Guppedantha Manasu: శైలేంద్రకు ఫీజులు ఎగిరే సీన్.. రిషిని మళ్లీ చంపించేందుకు ప్లాన్

కాలేజీలో పవర్ ఆఫ్ స్టడీస్ ఏర్పాట్లు జరుగుతుంటాయి. గెస్టులు వస్తున్నారు అని రిషికి ప్రిన్సిపాల్ చెబుతాడు. అలాగే విశ్వనాథంకు చెబుతాడు. అది విని వసుధార లేస్తుంటే.. మేడమ్ మీరెక్కడికి.. గెస్టుల దగ్గరికి వచ్చి.. మళ్లి ఇక్కడికి రావాలి. అంత అవసరం లేదు. వెల్ కమ్ చెప్పడమే కదా. మేము చెబుతాం మీరు ఇక్కడే ఉండండి అని రిషి అంటాడు. మళ్లీ వసుధార నడిస్తే ఎక్కడా కాలికి పెయిన్ వస్తుందో అని బాస్ చెబుతున్నారు అని ఏంజెల్ అంటుంది. వసుధార మేడమ్ మీరు ఇక్కడే ఉండండి.. ఏంజెల్ మేడమ్ మీరు రండి అని ప్రిన్సిపాల్ అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూలై 12 బుధవారం నాటి ఎపిసోడ్‌ 813లో ఇంకా ఏం జరిగిందంటే?

తెలిసిన వ్యక్తిలా:ప్రిన్సిపాల్ అన్నదానికి.. నేను ఎందుకులేండి. ఇక్కడే ఉండి వసుధారకు కంపెనీ ఇస్తాను అని ఏంజెల్ అంటుంది. అంతా బుకెలు పట్టుకుని బయటకు వెళ్తారు. అది చూసి మొహం దాచుకుంటాడు శైలేంద్ర. అంతా బయటకు వెళ్తున్నారేంటీ. పిన్ని బాబాయ్ వస్తున్నట్లు ఉన్నారు. మరి వసుధార ఇక్కడే ఎందుకు ఉంది అనుకుని శైలేంద్ర కూడా బయటకు వెళ్తాడు. కాలేజీ బయట అంతా ఎదురుచూస్తుంటారు. రిషిని దూరం నుంచి చూసిన శైలేంద్ర.. ఆ క్యాప్ పెట్టుకున్నతను ఎవరు. బాగా తెలిసిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు అని దగ్గరకు వెళ్లి చూద్దాం అనుకుంటాడు. కానీ అంతలోనే కారు వస్తుంది. కారులో పిన్ని బాబాయ్ వస్తున్నారనుకుని ఆగిపోతాడు శైలేంద్ర.

Guppedantha Manasu Serial July 12 2023 Today Full Episode 813

జగతి కన్నీళ్లు:కారు వస్తున్నప్పుడే రిషి కాస్తా అయోయంగా ఫేస్ పెడతాడు. ఇంతలో కారు దిగి రిషిని చూసి అలాగే నిల్చుండిపోతారు జగతి, మహేంద్ర. కొద్దిసేపటి తర్వాత రిషి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్లిన జగతి ప్రేమగా హగ్ చేసుకుంటుంది. మహేంద్ర పిలుస్తున్నా పట్టించుకోకుండా కన్నీళ్లతో బాధపడుతుంది. ఇంతకాలానికి నిన్నుచూస్తాను అనుకోలేదు నాన్నా. నిన్ను చూశాకా నా ప్రాణం కుదుటపడింది. నేను చేసింది తప్పే. ఈ అమ్మను క్షమిస్తావా. మళ్లీ అమ్మా అని పిలుస్తావా అని జగతి అనడంతో.. చుట్టూ ఉన్న వాళ్లంతా షాక్ అవుతారు. అమ్మనా అని పాండ్యన్ అంటాడు. రిషి మాత్రం ఇబ్బందిగా మొహం పెడతాడు. ఇంతలో జగతి అని మహేంద్ర పిలవడంతో ఊహనుంచి బయటకు వస్తుంది జగతి.

గుర్తుపట్టలేకపోయాను:రిషిని హగ్ చేసుకోవడం, అమ్మా అని పిలవమనడం అంతా జగతి ఊహించుకుంటుంది. రిషివైపు మహేంద్ర, జగతి ఆప్యాయంగా నడుస్తారు. అది చూసిన శైలేంద్ర.. వీళ్లేంటి ఇంత ఎమోషనల్ అవుతున్నారు అనుకుంటాడు. ఇక ప్రిన్సిపాల్ అందర్నీ పరిచయం చేస్తాడు. ఈయన రిషి.. మ్యాథ్స్ లెక్చరర్ అని అనగానే శైలేంద్రకు ఫీజులు ఎగిరిపోతాయి. వీడు రిషినా. వీళ్లొస్తే కానీ గుర్తు పట్టలేకపోయాను. ఇందుకా పిన్నీ బాబాయ్ లు ఎమోషనల్ అయ్యారు అని శైలేంద్ర షాక్ లో ఉంటాడు. కళ్లు నిమురుకుంటూ మరి చూస్తాడు. ఇక జగతికి బొకే ఇచ్చి వెల్ కమ్ చెబుతాడు రిషి. ఇక్కడ కేజీఎఫ్ బీజీఎమ్ తో తల్లికొడుకుల ప్రేమను ఎస్టాబ్లిష్ చేస్తారు.

Guppedantha Manasu Serial July 12 2023 Today Full Episode 813

చాలా బ్రిలియెంట్:అంతా లోపలికి వెళ్తుంటే రిషి మాత్రం బయటకు వెళ్లిపోతుంటాడు. రిషి, జగతి ఒకరినొకరు చూసుకుంటూ ముందుకు నడుస్తుంటారు. అసలు రిషి ఇంకా బతికి ఉండటం ఏంటి. నమ్మలేకపోతున్నాను. చాలా కన్ఫూజన్ గా ఉంది అని శైలేంద్ర బిత్తరపోతాడు. ఆడిటోరియంలో జగతి, మహేంద్రలను చూసి వసుధార షాక్ అవుతుంది. వాళ్లను వసుధారకు ప్రిన్సిపాల్ పరిచయం చేస్తాడు. వసుధార మేడమ్ చాలా బ్రిలియెంట్. విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు అని ప్రిన్సిపాల్ అంటే.. ఇక్కడికి రిషి రావడానికి పరోక్షంగా సహాయపడింది వసుధారే అని విశ్వనాథం అంటాడు. రిషి బయట కూర్చుని ఆలోచిస్తుంటాడు.

ఊగిపోయిన శైలేంద్ర:రిషిని గమనించిన శైలేంద్ర.. నేను చూస్తుంది నిజమేనా. ఇన్నేళ్లు వీడి చనిపోయాడని భ్రమ పడ్డానా. నేను పొరపాటు పడ్డానా. వీడిని చంపేశామంటే డబ్బులు కూడా ఇచ్చాను. నన్ను మోసం చేశారా అనుకుంటూ రిషిని చంపడానిక వచ్చిన వ్యక్తికి కాల్ చేస్తాడు శైలేంద్ర. ఏం సార్ మూడేళ్ల నుంచి మళ్లీ ఏం చెప్పలేదు అని అతను అంటే.. అప్పట్లో చెప్పిన పని పర్ఫెక్ట్ గా చేశారా అని శైలేంద్ర అడుగుతాడు. ఆ రోజే వాడిని వేసేశాం కదా అని అతను అంటే.. వాడింకా బతికే ఉన్నాడు అని శైలేంద్ర పూనకం వచ్చినట్లు ఊగిపోతాడు. లేదు సార్ మీరు ఎవర్నో చూసి ఉంటారు. వాడు స్పాట్ డెడ్ అయ్యాడు. అంబులెన్సులో తీసుకెళ్లారు అని అతను చెబుతాడు. వాడు నా కళ్ల ముందే ఉన్నాడు అని శైలేంద్ర గట్టిగా అరిస్తే.. కనుక్కుని చెబుతా అని రౌడీ కాల్ కట్ చేస్తాడు.

Guppedantha Manasu Serial July 12 2023 Today Full Episode 813

పాండ్యన్ వెతుకులాట:బయట ఆలోచిస్తున్న రిషి.. లోపలకు వెళ్లాలా వద్దా. సెమినార్ లో మాట్లాడగలనా లేదా. నన్ను ఎందుకిలా ఇరకాటంలో పడేశావ్ దేవుడా. వాళ్లు కావాలని వచ్చారా. యాదృచ్ఛికంగా వచ్చారా. ఇప్పుడు నేను ఫేస్ చేయాలా. మోసగాళ్లు అన్నవాళ్ల ముందే మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలా. ఏదైనా కానీ, నేను స్టూడెంట్స్ కోసం ఫేస్ చేసి తీరాలి. ఇలాంటివి జరిగినప్పుడే కదా మనిషి రాటు దేలుతాడు అని రిషి అనుకుంటాడు. మరోవైపు రిషి సార్ ఎక్కడున్నారో చూడమని పాండ్యన్ కు ప్రిన్సిపాల్ చెబుతాడు. తర్వాత శైలేంద్రకు కాల్ చేసిన రౌడీ అవును సార్ వాడు బతికే ఉన్నాడట అని చెప్పగానే శైలేంద్ర ఇంకా ఫైర్ అవుతాడు.

Guppedantha Manasu Serial July 12 2023 Today Full Episode 813

రక్షణ కవచం:వాడు ఎలా బతికి ఉన్నాడో అర్థం కావట్లేదు అని రౌడీ అంటే.. నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నేను వేరే వాళ్లతో పక్కాగా ప్లాన్ చేసుకుంటా అని శైలేంద్ర అంటాడు. వేరేవాళ్లు ఎందుకు సార్. మేమే వాడిని ఫినిష్ చేస్తాం అని రౌడీ కాల్ కట్ చేస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడే వాన్ని ఏం చేయలేకపోయారు. ఇప్పుడు వాడి వాళ్లంతా వాడి చుట్టూ చేరి రక్షణ కవచంలా ఉన్నారు. ఇప్పుడు వాన్ని మీరేం చంపగలరు. ఇప్పుడు వాన్ని ఏం చేయలేరు అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X