Guppedantha Manasu: రిషిని బుక్ చేసిన చక్రపాణి.. ఏంజెల్ షాక్.. ఎంగిలి మజ్జిగ తాగిన వసు

ప్రిన్సిపాల్ ముందు తనపై రిషి కోప్పడ్డాన్న బాధతో విశ్వనాథం ఇల్లు వదిలి తన ఇంటికి వెళ్లిపోతుంది వసుధార. రిషి కాల్ చేస్తే లిఫ్ట్ చేయని వసుధార మెసేజ్ లకు రిప్లై ఇస్తూ ఉంటుంది. వసుధార సమాధానాలు ఇస్తుంటే వెటకారంగా ప్రశ్నలు వేస్తాడు రిషి. అసలు ఏ విషయంపై గురించో చెబితే కదా సార్ మాట్లాడేది అని వసుధార అంటుంది. ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావ్. ఇంతకీ ఎక్కడ ఉన్నావ్ అని రిషి అడుగుతాడు. మీరు ఈ సమాధానం కోసమే ఫోన్ చేశారని తెలుసు సార్. నేను నా ఇంట్లో సేఫ్ గా ఉన్నాను. మీరేం కంగారు పడకండి. బై సర్ ఉంటాను అని రిప్లై ఇస్తుంది వసు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూలై 28 శుక్రవారం నాటి ఎపిసోడ్‌ 827లో ఇంకా ఏం జరిగిందంటే?

ఇప్పుడే రానన్నావ్:వసుధార రిప్లై చూసుకుని రిషి ఊరుకుంటాడు. ఇంతలో ఎంజెల్ వచ్చి వసుధార ఏమైనా ఆన్సర్ చేసిందా అని అడుగుతుంది. కాల్ కట్ చేసింది కానీ, మెసేజ్ చేసింది. వాళ్ల ఇంట్లో ఉందని చెప్పింది అని రిషి చెబుతాడు. హో.. కాలేజీలో అంత గొడవ అయింది కదా. అందుకే వెళ్లిపోయినట్టుంది. సరే పదా వెళ్లి వసుధారను చూసి వద్దాం అని ఏంజెల్ అంటుంది. నేను రాను అని రిషి అంటాడు. సరే నేను అయితే కచ్చితంగా వెళతాను అని ఏంజెల్ వెళ్లబోతుంటే రిషి పిలుస్తాడు. ఏంటీ రిషి పిలిచి సైలెంట్ గా ఉంటావ్ అని ఏంజెల్ అడిగితే.. నేను కూడా వస్తాను అంటాడు. ఇప్పుడే కదా రానన్నావ్. మళ్లీ వస్తానంటున్నావ్. సరే పదా అని ఏంజెల్ అంటుంది.

Guppedantha Manasu Serial July 28 2023 Today Full Episode 827

వసుధార కోసమే:రిషి, ఏంజెల్ కారులో బయలుదేరతారు. రిషి ఒక్కటి చెప్పు. నువ్వు వసుధార కోసమే వస్తున్నావ్ కదా. నాకు ఆన్సర్ చేయలేదు. కానీ, నీకు చేసింది అని ఏంజెల్ అడుగుతుంది. అదేం లేదు ఏంజెల్. ఈ రాత్రిపూట నిన్ను ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు తోడుగా వస్తున్నాను అని రిషి అంటాడు. థ్యాంక్స్ రిషి. నువ్వు అందరి గురించి ఆలోచిస్తావ్. కానీ, ఒక్క వసుధార విషయంలోనే అదోలా బిహేవ్ చేస్తావ్. వసుధార గురించి నీకు పూర్తిగా తెలియదు. లేకుంటా అలా ప్రవర్తించవ్. వసుధార చాలా మంచి అమ్మాయి. అది తన గొప్పతనం. తన గురించి తెలిస్తే నాకన్న నువ్వే ఎక్కువ ఇష్టపడతావ్. ఎప్పుడూ నీతోనే ఉండాలని కోరుకుంటావ్ అని ఏంజెల్ అంటుంది.

ఎవరికో దూరమైనట్లు:సుధార గొప్పతనం గురించి ఏంజెల్ చెబుతుంటే గతంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటాడు రిషి. వసుధార జీవితంలో పెద్ద కష్టం ఎదుర్కొంటునట్లు, ఎవరికో దూరమైనట్లు బాధపడుతుంది. కానీ, ఎప్పుడు బయటపడదు. అందరి ముందు ప్రశాంతంగా ఉన్నట్లు ఉంటుంది. అది నేను కనిపెట్టాను తెలుసా. తనకు ఏదైనా సమస్య ఉంటే మనకు చెప్తే సాల్వ్ చేస్తాం కదా. లేదా నేను నీకు చెప్పయిన సాల్వ్ చేస్తాం కదా. తను క్లాస్ ఎలా చెబుతుందో తెలియదు కానీ, మనసులో మాట మాత్రం బయటపెట్టదు అని ఏంజెల్ అంటుంది. వసుధార ఇంటి ముందు రిషి కార్ ఆపి ఇంట్లోకి రానని చెప్పి అక్కడే ఉంటాడు. వసుధార నాకు సమాధానం ఇవ్వలేదు కానీ, నీకు ఇచ్చింది. అందుకే రమ్మంటున్నాను అని చెప్పి తీసుకెళ్తుంది ఏంజెల్.

Guppedantha Manasu Serial July 28 2023 Today Full Episode 827

నాకే ఎందుకిలా:లోపలికి వెళ్లిన రిషిన చూసిన చక్రపాణి అల్లుడు గారు రండి అని అంటాడు. చక్రపాణి అలా అనడంతో ఏంజెల్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. రిషిని అల్లుడు గారు అంటున్నారేంటీ అంకుల్ అని ఏంజెల్ అడుగుతుంది. బాబు గారు అన్నానమ్మా అని చక్రపాణి అంటాడు. అవునా, నాకేంటీ అలా వినిపించిందన్న ఏంజెల్ ఇంతకుముందు మహేంద్రను రిషి డాడ్ అని పిలవడం గురించి చెబుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏంజెల్ అమాయకంగా అంటుంది. ఎక్కువగా ఆలోచిస్తే ఇలాగే జరుగుతుంది అని రిషి కవర్ చేస్తాడు. లోపల కూర్చున్న తర్వాత వసును పిలుస్తాడు చక్రపాణి. ఏంజెల్, రిషిని చూసి వసుధార షాక్ అవుతుంది.

Guppedantha Manasu Serial July 28 2023 Today Full Episode 827

వసుతో భోజనం:ఏంటీ వసుధార అలా చెప్పకుండా వచ్చేశావ్. నువ్వు ఇంటికి రాకపోయేసరికి, ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా అని ఏంజెల్ ఫైర్ అవుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాననే ఫీలింగ్ వల్లే చెప్పకుండా మా ఇంటికి వచ్చానని చెప్పిన వసుధార.. ఏంజెల్ కు సారీ చెబుతుంది. వెళ్లిపోదామన్న రిషితో కాఫీ తాగమంటాడు చక్రపాణి. లేదు సార్ అని కోపంగా రిషి అంటే.. ఏంజెల్ తో భోజనం చేయించేలా ఒప్పిస్తుంది వసుధార. తర్వాత రిషికి మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంది వసుధార. దాన్ని కొంచెం తాగి పక్కన పెడతాడు రిషి. ఏంజెల్, వసుధార, చక్రపాణి భోజనం చేస్తుంటారు. ఇన్ని రోజులు వసుధారను చూసుకున్నందుకు ఏంజెల్ కు థ్యాంక్స్ చెబుతాడు చక్రపాణి.

Guppedantha Manasu Serial July 28 2023 Today Full Episode 827

నేను ఒంటరి:థ్యాంక్స్ నాకు కాదు. రిషికి చెప్పండి. తనే కంటికి రెప్పలా చూసుకున్నాడు. నాకు జాగ్రత్తలు చెప్పేవాడు అని రిషిని తెగ పొగుడుతుంది ఏంజెల్. నాకు తెలుసమ్మా. తనను ప్రాణంగా చూసుకుంటాడు అని చక్రపాణి అంటే.. ఏంటీ అంకుల్ అని డౌట్ గా అడుగుతుంది. అదే బాబు అందరి క్షేమం గురించి ఆలోచిస్తాడు అని కవర్ చేస్తాడు చక్రపాణి. హాల్లో కూర్చున్న రిషి.. వసుధార అమ్మ కనిపించడం లేదేంటి. ఒకవేళ చక్రపాణి గారికి వసుధార కాల్ చేసి సడెన్ గా రమ్మనడంతో అక్కడే ఉండమని ఆయన వచ్చినట్లు ఉన్నారు. అయినా ఈ ఇంట్లో ఎవరుంటే నాకేంటి. నేను ఒంటరి అనుకుంటాడు రిషి. ఇంతలో ఏంజెల్ వచ్చి భోజనం బాగుందని, నువ్వు మిస్ అయ్యావని రిషితో అంటుంది.

Guppedantha Manasu Serial July 28 2023 Today Full Episode 827

రిషి ఎంగిలి:సార్.. మేడమ్ గారి అమ్మ గారు ఇంట్లో లేనట్లున్నారు. మేడమ్ ను జాగ్రత్తగా చూసుకోండి అని రిషి, ఏంజెల్ వెళ్లిపోతారు. చక్రపాణి బాధగా లోపలికి వెళ్లిపోతాడు. రిషి ఎంగిలి చేసిన మజ్జిగను వసుధార తాగుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి గ్లాస్ లాక్కునే ప్రయత్నం చేస్తాడు. ఏంటీ సార్ గ్లాస్ లాక్కుంటున్నారు అని వసుధార అంటుంది. అది ఎందుకు తాగుతున్నారు అంటే.. నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేదు. ఎంతో కష్టపడితే కానీ మజ్జిగ రాదు అని క్లాస్ తీసుకుంటుంది వసుధార. కావాలని కల్పించి చెబుతున్నట్లు లేదు అని రిషి అంటే.. లేదు, నిజమే చెబుతున్నా అని వసు అంటుంది. రిషి కార్ కీస్ తీసుకుని వెళ్లిపోతాడు. ఇది నా ఇష్టం సార్. మీరే నా ఇష్టం అని వసుధార అనుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X