Guppedantha Manasu: శైలేంద్రకు మహేంద్ర వార్నింగ్.. కాలర్ పట్టుకున్న జగతి.. వసుకు రిషి గుడ్ న్యూస్

వసుధార, రిషి ఎంగేజ్ మెంట్ ఫొటోలు విష్ కాలేజ్ అటెండర్ కు పంపించి వాళ్లను ఘోరంగా అవమానించాలని శైలేంద్ర చెబుతాడు. సినిమాకు పబ్లిసిటీ కోసం ఎలా అయితే పోస్టర్స్ వేస్తారో కాలేజీ గోడలపై వాళ్ల ఫొటోలు కనిపించాలని అంటాడు. దానికి ఖర్చు అవుతుంది అని అటెండర్ అంటే.. ఊహించనంత డబ్బు ఇస్తానంటాడు శైలేంద్ర. అప్పుడే అటు పక్క వచ్చిన జగతి ఆ మాటలు వింటుంది. శైలేంద్ర దగ్గర ఎంగేజ్ మెంట్ ఆల్బమ్ ఉందేంటి అని షాక్ అవుతుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూలై 31 సోమవారం నాటి ఎపిసోడ్‌ 829లో ఇంకా ఏం జరిగిందంటే?

ఒక ఐడియా:ఈ దెబ్బతో వాళ్ల జీవితాలు తారుమారు కావాలి అని ఫోన్ లో శైలేంద్ర అంటాడు. శైలేంద్ర ఏదో ప్లాన్ చేస్తున్నాడు. నా బిడ్డకు మళ్లీ ఏదైనా ప్రమాదం తలపెట్టేలా ఉన్నాడు. ఎలాగైనా అడ్డుకోవాలి అనుకున్న జగతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు కాలేజీలో పాండ్యన్ బ్యాచ్ ను పిలిచి వసుధార మాట్లాడుతుంది. బస్తీకి వెళ్లి చేసిన పని సక్సెస్ కాలేదని, అది విజయవంతం కావాలంటే రిషి సార్ సపోర్ట్ ఉండాలని, దానికి మీ సహాయం కావాలని పాండ్యన్ బ్యాచ్ ను అడుగుతుంది వసుధార. మీకోసం ఏమైనా చేస్తాం అని పాండ్యన్ బ్యాచ్ అంటుంది. వాళ్లకు ఒక ఐడియా చెబుతుంది వసుధార. దాంతో వాళ్లంతా రిషికి ఎదురుపడి ఒక్కొక్కరుగా పేపర్స్ ఇస్తూ ఉంటారు.

Guppedantha Manasu Serial July 31 2023 Today Full Episode 829

అంతకుమించి:వాళ్లు ఇచ్చే పేపర్ పై రిషి సార్ పవర్ ఆఫ్ స్టడీస్ ను ముందుకు తీసుకెళ్లండి, మిషన్ ఎడ్యుకేషన్ ను లీడ్ చేయండి అని రాసి ఉంటుంది. ఆ పేపర్స్ చూసి సైలెంట్ గా వెళ్లిపోతాడు రిషి. ఇక మరోవైపు శైలేంద్ర గదిలోకి నెమ్మదిగా వెళ్తుంది ధరణి. ఆయన స్నానానికి వెళ్లినట్లు ఉన్నారు. ఇదే మంచి టైమ్ అనుకున్న ధరణి భర్త ఫోన్ తీసుకుని వచ్చి జగతికి ఇస్తుంది. జగతి ఆ ఫోన్ ఆన్ చేసే లోపల పిన్నీ అని శైలేంద్ర పెద్ద షాక్ ఇస్తాడు. మీరెంత ప్రయత్నించినా మీకు ఏం తెలిసే అవకాశమే లేదు. మీరెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో అంతకుమించి జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. ఒక పని అయిపోయాగానే దాని ఆనవాళ్లు లేకుండా చేసే అలవాటు నాకుంది అని శైలేంద్ర అంటాడు.

కాలర్ పట్టుకుని:మీరు రీసైకిల్ బిన్ లో వెతికినా అక్కడ ఏం దొరకదు అని అన్న శైలేంద్ర.. ధరణిని దగ్గరికి తీసుకుని.. నువ్వు వీళ్ల పార్టీ అని నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్న డియర్ అంటాడు. ఇప్పుడు నేను పిన్నితో మాట్లాడాలి. నువ్వు వెళ్లి నాకోసం ఎదురుచూస్తూ ఉండు అని ధరణిని ముందుకు తోసేస్తాడు శైలేంద్ర. జగతి నుంచి ఫోన్ తీసుకుని నేనేం ఏం చేస్తున్నానో తెలియక కంగారు పడుతున్నారా అని శైలేంద్ర అంటాడు. మళ్లీ ఏం కుట్ర చేశావ్. నా కొడుక్కి ఏం ప్రమాదం తలపెడుతున్నావ్ చెప్పు. ఫొటోలు ఎవరికి పంపించావ్ అని శైలేంద్ర కాలర్ పట్టుకుని అడుగుతుంది జగతి. ఆమె చేతులు విడిపించుకున్న శైలేంద్ర.. ఏంటీ మీకు భయపడి చెబుతానా. నేను ఒక్కసారి వేటాడటం మొదలు పెడితే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు. మీరంతా ఈ శైలేంద్ర ఆధీనంలో పనిచేయాలి. మీరేం చేస్తున్నారో నాకు తెలియదా. నువ్వు బాబాయ్ నిజం దాచిపెడితే నిజం దాగుతుందా. రిషి ఎక్కడున్నాడో నాకు తెలుసు పిన్నీ అని శైలేంద్ర అంటాడు.

Guppedantha Manasu Serial July 31 2023 Today Full Episode 829

చెడబుట్టావ్ కదా:ఇంతలో తెలిస్తే ఏం చేస్తావురా అని మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు. మళ్లీ కుట్ర చేస్తున్నావా. నా కొడుకుని చంపాలనుకుంటున్నావా అని మహేంద్ర అంటే.. బాబాయ్ నేను అని శైలేంద్ర అంటాడు. హేయ్.. ఆపు ఇక నటించకు చూడలేకపోతున్నా. నువ్వు ఎంత మేకవన్నే పులివో నాకు తెలిసి చాలా కాలం అయింది. తెలిసిన మరుక్షణమే నీ అంతు చూడాలి అనుకున్నా. కానీ మా అన్నయ్య కోసం ఆగాను. అందుకే నువ్వు బతికి బట్ట కట్టావ్. ఛ పదవి కోసం తమ్ముడిపై పగ పెంచుకుంటావా. తనపై కక్ష సాధిస్తావా. మా కుటుంబంలో నువ్వు చెడబుట్టావ్ కదా అని మహేంద్ర అంటే.. బాబాయ్.. అని కోపంగా శైలేంద్ర అంటాడు. అలా పిలవకు. నీకు నాకు మధ్య ఏ బంధం లేదు. ఏ రోజు నా కొడుకుని చంపాలనుకున్నావో ఆరోజే నా మనసులో నీ స్థానం చచ్చిపోయింది అని మహేంద్ర అంటాడు.

Guppedantha Manasu Serial July 31 2023 Today Full Episode 829

నీకంతా సీన్ లేదు:అంతా సర్దుకుంది. జగతిని రిషి అమ్మగా స్వీకరిస్తాడు అనుకునేలోపు నైతికంగా దెబ్బ కొట్టావ్. నా కొడుకుని నేనే దగ్గరుండి తిరిగి తీసుకొస్తాను. అప్పుడు నీ పరిస్థితేంటి. ఇకనైనా జాగ్రత్తగా ఉండు అని మహేంద్ర అంటే.. నా జాగ్రత్తలో నేనున్నాను. రిషి తిరిగొచ్చిన నాకేం కాదు. డీబీఎస్టీ ఎండీ సీట్లో నేను కూర్చుని తీరుతాను అని శైలేంద్ర.. అంటే నీకంతా సీన్ లేదు అని మహేంద్ర అంటాడు. అని మీరు అనుకుంటున్నారు. నా బలహీనత, మీ బలహీనత మా డాడీనే. కానీ, చివరకు గెలిచేది నేనే. అందుకు నేను వేసే ఎత్తులు మీ ఊహకు కూడా అందవు అని శైలేంద్ర అంటాడు. తోడేలుకు అర్థం కావట్లేదు.. వేటాడాలి అనుకుంటుంది సింహాన్ని అని మహేంద్ర అనడంతో శైలేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Guppedantha Manasu Serial July 31 2023 Today Full Episode 829

వసుధార షాక్:వెంటనే వసుధారకు కాల్ చేసి మీరు ఎక్కడున్నారో శైలేంద్రకు తెలిసిపోయింది. మిమ్మల్ని అవమానించాలని ఏదో ప్లాన్ చేస్తున్నాడు. వాడు పక్కగా ప్లాన్ చేశాడు. మీ ఎంగేజ్ మెంట్ ఫొటోలు ఎవరికో పంపించాడు. జాగ్రత్తగా ఉండండి అని మహేంద్ర చెబుతాడు. అదంతా విని షాక్ అయిన వసుధార రిషి సార్ కు నేను చెబితే వినరు, ఏంజెల్ ద్వారా చెప్పిద్దామంటే తనకు డౌట్ వస్తుంది. నాన్నతో అసలు రిషి సార్ మాట్లాడరు అని పలు రకాలుగా ఆలోచిస్తుంది. సార్ మీతో మాట్లాడాలి. నా గురించు కాదు. కారిడార్ లో ఎదురుచూస్తుంటాను అని రిషికి మెసేజ్ పెడుతుంది వసుధార. అదే సమయంలో ప్రిన్సిపాల్ తో మాట్లాడుతుంటాడు రిషి. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నామని డిబీఎస్టీ కాలేజీ వాళ్లకు ఇన్ఫార్మ్ చేయమని చెబుతాడు రిషి.

Guppedantha Manasu Serial July 31 2023 Today Full Episode 829

ఫ్లెక్సీ షాప్ కి రిషి:మిషన్ ఎడ్యుకేషన్-పవర్ ఆఫ్ స్టడీస్ రెండు మెర్జ్ చేయాలని, రెండు కలిసి కంటిన్యూ చేద్దాం. దానివల్ల కాలేజీకి మంచి పేరు వస్తుంది అంటూ రిషి వివరిస్తాడు. చాలా గొప్ప ఆలోచన అని కాసేపు రిషిని పొగుడుతాడు ప్రిన్సిపాల్. దీనికి సంబంధించి కాలేజీలో ఫ్లెక్సీలు వేయిద్దాం అని సలహా ఇచ్చిన ప్రిన్సిపాల్ అతన్ని పిలుస్తానంటాడు. వద్దు. నేనే వెళ్లి చూస్తానని రిషి బయటకు వస్తాడు. అక్కడే ఎదురుచూస్తున్ పాండ్యన్ ను చూసి నవ్వుతాడు రిషి. అది చూసి పాండ్యన్ బ్యాచ్ సంతోషిస్తారు. మా నిర్ణయాన్ని అంగీకరించినందుకు థ్యాంక్స్ అంటారు. ఆశయాలు ఉంటే సరిపోదు ఆచరణ ఉండాలి అని రిషి వెళ్లిపోతాడు. చూస్తుంటే రిషిధార ఫొటోలు ప్రింటింగ్ కు ఇచ్చిన షాప్ కే రిషి వెళ్తాడని, ఆ ఫొటోలు బయటకు రాకుండా ఆపుతాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X