని ధరణిని అడుగుతాడు రిషి. అప్పుడు దేవయాని.. ధరణి చాలా రోజుల తర్వాత రిషి ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుంది.. మంచి వంటకాలు సిద్ధం చేయు అంటుంది. తర్వాత చూశారా రిషిని ఇంటికి ఎలా తీసుకొచ్చానో.. నీకు పేగు బంధం తెలియదు అని జగతిని అంటుంది. ఎందుకు వదినా ఇలా మాట్లాడుతున్నారు అని మహేంద్ర అంటాడు. అయ్యో నేను ఏమన్నాను.. మీరు మాట్లాడిందే కదా చెప్పాను అని దేవయాని అంటుంది.

    వసుధారను ఏం అనకండి..

    వసుధారను ఏం అనకండి..

    కాసేపు మౌనంగా ఉండిపోయిన రిషి.. మీరు ఇంకోసారి వసుధార ఫ్లాట్ కి వెళ్లకండి పెద్దమ్మా.. వసుధారను కలవకండి.. అటువైపు ఎవరు వెళ్లకండి అని ప్రాధేయపడతాడు రిషి. ఇంత జరిగిన తర్వాత నువ్వు వసుధారకు ఫ్లాట్ కీ ఎందుకు ఇచ్చావ్ అని దేవయాని అంటే.. పదే పదే వసుధార టాిక్ తీసి రిషిని ఎందుకు బాధపెడుతున్నారు అని జగతి అంటే.. బాధపెట్టడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా.. వసుధారను తీసుకొచ్చి.. రిషికి చనువు పెరిగేలా చేసి ఇలా అంటున్నావా అని దేవయాని అంటుంది. దీంతో పెద్దమ్మా.. అవన్నీ మాట్లాడే ఓపిక నాకు లేదు. మీకు మళ్లీ చెబుతున్నాను వసుధారను ఏం అనకండి.. తను నా ఒక్కడి బాధ అని చెప్పి వెళ్లిపోతాడు రిషి. తర్వాత మహేంద్ర-జగతి ఇద్దరు వచ్చి దేవయానికి థ్యాంక్స్ చెబుతారు. రిషిని ఇంటికి తీసుకొచ్చినందుకు సంతోషం.. కానీ మా ముగ్గురిని మళ్లీ విడగొట్టకండి అని మహేంద్ర చెప్పి వెళ్లిపోతాడు. అక్కయ్య ప్లీజ్ అని జగతి అని వెళ్లిపోతుంది.

    ఆ పాపంలో నాకు భాగముంది..

    ఆ పాపంలో నాకు భాగముంది..

    మరోవైపు రిషితో గడిపిన క్షణాలు, నెమలి ఈకలు, గోలీలు, రిషి వాచ్ చూసుకుంటూ మాట్లాడుకుంటుంది వసుధార. మనమంతా కలిసి మాట్లాడుకునే రోజు ఆనందంగా ఉండే రోజు ఎప్పుడొస్తుంది. ఈ పొగరుని మళ్లీ ఎప్పుడు పొగరు అని పిలుస్తారు సార్ అనకుంట తాళి చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార. ఇంతలో తండ్రి చక్రపాణి వస్తాడు. బాధపడుతున్నావా అమ్మా అని చక్రపాణి అంటే.. ఎదురుచూస్తున్నాను అని వసుధార అంటుంది. రిషి సార్ మాటల్లో నీపై ఆకాశమంతా ప్రేమ ఉందమ్మా.. రిషి కళ్లల్లో నీపై ఉన్న ప్రేమను చూశాను. రిషి సార్ గురించి చెప్పినప్పుడే నేను విని ఉంటే ఇక్కడిదాకా వచ్చేది కాదమ్మా. ఆ పాపంలో నాకు భాగముంది అని చక్రపాణి అంటాడు. నాన్న ప్రేమను ఎవరు గెలిపించాల్సిన అవసరం లేదు.. ప్రేమ తనను తాను గెలిపించుకుంటుంది అని వసుధార అంటుంది.

     వేరొకరి భార్య గురించి..

    వేరొకరి భార్య గురించి..

    రిషి సార్ కు నిజం చెప్పొచ్చు కదమ్మా అని చక్రపాణి అంటే.. లేదు నాన్నా రిషి సారే తెలుసుకోవాలి.. నేను చెబితే చెవులు మాత్రమే వింటాయి. అదే రిషి సార్ తెలుసుకుంటే.. మనసు కూడా వింటుంది అని వసుధార అంటుంది. మరోవైపు తన గదిలో పేపర్లపై రిషిధార అని రాసి.. అందులో ధార అనే పదంపై రాంగ్ మార్క్ వేస్తాడు రిషి. అవన్నీ రిషి ముందు చెల్లాచెదురుగా పడి ఉంటాయి. నా జీవితంలోకి వచ్చిన నా మనసుని, నా ఆనందాన్ని అన్నింటిని రంగులమయం చేశావు.. అవన్నీ జ్ఞాపకాలుగా మార్చి వెళ్లిపోయావు అని అనుకుంటాడు రిషి. అంతలోనే.. వసుధార మెడలో తాళీ, వసుధార నా భార్య అని రాజీవ్ అన్న మాటలు తలుచుకుని.. వేరొకరి భార్య గురించి నేను ఆలోచించకూడదు అని అనుకుంటాడు రిషి.

    English summary
    Guppedantha Manasu Serial January 31 2023 Today Full Episode 674
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X