Guppedantha Manasu: రిషి-మహేంద్రపై ఏంజెల్ డౌట్.. సీన్‌లోకి గౌతమ్.. షాక్ ఇచ్చిన విశ్వనాథం

రిషి చావు బతుకుల్లో ఉన్నప్పుడు తానే కాపాడినట్లు చెబుతుంది ఏంజెల్. అది విని వసుధార, జగతి షాక్ అవుతారు. ఏంజెల్ దగ్గరికి వెళ్లి ఏంటీ నువ్వు అనేది అని జగతి అడుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం రిషిని ఎవరో కత్తితో పొడిచారు. హాస్పిటల్ లో ప్రాణపాయ స్థితిలో ఉన్న రిషిని నేను, విశ్వం వెళ్లి కాపాడాకున్నాం అని ఏంజెల్ చెబుతుంది. అది విన్న జగతి తెగ ఎమోషనల్ అవుతుంది. ఏంజెల్, చాలా థ్యాంక్స్ అమ్మా అని అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూలై 18 మంగళవారం నాటి ఎపిసోడ్‌ 818లో ఇంకా ఏం జరిగిందంటే?

పునర్జన్మనిచ్చావ్: వసుధార గతంలో తాను ఎన్వోసీపై సంతకం పెట్టిన విషయం గుర్తు చేసుకుంటుంది. అప్పుడు బ్రేస్ లెట్ చూసి రిషినే అనుకుంటుంది. అది గుర్తు చేసుకున్న వసుధార వెళ్లి ఎంజెల్ ను కౌగిలించుకుంటుంది. వసుధార చేసిన పనికి ఏం చేయాలో తెలీక చూస్తుండిపోతుంది. ఏంటీ రిషి గురించి చెబుతుంటే మీరిద్దరు ఎమోషనల్ అవుతున్నారు. అసలు నాకేం అర్థం కావడం లేదు అని ఏంజెల్ అడుగుతుంది. దీంతో తేరుకున్న జగతి.. నువ్వు చేసింది చిన్న సాయం కాదు. ఒక ప్రాణం కాపాడావు. తల్లి జన్మనిస్తే.. నువ్వు పునర్జన్మనిచ్చావ్ అని జగతి అంటుంది. అవును, ఏంజెల్ నువ్వు చాలా గ్రేట్ అని వసుధార అంటుంది. మరోవైపు తన గదిలోకి వెళ్లిన రిషి.. తండ్రి మహేంద్ర అన్నమాటలు తలుచుకుంటాడు.

Guppedantha Manasu

నీతోనే ఉంటా: రిషి వెనుకే వచ్చిన మహేంద్ర మాట్లాడతాడు. నాన్న రిషి అందరి ముందు నటించలేకపోతున్నా. నిన్ను పరాయివాడిలా చూడాలంటే ప్రాణం పోతుంది. ఏ కన్న తల్లిదండ్రులు అయినా ఇలా చేయగలరా అని మహేంద్ర అంటాడు. ఏ కన్నతల్లి అయినా కన్నబిడ్డపై అభియోగం మోపుతుందా. అప్పుడు అది జరిగింది. ఇప్పుడు ఇది కూడా జరగాల్సిందే అని రిషి అంటాడు. సరే నీ ఇష్టం. కానీ, ఎలాగు ఇక్కడే ఉన్నాం. ఒక్కరోజు నీతోనే ఉంటాను అని అడుగుతాడు మహేంద్ర. జీవితంలో ఒక్క క్షణం కూడా మీకు దూరంగా ఉండకూడదు అనుకున్నాను. కానీ, ఈరోజు మీరు ఒక్కరోజు నాతో ఉంటానని ప్రాధేయపడుతున్నారు. అందుకు కారణం ఆ గురు శిష్యులే కదా అని డాడ్ అనబోయి ఆగిపోతాడు రిషి.

Guppedantha Manasu

ఏంజెల్ డౌట్: ఏంటీ నాన్న డాడ్ అని అనడానికి సంకోచిస్తున్నావా అని మహేంద్ర అంటాడు. నేను ఎప్పుడు సంకోచించను డాడ్. నా మనసులో మీ స్థానం ఎప్పుడూ అలాగే ఉంటుంది అని రిషి అంటాడు. నిజం తెలిసి కూడా నీకు చెప్పలేకపోతున్నా. అన్నయ్యకు సమస్య రాకుండా నిజం బయటపెట్టి మళ్లీ నిన్ను ఇంటికి తీసుకొస్తా. ఎండీగా చూస్తానని మనసులో అనుకున్న మహేంద్ర.. ఈ ఒక్కపూట నీతో ఉంటాను. కాదనకు ప్లీజ్ అని అంటాడు మహేంద్ర. రిషి సరే అనేసరికి కొడుకును కౌగిలించుకుంటాడు మహేంద్ర. అది ఏంజెల్ చూస్తుంది. రిషి ఏంటీ ఇంత ఎమోషనల్ అవుతున్నాడు. వీళ్లిద్దరికి ఏదైనా బంధం ఉందా అని డౌట్ పడుతుంది ఏంజెల్.

Guppedantha Manasu

భార్యతో కాకుండా: ఏంజెల్ వెళ్లి తన అనుమానంపై విశ్వనాథంకు చెబుతుంది. గెస్టులు వచ్చినప్పటినుంచి రిషిలో మార్పు వచ్చింది అని ఏంజెల్ అంటే.. తెలిసినవాళ్లు అని చెబుతున్నాడు కదా. అందుకే అలా ఎగ్జైట్ అవుతున్నాడేమో అని విశ్వం అంటాడు. వీళ్లు తన ఆత్మీయులు అంటే నమ్మబుద్ధి కావట్లేదు. చాలా సంవత్సరాల తర్వాత బంధువులను చూసిన ఫీలింగ్, ఎమోషన్ రిషి కళ్లలో కనిపిస్తుంది అని ఏంజెల్ అంటే.. బంధువులు అయితే రిషి చెబుతాడు కదా అని విశ్వం అంటాడు. మరి మహేంద్ర సార్.. తన గదిలో భార్యతో ఉండకుండా రిషి గదిలో ఎందుకు ఉన్నట్లో అర్థం కావట్లేదు అని ఏంజెల్ అనేసరికి విశ్వనాథం ఆలోచనలో పడిపోతాడు.

ఏంజెల్ క్లారిటీ: అదంతా వింటున్న వసుధార.. వీళ్లకు డౌట్రాకుండా చేయాలని మనసులో అనుకుంటుంది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ఏంజెల్. రిషి సార్ కు కావాల్సిన వాళ్లు అన్నారుగా. ఇన్నేళ్ల తర్వాత రిషి సర్ ని కలిశారు కదా. అందుకే తనతో ఏమైనా మాట్లాడాలని అనుకున్నారేమో. నువ్వు ఇంత చిన్న విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని వసుధార అంటుంది. కాలేజీ గురించి రిషితో డిస్కస్ చేస్తారు కావచ్చు అని విశ్వనాథం కూడా చెప్పడంతో ఏంజెల్ కు అనుమానం పోతుంది. రిషి గురించి ఏంజెల్, వసుధార మాట్లాడుకుంటారు. రిషి గురించి కచ్చితంగా గౌతమ్ కి తెలిసే ఉంటుంది ఏంజెల్ అనేసరికి వసు షాక్ అవుతుంది.

ఎంక్వైరీ ఏంటని: రిషి గురించి గౌతమ్ కి అన్నీ తెలుసు. కానీ, ఇప్పుడు కాంటాక్ట్ లో లేడు. మేం ముగ్గురం మంచి ఫ్రెండ్స్. రిషి గతం గురించి ఏం తెలియదు. ఇప్పుడు మహేంద్ర సార్, జగతి మేడమ్ రిషికి బాగా దగ్గరివాళ్లు కదా. వాళ్లను అడిగితే రిషి గురించి తెలుస్తుంది కదా అని ఏంజెల్ అంటుంది. మహేంద్ర సార్ ఏమైనా పొరపాటు పడితే ఏంజెల్ కనిపెట్టేస్తుందని అనుకున్న వసుధార.. నువ్ అలా ఎంక్వైరీ చేశావని రిషికి తెలిస్తే బాధపడతాడు కదా అని వసు అంటుంది. అవును కదా అని ఏంజెల్ అంటుంది. సరే నీ పాస్ట్, ఫ్యూచర్ గురించి చెప్పమంటే అంతా రిషి సారే అని మనసులో అనుకుని.. ఏదో జీవితం సాగిపోతుంది అని బయటకు చెబుతుంది వసుధార.

లవ్ స్టోరీ చెప్పు: నీ లవ్ స్టోరీ గురించి చెప్పమని వసుధారను ఏంజెల్ అడగడంతో ఇబ్బంది పడుతుంది. ఇంతలో రిషి రావడంతో మంచి టాపిక్ నడుస్తుంది. వచ్చి కూర్చో అంటుంది ఏంజెల్. నాకు అందులో ఇంట్రెస్ట్ లేదని రిషి వెళ్లిపోతుంటే ఏంజెల్ ఆపుతుంది. నీకు గౌతమ్ కాంటాక్ట్ లో ఉన్నాడా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు. వాడి నెంబర్ ఉంటే ఇస్తావా అని అడుగుతుంది ఏంజెల్. దీనికి వసువైపు రిషి చూస్తాడు. అదేంటీ నేను గౌతమ్ గురించి అడిగితే.. వసు వైపు చూస్తావ్. ఏదో మీ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉన్నట్లు అని ఏంజెల్ అంటుది. కొన్నేళ్లుగా గౌతమ్ తో కాంటాక్ట్ లో లేనని చెప్పి వెళ్లిపోతాడు రిషి. మరుసటి రోజు కాలేజీలే మిషన్ ఎడ్యుకేషన్ ను టేకప్ చేయాలని రిషి, వసుకు చెప్పడంతో వాళ్లు షాక్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X