Guppedantha Manasu: వసుకు రిషి సేవలు.. తమ్ముడి దగ్గరికే అన్న.. మహేంద్ర-జగతి స్కెచ్

ట్రీట్ మెంట్ తీసుకున్న వసుధార ఏంజెల్ ఇంట్లో ఉంటుంది. వాటర్ బాటిల్ తీసుకునేందుకు ప్రయత్నించి బెడ్ పైనుంచి కిందపడిపోతుంది వసుధార. సౌండ్ రావడంతో తన దగ్గరికి వెళ్దామనుకుంటాడు రిషి. కానీ పిలవకుండా నేనెందుకు వెళ్లాలి, పిలిస్తే కదా వెళ్లాలని అని ఆగిపోతాడు. వసుధార బాధతో మూలుగుతున్న సౌండ్ వినిపించి కిందకు దిగుతాడు రిషి. నేను వెళ్లడమేంటీ అని అనుకున్న వెనక్కి మరలుతాడు. మళ్లీ పిలవలేదంటే అవసరం లేదని కాదుగా అనుకుని వసుధార గదిలోకి వెళ్తాడు రిషి. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూలై 3 సోమవారం నాటి ఎపిసోడ్‌ 805లో ఇంకా ఏం జరిగిందంటే?

ఓపిక లేకుంటే:గదిలోకి వెళ్లి చూసేసరికి వసుధార కిందపడి ఉంటుంది. అయ్యో ఏమైంది అని అడుగుతాడు రిషి. వాటర్ బాటిల్ తీసుకుందామని చూస్తే పడిపోయాను అని వసుధార చెబుతుంది. ఇక్కడున్న వాటర్ బాటిల్ అందలేదా అని అనుమానంగా చూస్తాడు రిషి. దీంతో నేనేం కావాలని పడిపోలేదు సార్.. నిజంగానే అందలేదు అని వసుధరా అంటుంది. నేనేం అడగలేదే అని రిషి అంటాడు. లేవొచ్చు కదా మరి అని రిషి అంటే.. లేచే ఓపిక ఉంటే పడేదాన్ని కాదు సార్ అని వసుధార సమాధానం ఇస్తుంది. దీంతో వసుధార చేయి పట్టుకుని లేపి బెడ్ పై కూర్చోపెడతాడు రిషి. ఓపిక లేకపోతే పిలవొచ్చు కదా అని రిషి అంటాడు. పిలిస్తే మీరు వస్తారో రారో అని పిలవలేదని చెబుతుంది వసుధార.

Guppedantha Manasu Serial July 3 2023 Today Full Episode 805

మాట రాకూడదు:సాటి మనిషిగా యాక్సిడెంట్ అయితే సాయం చేసిన వాడిని వాటర్ బాటిల్ ఇవ్వలేనా అని బాటిల్ అందిస్తాడు రిషి. బాటిల్ మూత రాక వసుధార ఇబ్బంది పడుతుంటే అది తీసి గ్లాసులో నీళ్లు పోసి ఇస్తాడు రిషి. థ్యాంక్స్ అని వసుధార చెబితే.. మీరేం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు మేడమ్. ఇది మీకోసం చేసింది కాదు. నా ప్రాణాలు కాపాడిన వాళ్లు వీళ్లు. నాకు కావాల్సింది ఈ ఇల్లు చక్కగా ఉండాలి. మీ దగ్గర మా వాళ్లకు మాట రాకూడదు. అందుకే వచ్చాని అని చెప్పిన రిషి కావాల్సినవి వసు పక్కనే పెడతాడు. అన్నీ పక్కనే పెట్టాను. నా అవసరం రాకుండా చూసుకోండి. తప్పనిసరి అయితే మాత్రమే పిలవండి మేడమ్ అని వెళ్తుంటాడు రిషి.

Guppedantha Manasu Serial July 3 2023 Today Full Episode 805

డౌట్ రాలేదు:సార్.. పిలిస్తే పలికేంత దూరంలో ఉండండి సార్ అని వసుధార అంటుంది. మరోవైపు కాలేజీ గెస్ట్ హౌజ్ లో మహేంద్ర, జగతి ఉంటారు. ఇలా వచ్చామని తెలిసిన వెంటనే అన్నయ్యా చాలా బాధపడతారు. ఆయన్ని తలుచుకుంటేనే బాధగా ఉంది. కానీ శైలేంద్ర, వదినా కలిసి పదవుల కోసం కన్నతల్లి నీతోనే కొడుకు మీద నింద వేసేలా చేశారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అస్సలు తట్టుకోలేకపోతున్నాను. వదినా గారు కన్నింగ్ అని డౌట్ వచ్చేది. కానీ శైలేంద్ర ఎంత బాగా మాట్లాడేవాడు. ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేవాడు అని మహేంద్ర అంటాడు. శైలేంద్ర తేనే పూసిన కత్తి. నాకు మొదట్లో డౌట్ రాలేదు. చాలా బాగా నటిస్తాడు అని జగతి అంటుంది.

సమస్య లేదు:ఇంతలో ఫణీంద్ర ఎంట్రీ ఇస్తాడు. ఎందుకు ఇలా నాకు చెప్పకుండా వచ్చేసారు అని కోపంగా అడుగుతాడు ఫణీంద్ర. రిషిపై అభియోగం మోపి జగతి ఏం చెప్పదు. ఇప్పుడు ఇలా వచ్చేశారు. అసలు ఏమైంది. శైలేంద్ర, దేవయాని ఏమైనా అన్నారా. వర్క్ విషయంలో ఏమైనా కలగజేసుకున్నారా. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఏం జరిగిందో చెప్పండి అని ఫణీంద్ర అంటాడు. శైలేంద్ర, దేవయాని వదినా వర్క్ విషయంలో ఏం కలగజేసుకుంటారు. వాళ్లు ఇంకా సపోర్ట్ చేస్తారే తప్పా. ఇక్కడ ఉంటే కాలేజీ స్టాఫ్ తో చర్చించి బాగా పని చేయొచ్చు కదా అని వచ్చాం. ఏ సమస్య లేదు అన్నయ్యా అని మహేంద్ర చెబుతాడు. అలా అయితే నేను ఇంటికి వచ్చాకా చెప్పి రావొచ్చు కదా. కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా అని ఫణీంద్ర అంటాడు.

Guppedantha Manasu Serial July 3 2023 Today Full Episode 805

గిల్టీగా ఉంది:మీరు కోర్టు పని మీద వెళ్లారు కదా. ఆ సమయంలో డిస్టర్బ్ చేయడం ఎందుకని అని మహేంద్ర అంటాడు. సరే అయితే, నేను కూడా మీతో ఇక్కడే ఉండే హెల్ప్ చేస్తాను అని ఫణీంద్ర అంటాడు. మీరు ఇక్కడ ఎందుకు బావగారు. ఇంటికి వెళ్లండి అని జగతి అంటుంది. లేదు జగతి మీతో వర్క్ చేస్తా. లేదా మీరు ఇంటికి వస్తారా.. లేదంటే ఇక్కడే ఉండి వర్క్ చేస్తా అని ఫణీంద్ర అనడంతో.. మహేంద్ర ఒప్పుకుంటాడు. బావగారు ఇక్కడే ఉండటానికి ఎందుకు ఒప్పుకున్నావ్ అని జగతి అంటే తప్పలేదు. అన్నయ్య నన్ను వదిలి ఉండలేరు. అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది. అన్నయ్యకు అబద్ధం చెప్పినందుకు గిల్టీగా ఉంది. శైలేంద్ర గురించి నిజం చెబితే తట్టుకోలేరు. ప్రాణాలు కాపాడుకోవడానికే ఇలా చేయాల్సి వచ్చింది అని మహేంద్ర అంటాడు.

Guppedantha Manasu Serial July 3 2023 Today Full Episode 805

పొలమారడంతో:మరోవైపు రిషి, వసుధార ఇద్దరూ ఒకరి గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడో దూరం అయ్యాం. అది నువ్వు గుర్తించాలి. నువ్వు కేవలం వసుధారవి. నేను రిషిని. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని రిషి అనుకుంటాడు. అప్పుడే ఏంజెల్ ఫోన్ చేసి ఇంటికి రావడానికి కాస్తా టైమ్ పడుతుందని, వసుకి ట్యాబ్లెట్ ఇచ్చే టైమ్ అయింది ఇవ్వమని చెబుతుంది. దీంతో వసు గదిలోకి రిషి వెళ్లి ట్యాబ్లెట్ ఇస్తాడు. నీళ్లు తాగుతుంటే వసుధారకు పొలమారుతుంది. వెంటనే రిషి తల నిమురుతాడు. కాసేపు కంపెనీ ఇవ్వొచ్చు కదా అని వసు అంటే.. కంపెనీలు, కాఫీలు ఇచ్చేందుకు నేను ఇదివరకు.. అని రిషి ఆగిపోతాడు.

మాట తప్పను:ఎందుకు సార్ అలాంటి మాటలతో గుండెను కొట్టినట్లు చేస్తారు అని వసుధార అంటే.. నా గుండెను కోసేసారు కదా అని రిషి అంటాడు. గతం గుర్తు చేసుకోకూడదని చాలా ప్రయత్నిస్తున్నారు కదా సార్. మరి మీ చేతికి ఉన్న ఆ బ్రేస్ లెట్ గతాన్ని గుర్తి చేయడం లేదా అని వసు అడుగుతుంది. ఇది ఉంటేనే కదా నాకు జరిగిన మోసం అన్నీ గుర్తుకు వచ్చేది. అయినా నేను మాట ఇస్తే తప్పను. కొంతమందిలాగా మోసం, ద్రోహం చేసే అలవాటు లేదు. అయినా ఇది పెట్టుకుని సంతకాలు పెట్టమని చెప్పారు. నేను జ్ఞాపకాలు వదులుకోలేను. ఎందుకంటే నీకు తెలిసో లేదో.. నేను జెంటిల్ మెన్ అనేసి వెళ్లిపోతాడు రిషి. మరోవైపు శైలేంద్ర, దేవయానికి తెలియకుండా రిషిని ఎలాగైనా మళ్లీ కాలేజీలోకి తీసుకురావాలని డిసైడ్ అవుతారు మహేంద్ర, జగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X