Guppedantha Manasu: షాకింగ్.. వసు ముందే రిషికి ఏంజెల్ లవ్ ప్రపోజల్.. జగతికి శైలేంద్ర వార్నింగ్

పవర్ ఆఫ్ స్టడీస్ సెమినార్ గురించి విశ్వనాథం ఇంట్లో ఆన్ లైన్ చర్చిస్తారు. రిషి ఐడియాలు, వసుధార చెప్పిన పాయింట్స్ విని ప్రిన్సిపాల్ చాలా బాగున్నాయి అని చెబుతాడు. అక్కడే కూర్చుని అదంతా చూస్తూ ఉంటుంది ఏంజెల్. డిస్కషన్ అయిపోయాక.. చూశావా వసుధార మా రిషి ఎలా ఇంప్రెస్ చేశాడో అని అంటుంది.

మాట్లాడేది తక్కువే అయినా అందరినీ తనవైపుకు లాక్కుంటాడు. సెమినార్ ఇంట్లోనే కండక్ట్ చేయడానికి ఒప్పించాడు అని ఏంజెల్ అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూలై 10 సోమవారం నాటి ఎపిసోడ్‌ 811లో ఇంకా ఏం జరిగిందంటే?

Guppedantha Manasu Serial July 10 2023 Today Full Episode 811

లవ్ చేయలేదా: అందరి ఒప్పించడమే కాదు.. ఆన్ లైన్ లోనే పవర్ ఆఫ్ స్టడీస్ టాపిక్ చెప్పి అందరు ఒప్పుకునేలా చేశాడు అంటూ తెగ పొగడుతుంది ఏంజెల్. అవును ఏంజెల్. రిషి సార్ చాలా గ్రేట్. జెంటిల్ మెన్ అని వసుధార అంటుంది. ఇలాంటి పొగడ్తలు నాకు నచ్చదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని రిషి అంటాడు.

అవును, నాకొక డౌట్.. రిషి నువ్వు చాలా చార్మ్ గా అందంగా ఉంటావ్ కదా. ఇప్పటివరకు నిన్ను ఎవరు లవ్ చేయలేదా అని ఏంజెల్ అడుగుతుంది. దీంతో వసుధార, రిషి షాక్ అవుతారు. అప్పుడు వసుధార తనకు ప్రపోజ్ చేసిన విషయం గుర్తు తెచ్చుకుంటాడు రిషి. సరే మరి నువ్వు ఎవరిని లవ్ చేయలేదా అని మళ్లీ అడుగుతుంది ఏంజెల్.

Guppedantha Manasu Serial July 10 2023 Today Full Episode 811

లక్కీ ఎవరు లేరు: వసుధారకు తను ప్రపోజ్ చేసిన విషయం గుర్తు చేసుకంటాడు రిషి. ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా అని రిషి టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఏంజెల్ వినదు. నువ్వు చెప్పు వసుధార. రిషి బాగుంటాడా లేదా అని అడుగుతుంది ఏంజెల్. వసుధార సిగ్గు పడుతూ బాగుంటాడని చెబుతుంది. ఇంతలో ఐలవ్యూ రిషి అని ఏంజెల్ అంటుంది. ఏంజెల్ రిషికి అలా ప్రపోజ్ చేసిందేంటని రిషి, వసుధార ఒక్కసారిగా ఉలిక్కిపడతారు.

తర్వాత ఐ లవ్యూ రిషి అని ఎవరు నీకు చెప్పలేదా అని ఏంజెల్ అనడంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా.. అసలే చాలా పనులు ఉన్నాయని రిషి అంటాడు. ఏది ఏమైనా రిషి నిన్ను చేసుకునే అమ్మాయి ఎవరో కానీ, ఈ ప్రపంచంలోనే తనంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు అని చెప్పిన ఏంజెల్ అవసరం అయితే నన్ను పిలవండి అని చెబుతుంది.

Guppedantha Manasu Serial July 10 2023 Today Full Episode 811

ఏమైనా ప్లాన్: ఈ బోరింగ్ పర్సన్ కు లవ్ తెలియదు. కాఫీ, టీ అవసరం అయినా నన్ను పిలవండని చెప్పి వెళ్లిపోతుంది ఏంజెల్. రిషి సార్ కు ప్రేమ తెలియకపోవడమా. పిచ్చి ఏంజెల్. తను వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ అని మనసులో అనుకుంటుంది వసుధార. ఏం ఆలోచిస్తున్నావ్ అని వసుధారను రిషి అడిగితే.. ఏం లేదు అంటుంది. తను అడిగితే అలా చెప్పాలా అని రిషి అంటాడు. అంటే చెప్పకపోతే మళ్లీ ఏం కఠినంగా అడుగుతుందో అని వసుధార అంటుంది.

అబద్ధాలు చెప్పడం అలవాటే కదా. అడిగినప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి దాన్ని ఆపేయొచ్చు కదా అని రిషి అంటే వసుధార బాధ పడుతుంది. మరోవైపు జగతి, మహేంద్ర స్టే చేస్తున్న హోటల్ దగ్గర ఉంటాడు శైలేంద్ర. అసలు ఇక్కడికి వీళ్లు ఎందుకు వచ్చారు. కాలేజీ బాధ్యతలు అప్పగించకుండా పిన్నీ ఏమైనా ప్లాన్ చేస్తుందా అని ఆలోచిస్తుంటాడు.

జాగ్రత్తగా ఉండండి: హోటల్ మహేంద్ర చాలా టైడ్ అయ్యాం పడుకుందాం అని అంటాడు. నిద్ర పడుతుందా. రిషి మళ్లీ నన్ను అమ్మలాగా చూస్తాడా. నేను చేసిన తప్పుకు వసు ప్రేమను పోగొట్టుకుంది. తల్లిని కోల్పోయింది. ఇంతకుముందులా నాతో మాట్లాడుతుందా అని జగతి బాధపడుతుంది. రిషి ఏదో ఒక రోజు తప్పుకుండా అర్థం చేసుకుంటాడని మహేంద్ర చెబుతాడు.

ఇంతలో జగతికి శైలేంద్ర కాల్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతాడు. ఒకవేళ ఏదైనా హోటల్ లో స్టే చేస్తే జాగ్రత్తగా ఉండండి. బాబాయ్ కు కూడా జాగ్రత్తలు చెప్పండి. అసలే కారు స్పీడ్ గా డ్రైవ్ చేస్తాడు కదా. డ్రైవ్ చేసేటప్పుడు వెనుక ముందు చూసుకోమ్మను. రేపు నేను కాలేజీకి వెళ్లాలా అని శైలేంద్ర అంటాడు.

లైట్ వేసి: ఏం వద్దు బావగారికి అన్ని చెప్పాను. ఆయన చూసుకుంటారు అని చెప్పి కాల్ కట్ చేసి జగతికి శైలేంద్ర మీద అనుమానం వస్తుంది. మేం ఇక్కడ దిగినట్లు మాట్లాడుతున్నాడేంటి అని అనుకుంటుంది జగతి. మరోవైపు రిషి అలసిపోయి ల్యాప్ ట్యాప్ పైన పెట్టుకుని పడుకుంటాడు. వసుధార ఎంత పిలిచినా లేవడు.

దీంతో దిండు, దుప్పటి తెచ్చి కప్పి వసు వెళ్లిపోతుంటే.. థ్యాంక్యూ ఏంజెల్ అని రిషి అంటాడు. దీంతో కొద్దిగా అప్సెట్ అయిన వసుధార వెళ్లి తన గదిలో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత కొద్దిసేపటికి మెళకువ వచ్చి లేచిన రిషి ల్యాప్ ట్యాప్ లేదేంటి.. ఏంజెల్ తీసి ఉంటుంది అనుకుంటాడు. వసు గదిలో లైట్ వేసి ఉండటంతో వెళ్లి చూస్తాడు. ఏంటీ ఇంకా వర్క్ చేస్తున్నారా అని రిషి అంటాడు.

మిస్ అయినట్లు: మీరు అలసిపోయి నిద్రపోయారు. అందుకే పూర్తి చేస్తున్నాను అని వసుధార అంటుంది. ఇదంతా ఎవరినీ ఇంప్రెస్ చేయడానికి అని రిషి అంటే.. ఎవరి కోసం కాదు. నాకు పవర్ ఆఫ్ స్టడీస్ కాన్సెప్ట్ బాగా నచ్చి చేస్తున్నాను. ఇంట్రెస్ట్ తో చేస్తున్నాను అని అంటుంది. ఎవరు చేస్తే ఏంటే సార్ మీరు ఆపేసిన పనిని నేను పూర్తి చేశాను అని వసు అంటుంది.

మరుసటి రోజు ఉదయం రిషి సార్ సెమినార్ లో మాట్లాడటం, చిరు నవ్వు ఎలాగైనా చూడాలి అనుకుంటుంది వసుధార. విశ్వనాథం దగ్గరికి వెళ్లి నాకు మాట ఇవ్వాలని తీసుకుంటుంది వసుధార. సెమినార్ కు నేను కూడా వస్తాను. ఇక్కడే ఉంటే మిస్ అయినా ఫీలింగ్ కలుగుతుంది అని వసు అంటే.. నాకు తెలుసు నువ్వు నాకోసమే వస్తున్నావని రిషి మనసులో అనుకుంటాడు. ఏం చేద్దాం రిషి అని విశ్వనాథం అడుగుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X