Guppedantha Manasu: ఊహించని ట్విస్ట్.. కత్తిపోటుకు దగ్గరగా రిషి.. రాత్రికి రాత్రే స్కెచ్
విశ్వనాథం ఇంట్లో నుంచి జగతి, మహేంద్ర బయలుదేరతారు. పదవి, పరపతి కోసం సొంతవాళ్లను చంపేసుకోవాలనుకుంటున్న ఈ రోజుల్లో ఏ సంబంధం లేని రిషి, వసుధారను మీ ఇంట్లో పెట్టుకుని ఆశ్రయం ఇవ్వడం చాలా గొప్ప వ్యక్విత్వం. మీరు చాలా గొప్పవారు అండి అని విశ్వనాథంను పొగుడుతుంది జగతి. ఏంజెల్ దగ్గరకు వెళ్లిన జగతి.. నువ్వు ముఖ్యంగా రిషిని జాగ్రత్తగా చూసుకుంటున్నావ్. అందుకు థ్యాంక్స్ అమ్మా అని అంటుంది. రిషి నా ఫ్రెండ్. నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు. అయినా మీరెందుకు రిషి గురించి థ్యాంక్స్ చెబుతున్నారు. అంత ఎమోషనల్ అవుతున్నారు అని ఏంజెల్ అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూలై 20 గురువారం నాటి ఎపిసోడ్ 820లో ఇంకా ఏం జరిగిందంటే?
మీరు అనుకున్నట్లే:ఏంజెల్ అలా అనడంతో జగతి సైలెంట్ అయిపోతుంది. రిషి సార్ చాలా మంచి వారు కదా. అలాంటి వారు ఉండటం అరుదు. అందుకే మేడమ్ అలా చెబుతున్నారు అని వసుధార కవర్ చేస్తుంది. సరే ఇప్పటికీ నేను ఎవరికీ చెప్పలేదు. కానీ మీకు చెప్పాలనిపిస్తుంది. రిషిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వసుధార మేడమ్.. మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతల గురించి ఆలోచించండి. రిషి సార్ ను ఒప్పించండి. ఇది అందరికి మంచిది. పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని జగతి అంటుంది. అందుకు సరే మేడమ్.. మీరు అనుకున్నట్లే జరుగుతుంది అని వసుధార అంటుంది. వెళ్లొస్తాం అని చెప్పిన జగతి ఇల్లంతా చూస్తుంది. ఏంటీ మేడమ్ రిషి కోసం చూస్తున్నారా అని ఏంజెల్ అడుగుతుంది.

పొగిడేస్తున్నారు:రిషి బయటకు వెళ్లాడు. వచ్చాక చెప్పి వెళుదురుగాని కూర్చోండి అని విశ్వనాథం అంటాడు. జగతి సరే అనుకుంటుంది. కానీ, మహేంద్ర మాత్రం పరిస్థితి అర్థం చేసుకో వెళ్దాం పదా అని బలవంతంగా బయలుదేరుతాడు. ఇంతలో రిషి ఎదురుపడతాడు. జగతి చాలా సంతోషిస్తుంది. వెళ్లొస్తాం సార్ అని జగతి అంటే.. సీయూ అగైన్ రిషి అని మహేంద్ర అనేసి వెళ్లిపోతారు. మరోవైపు విష్ కాలేజీలో లెక్చరర్స్ మాట్లాడుకుంటారు. మనం ఎప్పటినుంచో కాలేజీలో పని చేస్తున్నాం. కానీ మనకు ఎప్పుడూ ఎలాంటి సన్మానం చేయలేదు. రిషి సార్, వసుధార మేడమ్ వచ్చారో లేదే వాళ్లను పొగిడేస్తున్నారు. ఛైర్మన్ సార్ ని బాగా బుట్టలో వేశారు. ఇంట్లోనే తిష్ట వేశారు అని అనుకుంటారు.
సోఫాలో కూర్చుని:ఇద్దరి మధ్య ఏదో ఉంది. పేరుకు అలా పిలుచుకుంటున్నారు కానీ, ఏదో నడుస్తుంది. ఇద్దరు వయసులో ఉన్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నారు. రిలేషన్ మెయింటేన్ చేస్తే తప్పేముంది అని అనుకుంటారు ఆ లెక్చరర్స్. వాళ్ల మాటలు విన్న పాండ్యన్ కోపంగా అరుస్తాడు. పాఠాలు చెప్పాల్సిన మీరే ఇలా చిల్లరగా మాట్లాడటం సరికాదు. ఇంకోసారి ఇలా చీప్ గా మాట్లాడితే పాత పాండ్యన్ ను చూడాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. రాత్రి బాల్కనిలో కూర్చున్న వసుధార పేపర్లపై వీఆర్ అని లెటర్ రాస్తుంది. దాని కిందే సోఫాలో కూర్చున్న రిషి.. వసు వచ్చినప్పటి నుంచి జరిగినదంతా గుర్తు చేసుకుంటాడు.

మర్చిపోలేను:అసలు ఏం జరుగుతోంది. ఎందుకిలా అవుతోంది. నేను దూరంగా ఉండాలని ప్రయత్నించినా మళ్లీ నా జీవితంలోకి ఎందుకొస్తున్నారు. మీరు రావడం చిరగ్గా ఉన్నా మిమ్మల్ని చూశాక మనసు తేలికగా, ప్రశాంతంగా ఉంది. కానీ వాళ్లు దగ్గరిగా రావడం అశాంతిగా ఉంది. వాళ్లు చేసిన పని నేను జీవితంలో మర్చిపోలేను. నా గుండెకు గాయం చేశారు. అది మానదు. నన్ను కావాలనే కాలేజీ బాధ్యతల నుంచి తప్పించారు. ఎందుకో మీకే తెలియాలి. కారణాలు ఇప్పుడు తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అందుకే దూరం పెట్టాను. ఇలాగే ఉండాలనుకుంటున్నాను. డీబీఎస్టీ కాలేజీకి సంబంధించిన ప్రాజెక్ట్ చేయను అని రిషి అనుకుంటాడు. ఇంతలో వసుధార రాసిన వీఆర్ లెటర్ పేపర్స్ గాలికి ఎగిరి రిషి పక్కకు వచ్చి పడుతాయి.

స్వార్థం-ప్రేమ:ఆ వీఆర్ లెటర్ రాసి ఉన్న పేపర్ ను రిషి చింపేయబోతుంటే వసుధార ఆపుతుంది. అన్ని చోట్ల అధికారాలు చెల్లవు. మీ అధికారం చూపించి రిజైన్ లెటర్ చించినట్లు దీన్ని ముక్కలు చేయలేరు. అది మంచి కోసం కాబట్టి ఉండేందుకు ఒప్పుకున్నా. కానీ ఇది నా ప్రేమ, నా ప్రాణం. నా మనసుకు గాయం అయితే నేను ఒప్పుకోను సార్ అని వసు అంటుంది. మనసుకి గాయాలు చేసే మీరు మనసుకు గాయం అయితే ఒప్పుకోకపోవడమా ఎంత స్వార్థం అని రిషి అంటాడు. అది స్వార్థం అని మీరునుకుంటున్నారు. ప్రేమ అని నేననుకుంటున్నాను. మీకు కొన్ని విషయాలు అర్థం అయ్యేసరికి ఆలస్యం కావొచ్చు. కానీ నిజం తెలిసిన రోజు మొదట ఈ వసుధార గురించే ఆలోచిస్తారు అని వసు అంటుంది.

మోసమే ఉంది:అంత నమ్మకం ఏంటీ అని రిషి అంటే.. అది కూడా ప్రేమే. మీ మనసుకు ద్వేషం కమ్ముకుంది. కానీ ఆ ద్వేషం ప్రేమగా మారుతుంది. నా వల్ల తప్పు జరిగింది కాబట్టే మౌనంగా ఉన్నాను. ఆ తప్పును అజ్ఞానంతో చేసే మూర్ఖులం కాదు మేము. తప్పనిపరిస్థితుల్లో చేసే తప్పులు కొన్ని ఉంటాయి. అది మీరే తెలుసుకోండి అని వసు వెళ్లిపోతుంది. అయినా నాకు అవన్నీ అవసరం లేదు. మీరు చేసిన మోసమే నా గుండెల్లో మెదులుతోంది. మిమ్మల్ని క్షమించను అని రిషి అనుకుని లోపలికి వెళ్లిపోతాడు. ఏంజెల్ ఇంటికి రౌడీని తీసుకొచ్చిన శైలేంద్ర అతనికి రిషిని చూపిస్తాడు. ఈసారి మిస్ అవ్వకూడాదని చెప్పి పంపిస్తాడు. ఆ రౌడీ ముసుగు వేసుకుని కత్తి పట్టుకుని రిషి వైపు నెమ్మదిగా అడుగులేస్తాడు. రిషి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్ చూస్తూ ఉంటాడు.


Click it and Unblock the Notifications











