Don't Miss!
- News
Varahi Yatra : పవన్ వారాహి యాత్ర అక్కడి నుంచే ? రఘురామ హింట్ !
- Finance
SBI: భారీగా పడిపోయిన ఎస్బీఐ షేర్లు.. అదానీ కారణంగానే..!
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- Sports
INDvsNZ : చూస్తున్నావా సాయిబాబా?.. టీమిండియాపై పేలుతున్న మీమ్స్!
- Automobiles
మరింత అందంగా మారిపోయిన జావా 42 & యెజ్డీ రోడ్‌స్టర్: ఇవి తప్పకుండా మీ మనసు దోచేస్తాయ్..
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Guppedantha Manasu: షాకింగ్ ట్విస్టులు.. జైల్లో వసుధార, ఆస్పత్రిలో తల్లిదండ్రులు.. దేవయానికి వార్నింగ్!
తల్లిదండ్రులను చంపే ప్రయత్నం చేసిందన్న కారణంగా వసుధార పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. వసుధార పోలీస్ స్టేషన్ లో ఉందని తెలిసి కంగారుగా వస్తాడు రిషి. వసుధారతో మాట్లాడతానని ఎస్సైతో చెబుతాడు. మీరెవరని ఎస్సై అడగడంతో నా పేరు రిషీంద్ర భూషణ్.. వసుధార నేను ప్రేమించుకున్నాం అని చెబుతాడు రిషి. దీనికి అది నువ్వేనా.. చూస్తే చదువుకున్నోడిలా, సౌండ్ పార్టీలా ఉన్నావ్ అని అంటాడు ఎస్సై. ఇంతలో రాజీవ్ వచ్చి రిషిని రెచ్చగొడతాడు. దీంతో రాజీవ్ కాలర్ ను రిషి పట్టుకుంటాడు. అది చూసి నా ముందే నీ దౌర్జన్యం ఏంటని ఎస్సై అంటాడు. మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జనవరి 6 తాజా ఎపిసోడ్ 653లో ఇంకా ఏం జరిగిందంటే?

వసుధారను బతిమిలాడిన రిషి..
రిషిని
వారిస్తాడు
ఎస్సై.
చూడాలని
వచ్చినవాడివి
చూసి
వెళ్లు
అని
కోప్పడతాడు
ఎస్సై.
తర్వాత
వసుధార
దగ్గరికి
వెళ్లి
ఏమైంది
అని
అడుగుతాడు
రిషి.
నువ్వు
జైళ్లో
ఉండటం
ఏంటి
వసుధార..
ఒకసారి
ఇటు
చూడు
అంటూ
బతిమిలాడుతాడు
రిషి.
అయినా
రిషి
వంక
చూడదు
వసుధార.
అలా
లాకప్
దగ్గర
వసుధారను
రిషి
బతిమిలాడుతుంటుండగా..
మహేంద్ర,
జగతి
వస్తారు.
వాళ్లు
పోలీస్
స్టేషన్
లోకి
ఎంటర్
కాగానే..
రిషి
అమ్మా
నాన్న
అని
ఎస్సైకి
చెబుతాడు
రాజీవ్.
దీంతో
సరిపోయింది
అనుకుంటూ
వెళ్లిపోతాడు
ఎస్సై.
మహేంద్ర-జగతి
కూడా
వసుధార
దగ్గరికి
వెళ్లి
మాట్లాడేందుకు
ప్రయత్నిస్తారు.

తాళి చూసి ఒక్కసారిగా రిషి షాక్
వసుధార ఏమైంది అని ఎంత అడిగినా వసుధార చెప్పదు. తర్వాత వెళ్లిపోండి రిషి సార్ అని అంటుంది వసుధార. దీంతో విసిగిపోయిన రిషి ఏంటి.. వెళ్లిపోయేది.. ఎక్కడికి వెళ్లను.. వచ్చింది వెళ్లిపోవడానికా అని అరుస్తాడు రిషి. ఇంతలో రాజీవ్ కలగజేసుకునే సరికి కోపంతో రాజీవ్ పైకి వెళ్తాడు రిషి. ఇద్దరు కొద్దిసేపు నెట్టుకుంటారు. అది చూసి వెళ్లిపోమ్మని చెప్పాను కదా అని గట్టిగా అరుస్తూ రిషి వైపుగా తిరుగుతుంది వసుధార. అప్పుడు వసుధార మెడలో తాళి కనపిస్తుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు రిషి. మెల్లిగా వసుధారవైపుకు వెళ్లి తాళిని చూస్తాడు. ఇంతలో జగతి ఈ తాళి అని అడిగితే.. నేను కట్టలేదు ఆ తాళి అని కోపంగా అరుస్తాడు రిషి. ఆ తాళికి నాకు ఎలాంటి సంబందం లేదు అని బాధతో అంటాడు రిషి. మరోవైపు వసుధారకు తాళి రిషి కట్టకుంటే ఇంకెవరు కట్టారు.. కనిపెడితే.. అవకాశాలు నాకు చాలా ఉన్నాయి అని అనుకుంటాడు రాజీవ్.

మీ సంతోషం ఎక్కువ ఉండదు..
వసుధార జైల్లో కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి దేవయాని వస్తుంది. వసుధార దగ్గరికి వెళ్లిన దేవయాని.. ఏంటీ వసుధార.. భూషణ్ ఫ్యామిలీలోకి కోడలిగా రావాల్సిన దానివి ఖైదీగా పోలీస్ స్టేషన్ కి వచ్చావ్. ఇక జన్మలో రిషి నీ మొహం చూడడు. నీ బతుక్కీ మీ బావే దిక్కు అని అంటుంది. మేడమ్ మీరు సంతోషపడుతున్నారు. కానీ మీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు. మరింత పొగరు పెరిగిన వసుధారను చూస్తారా అని వసుధార అంటుంది. దానికి వెటకారంగా చూస్తూ వెనక్కి తిరిగి వెళ్లిపోతుంది దేవయాని. అప్పుడు చిటికెలు వేసి దేవయానిని పిలుస్తూ మేడమ్ త్వరలో కలుద్దాం అని షాక్ ఇస్తుంది వసుధార.
గురువారం ఎపిసోడ్ లో..
వసుధార మెడలో తాళి తెంపి తన తాళి కట్టేందుకు ప్రయత్నిస్తాడు రాజీవ్. దీపం కుందీ పట్టుకుని రాజీవ్ ను చంపేస్తా అని బెదిరిస్తుంది వసుధార. మధ్యలో సుమిత్ర ఆపుతుంటుంది. ఇంతలో సుమిత్రను వసుధారచేత పొడిపిస్తాడు రాజీవ్. మరోవైపు పక్కకు దెబ్బ తగిలి చక్రపాణి ఉంటాడు. కట్ చేస్తే వసుధార జైలు గొడల మధ్య ఉంటుంది. మరోవైపు హోటల్ గదిలో వసుధార మాటలు తలుచుకుంటూ ఆలోచనలో పడిపోతాడు రిషి. ఎవరో తనను బెదిరించి అలా మాట్లాడించారు. అవి వసుధార మాటలు కాదు. నేను బాధపడేలా వసుధార ఏ పని చేయదు. దీని వెనుక ఏదో కుట్ర ఉంది అని అనుకుంటాడు రిషి. వసుధారకు కాల్ చేస్తాడు రిషి. దీంతో వసుధార జైల్లో ఉన్న విషయం తెలుస్తుంది. అటువైపు ఎస్సైకి మొత్తం కథలో విలన్ వీడే సార్.. నా భార్య వసుధారను మభ్యపెట్టింది వీడే అని అవి ఇవీ చెబుతాడు రాజీవ్. ఇంతలో పోలీస్ స్టేషన్ కు రిషి, మహేంద్ర-జగతి వెళతారు.