Guppedantha Manasu: ఊహించని ట్విస్ట్.. మహేంద్రను డాడ్ అన్న రిషి.. ఒక్కో నిజం బయటకు!

సెమినార్ చాలా బాగా జరిగిందని రిషిని ఏంజెల్, విశ్వనాథం పొగుడుతారు. రిషి సెమినార్ చాలా బాగా ఇచ్చావ్. ఇదే నీ మొదటి సెమినారా.. లేకుంటే ఇదివరకు ఏదైనా కాలేజీలో ఈ టాపిక్స్ పై సెమినార్ ఇచ్చావా అని విశ్వనాథం అడుగుతాడు. దీంతో షాక్ అయిన రిషి డీబీఎస్టీ కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన సెమినార్ ఇవ్వడం గురించి గుర్తు చేసుకుంటాడు. విశ్వం అడిగితే సైలెంట్ గా ఉంటావేంటీ రిషి అని ఏంజెల్ అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూలై 15 శనివారం నాటి ఎపిసోడ్‌ 816లో ఇంకా ఏం జరిగిందంటే?

మనసులో బాధ : రిషి ఏదో చెప్పబోతుంటే.. ఎక్కడా వర్క్ చేసి ఉండడులే విశ్వం. మనం చాలా బతిమిలాడితే కానీ ఇక్కడ కాలేజీకి వెళ్లలేదు. గతంలో చేసే ఛాన్స్ ఉండి ఉండదులే అని ఏంజెల్ అంటుంది. ఇదంతా నావల్లే సార్. నేను చేసిన తప్పుకు మీరు మీలా ఉండట్లేదు. అందుకే అబద్ధాలు చెబుతున్నారు. నన్ను క్షమించండి సార్ అని మనసులో బాధపడుతుంది వసుధార. టీపాయ్ పై ఉన్న బుకెను చూసిన రిషి జగతి సన్మానం చేసింది గుర్తు చేసుకుంటాడు. ఏంజెల్ ఆ పూల బుకెను ఎక్కడైనా మూలకు పెట్టించమని పని అమ్మాయికి చెప్పవా అని రిషి అంటాడు. అంత అందమైన పూల బుకెను మూలకు పెట్టమంటావా. అవి ఎంత బాగున్నాయి. వాటితో సెల్ఫీ తీసుకుందాం అని ఏంజెల్ అంటుంది.

rishi1

నాలుగైదు గంటలు : విశ్వనాథం సెల్ఫీ తీస్తుంటే అంతా నిల్చుంటారు. రిషి నీ మూడ్ చేసి పూలు ఫీలవుతాయి. కాస్తా స్మైల్ చేయి అని ఏంజెల్ అంటుంది. అందర్ని విశ్వనాథం సెల్ఫీ తీస్తాడు. మరోవైపు ఇంటికెళ్లిన శైలేంద్ర.. రిషి బతికి ఉన్న విషయం దేవయానికి చెబుతాడు. ఏంటీ రిషి బతికి ఉన్నాడా. నువ్ సరిగా చూశావా అని దేవయాని షాక్ అవుతుంది. బతికే ఉన్నాడు. ఏదో రెండు సెకన్లు చూడలేదు మమ్మీ. నాలుగైదు గంటలు చూస్తూనే ఉన్నాను. వాడే. నాకేం సైట్ లేదు అని శైలేంద్ర అసహనంగా అంటాడు. మరి నువ్ ఎవరితో చంపించేశావ్ అని దేవయాని అడుగుతుంది. నేను కూడా అదే అనుకున్నా మమ్మీ. వాళ్లను అడిగితే కనుక్కుని వాడు బతికే ఉన్నాడని కన్ఫర్మ్ చేశారు అని శైలేంద్ర అంటాడు.

gm

నాకు చెప్పే చేయు : అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని దేవయాని అంటే.. ఏదో ఒకటి ఏంటీ మమ్మీ. రిషిని లేపేద్దాం అని శైలేంద్ర అంటాడు. ప్రతిసారి ఆవేశంగా మాట్లాడకు నాన్నా. చంపేటువంటి పనులు ఎందుకు. గోటితో పోయేది గోటితే సరిచేయాలి. గొడ్డలితో పోయేదాన్ని గొడ్డలితోనే సరిచేయాలి. నాకు అక్కడి నుంచే కాల్ చేస్తే అయిపోయేది కదా. ఇక్కడికి వచ్చి చెప్పాలా. సెమినార్ కు వెళ్లిన మహేంద్ర, జగతి ఇంకా ఇంటికి రాలేదు. అంటే అక్కడే ఉన్నారు. వాళ్లు ఏం చేస్తున్నారో కనిపెట్టు. ఇప్పటిదాకా మనం చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసేది మరో ఎత్తు. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏం చేయాలి అన్నా నాకు చెప్పే చేయాలని దేవయాని అంటుంది.

gm

గఒక గూటి పక్షులు : వాళ్లను గమనిస్తూ అనుమానం రాకుండా చూసుకో. ఇక్కడ మీ నాన్నకి, ధరణికి అనుమానం రాకుండా నేను చూసుకుంటాను అని దేవయాని అంటుంది. నాకు కంగారులో ఏం అర్థం కాకా వచ్చేశాను మమ్మీ. నువ్వు చెప్పినట్లే గమనిస్తూ ఉంటాను అని శైలేంద్ర వెళ్లిపోతాడు. విశ్వనాథం ఇంట్లోకి గెస్టులు వస్తున్నారని బెడ్ రెడీ చేస్తారు వసు, ఏంజెల్. ఎవరు వస్తున్నారు అని వసు అంటే సర్ప్రైజ్ అంటుంది ఏంజెల్. సరే నీకు ఒక క్లూ ఇస్తా. మీరంతా ఒక గూటి పక్షులు అని ఏంజెల్ చెబుతుంది. హాల్లో కూర్చున్న రిషి ఆలోచనలో పడిపోతాడు. అది గమనించిన విశ్వనాథం పిలిచి.. మన ఇంటికి గెస్టులు వస్తున్నారు అని చెబుతుంటే.. కారు సౌండ్ అవుతుంది.

gm

వసును చూసి షాక్ : కారులో నుంచి మహేంద్ర, జగతి దిగుతారు. వారిని చూసి రిషి షాక్ అవుతాడు. రిషి ఏమైనా అనుకుంటాడని మనసులో బాధపడకు, కంగారు పడకు అని జగతికి ధైర్యం చెబుతాడు మహేంద్ర. వీళ్లు రెండు మూడు రోజులు సిటీలో ఉంటామన్నారు. వీళ్లు నీకు గురువులతో సమానం అని చెప్పావ్ కదా. అందుకే ఎక్కడో ఎందుకు మన ఇంట్లోనే ఉండమని చెప్పి రమ్మన్నాను అని విశ్వనాథం అంటాడు. మీ ఇష్టం సార్ అని రిషి అంటే.. అంతా లోపలకు వెళ్తారు. గెస్టులు వచ్చారు అని ఏంజెల్ ను పిలిస్తే.. తనతోపాటు వసు వస్తుంది. వసుధారను చూసి జగతి, మహేంద్ర షాక్ అవుతారు. వసు ఇక్కడ ఉందేంటి అని మహేంద్రతో అంటుంది జగతి. నీ ఆత్మీయులను చాలా రోజుల తర్వాత కలిశావ్ కదా. ఎలా ఉంది. నీ ఆత్మీయులతో కూడా కలుపుగోలుగా ఉండవా. లేదా ఏదానా దాస్తున్నావా అని ఏంజెల్ అడుగుతుంది.

gm

యాక్సిడెంట్ వల్ల : అదేం లేదమ్మా. రిషి ముందు నుంచి అంతే. ఎవరితో ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటాడు. ఏదైనా సమస్య వస్తే సాల్వ్ చేస్తాడు అని మహేంద్ర అంటాడు. అవునండీ, అందరూ సంతోషంగా ఉండాలని ప్రతిక్షణం కోరుకుంటాడు. రిషిని కన్నవాళ్లు చాలా అదృష్టవంతులు. అందుకే గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తిని కొడుకుగా పొందారు అని విశ్వనాథం అంటాడు. నిజంగా లక్కీనే. కాని కాలం ఆడిన ఆట వల్ల నా బిడ్డ ముందు పరాయి వాళ్లల కూర్చున్నాం అని జగతి అనుకుంటుంది. వసుధారనే జగతి చూస్తుంటే.. తను మా ఇంట్లో ఉందేంటి అని చూస్తున్నారా.. తనకు చిన్న యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి మా ఇంట్లో ఉంటుంది అని ఏంజెల్ అంటుంది.

gm

రండి డాడ్ : జగతి కంగారుగా లేవబోతుంటే వసుధార ఆగమన్నట్లుగా చూస్తుంది. తన ఆరోగ్యం బాలేకపోయినా వర్క్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. రిషితో కలిసి వర్క్ చేసిందని విశ్వనాథం చెబుతాడు. తర్వాత రూమ్స్ చూపించమని ఏంజెల్ కు చెప్పి విశ్వనాథం వెళ్లిపోతాడు. రిషి నీ రూమ్ ఎక్కడా అని మహేంద్ర అడిగితే.. రండి డాడ్ చూపిస్తా అని అంటాడు. ఆ మాట విన్న ఏంజెల్ షాక్ అవుతుంది. ఏంటీ డాడ్ అని పిలుస్తున్నావ్ అని అడుగుతుంది. లేదే. డాడ్ అన్లేదు అని రిషి మాట మారుస్తాడు. మహేంద్ర, జగతి, వసుధారలను అదే అడిగితే.. వాళ్లంతా లేదని చెబుతారు. నాకేమైనా వినిపించని సమస్య వచ్చిందా. ఈఎన్టీ డాక్టర్ దగ్గరకు వెళ్లాలా అని ఏంజెల్ అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X