Guppedantha Manasu: అనేక మలుపులతో ఎపిసోడ్.. బాధతో ఇంటికి రిషి, రాజీవ్ ను చంపేస్తానంటూ వసుధార!

వసుధార ఇంటికి రిషి, జగతి-మహేంద్రలు వచ్చేస్తారు. వసుధార చేయి పట్టుకుని వెళ్లిపోదామని రిషి అంటే వసుధార అడుగు ముందుకు వేయదు. దీంతో రిషి షాక్ అవుతాడు. జగతి-మహేంద్రలు అలానే చూస్తూ ఉండిపోతారు. వాళ్లందరిని తన బావ రాజీవ్ ఎక్కడ చంపేస్తాడో అని భయంతో రిషిని వెళ్లిపోమ్మంటుంది వసుధార. ఏం అర్థం కానీ రిషి.. వసుధారను బతిమిలాడతాడు. నన్ను వెళ్లిపోమ్మంటున్నావా అని బాధతో అడుగుతాడు. తర్వాత వసుధార గట్టిగా అరిచి చేతులతో దండంపెట్టి వెళ్లిపోమ్మనడంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు రిషి వాళ్లు. మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జనవరి 5 తాజా ఎపిసోడ్‌ 652లో ఇంకా ఏం జరిగిందంటే?

వసుధార మెడలో తాళి చూసి..

వసుధార మెడలో తాళి చూసి..

వసుధార మాటలు తలుచుకుంటూ బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. తర్వాత వసుధార వసుధారను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు బావ రాజీవ్. వసుధార మెడలో తాళి కట్టేందుకు వెళతాడు రాజీవ్. ఇంతలో వసుధార మెడలో నల్లపూసలు చూసి షాక్ అవుతాడు రాజీవ్. వాటిని తెంపి అయినా తాళి కడతానంటాడు. నాకు పెళ్లయిందని చెప్పిన వినవేంటి అని వసుధార అంటే.. నాకు ఒకసారి పెళ్లయింది.. నీకు ఒకసారి అయింది.. లెక్క సరిపోయింది కదా అని అంటాడు రాజీవ్. నాన్న బావ ఒక దుర్మార్గుడు అని వసుధార తండ్రి చక్రపాణికి చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. సుమిత్ర కూడా అవునండీ అంటే.. నువ్ నోరు మూయు అని సుమిత్రను బెదిరిస్తాడు చక్రపాణి.

చక్రపాణికి దెబ్బ తగలడంతో..

చక్రపాణికి దెబ్బ తగలడంతో..

రిషి సార్, నా తల్లిదండ్రుల ప్రాణాలు ముఖ్యం నాకు.. నా ప్రాణాలు కాదు అని రాజీవ్ నిజస్వరూపం బయట పెడతానంటుంది వసుధార. ఏదో తప్పించుకోవడానికి వాగుతుందని రాజీవ్ అంటాడు. నీ బండారం బయట పెడతానని వసుధార అంటే.. నీ తాళి తెంపి నా తాళి కడతానని రాజీవ్ అంటాడు. వసుధారపైకి రాజీవ్ వెళితే.. మధ్యలో చక్రపాణి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఆ పెనుగులాటలో చక్రపాణి పక్కకు వెళ్లి కుర్చీకి బలంగా తాకుతాడు. దీంతో అతనికి దెబ్బ తగలడంతో కిందపడిపోతాడు. బావ దగ్గరకి వస్తే చంపేస్తానని పూలు, పళ్లాలు అన్ని విసిరేస్తుంటుంది వసుధార.

జైలుకు వెళ్లే అవకాశం..

జైలుకు వెళ్లే అవకాశం..

తర్వాత చేతిలోకి దీపం కుంది చేతిలోకి తీసుకుంటుంది. ఇదంతా చూస్తుంటే గురువారం నాటి ఎపిసోడ్ లో రాజీవ్ ను వసుధార చంపేస్తుందని అర్థమవుతోంది. తర్వాత రాజీవ్ గురించి తెలిసి, పరిస్థితి అర్థమై చక్రపాణి మారినట్లయితే ఆ నేరం తనపై వేసుకుని జైలుకు వెళతాడు. లేదంటే నేరం చేసిన కారణంగా వసుధారనే జైలుకు వెళ్లే అవకాశం ఉంది. అనంతరం వసుధారను రిషి విడిపించుకుని తీసుకుని రావొచ్చు. తర్వాత పెళ్లి చేసుకుంటే.. దేవయానితో వసుధారకు వార్ స్టార్ట్ అయ్యేలా ఎపిసోడ్ ప్లాన్ చేసి ఉండొచ్చు. మరి తర్వాత ఏం జరుగుతుంతో తెలియాలంటే గురవారం ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

బుధవారం నాటి ఎపిసోడ్ లో..

బుధవారం నాటి ఎపిసోడ్ లో..

వసుధార ఇంటికి వచ్చిన రిషి పెళ్లి బట్టల్లో ఉన్న వసుధారను చూసి కంగారుపడతాడు. ఏం జరుగుతోంది వసుధార.. మనం వెళ్లిపోదాం అని అడుగుతాడు. తర్వాత జగతి, మహేంద్ర వస్తారు. వాళ్లు వచ్చనట్లుగా రాజీవ్ మాట్లాడుతూ చేతితో గన్ చూపిస్తూ వసుధారను భయపెడతాడు. చేతిసైగలతో గన్ లా చూపిస్తూ మాట్లాడు వసుధార అంటాడు. మళ్లీ రా వెళదాం వసుధార అంటూ చేయి పట్టుకుంటాడు రిషి. రిషి చేయిని విసిరికొట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అరుస్తుంది. నన్ను వెళ్లిపోమ్మంటావా.. మనిద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం కదా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం కదా నిన్ను ఎవరైనా బెదిరించారా అని అడుగుతాడు రిషి. అయినా వసుధార ఏం మాట్లాడకుండా రిషి చేయిని దూరంగా నెట్టేస్తుంది.

మెడపట్టి గెంటించేలా ఉంది..

మెడపట్టి గెంటించేలా ఉంది..

వసుధారకు జగతి-మహేంద్ర నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తారు. అయినా వినదు వసుధార. దీంతో జగతి కోపంతో.. వసుధార చేయి పట్టుకుని పిచ్చి పట్టిందా వసుధార. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావ్.. ఈ పెళ్లేంటి.. నువ్వు పెళ్లి కూతురుగా రెడీ అవ్వడం ఏంటి.. నీ పెళ్లి గురించి మాట్లాడటానికే కదా రమ్మన్నావ్. ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావ్. ఏమైంది అని అడుగుతుంది. మహేంద్ర కూడా.. ఏంటమ్మా ఇది అని అడిగితే.. ఇది మా ఇంటి సమస్య మీరు వెళ్లిపోండని అంటుంది వసుధార. దీంతో వెళ్దాం పద జగతి.. లేకపోతే మేడం మెడపట్టి గెంటించేలా ఉంది అని వెళ్లిపోతారు.

ఒక తాళి ఉండగా..

ఒక తాళి ఉండగా..

తర్వాత రాజీవ్, చక్రపాణి ఇద్దరూ సంతోషపడుతూ ఉంటారు. అనంతరం పెళ్లి పీటలపైకి వసుధార వస్తుంది. మాంగళ్య ధారణ జరిపించండి అని రాజీవ్ అంటే.. పంతులు గారు ఒక చిన్న సందేహం.. ఒక మంగళ సూత్రం ఉన్న తర్వాత కూడా మరొక మంగళసూత్రం కడతారా అని అడుగుతుందు వసుధార. వసుధార మెడలో తాళి చూసి అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. రెండు తాళి బొట్లు ఏంటమ్మా.. ఏం మాట్లాడుతున్నారు అని పంతులు అంటే.. అదే మాట ఇ పెళ్లి కొడుక్కి చెప్పండి అని అంటుంది వసుధార. అప్పుడే తాళి తెంచేస్తా అని అంటాడు రాజీవ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X