Guppedantha Manasu: వసు కోసం మాటిచ్చిన రిషి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన జగతి-మహేంద్ర.. ఫణీంద్ర వార్నింగ్
రిషి వెళ్లిపోవడానికి అసలు కారణం శైలేంద్ర, దేవయాని అని తెలియడంతో జగతిని ఇన్నేళ్లు అన్న మాటలను తలుచుకుంటూ బాధపడుతుంటాడు మహేంద్ర. జగతి రాగానే సారీ చెప్పి హగ్ చేసుకుంటాడు మహేంద్ర. రిషిపై ప్రేమతో నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నిజం తెలిసిన క్షణం నుంచి నా గుండె తట్టుకోలేకపోతుంది. నువ్వు ఇన్నాళ్లు ఎలా ఉన్నావ్. ఎలా భరించావ్. ఎవరికీ చెప్పకుండా నీలోనే ఎంత వేదన అనుభవించావ్ అని మహేంద్ర అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూలై 1 శనివారం నాటి ఎపిసోడ్ 804 లో ఇంకా ఏం జరిగిందంటే?
ఆ బాధ లేదు: పరిస్థితులు పెట్టే పరీక్షలను తట్టుకోవాలి. వాటికి ఎదురు తిరిగి ఎదుర్కొవాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లగలం అని జగతి అంటుంది. ఇంత ధైర్యం ఏంటీ జగతి. చిన్నప్పుడే రిషిని వదిలేసినందుకు అమ్మా అనే పిలుపు కోసం తపించిపోయావ్. ఇప్పుడిలా చేశావ్. ఇక ఎప్పటికీ అమ్మా అని రిషి పిలవడేమో అని మహేంద్ర అంటాడు. లేదు మహేంద్ర. రిషి నన్ను అమ్మా అని పిలిచాడని చెప్పిన విషయాన్ని చెబుతుంది జగతి. వరం ఇచ్చినట్లే ఇచ్చి.. ఇలా శిక్షించి వెళ్తాడని అనుకోలేదు అని జగతి అంటుంది. బాధపడకు జగతి రిషి నిన్ను అర్థం చేసుకుంటాడు అని మహేంద్ర అంటాడు. నా గురించి బాధ లేదు. వసు వద్దని చెబుతున్నా.. అబద్ధపు సాక్ష్యం చెప్పించి వాళ్లిద్దరిని విడగొట్టాను. ఇప్పుడు ఇద్దరూ ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో అని జగతి అంటుంది.

కంపరంగా ఉంది: జగతి నీకో విషయం చెప్పాలి. వసుధార వాళ్ల అమ్మగారు చనిపోయారు అని మహేంద్ర అంటే.. తెలుసు. ఈ విషయం నీకు చెప్పి బాధపెట్టడం ఎందుకని చెప్పలేదు అని జగతి అంటుంది. వసు, రిషి ఒకే కాలేజీలో లెక్చరర్స్ గా పనిచేస్తున్నారు. కానీ వసుపై రిషికి ఇంకా కోపం తగ్గలేదు. గతం లేదు గుర్తు చేయడానికి ప్రయత్నించకు అని రిషి అంటున్నాడట. ఇదంతా చక్రపాణి గారు చెప్పారు అని మహేంద్ర చెబుతాడు. రిషికి కోపం తగ్గాలి. మళ్లీ వాళ్లు ఇంటికి రావాలి. డీబీఎస్టీ కాలేజీ బాధ్యతలు చేపట్టాలి అని జగతి అంటుంది. నా కొడుక్కి కీడు చేయాలనుకున్న ఈ మనుషుల మధ్య ఉండాలంటే కంపరంగా ఉంది జగతి. వాళ్లలా నటిస్తూ ఉండలేను. నా ఆవేశానికి ఏదో ఒక రోజు అన్నయ్యకు చెప్పిన చెప్పేస్తాను. మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అని మహేంద్ర అంటాడు.

మాటిచ్చిన రిషి: నీ ఇష్టం మహేంద్ర. నువ్వు ఏది చెబితే అది చేస్తాను అని జగతి అంటే.. అన్నయ్య ఇంట్లో లేడు. ఉంటే వెళ్లనివ్వడు. ఇప్పుడే వెళ్లిపోదాం అని మహేంద్ర అంటాడు. మరోవైపు ఏంజేల్, విశ్వనాథం ఇద్దరు ఏదో ఫంక్షన్ కోసం బయటకు వెళ్తారు. వెళ్లేముందు వసుధారకు, రిషికి చెబుతారు. రిషి పట్టించుకోడు. కానీ నువ్వే పట్టించుకోవాలి. పిలిస్తే పలుకుతాడు అని వసుకు చెబుతుంది ఏంజెల్. రిషి దగ్గరికి వెళ్లి నేను, తాతయ్య ఫంక్షన్ కు వెళ్తున్నాం. నువ్ నాకొక మాట ఇవ్వాలి అని రిషి వద్ద మాట తీసుకుంటుంది ఏంజెల్. మేము వచ్చేంతవరకు వసుని నువ్వే చూసుకోవాలి అని ఏంజెల్ అనడంతో రిషి షాక్ అవుతాడు. తర్వాత సరే అవసరం వస్తే చూసుకుంటాను అని రిషి మాట ఇస్తాడు. మరోవైపు సూట్ కేస్ లు పట్టుకుని హాల్లోకి దిగుతారు మహేంద్ర, జగతి. అది చూసి దేవయాని, శైలేంద్ర షాక్ అవుతారు.

డౌట్ ఎందుకు: జగతి ఇద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని దేవయాని అడిగితే.. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తామని మినిస్టర్ గారికి మాటిచ్చాం కదా. అందుకు అని జగతి చెబుతుంది. మళ్లీ ఎప్పుడొస్తారంటే ఇక మళ్లీ రాం వదినా. మనకు సాయంగా ఉన్న వాళ్ల మధ్యలో ఉంటే మంచిది కదా. అదే మిషన్ ఎడ్యుకేషన్ పనులను సవ్యంగా చేయగలం అని మహేంద్ర అంటాడు. సరే మీ అన్నయ్య వచ్చాకా వెళ్లండి అని దేవయాని అంటే.. అన్నయ్యకు నేను కాల్ చేసి చెబుతాను అని మహేంద్ర అంటాడు. తర్వాత వెళ్లేటప్పుడు ధరణిని చూసి.. జాగ్రత్తమ్మా అని చెప్పి వెళ్లిపోతారు మహేంద్ర, జగతి. దీంతో అదేంటీ బాబాయ్ నీకు జాగ్రత్తలు చెబుతున్నాడని ఆవేశంగా శైలేంద్ర అంటాడు. అయినా వాళ్లకు జాగ్రత్తలు చెప్పకూడదా.. దీంట్లో డౌట్ పడటానికి ఏముంది అని ధరణి వంటగదిలోకి వెళ్లిపోతుంది.

ఎందుకొచ్చారు: ఏంటీ మమ్మీ బాబాయ్ కి నిజం తెలిసిపోయిందా అని శైలేంద్ర అంటే.. నువ్వేం అలాంటి అనుమానాలు పెట్టుకోకు. ఒకవేళ నిజం తెలిస్తే మహేంద్ర ఇలా సైలెంట్ గా ఉండడు. రచ్చ చేస్తాడు. మనల్ని నిలదీస్తాడు. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అని దేవయాని అంటుంది. ఇంతకాలం భర్త ఫారెన్ లో ఉంటే ఎప్పుడొస్తాడా అని అనుకునేదాన్ని. ఇప్పుడు ఎందుకు వచ్చారా అనిపిస్తుంది. పదవి కోసం ఇంత నీచానికి దిగజారుతురా. ఆయన, అత్తయ్య అసలు మనుషులోనా అని మనసులో అనుకుంటుంది ధరణి. ఇంతలో వచ్చిన ఫణీంద్ర కోర్టులో తీర్పు ఫేవర్ గా వచ్చిందని సంతోషంగా చెబుతూ మహేంద్రను పిలుస్తాడు. ధరణి వచ్చి చిన్నత్తయ్యా, చిన్న మావయ్య ఇంట్లోంచి వెళ్లిపోయారు అని చెబుతుంది.
స్ట్రాంగ్ వార్నింగ్: అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది. జగతి వెళ్లిపోయింది. వచ్చింది. అంతా కలిసి హ్యాపీగా ఉండొచ్చనుకుంటే రిషి వెళ్లిపోయాడు. ఇప్పుడు వీళ్లు వెళ్లిపోయారు ఏంటీ దేవయాని అని ఫైర్ అవుతాడు ఫణీంద్ర. రిషిపై నింద వేసింది ఎందుకో చెప్పమంటే జగతి చెప్పదు. అసలు రిషి వెళ్లిపోవడానికి కారణం మీకు తెలుసా అని ఫణీంద్ర గద్దిస్తాడు. దీంతో శైలేంద్ర, దేవయాని షాక్ అయి తమకు తెలియదని చెబుతాడు. ధరణి నీకైమైనా తెలుసా అంటే.. అది మావయ్య అని చెప్పబోతుండగా.. నాకే తెలియదు. ఇక నీకు తెలిసే ఛాన్సే లేదు అని ఫణీంద్ర అంటాడు. ఒకవేళ వాళ్లు వెళ్లిపోడానికి కారణం మీరు అని తెలిస్తే ఊరుకోను. మీరు నా కోపం చూల్లేదు. చూస్తే తట్టుకోలేరు అని గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు ఫణీంద్ర.
కల నెరవేరుతుంది: ఫణీంద్ర వెళ్లగానే ధరణిపై శైలేంద్ర ఫైర్ అవుతాడు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా నీకు అని వారిస్తాడు శైలేంద్ర. దీంతో నాది మట్టి బుర్ర కదా అండి. ఎప్పుడెలా ఉండాలో తెలియదు. నిజం చెప్పడం మాత్రమే తెలుసు అని ధరణి కౌంటర్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఇప్పుడు మీ నాన్న మహేంద్ర దగ్గరకు కోపంగా వెళ్లారు కదా. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవ పడొచ్చు. ఇద్దరూ విడిపోవచ్చు. అప్పుడు కాలేజీ మన సొంతం అవుతుంది. ఒకవేళ కలిస్తే.. జగతి, మహేంద్ర ఇంటికి వస్తారు. అప్పుడు అనుక్షణం గమనిస్తూ వాళ్ల పనికి అడ్డుతగలొచ్చు. మన కల నెరవేరుతుంది అని దేవయాని అంటుంది.


Click it and Unblock the Notifications











