Guppedantha Manasu: శైలేంద్రకు ఇచ్చి పడేసిన జగతి.. లైబ్రరీలో రిషిధార రొమాన్స్.. వసుపై నిఘా
రిషి కారు వసుధార ఎక్కాలంటే తన క్లాస్ వినాలని రిక్వెస్ట్ చేస్తుంది. అందుకు ఒప్పుకున్న రిషి అదంతా విశ్వనాథం కోసం అని, కేవలం పది నిమిషాలు మాత్రమే కూర్చుని వింటాను అని అంటాడు. దీంతో తెగ సంబరపడిపోతుంది వసుధార. ఇంతలో రిషి కారు డోర్ వేయడంతో.. ఇదంతా నా డ్రీమా అని మనసులోనే అనుకుంటుంది వసుధార. అంటే రిషి సార్ నా రిక్వెస్ట్ ఒప్పుకోలేదా అని అనుకుంటుంది. మీరు రిక్వెస్ట్ కు ఒప్పుకోకపోతే కారు ఎక్కనని అన్నారు కదా. అందుకే మీరు కారులో వచ్చేయండి.. నేనే నడుచుకుంటూ వెళ్తాను అని రిషి అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూలై 25 మంగళవారం నాటి ఎపిసోడ్ 824లో ఇంకా ఏం జరిగిందంటే?
అంత కోపం:మీకు ఇష్టం లేకపోతే రానని చెప్పండి. అంతేకానీ నడుచుకుంటూ వస్తే విశ్వనాథం గారు నన్నేమనుకుంటారు అని వసుధార్ అంటుంది. డిస్కషన్ ఓవర్. ఇష్టం లేనివాళ్లతో ప్రయాణం నాకు నచ్చదు. మీ మాట వినడమే ఇష్టం లేదు. అలాంటిది మీ పాఠాలు ఎలా వింటానని అనుకున్నారు. దయచేసి ఇలాంటి రిక్వెస్టులు ఇంకోసారి పెట్టొద్దు. ఇలాగే రిజెక్ట్ చేస్తాను. అని కారు కీస్ ఇచ్చి వెళ్లిపోతాడు రిషి. కాలేజీలో ఒంటరిగా కూర్చున్న రిషి వసుధార రిక్వెస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చిన వసుధార రిషిని చూస్తూ అంత కోపం ఎందుకు సార్ అని అనుకుంటుంది. కోపం రాక ఎలా ఉంటుంది. చేసిదంతా చేసి ఇప్పుడు నీ క్లాస్ వినమంటే ఎలా వింటానని అనుకుంటున్నావ్ అని రిషి అనుకుంటాడు.

పాండ్యన్ డౌట్:అటువైపు నుంచి పాండ్యన్ బ్యాచ్ వస్తుంది. వసుధార మేడమ్ ఇచ్చిన ప్లాబ్లమ్ సాల్వ్ కావట్లేదు అనుకుని వసుధార కనిపించగానే దాని గురించి అడుగుతారు. అది తర్వాత చెబుతాను. ఇప్పుడు ఒక విషయం చెబుతానని వాళ్లను అడ్డం పెట్టుకుని రిషికి చెబుతుంది. వ్యత్తి ధర్మంలో వ్యక్తిగతం ఉండకూడదని అర్థం వచ్చేలా టంగుటూరి ప్రకాషం, ఆయన భార్య చనిపోడవడం గురించి ఓ కథ చెబుతుంది. అది విన్న పాండ్యన్ బ్యాచ్ ఇది మాకెందుకు చెబుతున్నారు అని అడుగుతారు. ఇది మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుందని కవర్ చేస్తుంది వసుధార. అది మీకోసం కాదు. నాకోసం అని రిషి అనుకుంటాడు. లేచి నిల్చొని పాండ్యన్ బ్యాచ్ దగ్గరికి వచ్చి క్లాస్ కు టైమ్ అవుతుందని తీసుకెళ్తాడు.
ప్రమాదం ఉంది:నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు వినాల్సింది విన్నారు. కచ్చితంగా మీరు మిషన్ ఎడ్యుకేషన్ టేకప్ చేస్తారు. చేసేలా చేస్తాను అని వసుధార మనసులో సంతోషపడుతుంది. మరోవైపు డీబీఎస్టీ కాలేజీలో మీటింగ్ గురించి అందరికీ చెప్పావా అని మహేంద్రను జగతి అడుగుతుంది. చెప్పాను. ఆల్రెడీ అందరూ వచ్చి ఉంటారు అని మహేంద్ర అంటాడు. శైలేంద్రకు చెప్పావా అని అడిగితే.. చెప్పలేదు. కనీసం లిస్ట్ లో కూడా తన పేరు చేర్చలేదు. మీటింగ్ జరుగుతున్న విషయం శైలేంద్రకు తెలిసే అవకాశమే లేదు అని మహేంద్ర అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు రిషి వాళ్లకు అప్పగిస్తున్నామని చెప్పొద్దు. కేవలం విష్ కాలేజీకి అప్పగిస్తున్నాం అని చెప్పాలి. అన్నయ్యకు కూడా చెప్పకూడదు. చెబితే శైలేంద్ర, దేవయానికి తెలిసే ప్రమాదం ఉందని అని అనుకుంటారు.

ఏంజెల్-వసు:రిషి లైబ్రరీలో ఉండగా.. వసు కూడా వస్తుంది. వృత్తి ధర్మంలో వ్యక్తిగతం ఉండకూడదని వసు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఎవరెవరో జీవితకథలు చెప్పి నా మనసు మార్చలేవు. వెళ్లిపోమ్మని మెసేజ్ పెడతాడు రిషి. నా ప్రయత్నం నాది. మీ నిర్ణయం నీది. అయినా మిమ్మల్ని బలవంతంగా ఒప్పించడానికి మన మధ్య బంధం లేదని మీరే అన్నారు కదా అని వసు రిప్లై ఇస్తుంది. తర్వాత లైబ్రరీ బుక్స్ పెట్టిన ర్యాక్ డోర్ వసు మీద పడబోతుంటే రిషి గమనించి పక్కకు లాగుతాడు. అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే ప్రమాదాలు జరుగుతాయని చెప్పి వెళ్లిపోతాడు కాలేజీకి వచ్చిన ఏంజెల్ వసుధార రమ్మందని, బయటకు వెళ్తున్నామని, రిషిని కూడా రమ్మంటుంది. కానీ, రిషి రానంటాడు.

ఇంట్రెస్ట్ ఏంటీ:ఏంజెల్, వసుధార బయటకు వెళ్తారు. అది అప్పటిదాకా గమనించిన అటెండర్ వసుధార మేడమ్ ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటాడు. రిషి కూడా అలాగే అనుకుని మెసేజ్ చేద్దామనుకుని ఆగిపోతాడు. మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాం. మేం వెళ్లొచ్చిన కాలేజీలో మంచి టీమ్ ఉంది. వాళ్లకు మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అని జగతి అంటుంది. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన శైలేంద్ర ఏంటీ పిన్ని.. ప్లేట్ పిరాయిస్తున్నావ్. మిషన్ ఎడ్యుకేషన్ మనం హ్యాండిల్ చేయలేమని అప్పుడే చెబితే నా మాట వినలేదు. ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా నేనే ముందుకు తీసుకెళ్తానని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏమైంది. మీరు ఎవరిని కలిశారు. వాళ్ల మీద ఇంట్రెస్ట్ ఏంటీ. ఆ కాలేజీకి పేరు లేదా అని ప్రశ్నలు వేస్తాడు.

సంతకాలు చేశారు:ఎందుకు లేదు శైలేంద్ర. మేం వెళ్లొచ్చిన కాలేజి పేరు విష్ కాలేజ్. మిషన్ ఎడ్యుకేషన్ ని ఫ్యాషన్ తో పని చేసే వాళ్లు కావాలన్న మా అన్వేషణ ఫలించింది. ఆ కాలేజీలో ఉన్న స్టాఫ్ ని చూస్తే ఈ పని చేయగలరని అనిపించింది అని మహేంద్ర అంటాడు. మరి ఈ బాధ్యతలు ఎవరికీ అప్పగిస్తున్నారు. వాళ్ల పేర్లు ఏంటీ అని శైలేంద్ర అడుగుతాడు. పేర్లు చెప్పను. మనకు పేర్లు ముఖ్యం కాదు. మన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే వాళ్లకు ప్రాముఖ్యత ఇస్తాను అని జగతి అంటుంది. అలా అంటారు ఏంటీ పిన్ని. మేం కాలేజీ బోర్డ్ మెంబర్స్ కదా. పేర్లు తెలియాలి కదా అని శైలేంద్ర అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ పూర్తి బాధ్యత నాదేనని మీరంతా సంతకాలు చేశారు అని జగతి చెబుతుంది.

తేడా తెలుసుకో:మిషన్ ఎడ్యుకేషన్ పూర్తి అథారిటీ జగతికి అప్పగిస్తున్నట్లు సైన్ చేసింది గుర్తు చేసుకుంటాడు శైలేంద్ర. ఈ విషయంలో పూర్తి బాధ్యత నాది అన్న విషయం గుర్తు పెట్టుకుని మాట్లాడు. ఏం జరిగినా నన్ను అడుగుతారు. ఏ నిర్ణయం తీసుకున్నాఅది నా ఇష్టం. ఈ ప్రాజెక్ట్ వేరే వాళ్లకు ఎప్పుడైతే ఇద్దామని నువ్వు చెప్పావో అప్పుడే నీకు దీనిమీద ఇంట్రెస్ట్ లేదని అర్థం అయింది. అందుకే నిన్ను మీటింగ్ కు కూడా పిలవలేదు. అయినా మీటింగ్ కు వచ్చి ప్రశ్నలు వేస్తున్నావ్. అయినా మేం ఇస్తుంది మానిటరింగ్ చేయడం. వాళ్లకు వర్క్ కల్పిస్తున్నాం అంతే. పూర్తిగా హ్యాండోవర్ చేయట్లేదు. దీనికి దానికి తేడా తెలుసుకోని మాట్లాడు అని శైలేంద్రకు గట్టిగా చురకలు వేస్తుంది జగతి.


Click it and Unblock the Notifications











