Guppedantha Manasu: పిన్నీ నిజంగా ఆడపులే.. జగతి కొత్త ప్లాన్, కుమిలిపోయిన మహేంద్ర.. రిషిపై అతనికి డౌట్

విష్ కాలేజీకి పవర్ ఆఫ్ స్టడీస్ సెమినార్ కోసం జగతి మహేంద్ర వస్తారు. అక్కడ రిషి సెమినార్ ఇస్తాడు. దీంతో అంతా చప్పట్లు కొడతారు. తర్వాత రిషి, వసుధారలను ఇద్దరిని జగతి, మహేంద్ర శాలువా కప్పి సన్మానం చేస్తారు. అనంతరం ప్రిన్సిపాల్, విశ్వనాథం ఇద్దరు కలిసి జగతి, మహేంద్రకు కాలేజీ తిప్పి చూపిస్తారు. మీ కాలేజీ చాలా బాగుంది అని మహేంద్ర అంటాడు.

ఇలాంటి సెమినార్ వల్ల మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనంందంగా ఉందని విశ్వనాథం అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూలై 14 శుక్రవారం నాటి ఎపిసోడ్‌ 815లో ఇంకా ఏం జరిగిందంటే?

Guppedantha Manasu Serial July 14 2023 Today Full Episode 815

పిన్ని ఆడపులి: రిషి, వసుధార వంటి బ్రిలియెంట్ లెక్చరర్స్ ని సన్మానించడం మా అదృష్టం అని జగతి అంటుంది. ఇదంతా చాటుగా వింటాడు శైలేంద్ర. కోపంతో రగిలిపోతాడు. మమ్మీ నువ్ చెప్పింది నిజమే. పిన్ని ఆడపులి. కొడుకు దూరమైన ఇన్నేళ్లు ఎంతో నిబ్బరంగా ఉంది. భర్త మాట్లాకపోయిన సహనంతో ఎదురుచూసింది. ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా నిల్చుంది.

ఎంతో భయపెట్టినా ఎక్కడా జంకలేదు. మా బెదిరింపులను లెక్కచేయలేదు. చివరికీ తన కొడుకుని చూసింది. ఇంత తట్టుకుని నిలబడిన పిన్ని నిజంగా ఆడపులే అని శైలేంద్ర అనుకుంటాడు. మరోవైపు కాలేజీ నుంచి బయటకు వచ్చినా రిషి జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటాడు.

కుదురుగా ఉండవా: నేను అనుకుంది సాధించాను. ఎవరి కోసమే సెమినార్ ఇవ్వకుండా వెళ్లి ఉంటే చాలా బాధపడేవాన్ని. ఎవరికైతో దూరం కావాలనుకుంటున్నానో వాళ్ల చేతే సన్మానం చేయించుకునే పరిస్థితి వచ్చింది అని కోపంగా పూల బుకెను చెత్తకుండీలో పడేస్తాడు రిషి. ఇంతలో ఆ బుకెను వసుధార వచ్చి పట్టుకుంటుంది. పూలు ఇలా పడేయెచ్చా సార్.

ఎవరి మీద కోపంతో సున్నితమైన పూలను డస్ట్ బిన్ లో పడేయడం ఏంటీ అని వసుధార అంటుంది.నేను చెప్పానా కోపం ఉందని అని రిషి అంటే.. చెప్పాల్సిన అవసరం లేదు. తెలుస్తుంది అని వసధార అంటే.. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావ్. కుదురుగా ఓ చోటే కూర్చోమన్న కదా. స్టేజీ ఎక్కడం, దిగడం, సన్మానం చేయించుకోవడం అవసరమా. బాగానే నడుస్తున్నావ్. ఇంట్లో నటిస్తున్నావా అని రిషి అంటాడు.

హెల్ప్ చేయాలి: వాళ్లు సన్మానం చేస్తే వద్దనం లేం కదా. ఇవాళ కొంచెం బాగుంది. అందుకే నడుస్తున్నా. అంతేకానీ నటించాల్సిన అవసరం లేదు అని వసుధార అంటుంది. అసలు నిన్ను కాదు. ఏంజెల్ ని అనాలి. తనెక్కడుంది అని రిషి అడిగితే.. కారు పార్కింగ్ లో ఉందని వసు చెబుతుంది. దీంతో రిషి వెళ్లిపోతాడు. మరోవైపు ప్రిన్సిపాల్ క్యాబిన్ లో జగతి, మహేంద్ర, విశ్వనాథం మాట్లాడుకుంటారు. సెమినార్ బాగుందని జగతి అంటే.. రిషిని విశ్వనాథం, ప్రిన్సిపాల్ పొగుడుతారు.

ఈ సందర్భంగా ఓ విషయం అడుగుతాం కాదనొద్దు అని మహేంద్ర అంటాడు. మీరు సమాజం, విద్యార్థుల కోసం అడుగుతారు పర్లేదు చెప్పండి అని విశ్వనాథం అంటాడు. ఇలాంటి నాలేడ్జ్ ఉన్న లెక్చరర్స్ ఇద్దర్ని డీబీఎస్టీ కాలేజీ తరఫున మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కి హెల్ప్ చేయాలి అని జగతి అంటుంది.

మహేంద్ర షాక్: ఈ విషయం వాళ్లను అడిగి, కాలేజీ బోర్డ్ మెంబర్స్ తో మాట్లాడి మీకు చెబుతాం. మూడు నాలుగు రోజులు సమయం పడుతుంది అని విశ్వనాథం అంటాడు. ఎంత టైమ్ తీసుకున్నా పర్లేదు. వాళ్లతో మాట్లాడి మాకు చెప్పండి. మిషన్ ఎడ్యుకేషన్ మహాయాగం లాంటిది. దానికి తగ్గ అర్హులు బాధ్యతలు స్వీకరిస్తే సంతోషంగా ఉంటుంది అని జగతి అంటుంది.

ఎన్ని రోజులైన ఎదురుచూస్తామంటున్నారంటే ఈ విషయాన్ని మీరు ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతోంది. తప్పకుండా వాళ్లతో మాట్లాడతాం అని విశ్వనాథ్ హామీ ఇస్తాడు. మరోవైపు రిషి నడుస్తుంటే మహేంద్ర పిలుస్తాడు. వచ్చి రిషి భుజంపై చేయి వేస్తే.. తీసి పక్కకు అంటాడు రిషి. అది చూసి మహేంద్ర షాక్ అవుతాడు.

కన్నీళ్లతో సావాసం: రిషి నేను తండ్రిని అని మహేంద్ర అంటాడు. ఇక్కడ మనం తండ్రీకొడుకులం కాదు. కేవలం పరిచయస్తులం మాత్రమే. సెమినార్ కు వచ్చిన ఇద్దరి మధ్య ముఖ పరిచయం మాత్రమే ఉందని రిషి అంటే మహేంద్ర బాధపడతాడు. అదే మాట నా కళ్లలోకి సూటిగా చూసి చెప్పు అని మహేంద్ర అంటాడు. అది పట్టించుకోకుండా రిషి వెళ్లిపోతుంటే.. నువ్ అలా వెళ్లిపోతుంటే నా ప్రాణాలు పోతున్నాట్టున్నాయని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు.

ఆగిన రిషిని వచ్చి వెనుక నుంచి హగ్ చేసుకుంటాడు. ఇన్నేళ్లు నీకోసం ఎంతో వెతికాను. ఎంతో తపించాను. కన్నీళ్లతో సావాసం చేశాను. నేను ఏ తప్పు చేశాను. నేను చేయని తప్పుకు నాకేందుకు గుండెకోత. ఇంకా నా మీద జాలి కలగడం లేదా అని చేతులెత్తి రిషిని ప్రాధేయపడతాడు మహేంద్ర.

ఒక్క సెమినార్ తో: మీరు ఇలా చేస్తే నన్ను ఇంకా బాధపెట్టిన వాళ్లవుతారు. మీ బాధను నేను అర్థం చేసుకున్నాను. స్వయంగా చూశాను కూడా. నేను పరోక్షంగా మిమ్మల్ని బాధపెట్టుంటే ఐయామ్ వేరీ సారీ డాడ్. నేను ఓ మోసగాడిని. నేను ఇలా ఒంటరిగానే ఉండాలనుకుంటున్నా. నేను మీకు ఇలా దూరం అవుతాననుకోలేదు డాడ్ అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి.

నువ్వు ఒంటరిగా వదిలేయమని చెప్పినంతమాత్రానా ఈ తల్లిదండ్రులు ఎలా వదిలేస్తారు. నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోమని మహేంద్ర మనసులో అనుకుంటాడు. ఇక ఇంటికి వెళ్లిన రిషి, వసుధారకు దిష్టి తీయిస్తుంది ఏంజెల్. కాలేజీకి ఎన్నడూ రాని పేరు ప్రఖ్యాతలు ఈ ఒక్క సెమినార్ తో వచ్చాయి అని ప్రశంసలు కురిపిస్తాడు విశ్వనాథం.

ఇంతకుముందు చేశావా?: డీబీఎస్టీ కాలేజీ బోర్డ్ మెంబర్స్ జగతి, మహేంద్ర మన కాలేజీకి రావడం ఆశ్చర్యంగా ఉంది. అయినా వాళ్ల గురించి నువ్వు లిస్ట్ చేయలేదు అని రిషిని అడుగుతాడు విశ్వనాథం. మర్చిపోయాను సార్ అని రిషి అంటాడు. వారి కాలేజీ విధానాలు, నీ ఆలోచనకు దగ్గరగా ఉన్నాయి. ఒక్క సెమినార్ తోనే ఇంత ఆదరణ వచ్చిందంటే ఇదే నీ మొదటి సెమినారా.. ఇంతకుముందు ఇతర కాలేజీలో ఇలాంటి సెమినార్స్ కండక్ట్ చేశావా అని రిషిని అడుగుతాడు విశ్వనాథ్. దీంతో ఆలోచనలో పడిపోతాడు రిషి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X