Guppedantha Manasu: రిషి బలహీనతపై కొట్టిన జగతి.. అన్నదమ్ముల యుద్ధం.. చంపించేందుకు ప్లాన్

విష్ కాలేజీలో డీబీఎస్టీ కాలేజీ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లో పని చేసే ప్రపోజల్ గురించి లెక్చరర్స్ కు ఛైర్మన్ విశ్వనాథం చెబుతాడు. దానికి అంతా సంతోషంగా ఒప్పుకుంటారు. అప్పుడే వచ్చిన రిషి, వసుధారలతో మీ పనితనం చాలా బాగా నచ్చిందని జగతి, మహేంద్ర పొగిడారు అని విశ్వనాథం చెబుతాడు. మీకు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి తెలుసు కదా. దాని బాధ్యతలను మీరు చేపట్టాలని వారు కోరుతున్నారు అని విశ్వనాథం అనడంతో వసు, రిషి షాక్ అవుతారు. ఇద్దరు మొహాలు ఒకరినొకరు చూసుకుంటారు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూలై 19 బుధవారం నాటి ఎపిసోడ్‌ 819లో ఇంకా ఏం జరిగిందంటే?

ఇక్కడ ఉండే వర్క్:రిషి నువ్వు ఏమంటావ్ మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు చేపట్టడం నీకు ఇష్టమేనా అని విశ్వనాథం అడగడంతో వాళ్లు ప్రాజెక్ట్ ను మనం టేకప్ చేయడం ఏంటీ సార్. వాళ్లకు సాధ్యం కాకపోతే వాళ్ల లెక్చరర్స్ తో చేయించుకోవచ్చు కదా అని అంటాడు. ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడే నువ్వు ఇలా నెగెటివ్ గా అంటున్నావేంటి. ప్రాజెక్ట్ ను ముందుకు నడిపించే ప్రతిభ మీలో ఉందనుకున్నారేమో. వసుధార నువ్వు చెప్పమ్మా అని విశ్వనాథం అంటే.. నాకు ఇష్టమే సార్ అని వసు చెబుతుంది. దీంతో మరింత షాక్ అవుతాడు రిషి. నాకు ఈ కాలేజీ వదిలి వెళ్లడం ఇష్టం లేదు సార్ అని రిషి అంటే.. అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ ఉండే వర్క్ చేయమని కూడా చెప్పారు అని ప్రిన్సిపాల్ అంటాడు.

Guppedantha Manasu Serial July 19 2023 Today Full Episode 819

కారణాలేంటి:సరే సార్ మీ ఇష్టం. కానీ, నేను వాళ్లతో ఒకసారి మాట్లాడతాను అని రిషి అంటాడు. దీంతో సరే అని విశ్వనాథం అంటాడు. కట్ చేస్తే.. జగతి, మహేంద్రతో రిషి, వసుధార కలుస్తారు. మళ్లీ నా జీవితంలోకి వచ్చి ప్రశాంతతం లేకుండా ఎందుకు చేస్తున్నారు. వేటాడి వెంటాడి ఎక్కడున్నానో వెతుక్కుని వచ్చారు. మీ రాక, మీ ఊహే నన్ను రకరకాలుగా చిత్రవధ చేస్తోంది. నిందలు మోపి నన్ను ఒక మోసగాడు అని కాలేజీ నుంచి పంపించారు. మళ్లీ ఈ మోసగాడి దగ్గరకు ఎందుకు వచ్చారు అని బాధగా అంటాడు రిషి. అలా ఎందుకు అనుకుంటావ్ నాన్నా. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది. దాని వెనుక ఉన్న కారణాలేంటే తెలుకోవాలి అని మహేంద్ర అంటాడు.

Guppedantha Manasu Serial July 19 2023 Today Full Episode 819

ఆడుకోవాలనుకుంటున్నారా:ఇంకేం తెలుసుకోవాలి. ఈ గురు శిష్యులు ఇద్దరు కలిసి నా మీద మోసగాడు అని ముద్ర వేశారు. నేను మోసగాడినని వీరిద్దరు అందరిని నమ్మించారు. ఎండీగా పనికిరానని తేల్చేశారు. బోర్డ్ నుంచి తీసేశారు. నా ప్రాణం లాంటి డీబీఎస్టీ కాలేజికి నన్ను దూరం చేశారు. నువ్వు తప్పుడు మనిషని నింద మోస్తూ బతికిపో అని శాపం పెట్టారు. ఆ క్షణంలో మనిషి ఎంత బాధనైతే భరిస్తాడో దాని లిమిట్ కూడా దాటేసి అంత బాధను నేను భరించాను. నా బాధకు కొలమానం లేదు డాడ్. ఇంత చేసి ఇప్పుడు వచ్చి నన్ను పొగిడి బాధ్యతలు అప్పగించి ఏం చేయాలనుకుంటున్నారు. నన్ను మళ్లీ ఇబ్బంది పెట్టడానికే పిలుస్తున్నారా. మీరు నా జీవితంతో ఆడుకోవాలని అనుకుంటున్నారా అని కోపంగా అరుస్తాడు రిషి.

Guppedantha Manasu Serial July 19 2023 Today Full Episode 819

బలహీనత తెలుసు:నీకు మా మీద ఉన్న కోపం సహజం అని జగతి అంటుండగా.. ఇది కోపం కాదు.. ఆవేదన అని బాధగా కోపంగా అంటాడు రిషి. నువ్వు దూరమైంది మా వల్లే. అది మేం చేసిన తప్పు. అందుకు చేతులు జోడించి క్షమాపణలు అడుగుతున్నా. డీబీఎస్టీ కాలేజీ వైభవం పోతోంది. మిషన్ ఎడ్యుకేషన్ ప్రభావం తగ్గిపోతుంది. మినిస్టర్ గారు మీ యాక్షన్ ఏంటని అడుగుతున్నారు. అందుకే నిన్ను టేకప్ చేయమని అడుగుతున్నాను. మన ద్వేషం, మన దూరం వ్యక్తిగతం. నిన్ను రమ్మని అంటుంది మాత్రం మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతల కోసం. మాకోసం కాదు, పేద పిల్లల కోసం, నువ్వు అనుకున్న లక్ష్యం కోసం అని జగతి అంటుంది. ఈ రిషి బలం, బలహీనత మీకు తెలుసు. అందుకే రమ్మంటున్నారు. నేను ఆలోచించనిదే ఏం చేయలేను. దయచేసి మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. మళ్లీ నా జీవితంలోకి రాకండి అని వెళ్లిపోతాడు రిషి.

Guppedantha Manasu Serial July 19 2023 Today Full Episode 819

నమ్మకం ఉంది:రిషిని మహేంద్ర ఆపుతుంటే వసు వద్దంటుంది. సార్ కి అయినా గాయం తగ్గడానికి కాస్త సమయం ఇవ్వండి అని వసు అంటే చేయ వేయబోతుంది జగతి. దీంతో జగతిపై సీరియస్ అవుతుంది వసు. నా బంధం వచ్చాకే మన బంధం మేడమ్. అంతవరకు నన్ను మనిషిలా కూడా చూడకండి. నేను తప్పు చేసినదాన్ని. అలాగే చూడాలి అని వెళ్లిపోతుంది. తర్వాత ప్రాజెక్ట్ బాధ్యతల గురించి రిషి ఏమన్నాడని విశ్వనాథం అడుగుతాడు. రెండు రోజులు సమయం ఇచ్చామని, రిషి వ్యక్తిత్వం గొప్పతనం గురించి చెబుతాడు మహేంద్ర. అదంతా పైనుంచి రిషి వింటాడు. రిషి ఒప్పుకుంటాడనే నమ్మకం ఉందని జగతి అంటుంది. మరోవైపు రిషి బతికి ఉన్నాడనే నిజంతో శైలేంద్ర రగిలిపోతాడు.

Guppedantha Manasu Serial July 19 2023 Today Full Episode 819

యుద్ధంలో అడుగు:రిషి ఉన్నంతకాలం ఎండీ సీటు దక్కదనే భయం గుండెల్లో ఉంటుంది. ఒక్కసారి శత్రువైతే జీవితాంతం శత్రువే. శత్రుశేషం ఉండకూడదు అంటే రిషిని ఏదో ఒకటి చేయాలి. పిన్ని, బాబాయ్ కూడా కలిసారంటే నిజం తెలిసిపోయినట్లేనా. నిజం తెలిస్తే ఇక యుద్దమే. యుద్ధంలో అడుగు ముందుగా వేసినవాడిదే పైచేయి. కాబట్టి నేనే ఒక అడుగు ముందుకు వేస్తా. రిషి ఊపిరి ఆగిపోతే కానీ, నేను ప్రశాంతంగా ఊపిరి తీసుకోలేను. వాడి చనిపోయే దాకా అటాక్ లు ఎన్ని సార్లయినా చేస్తాను అని శైలేంద్ర అనుకుంటాడు. మరోవైపు రిషిని వదిలిపెట్టి వెళ్లేందుకు జగతి మనసు ఒప్పుకోదు. ఇప్పుడున్న పరిస్థితి చూశావ్ గా.. వెళ్లక తప్పదు అని మహేంద్ర అంటాడు. ఈ పరిస్థితులకు భయపడే కదా రిషిన దూరం చేసుకున్నాను అని జగతి అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X