Guppedantha Manasu: వసు-రిషిపై ఏంజెల్ అనుమానం.. రిషిని చంపెయమన్న దేవయాని
రిషిని భోజనానికి పిలవడానికి కోసం వసుధార, ఏంజెల్ బయలుదేరతారు. హాల్లోకి రాగానే మెట్లపై నుంచి రిషి దిగుతాడు. నీకోసమే వస్తున్నాను అని ఏంజెల్ అంటే.. వసుధార వైపు చూస్తాడు రిషి. నేను చెబుతుంటే నువ్వెంటీ వసుధార వైపు చూస్తున్నావ్. హో.. తనను ఎక్కడికి తీసుకెళ్తున్నానని చూస్తున్నావా.. ఈరోజు వసుధార మనతోనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి తింటుందట అని ఏంజెల్ చెబుతుంది. పద వెళ్దాం అని ఏంజెంల్ అంటే.. నేను రాను.. గదిలోనే తింటాను అని రిషి చెబుతాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూలై 24 సోమవారం నాటి ఎపిసోడ్ 823లో ఇంకా ఏం జరిగిందంటే?
భయపడి గదిలో:రిషి డైనింగ్ టేబుల్ దగ్గరికి రానని చెప్పేసరికి నేను వస్తున్నాననే రావట్లేదు. ఏంటీ సార్ నేనున్నానని పారిపోతున్నారా అని వసుధార మనసులో అనుకుంటుంది. పారిపోవాల్సిన అవసరం నాకు లేదు అని రిషి కూడా మనుసులోనే అంటాడు. మరి దీన్ని ఏమంటారు. మనసు నావైపు తిరిగిపోతుందని భయపడుతున్నారా అని వసుధార అంటే.. భయం అనేది ఈ రిషీంద్ర భూషణ్ హిస్టరీలోనే లేదు. నాకెందుకు భయం. తప్పు చేసిన వాడలా తన ముందు నేనేందుకు తల దించుకుని ఉండాలి. నేనేందుకు గదిలో కూర్చుని తినాలి. తనకు భయపడి గదిలో ఉండిపోయానని అనుకుంటుందేమో. తప్పు చేసిన వాడిలా ఎందుకు పారిపోవాలి అని రిషి అనుకుంటాడు.

మీరేమైన శత్రువులా:ఏంటీ మీరు ఎప్పుడూ కళ్లతోనే మాట్లాడుకుంటారా. నోటితో మాట్లాడరా. మిమ్మల్ని చూస్తుంటే అప్పుడప్పుడు ఒక డౌట్ వస్తుంది. మీకు పాఠాలు చెప్పడంతో పాటు మనసులో భావాలు కూడా పసిగడతారు. సర్లే నేను ఎంత మొత్తుకున్న ప్రయోజనం ఉండదు. నాకు నేనే ప్రశ్నలు వేసుకుని నేనే సమాధానాలు వెతుక్కోవాలి. సరే రిషి, నీకు భోజనం గదిలోకి తీసుకొస్తానులే అని ఏంజెల్ అంటుంది. అక్కర్లేదు నేను మీతోపాటే డైనింగ్ టేబుల్ వద్ద తింటాను అని రిషి అంటాడు. ఏంటీ రిషి.. ఇప్పుడు గదిలో తింటా అన్నావ్. మళ్లీ ఇప్పుడే వస్తానంటున్నావ్. అసలు నీ సమస్య ఏంటీ. మీ ఇద్దరికి ఏమైనా శత్రుత్వం ఉందా అని ఏంజెల్ అంటుంది.

వెళ్లిపోతా సార్:అదేం లేదు అని రిషి అనడంతో అంతా కలిసి భోజనం చేస్తుంటారు. మహేంద్ర సార్ చెప్పినట్లు వెన్నెల్లో కూర్చుని తింటే చాలా బాగుంటుంది కదా. చక్కగా టెర్రస్ పైన సెటప్ కూర్చుని తినేవాళ్లం. వసుధార నువ్వైనా గుర్తు చేయొచ్చు కదా అని ఏంజెల్ అంటుంది. ఇప్పుడు ఇలా వెళ్లలేం కదా. నెక్ట్స్ టైమ్ ప్లాన్ చేద్దాం. ఏమంటావ్ రిషి అని విశ్వనాథం అంటాడు. మనకి ఇష్టమైన వాళ్లతో ఎక్కడ కూర్చుని తిన్నా తృప్తిగానే ఉంటుంది. కానీ, ఇష్టం లేనివాళ్లతో ఎక్కడ కూర్చున్న తిన్నట్లు ఉండదు అని రిషి అంటాడు. చాలా బాగా చెప్పావ్ రిషి అని ఏంజెల్ అంటే.. సర్ నేను ఇంట్లో నుంచి వెళ్లిపోదామనుకుంటున్నా అని వసుధార అంటుంది. అంత సడెన్ గా ఎందుకు అని విశ్వనాథం అడగుతాడు.

లవ్ లో ఉండేవాళ్లు:ఎక్కువ రోజులు ఇక్కడ ఉండటం ఇబ్బందిగా ఉంటుంది అని వసు అంటే.. మీ నాన్న ఏవో పనులు ఉన్నాయని చెప్పారు. ఆయన రాకుండా వెళ్లడం ఎందుకు. మీ నాన్న వచ్చిన తర్వాత వెళ్లొచ్చు. అప్పటివరకు ఇక్కడే ఉండు అని విశ్వనాథం అంటాడు. నాన్న లేకపోతే ఏంటీ వాళ్ల అమ్మ ఉంటుంది కదా. వెళ్లొచ్చు కదా అని రిషి అనుకుంటాడు. మీరిద్దరూ ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడుకోరు ఏటీ. మీ ప్లేసులో ఇంకెవరైనా ఉంటే వాళ్లు ఈపాటికి లవ్ లో ఉండేవారు అని ఏంజెల్ అనడంతో ఇద్దరు షాక్ అయి మొహాలు చూసుకుంటారు. తనకు యాక్సిడెంట్ అయతే సేవ్ చేశావ్. ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకుంటున్నారు. వేరే వాళ్లయితే బాగా కనెక్ట్ అయ్యేవాళ్లు అని ఏంజెల్ అంటుంది.

ఏం అడిగావ్:రిషి నువ్వే కొంచెం మనుషులతో కలిసిపోవాలి. వసు నువ్వే ఆ పని చేయి. రిషికి మనుషులతో ఎలా ఉండాలో నేర్పించు అని ఏంజెల్ అంటే.. భోజనం అయిపోయిందని రిషి వెళ్లిపోతాడు. గదిలోకి వెళ్లిన తర్వాత ఏంజెల్ అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. అప్పుడే వసుధార మెసేజ్ చేస్తుంది. మన గతం తెలియనక్కర్లేదు కానీ మన మధ్య ఏదో ఉందని అనుమానం రానక్కర్లేదు. మాములుగా ఉండటానికి ట్రై చేయండి. అది నాకంటే మీకే మంచిది అని వసు అంటుంది. అది చూసిన రిషి రిప్లై ఇవ్వకుండా ఉంటాడు. మరోవైపు ఉదయం మహేంద్ర చేసిన పనికి శైలేంద్ర రగిలిపోతుంటాడు. ఇంతలో దేవయాని వచ్చి.. వాళ్లను నువ్వు ఏం అడిగావ్. అంత కోపానికి వచ్చారు అని అడుగుతుంది.

నువ్వే దిక్కు:రిషి ఎక్కడున్నాడో చెప్పమని అడిగాను అని శైలేంద్ర అంటాడు. రిషిని మనమే బయటకు పంపించామని మహేంద్రకు జగతి చెప్పిందా అని దేవయాని అంటే.. నాకు అదే డౌట్ మమ్మీ. బాబాయ్ కి చూచాయగా తెలిసినట్లుంది. కానీ బయటపడటం లేదు. చివరీకి డాడ్ కు కూడా చెప్పలేదు రిషిని కలిసినట్లు. అంటే వీళ్లు ఇంకేదో ప్లాన్ చేస్తున్నారు. అయినా డాడ్ అంటీ నన్ను అంటారు. నేను చెప్పేది వినరా అని శైలేంద్ర అంటాడు. అది వాళ్ల మీద ఆయనకు ఉన్న నమ్మకం. రిషిని మట్టిలో కలిపేస్తేనే మనం అనుకున్నది జరుగుతుంది. అప్పుడు కాలేజీకి నువ్వే దిక్కు. ఎండీ సీటులో కూర్చునేది నువ్వే అని దేవయాని అంటుంది. ఇంకెప్పుడు కూర్చునేది. అందుకే బాబాయ్ ను కూడా మట్టిలో కలిపేస్తానంటే నువ్వే సెంటిమెంట్ అని వినలేదు అని శైలేంద్ర అంటాడు.

పదే పది నిమిషాలు:ఇంతలో డీబీఎస్టీ కాలేజీ నుంచి ఓ లెక్చరర్ శైలేంద్రకు కాల్ చేసి జగతి మేడమ్ బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేశారని. లిస్టులో తన పేరు లేదని చెబుతాడు. దీంతో శైలేంద్ర రగిలిపోతాడు. ఇది నీ కాలేజ్ నిన్ను ఎవరూ పిలవాల్సిన అవసరం లేదు. వెళ్లి వాళ్ల ప్లాన్లకు అడ్డుకట్ట వేయమని శైలేంద్రను ఉరిగొలుపుతుంది దేవయాని. మరోవైపు వసు కాలేజీకి వెళ్దామనుకుంటే కారు ఏంజెల్ తీసుకెళ్తుంది. రిషిని తన కారులో వసుధారను డ్రాప్ చేయమని విశ్వనాథం చెప్పి వెళ్లిపోతాడు. నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. మీ దగ్గర పాఠాలు నేర్చుకున్నాను. నేను పాఠాలు ఎలా చెబుతున్నానో మీరు క్లాసులో స్టూడెంట్ లా వినలాని అడుగుతుంది వసుధార. ముందు అది జరగదన్న రిషి తర్వాత ఒప్పుకుంటాడు. పదే పది నిమిషాలు కూర్చుంటాను అని రిషి అనడంతో.. వసుధార సంతోషిస్తుంది.


Click it and Unblock the Notifications











