Guppedantha Manasu: రిషి జాగ్రత్తలు, ఏంజెల్ బలి.. వసుధారను చూసేసిన శైలేంద్ర
విశ్వనాథం, రిషి కాలేజీకి బయలుదేరుతుంటే వసుధార వచ్చి తాను కూడా వస్తానంటుంది. గాయాలు ఇంకా నయం కాలేదు. వద్దు అని రిషి అంటాడు. సెమినార్ మిస్ అయితే నాకు చాలా భారంగా ఉంటుంది అని వసుధార అంటుంది. సరే రానిద్దం రిషి. సెమినార్ కోసం అంత వర్క్ చేసింది. రాకుంటే మనసు బాగోదు అని విశ్వనాథం అంటాడు. సరే అనుకున్న రిషి ఏంజెల్ ను కూడా వెంట రమ్మనమని చెబుతాడు. ఏంజెల్ ఎందుకని విశ్వనాథం అడిగితే.. వసుధారకు ఏమైనా అవసరం ఉన్నా, మధ్యలో సమస్య అయనా ఏంజెల్ తో వస్తుంది అని రిషి అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూలై 11 మంగళవారం నాటి ఎపిసోడ్ 812లో ఇంకా ఏం జరిగిందంటే?
నాకెందుకు:ఏంజెల్ ను విశ్వనాథం పిలిచి కాలేజీకి రమ్మని చెబుతాడు. కాలేజీ బోరింగ్. నేను రాను. అయినా వసుధారను రిషి చూసుకుంటాడుగా అని ఏంజెల్ అంటుంది. రమ్మంటుంది రిషినే అని విశ్వనాథం అనడంతో.. తప్పదా అని అన్న ఏంజెల్ చివరికీ ఒప్పుకుంటుంది. అంతా కలిసి కారులో కాలేజీకి బయలుదేరుతారు. దారిలో వసుధారకు కాలు నొప్పి రాకుండా ఉండేందుకు ఏంజెల్ ద్వారా రిషి జాగ్రత్తలు చెబుతాడు. చదునైన నేలపైనే అడుగు పెట్టాలి అని పెద్ద లిస్ట్ చెబుతాడు. ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావ్. వసుధార పక్కనే ఉందిగా. తనకే చెప్పు. అయినా వసుధారతో మాట్లాడేందుకు నీకున్న ఇబ్బంది ఏంటని ఏంజెల్ అడుగుతుంది.

నువ్వు అడుగు:రిషి, వసుధార ఏం మాట్లాడకుండా ఉండిపోతారు. మళ్లీ రిషి జాగ్రత్తలు మొదలు పెట్టడంతో.. కారు ఆపమని చెబుతుంది ఏంజెల్. వసుధారను వెళ్లి ముందు సీట్లో, విశ్వనాథాన్ని వచ్చి వెనుక సీట్లు కూర్చోమంటుంది. ఇక్కడ ఎక్కువసేపు కూర్చుంటే వసుధారకు తిమ్మిర్లు వస్తాయి. అదే ముందు సీట్లో అయితే రిలాక్స్ గా కూర్చోవచ్చని చెబుతుంది. దీంతో వసుధార, విశ్వనాథం సీట్లు మార్చుకుంటారు. ఇక ఇప్పుడు చెప్పు వసుధారకు జాగ్రత్తలు. నీ పక్కనే ఉందిగా అని ఏంజెల్ అంటుంది. రిషి ఏం మాట్లాడకపోయే సరికి తనేం మాట్లాడడు వసుధార నువ్వు మాట్లాడు. టిఫిన్ చేశావా అని అడుగు అంటుంది ఏంజెల్. దీంతో అలాగే అడుగుతుంది. రిషి కూడా ఏంజెల్ చెప్పడంతో తిన్నాను అని అంటాడు.

పాండ్యన్ తో:ఏం టిఫిన్ చేశారు అని వసుధారతో అడిగిస్తుంది ఏంజెల్. దోశెలు అని రిషి అంటాడు. ఎన్ని తిన్నాడో అడుగు వసుధార అని ఏంజెల్ అంటే... ఎన్ని తిన్నారు. నాలుగు తిన్నారా అని వసు అమాయకంగా అడుగుతుంది. దీంతో పద్నాలుగు తిన్నాను అని రిషి అంటాడు. ఏంజెల్ ఒక్కసారిగా నవ్వుతుంది. ఇలా ఈ సీన్ కామెడీగా సాగుతుంది. మరోవైపు కాలేజీలో కేడీ బ్యాచ్ అంతా సెమినార్ పనులు చూసుకుంటారు. ఒకప్పుడు చెడగొట్టేవాళ్లం, ఇప్పుడు దగ్గరుండి పనులు చేస్తున్నాం అని మాట్లాడుకుంటారు. కాలేజీలోకి రిషి వాళ్లు వస్తారు. ఏర్పాట్ల గురించి పాండ్యన్ తో ఆరా తీస్తారు. రిషి చెప్పిన జాగ్రత్తలను వసుధారకు చెబుతూ సెటైర్లు వేస్తుంది ఏంజెల్. తర్వాత ఆడిటోరియంకు వెళ్తారు.

ఇన్వెస్టిగేషన్ కాదు:ప్రిన్సిపాల్ తో సెమినార్ సక్సెస్ గురించి మాట్లాడుకుంటారు. ఇంతకీ ఎవరెవరు వస్తున్నారని రిషి అడిగితే.. పేర్లు బయటకు చెప్పొద్దన్నారు. వాళ్లకు పబ్లిసిటీ ఇష్టం లేదోమో అని ప్రిన్సిపాల్ అంటాడు. మళ్లీ వసుధారకు జాగ్రత్తలు చెబుతాడు రిషి. ఏంజెల్ నువ్వు మేడమ్ పక్కనే ఉండు అని రిషి అంటాడు. వసుధార రాకముందు ఒకలా ఉన్నావ్.. వచ్చిన తర్వాత రకారకాలుగా కనిపిస్తున్నావ్. మీ ఇద్దరూ మాట్లాడుకోరు. కానీ మీ మధ్య ఏదో బాండింగ్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఏంటా రిలేషన్ అని ఏంజెల్ అడుగుతుంది. దీంతో షాక్ అవుతారు రిషి, వసుధార. ఇది ఇన్వెస్టిగేషన్ టైమ్ కాదు. సెమినార్ టైమ్ అని చెబుతాడు రిషి. కేడీ బ్యాచ్ తో రిషి ఏర్పాట్ల గురించి మాట్లాడుతుంటే.. కేడీ బ్యాచ్ మంచిగా ఉండటాన్ని చూసి విశ్వనాథం మురిసిపోతాడు.

కన్ఫర్మ్:అదంతా రిషి వల్లే అని వసు అంటే.. కాదు నీ వల్లే నాకు తెలిసింది. నేను రిషికి చెప్పాను. ఆ క్రెడిట్ నీక్కూడా దక్కుతుంది అని విశ్వనాథం అంటాడు. అదే కాలేజీకి శైలేంద్ర వస్తాడు. కారు ఆపి పిన్నీ బాబాయ్ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు. బాబాయ్ కి పిన్ని నిజం చెప్పేసిందా. వీళ్లిద్దరు కలిసి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అనుకుంటాడు. ఇంతలో కాల్ వస్తుంది. వాళ్లిద్దరు అదే కాలేజీకి వస్తున్నారని కన్ఫర్మ్ గా చెబుతాడు. దీంతో మాస్క్ పెట్టుకుని కాలేజీలోకి వెళ్తాడు. అది చూసిన పాండ్యన్ ఎవరని అడిగితే.. గెస్ట్ గా వచ్చానని చెబుతాడు శైలేంద్ర. మరి మాస్క్ ఏంటని అడిగితే.. కఫ్ ఉందంటాడు. ఆడిటోరియం అటువైపు ఉందని పాండ్యన్ చెప్పడంతో వెళ్తాడు శైలేంద్ర.

శైలేంద్ర షాక్:ఆడిటోరియంలో వసుధారను చూసి షాక్ అవుతాడు శైలేంద్ర. అంటే బాబాయ్ పిన్నీ తనను కలిసేందుకు వస్తున్నారా. వసుధారను కలుస్తున్నారంటే ముగ్గురు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారో. వాళ్లు వచ్చేవరకు వెయిట్ చేసి వీళ్ల ప్లానేంటో తెలుసుకోవాలి అని శైలేంద్ర అనుకుంటాడు. మరోవైపు కారులో కాలేజీకి వస్తుంటారు జగతి, మహేంద్ర. రిషి ఎలా రియాక్ట్ అవుతాడో అని జగతి టెన్షన్ పడుతుంటే.. మనం రిషి కోసం వచ్చినట్లు తెలియకూడదు. ఏదో క్యాజువల్ గా కలిసినట్లు ఉండాలి అని మహేంద్ర అంటాడు.


Click it and Unblock the Notifications











