Guppedantha Manasu: వాటే సీన్..శైలేంద్రను ఈడ్చుకెళ్లి భయపెట్టిన మహేంద్ర..రిషి రియలైజేషన్..అసలు గేమ్ స్టార్ట్!

రిషిపై మళ్లీ అటాక్ జరగడంపై జగతి, మహేంద్ర కంగారు పడుతుంటారు. అటాక్ జరగడం ఏంటీ మహేంద్ర, రిషి ఎలా ఉన్నాడు అని జగతి వరుసగా ప్రశ్నలు అడుగుతుంది. వసుధార అందుకే కాల్ చేసింది. మనం అక్కడికి వచ్చినట్లు ఎవరికైనా తెలుసా అని.

రిషిపై అటాక్ చేయించే అవసరం ఎవరికీ ఉంది. శైలేంద్రకు ఏమైనా తెలిసిందా అని మహేంద్ర అంటాడు. ఆ మాటలు విన్న శైలేంద్ర బాబాయ్ అని పిలిచి అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూలై 22 శనివారం నాటి ఎపిసోడ్‌ 822లో ఇంకా ఏం జరిగిందంటే?

Guppedantha Manasu Serial July 22 2023 Today Full Episode

ఆన్సర్స్ దొరుకుతాయి: ఏంటీ బాబాయ్ ఇక్కడ మాట్లాకుంటున్నారు. నాకు తెలికుండా ఏదైనా విషయం దాస్తున్నారా. ఎక్కడికో వెళ్లొచ్చారు. నేను వస్తానంటే వద్దన్నారు. రిషి గురించి ఏమైనా తెలిసిందా. తెలిస్తే నాకు చెప్పండి బాబాయ్. నేను వెళ్లి రిషిని తీసుకొస్తా. ఎందుకు ఇక్కడ ఇంత రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అని శైలేంద్ర అంటాడు.

దానికి కోపంతో శైలేంద్ర.. అని మహేంద్ర అంటే జగతి ఆపుతుంది. హా చెప్పండి బాబాయ్ అని శైలేంద్ర.. అంటే.. మాపై నీకు చాలా అనుమానాలు ఉన్నాయి కదా. అందుకే కదా మమ్మల్ని దొంగచాటుగా వెంబడిస్తున్నావ్. నీ ప్రశ్నలకు అన్నీ సమాధానాలు ఇవాళే దొరుకుతాయి. నాతో రా అని చేయి పట్టుకుని ఈడ్చుకెళ్తాడు మహేంద్ర.

Guppedantha Manasu Serial July 22 2023 Today Full Episode

అనుమానాలు: ఎంటీ బాబాయ్ ఇది.. ఎక్కడికీ అని బలవంతంగా అడ్డుకున్న మహేంద్ర వినడు. లాక్కెళ్లి హాల్లో అన్నయ్యా అంటూ పిలుస్తాడు. ఏంటీ డాడ్ ను రమ్మంటున్నాడు అని శైలేంద్ర లోలోపలే భయపడిపోతాడు. ఇంతలో ఫణీంద్ర, దేవయాని, ధరణి వస్తారు. ఏమైందని ఫణీంద్ర అడుగుతాడు. చెప్పు శైలేంద్ర అన్నయ్య అడుగుతున్నారు కదా.

నీ అనుమానాలు, ప్రశ్నలు అందరి ముందు చెప్పు అని మహేంద్ర అంటాడు. ఏంటీ నాన్న, అనుమానాలు ఏంటీ, ప్రశ్నలు ఏంటీ అని దేవయాని అంటే.. నోరెత్తావంటే మర్యాదగా ఉండదు. నా తమ్ముడికి కోపం వచ్చేంత తప్పుడు పని వీడు ఏదో చేసే ఉంటాడు. చెప్పు మహేంద్ర వీడేం చేశాడు అని ఫణీంద్ర అడుగుతాడు.

నీ పాత్ర ఉందా: శైలేంద్ర హద్దు దాటి ప్రవర్తిస్తున్నాడు. నేను జగతి బాల్కనీలో రిషి గురించి బాధపడుతుంటే శైలేంద్ర వచ్చి అనుమానిస్తూ ప్రశ్నలు వేస్తున్నాడు. మా పనుల గురించి ఆరాలు తీస్తున్నాడు. అసలు తన సమస్యంటే మీరే అడగండి అని మహేంద్ర అంటాడు. ఏదో చెప్పేందుకు శైలేంద్ర ప్రయత్నిస్తే.. నోర్ముయ్ అని ఆపేస్తాడు ఫణీంద్ర. నీకు జ్ఞానం లేదా. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదా. అసలు నీ మనసులో అనుమానం ఎందుకొచ్చిందో చెప్పు.

అయినా నువ్వు బాల్కనీలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది. వెళ్లినా వాళ్లను చూసి తిరిగి రావాలి కదా. వాళ్ల విషయంలో ఎందుకు కలగజేసుకున్నావ్. నేను ఇటు అడుగుతుంటే నువ్ మీ అమ్మను చూస్తావేంటీ. ఇందులో నీ పాత్ర కూడా ఉందా అని దేవయానిపై ఫైర్ అవుతాడు ఫణీంద్ర.

Guppedantha Manasu Serial July 22 2023 Today Full Episode

మనసులో ఏముంది: అయ్యేం నాకేం తెలీదండి అని దేవయాని అంటుంది. మొన్న రిషి గురించి తప్పుగా మాట్లాడావ్. ఇప్పుడు ఇలా. రిషిపై కలుగజేసుకోవద్దని చెప్పినా పదే పదే చేస్తున్నావ్. అసలు నీ ఉద్దేశం ఏంటీ. చెప్పు శైలేంద్ర అన్నయ్య అడుగుతున్నారు కదా అని మహేంద్ర అంటే.. జగతి ఆపుతుంది. వాడు చెప్పాల్సిందే జగతి.

వాడి మనసులో ఏముందో చెప్పేవరకు ఇక్కడి నుంచి ఒక్కరు కూడా కదలరు అని ఫణీంద్ర మరింతగా చెబుతాడు. ఇప్పటికే రిషి గురించి బాధపడుతున్నాం. ఈ గొడవ పెద్దది చేయం ఇష్టం లేదు. శైలేంద్ర గురించి మీకు చెప్పాలనుకున్నాం చెప్పాం. తన తప్పు తానే తెలుసుకుంటాడు. ఈ ఒక్కసారికి వదిలేయండి అని జగతి అనేసరికి ఆలోచిస్తాడు ఫణీంద్ర.

నిలదీయం బాలేదు: వదిలేయండి అన్నయ్య అని చెప్పిన ఫణీంద్ర.. శైలేంద్ర.. దయచేసి మా విషయాల్లో కలుగజేసుకోవద్దు. మా బాధలో మమ్మల్ని ఉండనీ.. ఓ పక్క కాలేజీ పేరు నిలబెట్టడం కోసం, మరోపక్క రిషికోసం ప్రతిక్షణం బాధపడుతున్నాం. అర్థం చేసుకోవాల్సిన నువ్వే ఇలా ప్రవర్తిస్తుంటే బాధడపడాల్సి వస్తుంది అని మహేంద్ర అంటాడు. నా తమ్ముడి జోలికి వస్తే కొడుకైనా, ఎవరైనా వదలను.

ఇదే ఫైనల్ వార్నింగ్. మరోసారి రిపీటైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అది నీ ఊహకు కూడా అందవు. జాగ్రత్త అని ఫణీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. తనేదో తెలియక చేశాడు. శైలేంద్ర నువ్వు గదిలోకి వెళ్లు అని పంపిచేస్తుంది దేవయాని. ఏంటండి చెట్టంత కొడుకుని వాళ్ల ముందే నిలదీయడం బాలేదు అని దేవయని అంటే తనను కూడా తిడతాడు ఫణీంద్ర.

అంతా కోల్పోయాం: మరోవైపు వసుధార మాటలు గుర్తు చేసుకుంటాడు రిషి. అప్పుడు నాపై అన్నిసార్లు అటాక్ ఎవరు చేయించారు. నాపై నింద మోపడానికి, అటాక్స్ కు ఏమైనా కనెక్షన్ ఉందా అని ఆలోచించినా రిషి అయినా అదంతా గతం. నాకు అనవసరం. నన్ను రాయిలా మార్చేశారు. నేను వ్యక్తిగతంగా ఆలోచించి నా ఆశయాలకు దూరం అవుతున్నానా అని అనుకుంటూ కన్ఫ్యూజన్ లో ఉంటాడు.

మరోవైపు రూమ్ కు వెళ్లిన తర్వాత ఎందుకింత తొందరపడ్డావ్ అని మహేంద్రను జగతి అడుగుతుంది. శైలేంద్రను అదుపులో పెట్టాలంటే ఇదే దారి. అంతా కోల్పోయాం. ఇప్పుడు తొందరపడినా ఏం చేయాలేం. నీకున్న ఓర్పు నాకు లేదు. ముల్లును ముల్లుతోనే తీయాలు కుట్రలు చేసేవాడిని ఇలాగే ఎదుర్కొవాలి అని మహేంద్ర అంటాడు.

కోరలు తీద్దాం: వాళ్లు అన్నయ్యకు మాత్రమే భయపడి ఉంటారు. వాళ్లను హద్దుల్లో పెడితే కానీ, మనం అనుకున్నది జరగదు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్నయ్యను బాధపెట్టకుండా నెమ్మదిగా ఈ విషపురుగులా కోరలు తీద్దాం అని మహేంద్ర చిటికెలు వేసుకుంటాడు చెబుతాడు.

నేను వీళ్లను చూసుకుంటాను. నువ్వు మన కొడుకుని ఎలా ఇంటికి తీసుకురావాలో ఆలోచించు అని జగతికి చెబుతాడు మహేంద్ర. మరోవైపు రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. ఇంతలో ఏంజెల్ వచ్చి భోజనం ఇక్కడికి తీసుకురానా అంటే.. లేదు తానే వస్తానని వసు అంటుంది. సరే రా.. వెళ్లి రిషిని పిలుచుకొద్దాం అని బయలుదేరుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X