Guppedantha Manasu: సూపర్ ట్విస్ట్.. జగతికి నిజం చెప్పేసిన ఏంజెల్.. శైలేంద్ర పరిస్థితి ఏంటి?
మహేంద్రను డాడ్ అని రిషి పిలవడం విన్న ఏంజెల్ షాక్ అవుతుంది. అదేంటి రిషి సర్ ని డాడ్ అని పిలిచావ్ అని అడిగితే.. లేదని కవర్ చేస్తాడు. దీంతో మహేంద్ర, జగతి, వసుధారను అందరిని డాడ్ అనేగా పిలిచాడు అని అడుగుతుంది ఏంజెల్. అందుకు అందరూ లేదని అబద్ధం చెబుతారు. నాకు ఏమైనా వినికిడి సమస్య ఉందా. ఈఎన్టీ హాస్పిటల్ కు వెళ్లాలా. వసుధార ఒక్కసారి హలో అను అంటూ కాస్తా హడావిడి చేస్తుంది ఏంజెల్. ఇంతలో విశ్వనాథం వస్తాడు. ఏంటమ్మా వీళ్లకు ఇంకా రూమ్ చూపించలేదా. చెప్పాను కదా అని విశ్వనాథం అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూలై 17 సోమవారం నాటి ఎపిసోడ్ 817లో ఇంకా ఏం జరిగిందంటే?
అది కాదు విశ్వం.. ఓసారి హలో అను అడుగుతుంది ఏంజెల్. ఏంటమ్మా, ఏం జరిగింది అని విశ్వనాథం అంటే.. అసలు విషయం చెబుతుంది. రిషి అలా ఎందుకు పిలుస్తాడు. నువ్వు పొరపాటు పడి ఉంటావ్. ఒకవేళ పిలిచినా అందులో తప్పేముంది. రిషి గురువు లాంటివారు, తండ్రి సమానులు అలా పిలిస్తే ఏంటీ అని విశ్వనాథం అంటాడు. దీంతో ఏంజెల్ సైలెంట్ గా ఉంటుంది. రిషి ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు. పోయి మీద పాలు ఉన్నాయి. మర్చిపోయానని చెప్పిన ఏంజెల్ వీళ్లకు రూమ్ చూపించమని వసుధారకు చెబుతుంది. మహేంద్ర అక్కడే ఉంటాడు. జగతికి వాళ్లు ఉండబోయే రూమ్ చూపిస్తుంది వసుధార.

తప్పుడు సాక్ష్యం: మీకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసి పెట్టాం. ఏదైనా అవసరం ఉంటే పిలవండి అని వసు చెబుతుంది. ఇక్కడ నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది వసు భుజంపై జగతి చేయి వేస్తుంది. కానీ దాన్ని విదిలిచించుకుంటూ.. రిషిసార్ దగ్గరగా మాత్రమే ఉన్నాను. ఆయన మనసులో కాదు. సంతోషంలో మీరు లేరు, నేను లేను, ఎవరం లేము అని వసుధార అంటుంది. రిషి విషయంలో చాలా భయపడ్డాను. శైలేంద్ర ఎలా ఏ అపాయం తలపెడతానో అని కంగారు పడ్డాను. అందుకే నువ్వు నిజం చెబుదామన్న ధైర్యం చేయలేకపోయాను. కొడుకు క్షేమం కోసం తీసుకున్న తప్పుడు సాక్ష్యం, తప్పుడు నిర్ణయం ఇలా ద్వేషించేలా అవుతుందని అనుకోలేదు అని జగతి అంటుంది.
నన్ను పిలవకండి: రిషి నిన్ను దూరం పెట్టడానికి కారణం అయ్యాను. చివరికి మీ అమ్మ చనిపోవడానికి పరోక్షంగా కారణం అయ్యాను. నా కొడుక్కి మంచి చేయడం కోసం నీకు అన్యాయం చేశాను అని జగతి అంటుంది. ఇప్పుడు న్యాయ అన్యాయల గురించి మాట్లాడటం అనవసరం. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గతంలో గురించి మాట్లాడి ఇబ్బంది పెట్టొద్దు. మన మధ్య గురు శిష్యుల బంధం తెగిపోయింది. అత్తాకోడలు బంధంతో మాట్లాడలన్న నా భర్తే దూరం పెట్టాడ. నా బంధం నన్ను దగ్గరికి తీసుకునే వరకు నేను మీతో మాట్లాడలేను. మీతో మాట్లాడి రిషి సర్ కి ఇంకా దూరం కాలేను. ఏదైనా అవసరం అయితే ఏంజెల్ ను పిలవండి. నన్ను కాదు అని చెప్పేసి వెళ్లిపోతుంది వసుధార.

అదృష్టం దక్కింది: రాత్రిపూట అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. ఎంత విచిత్రంగా ఉందో కదా. మీరందరు ఎవరో కానీ అందరం ఇక్కడ చేరాం. మీరు అంతా అతిథులు, కానీ ఆత్మీయుల్లా ఉంది అని విశ్వనాథం అంటాడు. అసలు మిమ్మల్ని చూస్తుంటే మీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిలా అనిపిస్తుంది అని ఏంజెల్ అనడంతో అంతా షాక్ అవుతారు. మాది ఒకే కుటుంబం అని వసు మనసులో అనుకుంటుంది. ఇన్నేళ్ల తర్వాత కలిసి భోజనం చేసే అదృష్టం దక్కిందని మహేంద్ర మనసులో సంతోషపడతాడు. వెన్నెల్లో కూర్చుని తినడం గురించి మహేంద్ర చెబితే అలాగే చేద్దాం అని ఏంజెల్ అంటుంది. ఇంతలో రిషికి పొలమారితే జగతి వెంటనే నీళ్లు అందిస్తుంది.

మా ఎండీనే కారణం: నీళ్లు తీసుకునేందుకు చేయి చాచిన రిషి ఒక్కసారిగా ఆగిపోతాడు. తర్వాత మళ్లీ తీసుకుంటాడు. ఇలా మనకోసం, మనతో తినేవారు ఉంటే బాగుంటుందని ఏంజెల్ చెబుతుంది. తర్వాత అంతా కూర్చుని మాట్లాడుకుంటారు. మీ డీబీఎస్టీ కాలేజీకి పేరు రావడం కోసం ఏం చేశారు అని విశ్వనాథం అడుగుతాడు. అందుకు కారణం మా ఎండీ. తను కాలేజీ కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు అందుకు కారణం అని రిషి గురించి గొప్పగా చెబుతాడు మహేంద్ర. అంటే.. ఈ మేడమ్ ఆలోచనలు కూడా రిషి ఆలోచనల మాదిరిగానే ఉన్నాయి. కాదు కాదు.. రిషి ఆలోచనలే మేడమ్ లాగా ఉన్నాయి అని ఏంజెల్ అంటుంది. (డీబీఎస్టీ కాలేజీ ఎండీ జగతి అనుకున్న ఏంజెల్ అలా అంటుంది).

కొన ఊపిరితో రిషి: మన కాలేజీకి అవసరమైన విషయాలు మేడమ్ దగ్గర అడిగి తెలుసుకో అని విశ్వనాథం అంటాడు. నాకంటే నా కొడుక్కే ఎక్కువ తెలుసు అని జగతి అనుకుంటుంది. తర్వాత అంతా గుడ్ నైట్ చెప్పి వెళ్తారు. జగతి, ఏంజెల్, వసుధార ఉంటారు. రిషి నీకు ఎప్పటి నుంచి తెలుసు అని జగతి అడుగుతుంది. చాలా ఏళ్లుగా తెలుసు. మేము క్లాస్ మేట్స్, కాలేజీ తర్వాత ఎవరిదారిలో వారు వెళ్లిపోయాం. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత కలిసాం. నేను తనను కాపాడటం కోసమే కనిపించానేమో అని ఏంజెల్ అంటుంది. కాపాడుకోవడం ఏంటీ, రిషి సర్ కి ఏమైంది అని జగతి కంగారుగా అడుగుతుంది. కొన ఊపిరితో ఉన్న రిషికి ట్రీట్ మెంట్ చేయించింది నేనే కదా అని ఏంజెల్ చెప్పడంతో.. జగతి, వసు ఇద్దరూ షాక్ అవుతారు.
కత్తితో పొడిచారు: షాక్ అయి సోఫాలో నుంచి లేచి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఏంజెల్ దగ్గరికి వెళ్లి ఏంటీ నువ్వు అనేది. అసలు ఏమైంది అని జగతి అడుగతుంది. వసు, జగతి ఇద్దరి లేవడం చూసి షాక్ అయిన ఏంజెల్ కాస్తా కంగారుగా చూస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం రిషిని ఎవరో కత్తితో పొడిచారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రిషిని నేను, విశ్వం వెళ్లి కాపాడుకున్నాం అని ఏంజెల్ చెబుతుంది. దీంతో జగతి, వసు అలాగే షాక్ లో ఉండిపోతారు. చూస్తుంటే తర్వాత ఎపిసోడ్ లో... రిషిపై దాడి చేయించింది శైలేంద్రే అని జగతికి అనుమానం రావడం చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











