Guppedantha Manasu: సూపర్ సీన్స్.. శైలేంద్రకు అవమానం.. ఫణీంద్ర ఆగ్రహం.. వసుపై రిషి ఫైర్

మిషన్ ఎడ్యుకేషన్ గురించి డీబీఎస్టీ కాలేజీలో బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. ఎవరిని కలిశారు. వాళ్లకు ఎందుకు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అప్పజెబుతున్నారు. వాళ్ల పేర్లు ఏంటీ వంటి ప్రశ్నలు వేస్తాడు శైలేంద్ర. నీకు ఈ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ లేదని నాకు ఎప్పుడో తెలుసు. అయినా ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ ఇస్తున్నాం. పూర్తిగా వాళ్లకే వదిలేయట్లేదు. దానికి చాలా తేడా ఉంది. ఆమాత్రం తెలియదా అని జగతి అంటుంది. చూశారా డాడ్ నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నారో. ఇంతమందిలో నన్ను అవమానిస్తున్నారు అని శైలేంద్ర అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూలై 26 బుధవారం నాటి ఎపిసోడ్‌ 825లో ఇంకా ఏం జరిగిందంటే?

పెద్ద తప్పు చేశారు:నేను ఎన్నిసార్లు అడిగినా దాటేస్తున్నారు. వాళ్ల పేర్లు అడిగితే వీళ్లు చెప్పడం లేదు అంటే వీళ్లు ఏదో తప్పు చేస్తున్నారు. నాకు అడగటానికి హక్కు లేదంటున్నారు. కనీసం మీరైనా అడగండి అని జగతిని ఫణీంద్ర దగ్గర ఇరికిస్తాడు శైలేంద్ర. అది విన్న ఫణీంద్ర కాస్తా ఆలోచించి.. అవును జగతి.. శైలేంద్ర చెబుతుంది నిజమే. మీరు చేసింది చాలా పెద్ద తప్పు అని ఫణీంద్ర అంటే.. జగతి, మహేంద్ర షాక్ అవుతారు. శైలేంద్ర మాత్రం సంతోషిస్తాడు. కానీ ఇంతలోనే అసలు వీడిని లోపలకు రానివ్వడమే నువ్వు చేసిన తప్పు జగతి. ఎందుకు లోపలికి రానిచ్చావ్ అని కోప్పడతాడు ఫణీంద్ర. డాడ్ ఏంటిది అని శైలేంద్ర అంటే నోర్మూయ్ అని గట్టిగా గద్దిస్తాడు ఫణీంద్ర.

Guppedantha Manasu Serial July 26 2023 Today Full Episode 825

శైలేంద్రపై ఫైర్:అసలు నిన్ను ఎవడు మీటింగ్ రమ్మన్నారు. ఇక్కడ మీటింగ్ జరుగుతుందని నీకు ఎవరు చెప్పారు. వచ్చి ఇక్కడ ఇష్టమొచ్చినట్లు ప్రశ్నలు అడుగుతున్నారు. నువ్ ఇక్కడికి వచ్చి ఇలా అడగడం వల్ల ఏమైనా లాభం ఉందా. జస్ట్ టైమ్ వేస్ట్ తప్పా. అయినా నీకు వాళ్ల గురించి ఏం తెలుసు. ఏం చేసినా వాళ్లు పర్ఫెక్ట్ గా చేస్తారు. అయినా నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావ్. మిషన్ ఎడ్యుకేషన్ మీద బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. పోనిలే అని ఇక్కడ ఉండి ఏమైనా నేర్చుకుంటావని అనుకుంటే ఇలా చేస్తున్నావ్. నువ్వు చేసే పనులకు నాకు ఒళ్లు మండిపోతుంది. ఇక్కడి నుంచి వెళ్లు. బయటకు వెళ్లిపో అని ఫణీంద్ర కోపంగా ఫైర్ అవుతాడు. దీంతో శైలేంద్ర అనుకున్నది జరగ్గా అవమానంగా వెళ్లిపోతాడు.

రిజైన్ చేయొచ్చు:ఇంకా ఇక్కడ ఎవరికైనా పేర్లు కావాలా. కావాలనుకునేవాళ్లు రిజైన్ చేసి వెళ్లిపోవచ్చు అని ఫణీంద్ర అంటే.. లేదు సార్ అని మిగతా మెంబర్స్ అంతా చెబుతారు. నువ్వు చెప్పు జగతి అని ఫణీంద్ర అంటాడు. వాళ్లకు ఈ పని ఎప్పుడు అప్పజెబుతామో అది త్వరలోనే చెబుతాం. టైమ్ వచ్చినప్పుడు వాళ్ల పేర్లు కూడా చెబుతాం అని జగతి అంటుంది. అక్కర్లేదు. మీ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు పేర్లు చెప్పడం లేదంటే దానికి ఏదో గట్టి కారణమే ఉండి ఉంటుంది. మిషన్ ఎడ్యుకేషన్ పూర్తి బాధ్యత మీదే. మీరు ఏం చేసినా కాలేజీ మంచి కోసమే చేస్తారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. ఏం పర్వాలేదు అని ఫణీంద్ర అంటాడు. థ్యాంక్స్ అన్నయ్య. మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు అని మహేంద్ర మనసులో అనుకుంటాడు.

Guppedantha Manasu Serial July 26 2023 Today Full Episode 825

ఇంటెన్షన్ తెలుస్తుంది:మరోవైపు కారులో ఏంజెల్, వసుధార బయటకు వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నామని ఏంజెల్ అడిగితే.. మరికాసేపట్లో తెలిసిపోతుందిలే అని వసు అంటుంది. మీ కాలేజీలో అంతమంది ఉన్నారు కదా. నన్ను ఎందుకు రమ్మన్నావ్. నేను నీ ఫ్రెండ్ ని అనా అన ఏంజెల్ అంటుంది. అవును, నాకు తోడుగా ఉంటావ్. అలాగే నేను పడే ఇంటెన్షన్ నువ్వు చూస్తే మీ తాతయ్యకు చెబుతావ్ కదా. అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను అని వసుధార అంటుంది. రిషి కూడా వచ్చి ఉంటే బాగుండేది. తనకు ఇష్టం లేకపోయినా సినిమాలు, షాపింగ్ కు రమ్మంటే వచ్చేవాడు. కానీ ఈరోజు ఎంత అడిగినా రాలేదు. నవ్వు ఉన్నావనేమో అంటుంది. అయినా మీరు దేనిగురించి అయినా టక్కున సమాధానం చెబుతారు. కానీ మీ పేర్లు ఎత్తేసరకి మౌనంగా ఉండిపోతారు ఏంటీ అని ఏంజెల్ అంటుంది.

అటెండర్ తో నిఘా:నేనొకటి అడుగుతా నిజం చెబుతావా అని ఏంజెల్ అంటే... తప్పకుండా చెబుతాను అని వసుధార అంటుంది. ఇప్పుడు కాదులే. టైమ్ వచ్చినప్పుడు అడుగుతా అని ఏంజెల్ అంటుంది. వీళ్ల కారును అటెండర్ ఫాలో అవుతాడు. అటెండర్ కు వసుధార, రిషిలను కనిపెట్టుకుంటూ ఉండమని డబ్బులు ఇచ్చి పురమాయిస్తాడు శైలేంద్ర. ఆ ప్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. మరోవైపు ఏంజెల్, వసుధార ఎక్కడికి వెళ్లారో తెలుసా అని విశ్వనాథాన్ని రిషి అడుగుతాడు. తెలియదని విశ్వనాథం అనడంతో.. దెబ్బ తగిలాక ఈరోజే కాలేజికి వచ్చారు. ఈరోజే బయటకు వెళ్లారు. మళ్లీ ఏమైనా జరుగుతుందేమో. మీరు పట్టించుకోవాలి కదా సార్ అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial July 26 2023 Today Full Episode 825

తెలివైన అమ్మాయి:ఏం గమనించనట్లే ఉంటావ్ కానీ, అన్నీ గమనిస్తావ్. అయినా నువ్వు అనుకున్నట్లు ఏం కాదు. వసుధార చాలా తెలివైన అమ్మాయి. ధైర్యం ఉంది. అలాగే హద్దులు కూడా తెలుసు. వాళ్లకు ఏం కాదు వచ్చేస్తారు అని విశ్వనాథం అంటాడు. వసుధార ఏంజెల్ ఓ బస్తీ వద్ద ఆగి ఆడుకుంటున్న పిల్లలను చూపిస్తుంది. చదువుకోవాలని ఉన్న చదువుకోలేకపోతున్నా పిల్లలు. వీళ్ల కోసమే మిషన్ ఎడ్యుకేషన్ ఉంది అని వసుధార అంటే.. ఏంజెల్ ఒక్కసారిగా నవ్వి.. రిషి కూడా ఇలాగే ఆలోచిస్తాడు అని అంటుంది. పిల్లలందరిని పిలిచి చదువుకుంటారా అని అడిగితే వాళ్లంతా సంతోషంగా అవును అంటారు. పిల్లల తల్లిదండ్రులతో వాళ్ల చదువు గురించి, మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది వసుధార.

శైలేంద్రకు కాల్:అదంతా విన్న అటెండర్ వసుధార మిషన్ ఎడ్యుకేషన్ గురించి బస్తీ వాళ్లతో మాట్లాడుతుందని శైలేంద్రకు కాల్ చేసి చెబుతాడు. దీంతో వాళ్లకు డబ్బు ఆశ జూపి వసుధారు ఎదురు తిరిగి మాట్లాడి అవమానించి పంపిచేలా చేయమని అటెండర్ కు చెబుతాడు శైలేంద్ర. అటెండర్ ఓ భార్యాభర్తకు డబ్బు ఇచ్చి అలాగే చేస్తాడు. దీంతో ఆ దంపతులు ఇద్దరు వచ్చి వసుధారతో గొడవ పెట్టుకుంటారు. మాలాంటి వాళ్లను ఆశపెట్టి మధ్యలో వదిలేస్తారని డబ్బుతీసుకున్న ఆవిడ అంటుంది. ఆమె భర్త వసుధార వచ్చిన కార్ టైర్లో గాలి తీస్తాడు. కోపంతో వసుధార నువ్వు మనిషివా పశువ్వా అంటుంది.

Guppedantha Manasu Serial July 26 2023 Today Full Episode 825

అసలు బుద్ధుందా:నా భర్తను పశువా అని అంటావా అని వసుధారపై చేయి ఎత్తుతుంది డబ్బు తీసుకున్న ఆవిడ. ఆమె చేతిని అడ్డుకుంటుంది వసుధార. నేను చెప్పేది అర్థం చేసుకోండి అని వసుధార అంటే.. నా చేయి వదులూ అని ఆవడి గద్దిస్తుంది. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంటే.. ఆపండి అని రిషి మాట వినిపిస్తుంది. చూస్తే పాండ్యన్ బ్యాచ్ తో కలిసి రిషి దర్శనం ఇస్తాడు. రిషిని చూసిన వసుధార షాక్ అవుతుంది. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మేడమ్. వీళ్లతో గొడవ ఏంటీ. అసలు మీకు బుద్దుందా అని వసుధారపై ఫైర్ అవుతాడు రిషి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X