Guppedantha Manasu: కట్టలు తెంచుకున్న రిషి కోపం.. వసుధారపై అందరిముందే ఘోరంగా!
మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్పేందుకు బస్తీకి వెళ్తారు వసుధార, ఏంజెల్. అయితే శైలేంద్ర అటెండర్ తో ఇప్పించిన డబ్బులు తీసుకున్న బస్తీ జనం వసుధారతో గొడవకు దిగుతారు. ఇంతలో ప్యాండన్ బ్యాచ్ తో ఎంట్రీ ఇచ్చిన రిషిని చూసి వసుధార షాక్ అవుతుంది. ఏంటీ మేడమ్ ఇది. వీళ్లతో ఎందుకు గొడవ పడుతున్నారు. అసలు వీళ్లతో గొడవ పడతారా అని వసుధారపై ఫైర్ అవుతాడు రిషి. అలా బుద్ధి చెప్పండి సారు అని గొడవకు దిగిన మహిళ అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూలై 27 గురువారం నాటి ఎపిసోడ్ 826లో ఇంకా ఏం జరిగిందంటే?
అవసరం ఉండదు:ఎవరికి బుద్ధి చెప్పాలి. మీ పిల్లల్ని చదువుకోమంటున్నందుకు ఆవడికి బుద్ధి చెప్పాలా. మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తానన్నందుకు బుద్ధి చెప్పాలా అని బస్తీ మహిళపైకి రివర్స్ అవుతాడు రిషి. మీరు కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారేంటీ సారు. ఎంతోమంది ఇలా చెప్పే మోసం చేశారు అని ఆవిడ అంటుంది. ఆమె చెప్పినదాంట్లో తప్పెముంది. మీ పిల్లలనీ చదువుకోమని కదా చెప్పారు. ఆమెను చూస్తుంటే మోసం చేసేదానిలా కనిపిస్తుందా. మాటలతో మభ్యపెట్టేలా అనిపిస్తుందా. మీ పిల్లలను చదివిస్తే.. వాళ్లు మీలాగా కష్టపడే అవసరం ఉండదు. మీ పిల్లల కోసమే కదా ఆవిడ అలా అన్నారు అని రిషి అంటాడు. మా పిల్లల బాగోగులు మాకు తెలుసు అని తాగుబోతు అంటాడు.

డబ్బు కావాలి:తాగి సరిగ్గా నిల్చోలేకపోతున్నావ్. నువ్వు పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నావా. అలా ఆలోచించేవాడివైతే ఇలా తాగవు. మీ పిల్లలను చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుపడుతుంది అని రిషి అంటాడు. మాకు చాలా డబ్బుంది. అయినా మేం చదువుకోగా అందరినీ ఇబ్బంది పెట్టేవాళ్లం. రాత్రి పూట చదువుకునేందుకు కష్టపడినవాళ్లను చూసి బుద్ధి తెచ్చుకున్నాం. చదువుకుంటుంటే తెలుస్తోంది. దాని గొప్పతనం ఏంటో అని పాండ్యన్ బ్యాచ్ అంటుంది. మీరంతా ఉన్నోళ్లు. మీరు అలాగే అంటారు అని బస్తీలోని మరో ఆవిడ అంటుంది. ఆడంబరాలకు డబ్బు కావాలి. చదువుకు కాదు. జ్ఞానం ఉంటే ఎలాగైనా చదువుకోవచ్చు. నీ కొడుకు కలెక్టర్ అయితే నీ గౌరవమె పెరుగుతుందని అందరికీ క్లాస్ తీసుకుంటాడు రిషి.
ఏమైంది వసుధార:నువ్వేం చెప్పిన మేం వినం అని తాగుబోతు అంటే.. మధ్యలో ఇంకొకతను వచ్చి.. సార్ అంత స్పష్టంగా చెబుతున్నారు కదా. ఇదివరకు వచ్చినవాళ్లను చూసి ఇలా మాట్లాడం. తప్పుగా అనుకోకండి అని అంటాడు. మీ పిల్లలను చదివించాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కు కాల్ చేయండి అని విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్లిపోతారు రిషి. ఏంజెల్ నీకు కొంచెమైనా బుద్ధి ఉందా. ఆమె పిలిస్తే వెళ్లిపోవడమేనా. నమ్మించి అగాథంలో పడేయడమే ఆమె పని. తన గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించదు అని రిషి ఫైర్ అవుతాడు. సార్ ఏంజెల్ ను ఏమనకండి. నేనే తీసుకొచ్చాను అంటుంది వస్తుంది. చూస్తే వాళ్లంతా కారులో ఉంటారు. ఏమైంది వసుధార అలా మాట్లాడావ్ అని ఏంజెల్ అంటుంది.

బస్తీకి ఎందుకు:హో ఇదంతా నా భ్రమనా అనుకున్న వసుధార.. ఏదో ఊహించుకున్నాను అని అంటుంది. రిషి మందలించాడని ఊహించుకున్నావా అని ఏంజెల్ అంటుంది. బస్తీలో జరిగింది విశ్వనాథంకు చెప్పొద్దని రిషి చెబుతూ ఒక ఎగ్జాంపుల్ చెబుతాడు. సరే అని ఏంజిల్ అంటుంది. కట్ చేస్తే విష్ కాలేజీలో ప్రిన్సిపాల్ తో లెక్చరర్స్ అంతా ఉంటారు. మిషన్ ఎడ్యుకేషన్ మనం టేకప్ చేస్తున్నామని వాళ్లకు చెప్పామా అని ప్రిన్సిపాల్ ను అడుగుతాడు రిషి. లేదు సార్. మీ నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నాం అని ప్రిన్సిపాల్ అంటాడు. మరి ఈమె అలా బస్తీకి ఎందుకు వెళ్లింది. ఇక్కడ కాలేజీలో ఇన్పార్మ్ చేసి వెళ్లాలి కదా. ఆమెకు ఏమైనా అయితే కాలేజీదే కదా బాధ్యత అని రిషి కోప్పడతాడు.
ఎంజెల్ సాక్ష్యం:నేనేమి కాలేజీ పేరు బయటకు చెప్పలేదు. పర్సనల్ విషయాలను ప్రొఫెషనల్ గా కలపకూడదు అంటూ వసుధార కూడా గట్టిగానే చెబుతుంది. మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పాండ్యన్ వాళ్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లినప్పుడు ఫస్ట్ కాలేజీ పేరే బయటకు వచ్చింది. వాళ్ల పేరు కాదు. మిషన్ ఎడ్యుకేషన్ గురించి ముందుగా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాకే చదువు గురిచి చెప్పాలి. అంతేగానీ ఏం తెలియకుండా వాళ్లతో మాట్లాడితే ఇలాగే ఉంటంది అని ఆవేశగా అంటాడు రిషి. తెలియనప్పుడే కదా చెప్పాల్సింది. అంతా తెలిసాక మనం చెప్పేదేంటి సార్. అయినా నేను ఛైర్మన్ గారి కూతురితో వెళ్లాను. కావాలంటే సాక్ష్యానికి ఆమెను అడగండి అని వసుధార అంటుంది. దీంతో షటప్ వసుధార అని గట్టిగా అరుస్తూ లేచి నిల్చుంటాడు రిషి.

గొడవ ఏంటీ:రిషి అలా అరవడంతో అంతా షాక్ అవుతారు. మీరు సరిగా మాట్లాడుకున్నదే లేదు. అలా అన్నారేంటీ అని లెక్చరర్ అంటాడు. వాళ్లకు ఏదో గతం ఉంది. అందుకే ఇప్పటికే మేడమ్ అని ఇప్పుడు పేరు పెట్టి అన్నారు అని అటెండర్ మెల్లిగా లెక్చరర్ కు అక్కడే చెబుతాడు. అది విన్న రిషి, వసుధార చెరోవైపు వెళ్లిపోతారు. ఇద్దరు కాలేజి క్షేమం గురించే ఆలోచిస్తున్నారు. ఇద్దరి వాదనలో నిజం ఉంది. మీరైతే క్లాసులకు వెళ్లిండని అందరిని పంపించేస్తాడు ప్రిన్సిపాల్. తర్వాత ఇంట్లో కూర్చున్న రిషి వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఏంజెల్ వచ్చి కాలేజీలో ఏదో గొడవ చేసావంటా కదా. అన్నింటికి పాజిటివ్ గా ఆలోచించేవాడివి. ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావ్ అని అడుగుతుంది.

బ్యాలెన్స్ ఉందని:నేను జరిగినదంతా విశ్వానికి చెప్పాను. వసుధార చేసింది మంచి పని ఆయన కూడా మెచ్చుకున్నారు అని ఏంజెల్ అంటుంది. తను చేసింది మంచి పని అని నాకు తెలుసు. కానీ ఒంటరిగా హ్యాండిల్ చేయడం ఎందుకు అని రిషి అంటాడు. తర్వాత వసుధార ఇంకా ఇంటికి రాలేదు. అటెండర్ కు కాల్ చేస్తే కాలేజీ తర్వాతే వెళ్లిపోయిందన్నాడు. ఫోన్ ట్రై చేస్తే ఎత్తట్లేదు. సరే నువ్వు ట్రై చేయు అని వెళ్లిపోతుంది ఏంజెల్. వసుకి రిషి కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. ఎందుకు కాల్ చేశారు అని మెసేజ్ పెడితే.. బ్యాలెన్స్ ఉందని అంటాడు రిషి. ఇంకెవరికైనా చేయొచ్చు కదా. నాకెందుకు అని వసు అంటే.. మాట్లాడాల్సిన వాళ్లకే కదా చేస్తాం. ఇంతకీ ఎక్కడ ఉన్నారు మేడమ్ అని రిషి అంటాడు. దీంతో ఆలోచనలో పడిపోతుంది వసుధార.


Click it and Unblock the Notifications











